ఏదో ఒక జంతువును చంపి, అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి నన్ను అరెస్టు చేసి, జైలుకు పంపించడంటూ వేడుకున్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా? ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా పరారీలో ఉంటూ, గోవధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తాను గోవధ చేశానని,ఇప్పుడు లొంగిపోవాలనుకుంటున్నానంటూ ఒక పోస్టర్ ప్రదర్శిస్తూ, తనను అరెస్ట్‌చేసి, జైలుకు తరలించాలని పోలీసులను వేడుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోగల రూదౌలీ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్టేషన్‌లో శనివారం సమాధాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే ప్రజల సమస్యలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్బర్ అలీ అనే వ్యక్తి ఒక పోస్టర్ పట్టకుని, అక్కడి పోలీసు అధికారి దగ్గరకు వచ్చాడు.
అప్పుడు గోవధ చేసి.. ఇప్పుడు పశ్చాత్తాపం
అక్బర్ అలీ పోలీసులతో మాట్లాడుతూ ‘నేను గోవధ ఆరోపణలు ఎదుర్కొంటూ కొంతకాలంగా పరారీలో ఉన్నాను. ఈ కేసులో నా భార్య జైలులో ఉంది. మా సంసారం ముక్కలయ్యింది. నాకు పోలీసులపై నమ్మకముంది. అందుకే నేను లొంగిపోవాలని అనుకుంటున్నాను. మరోమారు నేను ఇలాంటి నేరాలకు పాల్పడను’అని చెప్పాడు. అక్బర్ మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. అనంతరం పోలీసులు అతనిని స్టేషన్‌లో కూర్చోబెట్టారు.
2022 నాటి ఉదంతంలో..
రూధౌలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎథర్ గ్రామంలో 2022లో కొంతమంది గోవులను హత్య చేశారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్బర్ అలీ వీరిలో ఒకడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే జైలుకు తరలించారు. అయితే అక్బర్ అప్పటినుంచి పరారీలో ఉన్నాడు.
జైలుకు వెళ్లిన భార్య
ఈ ఉదంతంలో అక్బర్ భార్య ఇంతకుమందే జైలుకు వెళ్లి, శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు అక్బర్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసు అధికారి సత్యేంద్ర భూషన్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ గోవధ నిందితుడు.. సమాధాన దినోత్సవం నాడు లొంగిపోయాడన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.
ఇది కూడా చదవండి: చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు!
Comments
Please login to add a commentAdd a comment