surrended
-
పార్లమెంట్ అలజడి కేసు సూత్రధారి లలిత్ ఝా అరెస్టు
ఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన కేసుమాస్టర్ మైండ్ లలిత్ ఝా అరెస్ట్ అయ్యాడు. తనంతట తానుగా వచ్చి ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు. గురువారం రాత్రి లలిత్ ఝా మరో వ్యక్తితో కలిసి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పోలీసు ప్రత్యేక బృందాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా ప్రస్తుతం లొంగిపోయాడు. పార్లమెంట్లో నిందితులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: Parliament Attack: జాతికి జవాబు కావాలి! -
కీలక మావోయిస్టు లొంగుబాటు.. 45మంది జవాన్ల హత్యలో సూత్రధారి
సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 45 మంది జవాన్లను హతమార్చిన ఓ మావోయిస్టు కాంకేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. బీజాపూర్ జిల్లాకు చెందిన సున్నూ మడవి అలియాస్ శివాజీ మావోయిస్టు పార్టీ ప్లాటూన్ నంబర్-5లో డిప్యూటీ కమాండర్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఆ పార్టీలో పనిచేసే ఓ మహిళా మావోయిస్టును వివాహం చేసుకోవడంతో పార్టీ డీప్రమోట్ చేసి గంగులూరు ఏరియా కమిటీకి పంపింది. ఆ సమయంలో అతడికి అగ్రనాయకుల వేధింపులు ఎదురవడంతో పార్టీ నుంచి పారిపోయి ఇంటికి వచ్చాడు. కాగా, గ్రామంలో అప్పటికే లొంగిపోయిన కొందరు మావోయిస్టులు.. మళ్లీ పార్టీలోకి వెళ్లవద్దని, నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించడంతో కాంకేర్‌లోని బీఎస్ఎఫ్ 135 బెటాలియన్ పోలీసు అధికారులను ఆశ్రయించాడు. బాలల సంఘం నుంచి డిఫ్యూటీ కమాండర్‌గా.. శివాజీ తొలుత 2005లో మావోయిస్టు పార్టీతో సంబంధాలు పెంచుకుని బాలల సంఘంలో చేరాడు. 2006లో కాంకేర్ జిల్లాలోని పార్తాపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత మిలటరీ ప్లాటూన్ కంపెనీ నంబర్-5కు డిప్యూ టీ కమాండర్‌గా నియమితులయ్యాడు. ఇక, అతనిపై రూ.3 లక్షల రివార్డు ఉంది. 2009లో మదనవాడలో ఎస్పీ వినోద్ చౌబోతే సహా 29 మంది జవాన్లను, 2006లో దంతెవాడలో ఎనిమిది మంది సీఐఎఫ్ జవాన్లపై దాడి చేసి హత మార్చిన ఘటనలో మడవి అలియాస్ శివాజీ పాల్గొన్నాడు. ఇది కూడా చదవండి: బెదిరింపు కాల్స్ రావడంతో అజ్ఞాతంలోకి -
‘నేను గోవధ చేశాను.. నన్ను జైలులో పెట్టండి’ అంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి..
ఏదో ఒక జంతువును చంపి, అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి నన్ను అరెస్టు చేసి, జైలుకు పంపించడంటూ వేడుకున్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా? ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా పరారీలో ఉంటూ, గోవధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తాను గోవధ చేశానని,ఇప్పుడు లొంగిపోవాలనుకుంటున్నానంటూ ఒక పోస్టర్ ప్రదర్శిస్తూ, తనను అరెస్ట్‌చేసి, జైలుకు తరలించాలని పోలీసులను వేడుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోగల రూదౌలీ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్టేషన్లో శనివారం సమాధాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే ప్రజల సమస్యలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్బర్ అలీ అనే వ్యక్తి ఒక పోస్టర్ పట్టకుని, అక్కడి పోలీసు అధికారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు గోవధ చేసి.. ఇప్పుడు పశ్చాత్తాపం అక్బర్ అలీ పోలీసులతో మాట్లాడుతూ ‘నేను గోవధ ఆరోపణలు ఎదుర్కొంటూ కొంతకాలంగా పరారీలో ఉన్నాను. ఈ కేసులో నా భార్య జైలులో ఉంది. మా సంసారం ముక్కలయ్యింది. నాకు పోలీసులపై నమ్మకముంది. అందుకే నేను లొంగిపోవాలని అనుకుంటున్నాను. మరోమారు నేను ఇలాంటి నేరాలకు పాల్పడను’అని చెప్పాడు. అక్బర్ మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. అనంతరం పోలీసులు అతనిని స్టేషన్లో కూర్చోబెట్టారు. 2022 నాటి ఉదంతంలో.. రూధౌలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎథర్ గ్రామంలో 2022లో కొంతమంది గోవులను హత్య చేశారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్బర్ అలీ వీరిలో ఒకడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే జైలుకు తరలించారు. అయితే అక్బర్ అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. జైలుకు వెళ్లిన భార్య ఈ ఉదంతంలో అక్బర్ భార్య ఇంతకుమందే జైలుకు వెళ్లి, శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు అక్బర్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసు అధికారి సత్యేంద్ర భూషన్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ గోవధ నిందితుడు.. సమాధాన దినోత్సవం నాడు లొంగిపోయాడన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇది కూడా చదవండి: చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు! -
విచిత్రమైన దొంగ: పర్సు కొట్టేసి... సముద్రంలో ఈత కొట్టి ఎస్కేప్! కానీ...
చైన్‌స్నాచర్లు, పిక్ పాకెటర్స్ చాలా తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటారు. ఎంతో స్కెచ్ వేస్తే గానీ ఒకపట్టాన దొరకరు. ఔనా! ఐతే ఈ దొంగ మాత్రం పర్సు కొట్చేసి ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరిడాలో ఒక దొంగ ఒక హోటల్ పార్కింగ్ వద్ద ఉన్న ఒక మహిళ పర్సును కొట్టేశాడు. ఆ తర్వాత ఆ దొంగ తప్పించుకునేందుకు టంపా బేలో ఉండే బీచ్‌లోకి వెళ్లిపోతాడు. ఆ బీచ్ వద్దే ఉన్న కొంతమంది ఆ దొంగ సముద్రంలోకి వెళ్లడం చూస్తారు. ఆ దొంగ ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. ఐతే సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను వెతకడం కోసం హెలికాప్టర్‌తో రంగంలోకి దిగారు. అధికారులు హెలికాఫ్టర్‌తో ఆ వ్యక్తి కోసం సముద్రం అంతా జల్లెడపడతారు. పాపం ఆ దొంగ పోలీసలు తనను వదలేటట్లు లేరని డిసైడ్ అయ్యి తనను వెంబిడిస్తున్న హెలికాప్టర్ని చూసి లొంగిపోతున్నట్లు చేతులు పైకెత్తుతాడు. కానీ ఆ దొంగ తప్పించుకోవాలన్న ప్రయాసతో ఏకంగా 200 అడుగుల లోతు వరకు ఈత కొట్టేశాడు. పోలీసులు సదరు దొంగను డెవేన్ డీన్‌గా గుర్తించి, పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు) -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెం టౌన్: నిషేధిత మావోయిస్టు పార్టీ ఇద్దరు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెంలో ఎస్పీ సునీల్‌దత్ శనివారం వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్దమిడిసెలేరుకు చెందిన గట్టుపల్లి సురేశ్, బొడిక భీమయ్య గతంలో మూడేళ్లు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని దళాల్లో పనిచేశారు. ఆ తర్వాత చర్ల ఎల్ఓసీ సభ్యులుగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. అయితే, మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీలోని కొందరు వేధిస్తుండటంతో భరించలేక పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా గిరిజన మహిళలు, చిన్నారులతో మావోయిస్టులు బలవంతంగా పని చేయించుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేశ్, భీమయ్య తెలిపారు. కాగా, మావోయిస్టులు లొంగిపోతే వారి భవిష్యత్‌కు అన్నివిధాల అండగా నిలుస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం వారిద్దరికీ రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ హరిఓం ఖారే, సెకండ్ ఇన్ కమాండెంట్ ప్రమోద్ పవార్, భద్రాచలం ఏఎస్పీ వినీత్, చర్ల సీఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టు అరెస్ట్ దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఓ మావోయిస్టును శనివారం అరెస్ట్ చేసినట్టు ఎస్పీ సునీల్‌శర్మ తెలిపారు. అరెస్టు చేసిన మావోయిస్టు శివయాదవ్‌పై రూ.లక్ష రివార్డు ఉందని వెల్లడించారు. 2012లో కలెక్టర్‌ను కిడ్నాప్ చేసిన కేసులో శివయాదవ్ నిందితుడని ఎస్పీ పేర్కొన్నారు. -
పాపభీతితో లొంగిపోయాడు
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): పాపభీతి వెంటాడటంతో తలనీలాల దొంగ పో లీసులకు లొంగిపోయాడు. సింహాద్రి అప్పన్న ఉగ్రరూపంలో నిద్రలో కనిపిస్తున్నాడని, నిజం చెప్పమని గర్జించడంతో లొంగిపోయానని సింహాచలం దేవస్థానంలో తలనీలాలు దొంగిలించిన ప్రధా న నిందితుడు ఏలూరు సమీపంలోని మాదేపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి రాంబాబు (47) పోలీసులకు తెలిపాడు. విశాఖ పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సంయుక్త పోలీస్ కమిషనర్ సత్తార్ ఖాన్, క్రైం డీసీపీ రవికుమార్‌మూర్తి వివరాలు వెల్లడించారు. 2015 ఫిబ్రవరి 14న సింహాచలం దేవస్థానంలో 10 బస్తాల్లో ఉన్న సుమారు 150 కేజీల తలనీలాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ రూ. 7.50 లక్షలు ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. తలనీలాలు ఎవరు దొంగలించారు, ఎక్కడికి తరలించారో తెలుసుకునేందుకు పోలీసులు చేపట్టిన దర్యాప్తు అంగుళం కూడా ముందుకు సాగలేదు. దొంగగా మారిన తలనీలాల వ్యాపారి ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంబాబు తండ్రి నుంచి వారసత్వంగా తలనీలాల వ్యాపారం స్వీకరించాడు. రాష్ట్రంలోని పలు దేవాలయాలకు చెందిన తలనీలాలను వేలం ద్వారా కొనుగోలు చేసి వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. కొన్నాళ్లపాటు భద్రాచలం కొత్తగూడెంకు చెందిన చల్లా జంపన్నతో కలిసి తలనీలాల వ్యాపారం చేశాడు. వీరిద్దరూ క్రికెట్ బెట్టింగ్‌లలో తమ వద్ద ఉన్న సొమ్మంతా పోగొట్టుకుని అప్పులపాలయ్యారు. అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు రాంబాబు, జంపన్నలు కలిసి సింహాచలం దేవస్థానం కల్యాణకట్టలో నిల్వ ఉంచిన తలనీలాల బస్తాలలో పదింటిని కిటికీ ఊసలు వంచి దొం గిలించారు. తర్వాత కాణిపాకం వినాయకుని దేవస్థానంలో కూడా వీరిద్దరూ కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ కేసులో చల్లా జంపన్నను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే తరుణంలో రాంబాబులో పాపభీతి మొదలయింది. సింహాద్రి అప్పన్న కలలో కనిపిస్తున్నాడని, తాను లొంగిపోదామనుకుంటున్నానని ప్రకాశం జిల్లా మాలకొండ దేవస్థానం కార్యనిర్వహణాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.4.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ డీసీపీ (క్రైం) వరదరాజు, ఏసీపీ భీమారావు, గోపాలపట్నం సీఐ వైకుంఠరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.