Slaughter
-
‘నేను గోవధ చేశాను.. నన్ను జైలులో పెట్టండి’ అంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి..
ఏదో ఒక జంతువును చంపి, అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి నన్ను అరెస్టు చేసి, జైలుకు పంపించడంటూ వేడుకున్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా? ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా పరారీలో ఉంటూ, గోవధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తాను గోవధ చేశానని,ఇప్పుడు లొంగిపోవాలనుకుంటున్నానంటూ ఒక పోస్టర్ ప్రదర్శిస్తూ, తనను అరెస్ట్‌చేసి, జైలుకు తరలించాలని పోలీసులను వేడుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోగల రూదౌలీ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్టేషన్లో శనివారం సమాధాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే ప్రజల సమస్యలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్బర్ అలీ అనే వ్యక్తి ఒక పోస్టర్ పట్టకుని, అక్కడి పోలీసు అధికారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు గోవధ చేసి.. ఇప్పుడు పశ్చాత్తాపం అక్బర్ అలీ పోలీసులతో మాట్లాడుతూ ‘నేను గోవధ ఆరోపణలు ఎదుర్కొంటూ కొంతకాలంగా పరారీలో ఉన్నాను. ఈ కేసులో నా భార్య జైలులో ఉంది. మా సంసారం ముక్కలయ్యింది. నాకు పోలీసులపై నమ్మకముంది. అందుకే నేను లొంగిపోవాలని అనుకుంటున్నాను. మరోమారు నేను ఇలాంటి నేరాలకు పాల్పడను’అని చెప్పాడు. అక్బర్ మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. అనంతరం పోలీసులు అతనిని స్టేషన్లో కూర్చోబెట్టారు. 2022 నాటి ఉదంతంలో.. రూధౌలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎథర్ గ్రామంలో 2022లో కొంతమంది గోవులను హత్య చేశారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్బర్ అలీ వీరిలో ఒకడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే జైలుకు తరలించారు. అయితే అక్బర్ అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. జైలుకు వెళ్లిన భార్య ఈ ఉదంతంలో అక్బర్ భార్య ఇంతకుమందే జైలుకు వెళ్లి, శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు అక్బర్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసు అధికారి సత్యేంద్ర భూషన్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ గోవధ నిందితుడు.. సమాధాన దినోత్సవం నాడు లొంగిపోయాడన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇది కూడా చదవండి: చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు! -
అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్ మంచిదేనా?
నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ టౌన్, దేవరకొండ : ఎక్కడ పడితే అక్కడే కోతలు.. ఎవరి ఇష్టం ఉన్నవి వారు ఎక్కడైనా కోసేసుకోవచ్చు.. అవి రోగాలు ఉన్నవా.. లేనివా చూసి పరీక్షించే వారులేరు. అవి ఆడవా.. మగవా అనేది కూడా ఎవరికీ తెలియదు. శుభ్రం ఉండదు. నీరు సక్రమంగా ఉండవు. ఇదీ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో జంతు వధలు సాగుతున్న పద్ధతి. వీటన్నింటికీ ప్రధాన కారణం వధశాలలు లేకపోవడమే. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూ డ, దేవరకొండలో రోడ్లపైనే మటన్ విక్రయాలు సా గుతున్నాయి. గొర్రెలు, మేకల ద్వారా అంత్రాక్స్ వ్యాధులు వస్తున్నాయనే ప్రచారం సాగిన సమయంలో అధికారులు మటన్‌షాపుల వద్దకు వచ్చి హాల్చల్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కనీసం మటన్‌షాపు నిర్వాహకులు కోస్తున్న గొర్రెలు, మేకలను ఆరోగ్యంగా ఉంటున్నాయా లేదా అనేది పరీక్షించే అధికారి జాడ కూడా లేకుండా పోయింది. మున్సిపల్ శానిటరీ విభాగం అధికారులు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు మాంసం కొనాలంటే హడలిపోతున్నారు. (చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85) నల్లగొండలో రోడ్డు వెంట సాగుతున్న వధ ధ్రువీకరించాకే వధించాలి.. వధించే గొర్రెలు, గొర్రె పొట్టేళ్లు, మేకలు, మేక పోతులు తదితర వాటిని అక్కడ పశువైద్యులు పరిశీలించి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తరువాత మాత్రమే వాటిని కోయాలి. వధశాలలు ఉంటే అక్కడ ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలయ్యే అవకాశం ఉండేది. వధశాలలు లేకపోవడంతో నిబంధనలు ఏవీ పాటించకుండా ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లోనే జీవాలను వధిస్తూ మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించకుండానే వినియోగదారుల చెంతకు మాంసం చేరిపోతోంది. అంతే కాకుండా వాటి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తుండడంతో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండలో శిథిలావస్థలో వధశాల నీలగిరి పట్టణంలో జంతు వధశాల 40 ఏళ్ల కిందటి వరకు లైన్వాడిలో ఉన్నట్లు మాంసం వ్యాపారులు చెబుతున్నారు. దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని పనులు మొదలు పెట్టగానే అక్కడ మార్కెట్ వద్దంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో నాలుగేళ్ల కిందటనే పనులు నిలిచిపోయాయి. దీని గురించి అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ సరిగా పట్టించుకోకపోవడంతో కోర్టు కేసు పరిష్కారం కాక మార్కెట్ పనులకు మోక్షం కలగడంలేదు. పానగల్ బైపాస్ రోడ్డులో జంతు వధశాల నిర్మాణం చేపట్టాలని భావించినా సాధ్యపడలేదు. దీంతో రోడ్ల వెంటే మాంసం విక్రయాలు సాగుతున్నాయి. పట్టణంలో మాంసం విక్రయించే వారు 40 మంది వరకు ఉండగా, ఇక ఆదివారం మాత్రం దాదాపు 200 మంది జంతు వధ చేసి వ్యాపారం చేస్తున్నారు. (చదవండి: Vikarabad: కారుతో ఢీకొట్టి పరార్.. ప్రమాదమా? హత్యాయత్నమా?) నిరుపయోగంగా ఉన్న స్లాటర్ హౌస్ దేవరకొండలో.. రోడ్లపైనే విక్రయాలు ప్రతి ఆదివారం దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 500 కేజీల వరకు మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ వధశాల లేకపోవడంతో రోడ్ల వెంటే మాంసం విక్రయాలు సాగుతున్నాయి. అధికారుల తనిఖీలు లేకపోవడంతో బక్కచిక్కిన, అనారోగ్యం పాలైన జీవాలను కూడా కొంతమంది వ్యాపారులు వధించి విక్రయిస్తున్నారు. దీంతో డబ్బులు పోసి జబ్బులు తెచ్చుకోక తప్పడం లేదని ప్రజలు మాంసాహార ప్రియులు వాపోతున్నారు. పట్టణంలో వధశాలనిర్మించి సంబంధిత అధికారులు ధ్రువీకరించిన తర్వాతనే మాంసం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వధశాల ఉన్నా.. నిరుపయోగమే పారిశ్రామికంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడపడితే అక్కడే మటన్ షాపులు వెలుస్తున్నాయి. పట్టణంలో సుమారు 100–200 వరకు మటన్ షాపులుండగా ఏ ఒక్క దుకాణం వద్ద కూడా మున్సిపల్ అధికారులు పరిశీలించి ముద్ర వేసిన దాఖలాలు లేవు. పట్టణంలోని తడకమళ్ల రోడ్డులోని తాళ్లగడ్డ సమీపంలో నిర్మించిన స్లాటర్ హౌజ్ (కబేళా కేంద్రం) నాలుగేళ్లుగా కోర్టు వివాదంలో ఉండడంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో వినియోగదారులు నాణ్యమైన మాసం పొందలేకపోతున్నారు. జంతు వధశాల నిర్మించాలి జంతు వధశాల లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ కోస్తున్నారు. వధశాల నిర్మాణం చేపడితే వ్యాపారులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. మటన్ మార్కెట్ నిర్మాణం నిలిచిపోయినా పట్టించుకోవడంలేదు. జంతు వధశాల పెడితే నాణ్యమైన మాంసం వినియోగదారులకు అందుతుంది. వ్యాపారులకు కూడా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. – మహ్మద్ ఆజం, మాంసం వ్యాపారి, నల్లగొండ ఆరోగ్యమా.. అనారోగ్యమా తెలియదు ప్రతి వారం మటన్ తీసుకెళ్తాను. వారు కోసేది ఆరోగ్యంగా ఉన్నదా.. అనారోగ్యంగా ఉన్నదా ఎవరికీ తెలియదు. మటన్‌షాపులు పెరుగుతున్నాయి కానీ క్వాలిటీ లేకుండా పోతోంది. వెటర్నరీ, మున్సిపల్ అధికారులు ధ్రువీకరించిన తరువాతనే గోర్రెలు, మేకలు, పొటేళ్లు కోయాలి. కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రెగ్యులర్‌గా వచ్చిన వారికి మాత్రమే మంచి మటన్ ఇస్తున్నారు తప్ప కొత్తవారికి ఇబ్బందులు తప్పవు. – నల్లగుంట్ల నరేష్కుమార్, ఇస్లాంపుర, మిర్యాలగూడ బహిరంగ ప్రదేశాల్లో వధించకూడదు బహిరంగ ప్రదేశాల్లో జీవాలు (గొర్రె, మేక)లను వధించకూడదు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. దేవరకొండ పట్టణంలో స్లాటర్ హౌస్ నిర్మాణానికి సంబం ధించి స్థలాన్ని పరిశీలిస్తున్నాం. వ్యాపారులు నాణ్యమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పడేయకూడదు. ఎప్పటికప్పుడు సంబంధిత పశు సంవర్థక శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపడుతాం. – వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్, దేవరకొండ -
సిద్దిపేటలో గోవధ: 8 మంది అరెస్ట్
సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన గోవధ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ రామేశ్వర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆరు గంటల్లోపే 8 మంది నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటనపై సీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. సిద్దిపేటకు చెందిన జుబేర్, ఖాజా, సద్దాం, అరాఫత్, ఇబ్రహీం, హర్షద్, ఆరాఫ్, జావిద్‌లు సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాల్లోని అంగళ్లలో ఆవులను కొనుగోలు చేసి, పట్టణంలోని పాత కోళ్లఫాంలో వధించి, హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి విక్రయించేవారని తెలిపారు. ఇప్పటికి ఇలా మూడుసార్లు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో వారిని అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌లో ట్రయల్ జరిపించి వీరికి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ సంఘటనతో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. (చదవండి: సిద్దిపేటలో కలకలం.. 16 గోవులను వధించారు) -
పబ్జీ: ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో..
జైపూర్: రాజస్తాన్‌లో పబ్జీ ఆట ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. పబ్జీ ఆడడానికి తన స్నేహితుడు ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో ఒక బాలుడు అతనిని కొట్టి చంపాడు. రాజ్‌సమంద్ జిల్లా జైత్పురకి చెందిన 14 ఏళ్ల బాలుడు, అతని స్నేహితుడు హమీద్(17)కి పబ్జీ గేమ్ అంటే పిచ్చి. హమీద్ ఫోన్లో ఆ గేమ్ ఉండడంతో ఇద్దరూ తరచూ ఆడేవారు. ఈ నెల 9న హమీద్ పొలానికి వెళ్లి, తిరిగి రాలేదు. పబ్జీ ఆడడానికి ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో బాలుడైన అతడి స్నేహితుడే బండరాయితో మోదడంతో హమీద్ ప్రాణం కోల్పోయాడని పోలీసు విచారణలో తేలింది. చదవండి: పబ్జీలో లీనం.. ప్రాణాలు తీసింది! -
సరిగ్గా నెలరోజులకు నిందితుడి అరెస్టు
