కల్లులో మత్తు తగ్గడంతో కల్లుప్రియులు వింతగా ప్రవర్తిస్తున్నారు. జగిత్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాస జలపతి కల్తీకల్లుకు బానిసయ్యూడు. 15 రోజులుగా కల్లులో మత్తు తగ్గడంతో వికృత చేష్టలకు దిగుతున్నాడు. దీంతో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. బుధవారం ఉదయం భార్య రాధతో గొడవపడి ఆమెనుగోడకు కొట్టడంతో కోమాలోకి వెళ్లింది. వెంటనే ఆమెను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, జలపతి గతేడాది కల్లు తాగొచ్చి మత్తులో భూమి హద్దుల విషయంలో సోదరుడు జలేంధర్‌ను గడ్డపారతో తలపై మోది హత్య చేసిన ఘటనలో నిందితుడు.
మరో ఘటనలో సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన శ్రీరాముల రాజయ్య(55) కల్లులో మత్తు తక్కువై వింతగా ప్రవర్తించడంతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. 21న వైద్యసిబ్బందికి చెప్పకుండానే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణ శివారులో చెరువు సమీపంలో బుధవారం రాజయ్య శవమై కనిపించాడు. కల్లు తాగే అలవాటున్న రాజయ్య మరణం పలు అనుమానాలకు తావిస్తోంది.
సైకోగా మారిన కల్తీ కల్లు బాధితుడు
Published Wed, Sep 23 2015 10:15 PM | Last Updated on Sat, Apr 6 2019 8:51 PM
Advertisement
Advertisement