సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 45 మంది జవాన్లను హతమార్చిన ఓ మావోయిస్టు కాంకేర్ జిల్లాలో బీఎస్‌ఎఫ్ పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. బీజాపూర్ జిల్లాకు చెందిన సున్నూ మడవి అలియాస్ శివాజీ మావోయిస్టు పార్టీ ప్లాటూన్ నంబర్-5లో డిప్యూటీ కమాండర్‌గా పని చేస్తున్నాడు.
అయితే, ఆ పార్టీలో పనిచేసే ఓ మహిళా మావోయిస్టును వివాహం చేసుకోవడంతో పార్టీ డీప్రమోట్ చేసి గంగులూరు ఏరియా కమిటీకి పంపింది. ఆ సమయంలో అతడికి అగ్రనాయకుల వేధింపులు ఎదురవడంతో పార్టీ నుంచి పారిపోయి ఇంటికి వచ్చాడు. కాగా, గ్రామంలో అప్పటికే లొంగిపోయిన కొందరు మావోయిస్టులు.. మళ్లీ పార్టీలోకి వెళ్లవద్దని, నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించడంతో కాంకేర్‌లోని బీఎస్‌ఎఫ్ 135 బెటాలియన్ పోలీసు అధికారులను ఆశ్రయించాడు.
బాలల సంఘం నుంచి డిఫ్యూటీ కమాండర్‌గా..
శివాజీ తొలుత 2005లో మావోయిస్టు పార్టీతో సంబంధాలు పెంచుకుని బాలల సంఘంలో చేరాడు. 2006లో కాంకేర్ జిల్లాలోని పార్తాపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత మిలటరీ ప్లాటూన్ కంపెనీ నంబర్-5కు డిప్యూ టీ కమాండర్‌గా నియమితులయ్యాడు. ఇక, అతనిపై రూ.3 లక్షల రివార్డు ఉంది. 2009లో మదనవాడలో ఎస్పీ వినోద్ చౌబోతే సహా 29 మంది జవాన్లను, 2006లో దంతెవాడలో ఎనిమిది మంది సీఐఎఫ్ జవాన్లపై దాడి చేసి హత మార్చిన ఘటనలో మడవి అలియాస్ శివాజీ పాల్గొన్నాడు.
ఇది కూడా చదవండి: బెదిరింపు కాల్స్ రావడంతో అజ్ఞాతంలోకి
Comments
Please login to add a commentAdd a comment