Maoist Leader Malla Rajireddy Passes Away Confirmed By Chhattisgarh Police - Sakshi
Sakshi News home page

Maoist Leader Malla Rajireddy Death: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత!

Aug 18 2023 12:57 PM | Updated on Aug 18 2023 1:25 PM

Maoist leader Malla Rajireddy Passes Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిని మావోయిస్టు పార్టీ ధృవీకరించకలేదు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండటం గమనార్హం. 

వివరాల ప్రకారం.. మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిచెందారు. కాగా, రాజిరెడ్డి స్వస్థలం.. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఎగ్లాస్‌పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లి. ఇక, రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అయితే, రాజిరెడ్డిని పట్టుకుంటే రూ.కోటి కూడా ప్రభుత్వం నజరానా కూడా ప్రకటించడం విశేషం. మరోవైపు.. రాజిరెడ్డి ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించారు. 

ఇది కూడా చదవండి: హైటెక్‌ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement