
ప్రతీకాత్మక చిత్రం
సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన గోవధ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ రామేశ్వర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆరు గంటల్లోపే 8 మంది నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటనపై సీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. సిద్దిపేటకు చెందిన జుబేర్, ఖాజా, సద్దాం, అరాఫత్, ఇబ్రహీం, హర్షద్, ఆరాఫ్, జావిద్‌లు సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాల్లోని అంగళ్లలో ఆవులను కొనుగోలు చేసి, పట్టణంలోని పాత కోళ్లఫాంలో వధించి, హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి విక్రయించేవారని తెలిపారు.
ఇప్పటికి ఇలా మూడుసార్లు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో వారిని అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌లో ట్రయల్ జరిపించి వీరికి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ సంఘటనతో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
(చదవండి: సిద్దిపేటలో కలకలం.. 16 గోవులను వధించారు)
Comments
Please login to add a commentAdd a comment