
రాజస్థాన్‌లోని జైపూర్‌లోగల రెండు ప్రముఖ ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ఆస్పత్రులకు చేరుకున్నారు. బాంబ్ స్క్యాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. రోగులను ఆస్పత్రి నుంచి బయటకు తరలించి, వైద్య సేవలు అందిస్తున్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం జైపూర్‌లోని సీకే బిర్లా, మోనిలెక్ ఆసుపత్రులలో బాంబులు ఉన్నాయనే సమాచారం అందుకోగాగానే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ఆస్పత్రులలో పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు ఉన్నారు. దీంతో పోలీసులు రోగులను బయటకు తరలించారు. వైద్యులు బయటనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్‌గా మారింది.
ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనిఖీల అనంతరం అవి ఫేక్ అని తేలుతోంది. అయితే ఇలాంటి వదంతుల వలన సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
जयपुर के सीके बिरला और मोनीलेक हॉस्पिटल में बम की सूचना पर बड़ी संख्या में पहुंची पुलिस. बम स्क्वायड वहां मरीजो को बाहर निकाल कर रहा है जांच @BhajanlalBjp @abplive pic.twitter.com/swl1p0s6Id
— Santosh kumar Pandey (@PandeyKumar313) August 18, 2024