మహేదేవ్‌పూర్: కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని మహేదేవ్ పూర్ మండలంలో ఈ తనిఖీలు చేపట్టారు. సారా బట్టీలపై దాడులు చేసిన పోలీసులు 15 లీటర్ల సారాతో పాటు, 400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సారా తయారీ దారులపై కేసు నమోదు చేశారు.