ఆందోళన చేస్తున్న బీజేపీ శ్రేణులు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో గోవధ ఉదంతం కలకలం రేపింది. బీజేపీ, అనుబంధ సంఘాల నాయకుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం పట్టణ శివారులోని ఓ కోళ్ల ఫాంలో కొందరు 68 గోవులను తీసుకొచ్చి వాటిని చంపి మాంసాన్ని హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యా రు. తొలుత 16 గోవులను వధించారు. ఈ విష యం తెలుసుకుని అక్కడికి చేరుకున్న బీజేపీ, బీజేవైఎం, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు గోవధ తగదని అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు.
ఈ సమాచారం అందుకున్న సీపీ జోయల్ డేవిస్‌తోపాటు ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను చెద రగొట్టారు. దీంతో వారంతా సిద్దిపేట పాతబస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గోవులను వధిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రామేశం మాట్లాడుతూ విషయం తెలియగానే సంఘటనాస్థలానికి చేరుకున్నామని, అప్పటికే 16 గోవులను వధించారని, మిగిలిన 52 గోవులను గోశాలకు తరలించామని తెలిపారు. కాగా, గోవధకు పాల్పడటం హేయమైన చర్య అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment