scare
-
Rajasthan: రెండు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్.. తనిఖీలు ముమ్మరం
రాజస్థాన్‌లోని జైపూర్లోగల రెండు ప్రముఖ ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ఆస్పత్రులకు చేరుకున్నారు. బాంబ్ స్క్యాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. రోగులను ఆస్పత్రి నుంచి బయటకు తరలించి, వైద్య సేవలు అందిస్తున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జైపూర్‌లోని సీకే బిర్లా, మోనిలెక్ ఆసుపత్రులలో బాంబులు ఉన్నాయనే సమాచారం అందుకోగాగానే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ఆస్పత్రులలో పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు ఉన్నారు. దీంతో పోలీసులు రోగులను బయటకు తరలించారు. వైద్యులు బయటనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్‌గా మారింది.ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనిఖీల అనంతరం అవి ఫేక్ అని తేలుతోంది. అయితే ఇలాంటి వదంతుల వలన సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. जयपुर के सीके बिरला और मोनीलेक हॉस्पिटल में बम की सूचना पर बड़ी संख्या में पहुंची पुलिस. बम स्क्वायड वहां मरीजो को बाहर निकाल कर रहा है जांच @BhajanlalBjp @abplive pic.twitter.com/swl1p0s6Id— Santosh kumar Pandey (@PandeyKumar313) August 18, 2024 -
Viral Video: మనతో మాములుగా ఉండదు.. పులిని బెంబేలెత్తించిన ఎద్దు
అడవిలో ఏ జంతువైనా పులి, సింహాన్ని చూసి భయపడాల్సిందే. వీటి దాడి నుంచి తప్పించుకోవడం కష్టం. చిన్నా పెద్ద తేడా లేకుండా వేటినైనా క్రురంగా వెంటాడి, చంపేసి ఆహరం చేసుకుంటాయి. పొరపాటున పులి కంటపడితే.. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు పెట్టాల్సిందే. అయితే తాజాగా ఓ జంతువు పులిని భయపెట్టించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఖాళీగా ఉన్న రోడ్డు మీద ఓ ఎద్దు దాని మానాన అది పరుగెత్తుకెళుతుంది. ఇంతలో రోడ్డు పక్కన దాక్కున్న పులి ఎద్దుని చూసి దాని మీదకు దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. పులిని చూసిన ఎద్దు ఎంతమాత్రం బెదరలేదు. అంతేగాక ఎద్దు తన కొమ్ములతో పొడిచేందుకు పులిని భయపెట్టింది. దీంతో ఎద్దుని చూసి బెంబేలెత్తిన పులి తొకముడుచుకొని వెనక్కి పారిపోయింది. తర్వాత ఎద్దు వెళ్లిపోయాక పులి దాని దారిలో అది వెళ్లిపోయింది. చదవండి: కొండచిలువతో పోట్లాడుతున్న కంగారు: వీడియో వైరల్ ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ భారత అటవీశాఖ అధికారి సుశాంత నంద ట్విటర్లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చి చేరుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘అన్నిరోజులు ఒకేలా ఉండవు.. పరిస్థితులు మారుతాయి. ఎవరైనా జాగ్రత్త పడాల్సిందే..’ అంటూ కామెంట్ చేస్తున్నారు. Courage is found in unlikely places… Bull scares away the tiger. This is not the behaviour apex predator that we know. Pressure of human presence is perhaps having a huge role. WA fwd pic.twitter.com/6A4kx39yVc — Susanta Nanda IFS (@susantananda3) August 30, 2022 -
దెయ్యం భయం.. ఊరు ఖాళీ!
సాక్షి, వేలేరుపాడు: ఆ ఊరి పొలిమేరల్లో ఓ పెద్ద బండరాయి.. దాని కింద ఓ సొరంగం.. అందులో ఉడుము రూపంలో ఎర్రమారి దెయ్యం.. నిత్యం బయట సంచరిస్తుంది.. కాలక్రమేణా ఆ సొరంగం మట్టితో పూడుకుపోయింది. ఇంకేం.. ఆ దెయ్యానికి కోపం వచ్చింది.. గ్రామస్తులను బలితీసుకోవడం మొదలుపెట్టింది.. అందుకే ఆ గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్నా ఇంకా ఇటువంటి మూఢాచారాలు జన జీవనాన్ని బెంబేలెత్తిస్తూనే ఉన్నాయనడానికి పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో మారుమూల గిరిజన గ్రామమైన కొర్రాజులగూడెం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇళ్లను సైతం పడగొట్టారు గ్రామంలో మొత్తం 40 గిరిజన కుటుంబాలుండేవి. పెంకుటిళ్ల కాలనీలతో పాటు, మూడు మంచినీటి బోర్లు, లక్షలాది రూపాయలు వెచ్చించి రహదారి కూడా నిర్మించారు. తొమ్మిదేళ్ల కిందట పక్కా పాఠశాల భవనాన్ని కూడా నిర్మించారు. గతేడాది మరో అదనపు పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ ఊరి పొలిమేరల్లో ఉన్న ఓ పెద్ద బండరాయి కింద ఉన్న సొరంగం రెండున్నరేళ్ల కిందట మట్టితో పూడిపోయింది. అదే ఏడాది గ్రామంలో వివిధ వ్యాధులతో కారం లక్ష్మయ్య, పరిశక లక్ష్మయ్య, బందం తమ్మయ్య, మిడియం రాములు మృతి చెందారు. మళ్లీ ఆరు నెలలకు మడివి చిన్నయ్య, కారం చిన్నక్క, సోడే రాజమ్మలు అనారోగ్యంతో మృతి చెందారు. ఇంకేముంది దీనికి ఎర్రమారి దెయ్యం ఆగ్రహమే కారణమని భయపడిన గ్రామస్తులు ఊరుని ఖాళీచేసి వెళ్లిపోయారు. గ్రామంలోని 30 పెంకుటిళ్లను సైతం పడగొట్టి.. కిలోమీటర్ దూరంలోని తారురోడ్డు ప్రాంతంలో పూరిగుడిసెలు నిర్మించుకున్నారు. అందుకే బలితీసుకుంటోంది.. ‘మా గ్రామంలో దెయ్యం ఉన్న సొరంగం మట్టితో పూడిపోవడంతో అది ఆగ్రహించి మా ఊరివాళ్లను బలితీసుకుంది’ అని ఆ గ్రామ పెద్దకాపులు తెల్లం సాయిబు, సోడే ముత్యాలు, కారం గంగులు ‘సాక్షి’తో చెప్పారు. అందువల్లనే ఊరు ఖాళీ చేశామని, ఇప్పుడు తమకు ప్రశాంతంగా ఉందన్నారు. గతంలో ఊరు అక్కడున్నప్పుడు 46 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో చదువుకునేవారు. గ్రామస్తులు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న ప్రాంతానికి అరకిలో మీటర్ దూరంలో ఉన్న ఈ పాఠశాలకు విద్యార్థులు వెళ్లకపోవడంతో ప్రభుత్వం మూసేసింది. దీంతో కొర్రాజులగూడేనికి చెందిన 18 మంది విద్యార్థులు కాలినడకన కిలోమీటరు దూరంలో ఉన్న చాగరపల్లి పాఠశాలకు వెళ్తున్నారు. బతుకుజీవుడా అంటూ బయటపడ్డాం.. ఆ దెయ్యం వల్ల మా వాళ్లను కోల్పోయాం. ఇంకా అక్కడే ఉంటే మమ్మలికూడా ఆ అది మింగేసేదే. అందుకే బతకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాం. వేరే చోట కొత్త ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. – కణితి శ్రీరాములు కొర్రాజులగుడెం గ్రామస్తుడు నన్నూ భయపెట్టారు.. ఈ పాఠశాలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేయడానికి ఇక్కడకొచ్చాను. ‘మీరు పాఠశాలకు ఎలా వెళుతున్నారు.. అక్కడ దెయ్యం ఉంది’ అంటూ నన్ను భయపెట్టారు. మొదట్లో కొంత భయపడ్డాను. తర్వాత నెమ్మదిగా భయం వీడి పాఠశాలకెళ్లాను. తర్వాత పాఠశాలను ప్రభుత్వమే మూసేసింది. ఇక్కడి విద్యార్థులను కిలోమీటరు దూరంలోని చాగరపల్లి పాఠశాలలో విలీనం చేశారు. ప్రస్తుతం చాగరపల్లి పాఠశాలలో పర్మినెంట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. కొర్రాజులగూడెం విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. – గుజ్జా శిరీష, అకడమిక్ ఇన్స్ట్రక్టర్ -
ప్రేమంటే అందరికీ భయమే!
లాస్ ఏంజిల్స్: ప్రేమ ఎంతటి వారినైనా గాయపరిచే అవకాశం ఉంది కాబట్టి అదంటే అందరికీ భయమే అంటున్నాడు ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్ జాన్ లెజెండ్. మోడల్ క్రిస్సీ టీజెన్‌ను పెళ్లాడిన ఈ 'ఆల్ ఆఫ్ మి' హిట్‌మేకర్.. రిలేషన్లో తమ భావోద్వేగాలను వెల్లడించడం పురుషులకు కష్టంతో కూడుకున్నది అని కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే పురుషులు తమ ఎమోషన్‌ను బయటకు కనిపించకుండా ఎప్పుడూ ఓ కవచాన్ని పెట్టుకుంటారని.. దాని నుంచి బయటపడి మహిళల వలే వారు ఎమోషన్‌ను స్వేచ్ఛగా చూపించరని బీబీసీతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. ఇక తన కొత్త ఆల్బమ్‌లో మూడేళ్ల కూతురు లూనాకు సంబంధించిన ఓ పాట ఉందని.. అది తనను ఎంతగానో ఉద్వేగానికి గురిచేసిన పాట అని, అది విన్న ప్రతిసారీ తనకు మంచి అనుభూతి కలుగుతోందని జాన్ లెజెండ్ తెలిపాడు. -
టపాసులకు కుక్కలు భయపడుతాయా?
న్యూఢిల్లీ: ఓ మనిషికి సాలె పరుగులంటే భయమనుకుందాం. సాలె పురుగులు గూళ్లు కట్టుకున్న ఓ గదిలోకి ఆ మనిషిని పంపించి తలుపులు మూసేశాం అనుకోండి. ఆ మనిషికి కదల్లేని స్థితి కూడా ఉందనుకోండి. అప్పుడు ఆ మనిషికి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి? దీపావళి టపాసులకు భయపడే కుక్కలకు ఏసీపి డ్రగ్ (అసెపోమజైన్)ను ఇచ్చినట్లయితే వాటి పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంటుంది. బాణాసంచా పేలుళ్లకు 45 శాతం కుక్కలు తీవ్రంగా భయపడుతాయి. ఆ శబ్దాలకు భయపడి గోలగోల చేస్తాయి. ఇల్లుపీకి పందిరేస్తాయి. ఆ బాధ నుంచి వాటిని తప్పించేందుకు జంతు వైద్యుల వద్దకెళితే వారు సాధారణంగా అసెపోజైన్ అనే మత్తు మందును సూచిస్తారు. ఆ మందును కుక్కలకు ఇవ్వడం వల్ల వాటి వినికిడి జ్ఞానం మరింత పెరుగుతుంది. అదే సమయంలో శరీరం మొద్దుబారిపోయి కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. బాణాసంచా పేలుళ్ల శబ్దాలు మరీ ఎక్కువగా వినిపించడం వల్ల అవి మానసికంగా అంతకుముందుకన్నా ఎక్కువగా ఆందోళన చెందుతాయి. ఆ శబ్దాలను దూరంగా పారిపోవాలనుకుంటాయి. అందుకు కాళ్లు, శరీరం సహకరించవు. కదలకుండా ఉండిపోతుంది. వాటిని చూసే యజమానులకు అవి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తాయి. బాణాసంచా పేలుళ్లకు భయపడకుండా ఉండేందుకు ‘డెక్సిమెడెటోమిడైన్’ అని మందును ఇవ్వాలంటూ ఇటీవల టీవీల్లో యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ మందు వల్ల వాటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఇంగ్లండ్‌లోని నట్టింగమ్ ట్రెంట్ యూనివర్శిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా పేలుళ్ల భయాందోళనల నుంచి పెంపుడు కుక్కలను రక్షించాలంటే ఏం చేయాలి? ఏ ప్రాంతంలో ఉంటే తన సురక్షితంగా ఉంటుందని ఆ కుక్క భావిస్తుందో అక్కడే దాన్ని ఉంచాలి. కుక్కకు ఓ ప్రత్యేక డెన్ ఉండి, చీకటి పడకముందే అ డెన్లోకి వెళ్లే అలవాటు ఉంటే అందులోకి తీసుకెళ్లాలి. యజమాని దగ్గరుంటేనే సురక్షితంగా ఉంటుందనుకుంటే ఆ యజమాని దగ్గరుంచాలి లేదా ఇంట్లోకి శబ్దం ఎక్కువ రాని గదిలో ఉంచి, తలుపులు, కిటికీలు మూసెయ్యాలి. వీలయితే మ్యూజిక్, లేదా టీవీ కార్యక్రమాలు బాణాసంచా పేలుళ్లు వినిపించని స్థాయిలో పెట్టాలి. వీటన్నింటికన్నా ఉత్తమమైన మార్గం కుక్క పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాటికి బాణాసంచా పేలుళ్ల శబ్దాలను క్రమంగా అలవాటు చేయాలి. అంటే దీపావళి పండుగకు రోడ్లపైకి తీసుకెళ్లడం కాదు. సీడీలు లేదా యూట్యూబ్ ద్వారా బాణాసంచా పేలుడు శబ్దాలను చిన్న స్థాయిలో వినిపిస్తూ క్రమంగా వ్యాల్యూమ్ పెంచుతూ పోతూ వాటికి అలవాటు చేయాలి. కొన్ని రోజుల్లోనే అవి ఆ సబ్దాలకు అలవాటు పడతాయి. -
నిబంధనలకు నీళ్లు
– ప్రైవేటు విద్యాసంస్థల్లో కరువైన సదుపాయాలు – తరచూ ప్రమాదాల బారిన పడుతున్న విద్యార్థులు హిందూపురం టౌన్ : తాగునీటి సౌకర్యం ఉండదు.. ఆటస్థలం ఉండదు.. మరుగుదొడ్డి ఉండదు.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు ఉండరు.. ఇలా ఏ సౌకర్యం లేకున్నా విద్యాశాఖ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి పాఠశాల, కళాశాలలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. పాఠశాల లేదా కళాశాలకు అనుమతి ఇవ్వాలంటే ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క నిబంధన పాటించకపోయినా విద్యాశాఖ వారు అనుమతి ఇస్తూ విద్యార్థుల ప్రమాదాలకు కారణమవుతున్నారు. అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదని చెబుతున్నారు. కానీ కొంతమంది ప్రైవేటు, కార్పొరేటు శక్తులు విద్యాశాఖ అధికారులను మామూళ్ల మత్తులో ముంచి అనుమతులు పొందుతున్నార నే ఆరోపణలు లేకపోలేదు. రూ.వేల ఫీజులు దండుకుంటూ తమ విద్యాసంస్థల్లోనే పుస్తకాలు, యూనిఫాం కొనాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు విధిలేక చెల్లిస్తున్నారు. పట్టణంలో మూడు కార్పొరేటు పాఠశాలలు, ఒక కార్పొరేటు కళాశాల, సుమారు 10 ప్రైవేటు కళాశాలలు, 52 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 50 శాతం విద్యాసంస్థలకు కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు. అయినా విద్యాశాఖ అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి– చంద్రశేఖర్‌రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పట్టణంలో నిబంధనలు అతిక్రమిస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల నిర్లక్ష్యంతో విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
అత్యవసర వైద్యం.. అందని దైన్యం
► అలంకారంగా సర్వజనాస్పత్రి ఏఎంసీ వార్డు ►పరీక్షలే కాదు.. సేవలూ అంతంతే ►తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఎవరికి ప్రాణం మీదికి వచ్చినా జిల్లాలో వెంటనే గుర్తొచ్చేది అనంతపురంలోని సర్వజనాస్పత్రి. ఇక నిరుపేదలకైతే ఇదే ఏకైక దిక్కు. అందువల్లే ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మేరకు వైద్యసేవలందించాల్సిన సర్వజనాస్పత్రిలో మాత్రం సౌకర్యాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పరికరాలు, సిబ్బంది సంఖ్య, వైద్యులు సేవలు కూడా అంతంత మాత్రమే కావడంతో ఇక్కడికి వస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం సిటీ: సర్వజనాస్పత్రిలోనిlఆక్యూప్ మెడికల్ కేర్ (ఏఎంసీ) వార్డులో ఎక్కువగా అత్యవసర కేసులకు సంబంధించిన రోగులకు చేర్చుకుంటారు. ప్రధానంగా విషం, పక్షవాతం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు చికిత్సలందిస్తారు. వార్డులో 30 దాకా పడకలున్నాయి. కానీ రోజూ ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉంటోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఐసీసీయూ వార్డులో 12 పడకలుండగా, అక్కడా అదే పరిస్థితి. పరికరాలే లేవు గుండెపోటు, పక్షవాతం వచ్చిన రోగులకు వ్యాధి నిర్ధారణ చేసేందుకు మానిటర్స్, వెంటిలేటర్స్ ఏఎంసీ వార్డులో లేవు. దీంతో రోగి ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాడో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ప్రధానంగా ఎంఆర్ఐ, గుండె జబ్బుకు సంబంధించిన రక్తపరీక్షలకు అవసరమైన పరికరాలు లేవు. ఇక మెడికల్ కళాశాల ఏర్పడి 16 ఏళ్లు గడిచినా కిడ్నీ డయాలసిస్‌కు సంబంధించిన వైద్యులు ఇక్కడ లేరు. బీ బ్రాండ్ డయాలసిస్ యూనిట్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ కింద ఏర్పాటు చేసినప్పటికీ.. కేవలం రెండు ఆర్డర్ కలిగిన వైద్యులతోనే సేవలు అందిస్తున్నారు. కిడ్నీ వ్యాధి నిపుణులైన డాక్టర్ సంజయ్‌ను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించినా, ఆయన నెలలో రెండు రోజుల్లో, అదీ 20 మంది రోగులకు మించి సేవలందించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఆయనకు ముందే నిర్దేశించిన రోజుల్లో రావడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్లెట్లెట్లు అందించాలన్నా కష్టమే ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే డయేరియాతో సర్వజనాస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య బాగా పెరిగింది. అయితే ఆస్పత్రిలో పడకల కొరత తీవ్రంగా ఉంది. ప్లేట్లెట్లు అందించాలన్నా...బ్లడ్ కాంపోసెట్ యూనిట్ కూడా పూర్తిగా పని చేయడం లేదు. ప్రస్తుతానికి ఈ విభాగంలో ఒక ప్రొఫెసర్, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ డాక్టర్లతో సేవలందిస్తున్నారు. వీరంతా ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఓపీ విభాగాల్లో, మధ్యాహ్నం నుంచి వార్డుల్లో చేరిన రోగులకు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో పని భారం పెరగడంతో మెరుగైన వైద్యం అందించలేకపోతున్నారు. ఉన్నవాటితోనే మెరుగైన వైద్యం అందిస్తున్నాం : –డాక్టర్ వెంకటేశ్వరరావు, మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ మా పరిధిలో ప్రతి రోగిని దగ్గరుండి చూసుకుంటున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకంటే దీటుగా చికిత్సలు అందిస్తున్నాం. ఇక్కడి వైద్యులు చాలా అనుభవం గలవారు. పరికరాల కొరత వాస్తవమే. ఆయినా ఆ విషయం..ఆస్పత్రి యాజమాన్యం చూసుకుంటుంది. ఉన్న పరికరాలతో మేం సేవలందిస్తున్నాం. రోగులు ఇబ్బంది పడకూడదన్నదే మా లక్ష్యం. -
చిరుతతో ఆరు గంటలు ఫైటింగ్
-
ఎక్సైజ్ డీసీ కార్యాలయంలో వ్యక్తి వీరంగం
కరీంనగర్ : కరీంనగర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. స్థానికంగా ఉన్న స్వాగత్ హోటల్ ముందు ఫాస్ట్‌పుడ్ సెంటర్‌ను నిర్వహించే అబ్దుల్లా అనే వ్యక్తి ఒక్కసారిగా కార్యాలయంలో చొరబడి అద్దాలు, ట్యూబ్ లైట్లు పగలగొట్టాడు. అనంతరం కార్యాలయం బయట ఉన్న రెండు బైక్‌లను ధ్వంసం చేశాడు. ఒక బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన వారిపై దాడి చేశాడు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడు నేపాల్‌కు చెందినవాడని, స్థానికంగా ఉన్న స్వాగత్ ఫాస్ట్‌పుడ్ సెంటర్ నడుపుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. -
వణుకుతున్న వైద్యులు!
నారాయణ (పేరు మార్చాం) ఓ ప్రైవేటు ప్యాక్టరీలో కార్మికుడు. చెయ్యి నుజ్జునుజ్జు అయ్యింది. నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు ఆపరేషన్ చేసి, చేయి తీసేయాలి బంధువుల్ని పిలిపించు మాట్లాడుదాం అని చెప్పారు. నాకెవ్వరూ లేరు, మీరే నాకు దేవుడు, ఆపరేషన్ చేయండి సార్ అంటూ ప్రాధేయపడ్డాడు. ఆమేరకు ఆవైద్యుడు ఆపరేషన్ చేసి ప్రాణాపాయం లేకుండా కాపాడారు. తాజాగా మీవల్లే చేయి పోయిందంటూ వైద్యుని ఎదుట బంధువులతో ఆందోళనకు దిగారు. వెంకారెడ్డి(పేరు మార్చాం) నగరంలోని ఓచిన్న పిల్లల ఆస్పత్రికి తన మూడేళ్ల బిడ్డను తీసుకెళ్లారు. అత్యవసర చికిత్సలను చిన్నపిల్లల వైద్యుడు చేపట్టారు. పరిస్థితి కొంచెం మెరుగుపడడంతో రెండురోజులు చికిత్స అందించారు. ఉన్నట్టుండి పరిస్థితి తిరగబడింది. మెరుగైన చికిత్సల కోసం ఎక్కడికైనా వెళ్లాలంటూ వైద్యుడు సూచనలు చేశారు. ఆ ప్రయత్నంలో ఉండగా బిడ్డ మృతి చెందారు. అందుకు మీరే కారకులంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ వెంటనే పెద్దమనుష్యుల జోక్యం.. పంచాయితీ.. సాక్షి ప్రతినిధి, కడప: పై రెండు ఘటనలు నగరంలో ఇటీవల చోటుచేసుకున్న ప్రత్యక్ష ఉదాహరణలు. రోజు రోజుకు వైద్యులు వారి సేవలు అందించాలంటే జంకుతున్నారనేందుకు నిదర్శనం. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు రోగులను ఆస్పత్రిలో చేర్చుకోవాలంటేనే భయపడిపోతున్నారు. రోగి బాగా తెలిసినవారు అయితే తప్ప వెనుకంజ వేస్తున్నారు. ఎంత చక్కగా సేవలు అందించినా నిందలు భరించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పెపైచ్చు సమాజంలో చులకన కావాల్సి వ స్తోందని వాపోతున్నారు. ఆవేదన కాదనలేనిదైనా.. వైద్యులు ఎవ్వరైనా రోగి ప్రాణాలు కాపాడాలనే దృక్పదమే అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఒకటి అర పొరపాట్లు జరిగిండోచ్చు. ఒకరిద్దరు వైద్యులు అత్యాశకు పోయి ఉండవచ్చు. అంతమాత్రాన వైద్యులందరినీ నిందించడం, వారినే క్రమం తప్పకుండా టార్గెట్ చేయడం తగదని పలువురు అంటున్నారు. తమ వారిని కోల్పోరుున వారి ఆవేదన తీరనిది అనడంలో ఎవరికీ సందేహంలేదు. అరుుతే సంయమనం కోల్పోరుు దాడులకు దిగడం, పంచాయతీల పేరుతో వ్యవహరించే తీరు అభ్యంతరకరం. ఇప్పటికే వైద్యులు అత్యవసర సేవలు అందించాలంటే వెనుకంజ వేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సర్జన్‌గా పేరున్న వైద్యులు సైతం ఆపరేషన్ చేయాలంటే కేవలం స్కానింగ్‌తో సరిపెట్టడం లేదు, ఎమ్మారై స్కానింగ్ సైతం చేయక తప్పడంలేదు. అందుకు కారణం ఆపరేషన్ వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయో అని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే. దీనివల్ల రోగి అదనంగా రూ.3 నుంచి రూ.4వేలు వరకూ భరించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పేదలకు సకాలంలో తక్షణం అందాల్సిన సేవలు సైతం అతిచూసీ జాగ్రత్తగా వైద్యులు మసులుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ పరిస్థితి ఏమాత్రం శ్రేయష్కరం కాదనడంలో సందేహంలేదు. తెరపైకి వస్తున్న సామాజిక, రాజకీయ వర్గాలు... ఫలానా వైద్యుడు వల్ల వ్యక్తి చనిపోయాడు అంటేనే ఆయా సామాజిక వర్గాలు, కొందరు నేతలు చేరి ఇబ్బంది పెడుతుండడంతో వ్యవహారం పక్కదారి పడుతోంది. చర్చలు అంటూనే వైద్యున్ని పీడించడం, లేదంటే దౌర్జన్యం చేయడం, సమాజంలో అభాసుపాలయ్యేలా వ్యవహరించడం లాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు మానసిక ఒత్తిడికి లోనవుతూ మరోమారు రోగులకు చికిత్సలు చేయాలంటే ముందస్తు ఆలోచన చేస్తున్నారు. వాస్తవంగా వైద్యుని తప్పుంటే అందుకు చట్టాలు ఉన్నాయి. వైద్యులు సైతం చట్టానికి అతీతులు కారు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్షదాడులకు, బెదిరింపులకు దిగడం ఏమాత్రం శ్రేయష్కరమో విజ్ఞనులు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది.