Psyco
-
సైకో ప్రేమికుడి హల్చల్
సాక్క్షి, హైదరాబాద్ : గోషామహల్‌లోని షాహీనాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తోన్న బాలు అనే యువకుడు, చుడీబజార్లోని ఓ దుకాణంలో పనిచేస్తోన్న యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. రోజూ ఆ యువతి పనిచేస్తోన్న దుకాణం వద్దకు వెళ్లి ఇబ్బంది పెడుతున్నాడు. బాలును గమనించి స్థానికులు మందలించారు. కోపోద్రిక్తుడై సైకోగా మారిన బాలు, మరో మైనర్ బాలుడి సహాయంతో స్థానికులపై కత్తులతో దాడి చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సంఘటనాస్థలానికి వచ్చి ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుపై గతంలో ఆయా పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఇదివరకే నమోదైనట్లు గుర్తించారు. ఈ సారి బాలుపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికుడి హత్య
తలపై కిరాతకంగా మోది చంపిన ఉన్మాది కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో కలకలం కొవ్వూరు రూరల్: ఎక్కడి నుంచి వచ్చాడో.. ఎందుకు వచ్చాడో తెలియదు కాని ఓ వృద్ధుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ ఉన్మాది. చూడటానికి మతిస్థిమితం లేని వ్యక్తిగా కన్పిస్తున్నా దారుణంగా పంచాయతీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న వ్యక్తిని హతమార్చిన ఘటన కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో మంగళవారం వేకువజామున 5.20 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో కలకలం రేగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐ.పంగిడి శివాలయం వద్ద ఉన్న చెరువుకు పంచాయతీ ఆధ్వర్యంలో వాకింగ్ ట్రాక్ నిర్మించి మొక్కలు నాటారు. సంపూర్ణ పారిశుద్ధ్యంలో భాగంగా అక్కడ ఎవరూ బహిరంగ మలవిసర్జన చేయకుండా పంచాయతీ కాంట్రాక్టు కార్మికుడైన ముప్పిడి చిన నాగయ్య (59)కు పరిశీలనా బాధ్యతలు అప్పగించారు. రోజూలానే మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నాగయ్య విధులు నిర్వహించేందుకు అక్కడకు వెళ్లాడు. అదే సమయంలో పలువురు వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాడని వాకింగ్ చేస్తున్న మహిళలు చిన నాగయ్య దృష్టికి తీసుకువచ్చారు. చిన నాగయ్య అతని వద్దకు వెళ్లి ఇక్కడ ఉండకూడదు వెళ్లిపోవాలని సూచించాడు. దీనిపై ఆగ్రహించిన ఆ వ్యక్తి నాగయ్యపై దాడికి ఉపక్రమించి అతడిని కిందకు తోచి చేతిలో ఉన్న కర్రతో విచక్షణారహితంగా తలపై మోదాడు. దీంతో నాగయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అదే సమయంలో వాకింగు చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానిక సర్పంచ్ భర్త పీకే రంగారావు, మరికొందరు ఇక్కడకు చేరుకుని ఉన్మాదిని పట్టుకున్నారు. కొవ్వూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఎం.శ్యాంసుందరరావు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నాగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే హత్య చేసిన వ్యక్తి ఉన్మాదా.. లేక మతిస్థిమితం కోల్పోయినా వ్యక్తా అనేది తేలాల్సి ఉంది. 15 ఏళ్లుగా ఇదే వృత్తిలో.. ఉన్మాది దాడిలో మృతిచెందిన ముప్పిడి చిన నాగయ్య 15 ఏళ్లుగా ఐ.పంగిడి పంచాయతీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సౌమ్యుడిగా పేరున్న అతను వాకింగు ట్రాక్ వద్ద పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు. చిన నాగయ్యకు భార్య వెంకాయమ్మ, వివాహమైన కుమార్తె మరియమ్మ ఉన్నారు. -
ప్రేమోన్మాది కలకలం
-
'సినిమాల ప్రభావంతోనే ఆ హత్యలు'
-
'సినిమాల ప్రభావంతోనే ఆ హత్యలు'
నెల్లూరు: చిల్డ్రన్స్ పార్క్ వద్ద దోపిడి, హత్య ఘటనలో కీలక నిందితుడు సైకో వెంటేశ్వర్లును పోలీసులు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. గతంలో కావలి, పెద్దచెరుకూరులో పలు హత్యలు చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సెటాప్ బాక్సులు రిపేర్ చేయాలని ఇంట్లోకి ప్రవేశించి.. నగదు, నగలు దోచుకొని హత్యలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. సినిమాల ప్రభావంతో వెంకటేశ్వర్లు హత్యలకు పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. శనివారం నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఆడిటర్ నాగేశ్వరరావు ఇంట్లోకి దోపిడీ దొంగలు చొరబడి భారీ స్థాయిలో నగలు, నగదు దోచుకోవడమేకాక కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో నాగేశ్వరరావు భార్య ప్రభావతి మృతి చెందగా.. కుమారుడు, కుమార్తె గాయపడ్డారు. సైకో వెంకటేశ్వర్లు పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. -
సైకో దాడిలో చిన్నారి సహా పలువురికి గాయాలు
బూర్గంపాడు (ఖమ్మం): ఖమ్మం జిల్లా బూర్గంపాడు శివారులో మంగళవారం ఓ ఉన్మాది జరిపిన రాళ్ల దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. ఇతడు ముందుగా భద్రాచలం నుంచి మణుగూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేయడంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వస్తున్న ఆటోపై కూడా దాడి చేశాడు. అందులోని ఏడాది వయసున్న సుస్మితకు తీవ్ర గాయమైంది. మరో ఆటోపై కూడా దాడి చేశాడు. ఆ ఆటో డ్రైవర్, అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. వాహన చోదకులు, ప్రయాణికులు అతి కష్టమీద అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సైకో తన వివరాలేవీ చెప్పడం లేదు. ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాడిగా స్థానికులు భావిస్తున్నారు. -
సైకోగా మారిన కల్తీ కల్లు బాధితుడు
కల్లులో మత్తు తగ్గడంతో కల్లుప్రియులు వింతగా ప్రవర్తిస్తున్నారు. జగిత్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాస జలపతి కల్తీకల్లుకు బానిసయ్యూడు. 15 రోజులుగా కల్లులో మత్తు తగ్గడంతో వికృత చేష్టలకు దిగుతున్నాడు. దీంతో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. బుధవారం ఉదయం భార్య రాధతో గొడవపడి ఆమెనుగోడకు కొట్టడంతో కోమాలోకి వెళ్లింది. వెంటనే ఆమెను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, జలపతి గతేడాది కల్లు తాగొచ్చి మత్తులో భూమి హద్దుల విషయంలో సోదరుడు జలేంధర్‌ను గడ్డపారతో తలపై మోది హత్య చేసిన ఘటనలో నిందితుడు. మరో ఘటనలో సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన శ్రీరాముల రాజయ్య(55) కల్లులో మత్తు తక్కువై వింతగా ప్రవర్తించడంతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. 21న వైద్యసిబ్బందికి చెప్పకుండానే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణ శివారులో చెరువు సమీపంలో బుధవారం రాజయ్య శవమై కనిపించాడు. కల్లు తాగే అలవాటున్న రాజయ్య మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. -
సైకో వీరంగం.. యువతికి తీవ్రగాయాలు
ఉమ్మడి రాజధాని నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఏకంగా హాస్టల్లో ఉన్న అమ్మాయిపై ఓ సైకో దాడి చేశాడు. ఈ ఘటన సంజీవరెడ్డి నగర్లో చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉన్న సాయి లేడీస్ హాస్టల్లోకి సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓ యువకుడు కత్తితో ప్రవేశించాడు. తిరుపతికి చెందిన మమత(21) ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. ఆమెపై అతడు దాడి చేయడంతో ఆమెకు తలపై తీవ్ర గాయాలయ్యాయి. కాగా సైకో తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనది ఉప్పల్ అని ఓసారి, వరంగల్ అని మరోసారి చెబుతున్నాడు. పేరు అడిగితే చైతన్య అని ఓసారి, కరణ్ అని ఇంకోసారి చెప్పాడు. తాను తన అన్న బిడ్డను కలిసేందుకు వస్తే.. తనపైనే దాడి చేశారని అన్నాడు. అయితే, అతడు ఎవరో ఒక అమ్మాయిని చంపాలనే లక్ష్యంతో వచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమీర్‌పేట, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో ఎక్కడా అసలు సెక్యూరిటీ అన్నది ఉండట్లేదు. ఈ విషయంలో పోలీసులు గతంలో జారీచేసిన నోటీసులను హాస్టళ్ల యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందుకే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. -
ఎక్సైజ్ డీసీ కార్యాలయంలో వ్యక్తి వీరంగం
కరీంనగర్ : కరీంనగర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. స్థానికంగా ఉన్న స్వాగత్ హోటల్ ముందు ఫాస్ట్‌పుడ్ సెంటర్‌ను నిర్వహించే అబ్దుల్లా అనే వ్యక్తి ఒక్కసారిగా కార్యాలయంలో చొరబడి అద్దాలు, ట్యూబ్ లైట్లు పగలగొట్టాడు. అనంతరం కార్యాలయం బయట ఉన్న రెండు బైక్‌లను ధ్వంసం చేశాడు. ఒక బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన వారిపై దాడి చేశాడు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడు నేపాల్‌కు చెందినవాడని, స్థానికంగా ఉన్న స్వాగత్ ఫాస్ట్‌పుడ్ సెంటర్ నడుపుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.