లక్నో : గోవులను వధించారనే వార్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల దాడిలో ఎస్ఐ సుబోధ్ కుమార్, సుమిత్ కుమార్ అనే యువకుడు మృతి చెందారు. ఈ ఘటన డిసెంబర్ 3న జరగగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యోగేష్రాజ్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని జిల్లా భజరంగ్‌దళ్ కన్వీనర్ యోగేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, అరెస్టు ముందు అతనొక వీడియోలో.. అల్లర్లు జరిగిన చోట నేను లేను. హింసాకాండ, ఆందోళలనకు నాకు ఏ సంబంధం లేదు. ప్రభుత్వం నన్ను చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. చెరుకు తోట సమీపంలో పశువుల కళేబరాలున్నాయని ఎవరో కాల్ చేశారు. దాంతో నేరుగా సియానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. ఆందోళన జరుగుతున్న సమయంలో భజరంగ్‌దళ్ మిత్రులతో కలిసి స్టేషన్లోనే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. (యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా) ఇదొక కథ..? యోగేష్‌రాజ్ పోలీసులకు ఇచ్చిన నివేదికలో వివరాలు మరోలా ఉన్నాయి. మిత్రులతో కలిసి సోమవారం (డిసెంబర్, 3) ఉదయం 9 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్‌కి వెళ్లినట్టు చెప్పాడు. పొరుగునున్న మహావ్ గ్రామంలోని చెరుకు తోట సమీపంలో గోవులను వధిస్తున్న ఏడుగురు ముస్లిం యువకులను గుర్తించామని, వారిని పట్టుకుందామనే లోపలే పారిపోయారని వివరించాడు. ఆ యువకులు తమ గ్రామానికి చెందినవారేనని తెలిపాడు. ఇదిలాఉండగా.. హింసాకాండ చెలరేగిన అనంతరరం కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వాటిల్లో.. పశువధ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ యోగేష్ రోడ్లను బ్లాక్ చేయించినట్టుగా ఉంది. ఆందోళన సాగుతున్న సమయంలో అతను పోలీసులతో మాట్లాడుతున్న మరో వీడియో కూడా బయటకొచ్చింది. వీడియోల్లో లభ్యమైన ఆధారాలను బట్టి హింసాకాండకు ప్రధాన సూత్రధారి యోగేష్ అనేందుకు బలం చేకూరుతోంది. భజరంగ్‌దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రవీణ్ భాటి మాట్లాడుతూ.. బులంద్‌షహర్ హింసాకాండతో యోగేష్రాజ్కి సంబంధం లేదని అన్నారు. ఆందోళన సమయంలో అతను పోలీసులకు సాయం చేశాడని చెప్పారు. హత్య, హత్యాయత్నం నేరాల కింద యోగేష్‌పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని నష్టపరిచారని కూడా కేసు పెట్టారు. -
రాజ్‌నాథ్ ఇలాకాలో ఉద్రిక్తత
లక్నో : హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రాంతమైన యూపీలోని చందౌలీ జిల్లా మహ్మద్‌పూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనారిటీల ప్రాబల్యం కలిగిన ప్రాంతంలో గురువారం ఉదయం లేగదూడ మాంసం కనిపించడంతో స్ధానికులు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మహేంద్ర నాథ్ పాండేల సొంత జిల్లా చందౌలీలో లేగదూడల వధపై పార్టీ శ్రేణులు, హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా లేగదూడ మాంసాన్ని గుర్తించిన స్ధానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో సకాలంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. దొంగిలించిన లేగదూడ మాంసాన్ని మహ్మద్‌పూర్ గ్రామంలోని ముస్లిం కుటుంబం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేగదూడను దొంగిలించిన కుటుంబం మాంసం కోసం దాన్ని వధించిందని స్ధానికులు చెబుతుండగా, గాలింపు చర్యల్లో భాగంగా గురువారం ఉదయం విగతజీవిగా మారిన లేగదూడను గుర్తించామని పోలీసులు వెల్లడించారు. కాగా కొందరు ఉద్దేశపూర్వకంగానే మత ఘర్షణలను ప్రేరేపించేందుకు తమ గ్రామంలో లేగదూడను విడిచిపెట్టి ఆందోళనలు చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని, అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని ఏఎస్పీ దేవేంద్ర నాథ్ చెప్పారు. -
జోథ్‌పూర్‌లో ఘోరాతిఘోరం
సాక్షి, రాజస్తాన్: మూఢ నమ్మకాలతో మనుషుల్లో ఉన్నమతిపోతుంది. రంజాన్ మాసంలో కూతురిని బలిస్తే, తనకు కుమారుడు పుట్టేందుకు అల్లా తనను కరుణిస్తాడని భావించి ఓ వ్యక్తి తన కూతురిని ఘోరాతిఘోరంగా చంపాడు. కసాయివాడు జంతువు గొంతు కోసినట్లు కూతురి గొంతు కోసి చంపాడు. ఈ దారుణమైన సంఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో శుక్రవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జోథ్‌పూర్ నగరంలో నవాబ్ అలీ ఖురేషీ, ఆయన భార్య, కూతురు రిజ్వానాలు, అలీ భార్య తరపు బంధువుల ఇంట్లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. నవాబ్ అలీ పై అంతస్తులో ఉంటుండగా..భార్య తరపు బంధువులు కింద పోర్షన్లో ఉంటున్నారు. నవాబ్ అలీ ఖురేషీకి నాలుగేళ్ల రిజ్వాన్ అనే కూతురు ఉంది. శుక్రవారం వేకువజామున రెండున్నర గంటల సమయంలో అలీ తన స్వహస్తాలతో కూతురిని గొంతు కోసి బలి ఇచ్చి, అల్లాకు కానుకగా సమర్పించాడు. అనంతరం తాను ఏమీ ఎరగనట్లు వచ్చి భార్య పక్కన పడుకున్నాడు. కూతురు రిజ్వానా కనపడకపోవడంతో తల్లి కిందకు వెళ్లి చూసింది. రక్తపుమడుగులో పడి ఉండటం చూసి హతాశురాలైంది. అలీ భార్య కేకలు విని బంధువులు బయటకు వచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 3 గంటలకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆధారాలు సేకరించేందుకు డాగ్ స్క్వాడ్‌ను హుటాహుటిన రప్పించిన పోలీసులు ఇళ్లంతా పరిశీలించారు. కుటుంబసభ్యులందరినీ శుక్రవారం, శనివారం అంతా పోలీసులు విచారించారు. విచారణలో కన్న తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. అల్లా కోసమే కూతురిని బలిచ్చానని విచారణలో నవాబ్ అలీ ఒప్పుకున్నాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిపడ్ నగర ఆసుపత్రికి తరలించారు. మూర్ఖపు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆవును చంపితే.. మిమ్మల్ని హత్య చేస్తాం’
జైపూర్ : గోవులను అక్రమంగా రవాణా, గోవులను మాంసం కోసం చంపిన వారిని హత్య చేస్తామంటూ బీజేపీకి చెందిన రాజస్థాన్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆవులను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తి అరెస్టుపై మాట్లాడిన రామ్‌ఘర్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా గోవులను చంపిన వారి ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన జకీర్‌ను అరెస్టు చేయబోయే ముందు చితక్కొట్టారు. అయితే, జకీర్‌ను ఎవరూ కొట్టలేదని అహూజా పేర్కొన్నారు. ఆవులను తరలిస్తున్న ట్రక్కును ప్రజలు వెంబడించారని, ఆందోళనతో జకీర్ చేసిన పొరబాటు వల్ల ట్రక్కు తిరగబడిందని చెప్పారు. అందుకే జకీర్‌కు గాయాలయ్యాయని తెలిపారు. కానీ, జకీర్ మాత్రం గ్రామస్థులు కొట్టారని అబద్దం చెబుతున్నాడని అన్నారు. -
యథేచ్ఛగా గోవధ
అనధికార కబేళాపై అధికారుల దాడి కబేళాకు సిద్ధం చేసిన గోవులు స్వాధీనం గోశాలకు తరలింపు రామచంద్రపురం: ‘హృదయ విదారకమైన దృశ్యాలు.... పశువధలు,... పశుకళేబరాలు.. వ్యర్థ పదార్థాలు, దుర్భరమైన దుర్వాసన వస్తున్న ప్రదేశాలు... ఇదీ.. రామచంద్రపురం పట్టణంలోని రాజబాబు నగర్‌లోగల పరిస్థితి. కొంతకాలంగా కాలనీలో జరుగుతున్న అనధికార కబేళా అంశాన్ని గతంలో సాక్షి పలు సందర్భాల్లో ప్రచురించింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు, మీడియా సంయుక్తంగా దాడులు నిర్వహించగా అక్రమ పశువధలు కనిపించాయి. పట్టణంలోని రాజగోపాల్ సెంటర్‌కు కూత వేటు దూరంలో గల రాజబాబునగర్‌లో కొంత కాలంగా నిర్వహిస్తున్న అనధికార కబేళాపై తహసీల్దార్ పి.రామ్మూర్తి, కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ, ఎస్సై నాగరాజు దాడులు నిర్వహించారు. రోడ్డు పక్కనే గల ఒక పాడు బడ్డ ఇంట్లో కబేళాకు తరలించేందుకు సిద్ధం చేసిన 11 ఆవులున్నాయి. సమీపంలో నాలుగు ఇళ్లలో కబేళా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక ఇంట్లో అప్పుడే పీక కోయబడిన గోమాతను అధికారులు గుర్తించారు. తాళాలు వేసి ఉన్న మరో మూడు ఇళ్లను తెరిచి చూడగా పశు కళేబరాలు, అవశేషాలు, చర్మాలు, ఎండబెట్టిన పేగులు కనిపించాయి. దీంతో పాటు డ్రెయిన్లలో రక్త కలిసిన నీరు ప్రవహించడాన్ని అధికారులు గుర్తించారు. ఈ అంశాలపై అధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కబేళాకు తీసుకువచ్చిన 11 ఆవులను రాజమండ్రిలోని గోశాలకు తరలిస్తున్నట్లు తహసీల్దార్ రామ్మూర్తి తెలిపారు. ఈ కబేళాపై పంచనామా నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ తెలిపారు. అంతేకాకుండా ఆయా ఇళ్లలోని పశు వ్యర్థాలను, పేగులను, చర్మాలను తొలగించి పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తామని వివరించారు. స్థానికులు ఆరోగ్య పరిర„ý ణకు తమకు సహకరించాలని కమిషనర్ కోరారు. కబేళా నిర్వాహకులపై మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై నాగరాజు తెలిపారు. -
ఆర్నెల్లలో గోవధ, విక్రయాలు నిషేధించండి..!
సిమ్లాః దేశంలో ఆరు నెలల్లో గోవధ నిషేధించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆవు, దూడలు, గొడ్డు మాంసం వాటి ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులతోపాటు, విక్రయాలను సైతం నిషేధించాలని పేర్కొంది. ఇచ్చిన వ్యవధిలోపు నిషేధంపై పూర్తిశాతం చర్యలు తీసుకోవాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బీఫ్ బ్యాన్ పై కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా గోవులు, లేగదూడల అమ్మకాలు, మాంసం ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులపై నిషేధం విధించాలని కోర్టు తన ఆదేశాల్లో తెలిపింది. బీఫ్ బ్యాన్ సమస్య ఆయా రాష్ట్రాల పరిథిలోనికి వస్తుందంటూ గతంలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను కేంద్రం తిరస్కరించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 14 అక్టోబర్ 2015 న కోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించిన జస్టిస్ రాజీవ్ శర్మ, కస్టిస్ సురేష్ వార్ థాకుర్ లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి చురకలు వేసింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. ఇప్పటినుంచీ ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. వివరాలకు సంబంధించిన ఓ కాపీని జాతీయ లా కమిషన్ కు కూడా పంపించింది. గోవులు ప్రజలకు ఆహారాన్ని, ఔషధాలను, అవస్థాపనను అందించే గోవులను వధించడం దారుణమని... ఆవుల రవాణాను నిలిపివేయాలని, వాటి రక్షణకోసం ప్రత్యేకంగా గోశాలలు నిర్మించాల్సిన అవసరం ఉందంటూ హిమాచల్ రాష్ట్రానికి చెందిన హిందూమత సంస్థ భారతీయ గోవంశ్ రక్షణ్ సంవర్థన్ పరిషద్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ విధంగా ప్రతిస్పందించింది. మొత్తం 71 పేజీల తీర్పులో ఆర్థిక, మత పరమైన రెండింటిలోనూ ఆవు యొక్క ప్రాముఖ్యతను గుర్తించినట్లు కోర్టు తెలియజేసింది. గోరక్షణలో భాగంగానే హిందువులు సైతం గోవును దైవంగా నమ్ముతారని, పవిత్రంగా భావిస్తారని తెలిపింది.