కరీంనగర్ : కరీంనగర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. స్థానికంగా ఉన్న స్వాగత్ హోటల్ ముందు ఫాస్ట్‌పుడ్ సెంటర్‌ను నిర్వహించే అబ్దుల్లా అనే వ్యక్తి ఒక్కసారిగా కార్యాలయంలో చొరబడి అద్దాలు, ట్యూబ్ లైట్లు పగలగొట్టాడు. అనంతరం కార్యాలయం బయట ఉన్న రెండు బైక్‌లను ధ్వంసం చేశాడు. ఒక బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన వారిపై దాడి చేశాడు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడు నేపాల్‌కు చెందినవాడని, స్థానికంగా ఉన్న స్వాగత్ ఫాస్ట్‌పుడ్ సెంటర్ నడుపుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.