
జైపూర్: రాజస్తాన్‌లో పబ్‌జీ ఆట ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. పబ్‌జీ ఆడడానికి తన స్నేహితుడు ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో ఒక బాలుడు అతనిని కొట్టి చంపాడు. రాజ్‌సమంద్ జిల్లా జైత్‌పురకి చెందిన 14 ఏళ్ల బాలుడు, అతని స్నేహితుడు హమీద్(17)కి పబ్‌జీ గేమ్ అంటే పిచ్చి. హమీద్ ఫోన్‌లో ఆ గేమ్ ఉండడంతో ఇద్దరూ తరచూ ఆడేవారు. ఈ నెల 9న హమీద్ పొలానికి వెళ్లి, తిరిగి రాలేదు. పబ్‌జీ ఆడడానికి ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో బాలుడైన అతడి స్నేహితుడే బండరాయితో మోదడంతో హమీద్ ప్రాణం కోల్పోయాడని పోలీసు విచారణలో తేలింది. చదవండి: పబ్జీలో లీనం.. ప్రాణాలు తీసింది!