వణుకుతున్న వైద్యులు!
నారాయణ (పేరు మార్చాం) ఓ ప్రైవేటు ప్యాక్టరీలో కార్మికుడు. చెయ్యి నుజ్జునుజ్జు అయ్యింది. నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు ఆపరేషన్ చేసి, చేయి తీసేయాలి బంధువుల్ని పిలిపించు మాట్లాడుదాం అని చెప్పారు. నాకెవ్వరూ లేరు, మీరే నాకు దేవుడు, ఆపరేషన్ చేయండి సార్ అంటూ ప్రాధేయపడ్డాడు. ఆమేరకు ఆవైద్యుడు ఆపరేషన్ చేసి ప్రాణాపాయం లేకుండా కాపాడారు. తాజాగా మీవల్లే చేయి పోయిందంటూ వైద్యుని ఎదుట బంధువులతో ఆందోళనకు దిగారు.
వెంకారెడ్డి(పేరు మార్చాం) నగరంలోని ఓచిన్న పిల్లల ఆస్పత్రికి తన మూడేళ్ల బిడ్డను తీసుకెళ్లారు. అత్యవసర చికిత్సలను చిన్నపిల్లల వైద్యుడు చేపట్టారు. పరిస్థితి కొంచెం మెరుగుపడడంతో రెండురోజులు చికిత్స అందించారు. ఉన్నట్టుండి పరిస్థితి తిరగబడింది. మెరుగైన చికిత్సల కోసం ఎక్కడికైనా వెళ్లాలంటూ వైద్యుడు సూచనలు చేశారు. ఆ ప్రయత్నంలో ఉండగా బిడ్డ మృతి చెందారు. అందుకు మీరే కారకులంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ వెంటనే పెద్దమనుష్యుల జోక్యం.. పంచాయితీ..
సాక్షి ప్రతినిధి, కడప: పై రెండు ఘటనలు నగరంలో ఇటీవల చోటుచేసుకున్న ప్రత్యక్ష ఉదాహరణలు. రోజు రోజుకు వైద్యులు వారి సేవలు అందించాలంటే జంకుతున్నారనేందుకు నిదర్శనం. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు రోగులను ఆస్పత్రిలో చేర్చుకోవాలంటేనే భయపడిపోతున్నారు. రోగి బాగా తెలిసినవారు అయితే తప్ప వెనుకంజ వేస్తున్నారు. ఎంత చక్కగా సేవలు అందించినా నిందలు భరించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పెపైచ్చు సమాజంలో చులకన కావాల్సి వ స్తోందని వాపోతున్నారు.
ఆవేదన కాదనలేనిదైనా..
వైద్యులు ఎవ్వరైనా రోగి ప్రాణాలు కాపాడాలనే దృక్పదమే అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఒకటి అర పొరపాట్లు జరిగిండోచ్చు. ఒకరిద్దరు వైద్యులు అత్యాశకు పోయి ఉండవచ్చు. అంతమాత్రాన వైద్యులందరినీ నిందించడం, వారినే క్రమం తప్పకుండా టార్గెట్ చేయడం తగదని పలువురు అంటున్నారు. తమ వారిని కోల్పోరుున వారి ఆవేదన తీరనిది అనడంలో ఎవరికీ సందేహంలేదు. అరుుతే సంయమనం కోల్పోరుు దాడులకు దిగడం, పంచాయతీల పేరుతో వ్యవహరించే తీరు అభ్యంతరకరం.
ఇప్పటికే వైద్యులు అత్యవసర సేవలు అందించాలంటే వెనుకంజ వేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సర్జన్‌గా పేరున్న వైద్యులు సైతం ఆపరేషన్ చేయాలంటే కేవలం స్కానింగ్‌తో సరిపెట్టడం లేదు, ఎమ్మారై స్కానింగ్ సైతం చేయక తప్పడంలేదు. అందుకు కారణం ఆపరేషన్ వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయో అని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే.
దీనివల్ల రోగి అదనంగా రూ.3 నుంచి రూ.4వేలు వరకూ భరించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పేదలకు సకాలంలో తక్షణం అందాల్సిన సేవలు సైతం అతిచూసీ జాగ్రత్తగా వైద్యులు మసులుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ పరిస్థితి ఏమాత్రం శ్రేయష్కరం కాదనడంలో సందేహంలేదు.
తెరపైకి వస్తున్న సామాజిక, రాజకీయ వర్గాలు...
ఫలానా వైద్యుడు వల్ల వ్యక్తి చనిపోయాడు అంటేనే ఆయా సామాజిక వర్గాలు, కొందరు నేతలు చేరి ఇబ్బంది పెడుతుండడంతో వ్యవహారం పక్కదారి పడుతోంది. చర్చలు అంటూనే వైద్యున్ని పీడించడం, లేదంటే దౌర్జన్యం చేయడం, సమాజంలో అభాసుపాలయ్యేలా వ్యవహరించడం లాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
ఈ క్రమంలో వైద్యులు మానసిక ఒత్తిడికి లోనవుతూ మరోమారు రోగులకు చికిత్సలు చేయాలంటే ముందస్తు ఆలోచన చేస్తున్నారు. వాస్తవంగా వైద్యుని తప్పుంటే అందుకు చట్టాలు ఉన్నాయి. వైద్యులు సైతం చట్టానికి అతీతులు కారు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్షదాడులకు, బెదిరింపులకు దిగడం ఏమాత్రం శ్రేయష్కరమో విజ్ఞనులు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది.