సైకో ప్రేమికుడి హల్‌చల్‌ | Psycho Lover Hulchul In Hyderabad | Sakshi
Sakshi News home page

సైకో ప్రేమికుడి హల్‌చల్‌

Published Tue, Jun 5 2018 6:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Psycho Lover Hulchul In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్క్షి, హైదరాబాద్‌ : గోషామహల్‌లోని షాహీనాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.  స్థానికంగా నివసిస్తోన్న బాలు అనే యువకుడు, చుడీబజార్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోన్న యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. రోజూ ఆ యువతి పనిచేస్తోన్న దుకాణం వద్దకు వెళ్లి ఇబ్బంది పెడుతున్నాడు. బాలును గమనించి స్థానికులు మందలించారు.

కోపోద్రిక్తుడై సైకోగా మారిన బాలు, మరో మైనర్‌ బాలుడి సహాయంతో స్థానికులపై కత్తులతో దాడి చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సంఘటనాస్థలానికి వచ్చి ఇద్దరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుపై గతంలో ఆయా పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు ఇదివరకే నమోదైనట్లు గుర్తించారు. ఈ సారి బాలుపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement