Physician
-
Dwarkanath Kotnis: భారత, చైనా మైత్రికి స్ఫూర్తి
భారత – చైనా దేశాల మధ్య స్నేహానికి స్ఫూర్తి డాక్టర్ ద్వారాకానాథ్ శాంతారాం కోట్నిస్. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ కాలంలో ఆయన జీవితం నుండి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. డాక్టర్ కోట్నిస్ 1910 అక్టోబరు 10న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతం అవుతుండగా, జపాన్ ఫాసిస్టుల దురాక్రమణకు చైనా గురైనకాలం అది. ఈ సమయంలో చైనాకు చెందిన జనరల్ ఛూటే తమ సైనికులకు వైద్యసహాయం అందించటానికి డాక్టర్లను పంపమని జవహర్లాల్ నెహ్రూను కోరారు. ఆ మేరకు 1938లో చైనాకు పంపబడిన 5 మంది డాక్టర్ల బృందంలో 27 ఏళ్ల డాక్టర్ కోట్నిస్ ఒకరు. డాక్టర్ కోట్నిస్, ఆయన బృందం గాయపడిన చైనా సైనికులకు రోజుకు 800 మందికి వైద్యసహాయం అందించేవారు. బృందంలోని డాక్టర్లు తిరిగి ఇండియాకు వచ్చినా కోట్నిస్ అక్కడే ఉండి పోయారు. 1941లో చైనాలోని నార్మన్ బెతూన్ అంతర్జాతీయ శాంతి హాస్పిటల్‌కు ఆయన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1941 డిసెంబరులో ఆయన అక్కడే యుద్ధ రంగంలో పనిచేస్తున్న ఒక చైనా నర్సును వివాహ మాడారు. వారికి కల్గిన కుమారునికి ‘ఇన్ హువా’ అని పేరు పెట్టారు. ఇన్ అంటే ఇండియా, హువా అంటే చైనా అని అర్థం. 1942లో ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. అవిశ్రాంతంగా పనిచేసిన కోట్నిస్‌కు అక్కడి అతిశీతల వాతావరణం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. అందుకే తన కుమారుడు జన్మించిన కొద్ది నెలలకే 1942 డిసెంబరు 9న మూర్ఛవ్యాధితో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే. ఆయన చనిపోయినపుడు ‘‘చైనా సైన్యం ఒక ఆపన్నహస్తాన్ని పోగొట్టుకుంది. చైనాదేశం ఒక స్నేహితుణ్ణి కోల్పోయింది. డాక్టర్ కోట్నిస్ అంతర్జాతీయ స్ఫూర్తిని మనం ఎల్లప్పుడూ మన మనస్సులలో పదిలపరచుకోవాలి’’ అని చైనా విప్లవ నాయకుడు కామ్రేడ్ మావో యువ డాక్టరుకు ఘనంగా నివాళులర్పించారు. చైనా కోట్నిస్ స్మృతికి గుర్తుగా చైనాలోని కొన్ని నగరాలలో వైద్యశాలలు, విగ్రహాలు, స్థూపాలు నిర్మించింది. చైనా నాయకులు ఇండియా పర్యటనకువచ్చినప్పుడల్లా డాక్టర్ కోట్నిస్ కుటుంబసభ్యులను తప్పనిసరిగా కలవటం ఒక ఆనవాయితీ. ప్రస్తుతం ఇరుదేశాల మధ్యగల సరిహద్దు తగాదాను సామరస్యంగాను, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోను పరిష్కరించుకోవాలి. భారత, చైనా దేశాల మైత్రికి సంకేతంగానూ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి ప్రతీకగానూ నిలిచిన డాక్టర్ కోట్నిస్ ఉద్వేగభరిత జీవితం నుండి స్ఫూర్తిని పొంది భారత, చైనా మైత్రీ ఉద్యమాన్ని నిర్మించటం నేటి తక్షణ కర్తవ్యం. (క్లిక్ చేయండి: తెలుగు నేలపై చైతన్య యాత్ర) – సి. భాస్కర్, యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) (డాక్టర్ కోట్నిస్ 80వ వర్ధంతి సందర్భంగా) -
వైద్య రహస్యం చెప్పలేదని.. ఏడాదిన్నరపాటు గదిలో బంధించి..
మైసూరు: మూడేళ్ల కిందట మైసూరులో అదృశ్యమైన నాటు వైద్యుడు షాబాద్ షరీఫ్ (48) హత్యకు గురైనట్లు తెలిసింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సరస్వతీ పురం పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. షరీఫ్ పూర్వీకులు ఎంతోకాలం నుంచి పైల్స్, ఫిస్టులాకు వైద్యం చేసేవారు. ఇందులో రహస్యం తెలుసుకోవాలని కేరళ మలప్పురం జిల్లా నీలాంబూర్‌కు చెందిన షైబీన్ అష్రఫ్, మరికొందరు కలిసి తమవారికి పైల్స్ ఆపరేషన్ చేయాలని చెప్పి 2019 ఆగస్టులో షరీఫ్‌ను కారులో కేరళకు తీసుకెళ్లారు. అతన్ని సుమారు యేడాదిన్నరపాటు ఒక గదిలో బంధించి పైల్స్, ఫిస్టులా చికిత్సా రహస్యాలను చెప్పాలని హింసించారు. కానీ ఫరీఫ్ నోరు విప్పలేదు. దీంతో దుండగులు అతన్ని ముక్కలుగా నరికిచంపి ప్లాస్టిక్ కవరులో కట్టి నదిలో పడేశారు. ఈ కేసు మిస్టరీ అనుకోకుండా వీడింది. నీలాంబూర్‌లో నిందితుడు అష్రఫ్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో నాటు వైద్యుని హత్య కేసు వివరాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి పోలీసులు మైసూరుకు వచ్చి మరింత దర్యాప్తు చేసి నిర్ధారించారు. నలుగురిని అరెస్టు చేశారు. చదవండి: నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి -
‘పూల’బాట!
చౌటుప్పల్: అతని వృత్తి వైద్యం.. ప్రవృత్తి వ్యవసాయం. అమెరికాలో ఉన్నత స్థానంలో ఓ వైద్యుడు ఇక్కడ సేద్యం వైపు అడుగులు వేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. విలాసవంతమైన జీవితం ఉన్నా.. సాధారణ రైతులా వ్యవహరి స్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనే హర్షారెడ్డి. నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన ఎరమాద రామచంద్రారెడ్డి–భారతి దంపతుల కుమారుడే హర్షారెడ్డి. చౌటుప్పల్ మండలం ఖైతాపురంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నాలుగున్నర ఎకరాలు భూమిని హర్షారెడ్డి కొనుగోలు చేశాడు. తన మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు 2016లో ప్రభుత్వ సబ్బిడీపై మూడున్నర ఎకరాల్లో మూడు పాలీహౌస్‌లు ఏర్పాటు చేశాడు. పాలీహౌస్లో జర్బెరా పూల సాగు పాలీహౌస్లో హర్షారెడ్డి జర్బెరా పూల సాగును ఎంచుకున్నాడు. మహారాష్ట్రలోని పుణె నుంచి ప్రత్యేకంగా జర్బెరా నారు తెప్పించారు. ఒక్కో మొక్క రూ. 28 నుంచి 30 చొప్పున కొనుగోలు చేశాడు. ఎకరానికి 24 వేల మొక్కలు నాటాడు. ఎకరం సాగులో ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు వేల వరకు పూల దిగుబడి వస్తుంది. మొక్కల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పూల మొక్కలపై హర్షారెడ్డి వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. రోజువారీగా మొక్కల సంరక్షణలపై షీట్ తయారు చేస్తారు. పుణేలో ఉన్న హార్టికల్చర్ సాగు నిపుణుడు విజయ్ తురాట్ అవసరాన్ని బట్టి ఇక్కడకు రప్పిస్తారు. సాగుకు అవసరమయ్యే నీటి కోసం ప్రాంగణంలో పెద్ద బావిని తవ్వారు. వర్షం నీరు ఇందులోకి వచ్చేలా పైప్లైన్లను వేశారు. 15 రోజులు అక్కడ.. 15 రోజులు ఇక్కడ.. హర్షారెడ్డి 15 రోజులపాటు అమెరికాలో ఉంటే మరో 15 రోజులు ఖైతాపురంలో ఉండేలా షెడ్యూల్‌ను తయారు చేసుకున్నారు. అమెరికాలో ఉన్నప్పుడు పూల సాగుకు సంబంధించిన వ్యవహారాలు చేపట్టలేకపోతున్నానన్న బాధ లేకుండా తన పాలీహౌజ్‌లో పూర్తిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాల పనితీరును తన సెల్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకున్నాడు. పూలు తెంపడం నుంచి ప్యాకింగ్ చేసి మార్కెట్‌కు తీసుకెళ్లే వాహనంలో వేసుకునేంత వరకు పూర్తిగా సీసీ కెమెరాలోనే చూసుకుంటున్నాడు. జర్బెరా పూలకు మంచి డిమాండ్.. ప్రస్తుతం జర్బెరా పూలకుమార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎకరానికి ప్రతిరోజూ మూడు నుంచి 4 వేల పూల దిగుబడి రానుంది. ఇక్కడి దిగుబడులను హైదరాబాద్‌లోని గుడిమల్కా పురం మార్కెట్‌కు తీసుకెళ్తారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు వచ్చినా అమ్ముతారు. ఒక్క పూవు ఉత్పత్తికి రూ. 1.50 ఖర్చు వస్తుంది. ఇదే పువ్వును విక్రయిస్తే సీజన్లో రూ.2.50 నుంచి రూ.3 వరకు ఆదాయం వస్తుంది. సీజన్ లేని సమయంలో ఒక్కో పువ్వుకు రూ.2.00 తగ్గకుండా ఆదాయం సమకూరుతుంది. ఏడాదిలో సుమారుగా ఐదారు నెలలపాటు మంచి సీజన్ ఉండడంతో ఆ రోజుల్లో మంచి లాభాలు సమకూరనున్నాయి. పూల సేద్యం సంతృప్తినిస్తుంది: హర్షారెడ్డి ప్రముఖ వైద్యుడిగా అమెరికాలో ఉద్యోగంలో ఉన్నా నాకు అంతగా తృప్తి కలుగలేదు. స్థాని కంగా మరేదో చేయాలన్న తపన నిరంతరం ఉండేది. ఆ సమయంలో తన మిత్రుడు పాలీ హౌజ్ నిర్వహణపై సూచన చేయడంతో పూల సాగును ఎంచుకున్నాను. నెలలో 15 రోజులు అక్కడ, మరో 15రోజులు ఇక్కడ ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సాగులో ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి ఆదాయమే వస్తుం ది. అమెరికాలో ఉన్నా సెల్లో పర్య వేక్షిస్తుంటా. ఇక్కడ అనుభవంతో కూడిన సిబ్బంది ఉండడంతో తనకు కొంత రిస్క్ తగ్గింది. తన వలన మరో 12 మందికి ఉపాది లభిస్తుండడం తనకు సంతోషానిస్తుంది. -
ముగిసిన ఫిజీషియన్ల రాష్ట్రస్థాయి సదస్సు
ఎంజీఎం : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం మెడిసిన్ విభాగంలో ఆధ్వర్యంలో సంయుక్తగా నిర్వహిస్తున్న రెం డు రోజుల ఫిజీషియన్ల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగి సింది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ వైద్యులు మాట్లాడా రు. వరంగల్ ఫిజిషియన్ల చాప్టర్ అధ్యక్షులు వి.చంద్రశేఖర్, ప్రధానకార్యదర్శి పవన్, కోశాధికారి జి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
వణుకుతున్న వైద్యులు!
నారాయణ (పేరు మార్చాం) ఓ ప్రైవేటు ప్యాక్టరీలో కార్మికుడు. చెయ్యి నుజ్జునుజ్జు అయ్యింది. నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు ఆపరేషన్ చేసి, చేయి తీసేయాలి బంధువుల్ని పిలిపించు మాట్లాడుదాం అని చెప్పారు. నాకెవ్వరూ లేరు, మీరే నాకు దేవుడు, ఆపరేషన్ చేయండి సార్ అంటూ ప్రాధేయపడ్డాడు. ఆమేరకు ఆవైద్యుడు ఆపరేషన్ చేసి ప్రాణాపాయం లేకుండా కాపాడారు. తాజాగా మీవల్లే చేయి పోయిందంటూ వైద్యుని ఎదుట బంధువులతో ఆందోళనకు దిగారు. వెంకారెడ్డి(పేరు మార్చాం) నగరంలోని ఓచిన్న పిల్లల ఆస్పత్రికి తన మూడేళ్ల బిడ్డను తీసుకెళ్లారు. అత్యవసర చికిత్సలను చిన్నపిల్లల వైద్యుడు చేపట్టారు. పరిస్థితి కొంచెం మెరుగుపడడంతో రెండురోజులు చికిత్స అందించారు. ఉన్నట్టుండి పరిస్థితి తిరగబడింది. మెరుగైన చికిత్సల కోసం ఎక్కడికైనా వెళ్లాలంటూ వైద్యుడు సూచనలు చేశారు. ఆ ప్రయత్నంలో ఉండగా బిడ్డ మృతి చెందారు. అందుకు మీరే కారకులంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ వెంటనే పెద్దమనుష్యుల జోక్యం.. పంచాయితీ.. సాక్షి ప్రతినిధి, కడప: పై రెండు ఘటనలు నగరంలో ఇటీవల చోటుచేసుకున్న ప్రత్యక్ష ఉదాహరణలు. రోజు రోజుకు వైద్యులు వారి సేవలు అందించాలంటే జంకుతున్నారనేందుకు నిదర్శనం. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు రోగులను ఆస్పత్రిలో చేర్చుకోవాలంటేనే భయపడిపోతున్నారు. రోగి బాగా తెలిసినవారు అయితే తప్ప వెనుకంజ వేస్తున్నారు. ఎంత చక్కగా సేవలు అందించినా నిందలు భరించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పెపైచ్చు సమాజంలో చులకన కావాల్సి వ స్తోందని వాపోతున్నారు. ఆవేదన కాదనలేనిదైనా.. వైద్యులు ఎవ్వరైనా రోగి ప్రాణాలు కాపాడాలనే దృక్పదమే అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఒకటి అర పొరపాట్లు జరిగిండోచ్చు. ఒకరిద్దరు వైద్యులు అత్యాశకు పోయి ఉండవచ్చు. అంతమాత్రాన వైద్యులందరినీ నిందించడం, వారినే క్రమం తప్పకుండా టార్గెట్ చేయడం తగదని పలువురు అంటున్నారు. తమ వారిని కోల్పోరుున వారి ఆవేదన తీరనిది అనడంలో ఎవరికీ సందేహంలేదు. అరుుతే సంయమనం కోల్పోరుు దాడులకు దిగడం, పంచాయతీల పేరుతో వ్యవహరించే తీరు అభ్యంతరకరం. ఇప్పటికే వైద్యులు అత్యవసర సేవలు అందించాలంటే వెనుకంజ వేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సర్జన్‌గా పేరున్న వైద్యులు సైతం ఆపరేషన్ చేయాలంటే కేవలం స్కానింగ్‌తో సరిపెట్టడం లేదు, ఎమ్మారై స్కానింగ్ సైతం చేయక తప్పడంలేదు. అందుకు కారణం ఆపరేషన్ వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయో అని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే. దీనివల్ల రోగి అదనంగా రూ.3 నుంచి రూ.4వేలు వరకూ భరించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పేదలకు సకాలంలో తక్షణం అందాల్సిన సేవలు సైతం అతిచూసీ జాగ్రత్తగా వైద్యులు మసులుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ పరిస్థితి ఏమాత్రం శ్రేయష్కరం కాదనడంలో సందేహంలేదు. తెరపైకి వస్తున్న సామాజిక, రాజకీయ వర్గాలు... ఫలానా వైద్యుడు వల్ల వ్యక్తి చనిపోయాడు అంటేనే ఆయా సామాజిక వర్గాలు, కొందరు నేతలు చేరి ఇబ్బంది పెడుతుండడంతో వ్యవహారం పక్కదారి పడుతోంది. చర్చలు అంటూనే వైద్యున్ని పీడించడం, లేదంటే దౌర్జన్యం చేయడం, సమాజంలో అభాసుపాలయ్యేలా వ్యవహరించడం లాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు మానసిక ఒత్తిడికి లోనవుతూ మరోమారు రోగులకు చికిత్సలు చేయాలంటే ముందస్తు ఆలోచన చేస్తున్నారు. వాస్తవంగా వైద్యుని తప్పుంటే అందుకు చట్టాలు ఉన్నాయి. వైద్యులు సైతం చట్టానికి అతీతులు కారు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్షదాడులకు, బెదిరింపులకు దిగడం ఏమాత్రం శ్రేయష్కరమో విజ్ఞనులు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. -
వ్యూహం హుజూరాబాద్‌లోనే
హుజూరాబాద్ : వరంగల్ జిల్లా హన్మకొండలోని అదాలత్ ప్రాంతంలో నివాసముండే పిల్లల వైద్య నిపుణుడు ప్రభుత్వ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. మిగతా సమయంలో హుజూరాబాద్‌లో క్లినిక్ నిర్వహిస్తుంటాడు. ప్రభుత్వాస్పత్రిలో విధులు ముగించుకుని నిత్యం హుజూరాబాద్‌కు కారులో వస్తుంటారు. పేషెంట్లు ఎక్కువగా ఉంటే ఒక్కో రోజు రాత్రి 10 గంటల వరకు వైద్యం చేస్తారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం తన కారులో హన్మకొండకు వెళ్తుండగా.. ఎల్కతుర్తి మండలం బావుపేట వద్ద ఓ ఇన్నోవా వాహనంలో నలుగురు అగంతకులు వచ్చి వైద్యుడి కారుకు అడ్డం పెట్టినట్లు తెలిసింది. రోడ్డుపైనే వాగ్వాదం జరిపి ఆ తర్వాత చితకబాది వైద్యుడి కారులోనే వేరే చోటుకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ సమయంలో ఓ వ్యక్తి చితకబాదుతూ ప్రతీరోజు సాయంత్రం 6 గంటల వరకే క్లినిక్ నిర్విహ ంచకుండా, ఇలా అర్ధరాత్రి వరకు వైద్యం చేయడం అవసరమా..? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ఇంతలో మరో వ్యక్తి జోక్యం చేసుకుని కొట్టకుండా ఆపే ప్రయత్నం చేయగా, ఈ వైద్యున్ని చంపినా మనకు డబ్బులే వస్తాయని, అయినా ఇతన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు గుంజుదామని చర్చించినట్లు సమాచారం. రెండురోజులపాటు వారి ఆధీనంలో ఉంచుకుని రూ. 35 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. వైద్యుడి ఫోన్నుంచే ఇంటికి సమాచారాన్ని పంపించి ఓ చిరునామా వద్ద ఉన్న వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ.16 ల క్షలు ముట్టజెప్పినట్లు చర్చ జరుగుతోంది. మిగతా డబ్బుల బాధ్యతను వైద్యుడికి అప్పగించి వదిలేయగా, భయభ్రాంతులకు గురైన సదరు వైద్యుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ ప్రారంభించారు. కొద్ది రోజులుగా సదరు వైద్యుడు హుజూరాబాద్‌లోని క్లీనిక్‌ను తెరవకపోవడంతో విషయం కాస్తా బట్టబయలైంది. పలువురిపై అనుమానం కిడ్నాప్ ఉదంతంలో పోలీసులు పలువురిని అనుమానిస్తున్నారు. బాధితుడు చెప్పిన విషయాల ఆధారంగా వృత్తిలో పోటీదారులెవరైనా ఈ సంఘటనకు ఉసిగొల్పారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. వైద్యుడి సమీప బంధువుపైనా సందేహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బాధితుడితో విభేదాలు ఉన్నవారిని కూడా అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో ఓ ప్రజాప్రతినిధి, ఇద్దరు పాత్రికేయుల పాత్ర ఉన్నట్లు చర్చ సాగుతోంది. సదరు వైద్యుడికి సంబంధించి చివరిసారిగా వచ్చిన ఒక ఫోన్ నంబర్ ఆధారంగా, ఆ నంబర్‌తో టచ్‌లో ఉన్నవారి వివరాలు, కాల్‌డాటా సైతం సేకరించినట్లు సమాచారం. ఇందులో హుజూరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు, తుమ్మనపల్లికి చెందిన ఒకరు, ఎల్కతుర్తి మండలానికి చెందిన ఇద్దరు, శంకరపట్నం మండలం ఎరుకలగూడెం, భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌కు చెందిన పలువురి నంబర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటన మొత్తానికి హుజూరాబాద్‌లోనే వ్యూహరచన జరిగినట్లు సమాచారం. వైద్యుడి పనివేళలు, వ్యక్తిగత వివరాలు తెలిసినవారే దీనికి కారణమవుతారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అనుమానితుల ఫోన్ కాల్‌డాటా సేకరించిటనట్లు తెలిసింది. ఇప్పటికే వారి చేతుల్లో కొంత కీలక సమాచారం ఉందని తెలిసింది. ఈ సస్పెన్స్‌కు రెండు రోజుల్లో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వంటకీ...వొంటికీ...
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. చక్కనమ్మ కాకపోతే మాత్రం? చిక్కితే అందంగా ఉండరా ఏంటి?! ఉంటారు. కానీ, చిక్కడం అంత ఈజీనా చెప్పండి. వాకింగ్లు, వర్కవుట్లు, డైటింగులు... ఎన్ని చెయ్యాలి!! చెయ్యగలితే ఓకే... చెయ్యలేకపోతే మాత్రం.... ఈ సీజనంతా... సంక్రాంతి వరకు... చిక్కుడు ఐటమ్స్‌ని లాగించేయండి! చిక్కుడు వంకాయ, చిక్కుడి పచ్చడి, చిక్కుడు తీపి కూర... చిక్కుడు కారం, చిక్కుడు ఫ్రై... మీ ఇష్టం. చిక్కుడు ఎందులోనైనా చక్కగా కలిసిపోతుంది. అంతేకాదు, మిమ్మల్ని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. చిక్కుడులో ఒక ఫిట్నెస్ గురు ఉన్నారు. ఒక ఫిజీషియన్ ఉన్నారు. ఇద్దరినీ మించి... ఓ మంచి వంట మాస్టర్ కూడా!! చిక్కుడు ఆవకాయ కావలసినవి: చిక్కుడుకాయలు - కిలో; పప్పు నూనె - పావు కిలో; కారం - 100 గ్రా; ఉప్పు - 100 గ్రాములకు కొద్దిగా తక్కువ; ఆవపిండి - 100 గ్రా; మెంతులు - టేబుల్ స్పూను; చింతపండు - పావుకిలో తయారి: చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీయాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, చిక్కుడుకాయలను అందులో వేసి బాగా వేయించి తీసేయాలి ఒక పాత్రలో ఆవపిండి, ఉప్పు, కారం, మెంతులు, చింతపండు, కొద్దిగా నూనె వేసి కలపాలి వేయించి ఉంచుకున్న చిక్కుడుకాయలను జతచేసి బాగా కలపాలి చివరగా నూనె పోసి గాలిచొరని పాత్రలో ఉంచి, మూడవ రోజు తిరగ కలపాలి ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది (ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కనుక, తగు పరిమాణంలో తయారుచేసుకుంటే మంచిది) పచ్చికారం కూర కావలసినవి: చిక్కుడుకాయలు - పావు కిలో; అల్లం - చిన్న ముక్క; పచ్చిమిర్చి - 4; ఎండుమిర్చి - 2; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను; కరివేపాకు - ఒక రెమ్మ; కొత్తిమీర - కొద్దిగా; మిరప్పొడి - టీ స్పూను తయారి: ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి రెండు ముక్కలుగా చేసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వరుసగా వేసి వేయించాలి చిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి మూత పెట్టాలి (మూత పెట్టడం వల్ల కూర మెత్తగా ఉంటుంది) బాగా ఉడుకు పట్టిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి చివరగా మిరప్పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. చిక్కుడుకాయ బంగాళదుంపకూర కావలసినవి: చిక్కుడుకాయలు - అరకిలో; బంగాళదుంపలు - పావుకిలో; ధనియాల పొడి - అర టీ స్పూను; జీలకర్ర పొడి - అర టీ స్పూను; పల్లీలపొడి - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కారం - టేబుల్ స్పూను; నూనె - 3 టేబుల్‌స్పూన్లు తయారి: ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీసి ముక్కలు చేయాలి బంగాళదుంపలను ఉడికించి, పైన పొట్టు తీసి ముక్కలు చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక బంగాళదుంపముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు వేసి, ఉప్పు జతచేసి బాగా కలిపి మూత ఉంచాలి పది నిముషాలయ్యాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, పల్లీలపొడి, కారం వేసి బాగా కలిపి ఐదు నిముషాలుంచి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రుచిగా ఉంటుంది. చిక్కుడు కాయ పచ్చడి కావలసినవి: చిక్కుడుకాయలు - పావుకిలో; చింతపండు- కొద్దిగా; ఎండుమిర్చి - 4; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; కొత్తిమీర - కొద్దిగా; నూనె - 2 టీ స్పూన్లు తయారి: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వరసగా వేసి దోరగా వేగాక తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక చిక్కుడుకాయముక్కలు (చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, ముక్కలుగా చేయాలి) వేసి కొద్దిగా వేగిన తర్వాత, ఉప్పు, చింతపండు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టాలి ముక్కలు బాగా మెత్తబడ్డాక బాణలి దించేయాలి మిక్సీలో ముందుగా పోపు వేసి మెత్తగా చేయాలి చిక్కుడుకాయ ముక్కలు, కొత్తిమీర జతచేసి మరోమారు మిక్సీ పట్టి తీసేయాలి. వంకాయ చిక్కుడుకాయ కూర కావలసినవి: వంకాయలు - పావుకిలో; చిక్కుడుకాయలు - అరకిలో; అల్లం - చిన్నముక్క; పచ్చిమిర్చి - 6; ఎండుమిర్చి - 5; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; కొత్తిమీర - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు; పాలు - 2 టేబుల్ స్పూన్లు తయారి: వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి చిక్కుడుకాయలను కడిగి ఈనెలు తీసి, పెద్ద ముక్కలు చేయాలి బాణలి లో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరుసగా వేసి వేయించాలి కరివేపాకు వేసి వేగాక, వంకాయముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, వేసి కలిపి మూత పెట్టాలి కూర దగ్గర పడిన తర్వాత పాలు జత చేసి మరోమారు కలిపి కొద్దిగా మగ్గించాలి అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చిక్కుడుకాయ వేపుడు కావలసినవి: చిక్కుడుకాయలు - పావు కిలో; ఉప్పు - తగినంత; మిరప్పొడి - టేబుల్ స్పూను; నూనె - రెండు టేబుల్ స్పూన్లు తయారి: ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీయాలి బాణలిలో నూనె వేసి కాగాక చిక్కుడుకాయలను వేసి బాగా కలిపి మూత ఉంచాలి. (మధ్యమధ్యలో కలుపుతుండాలి) పావు గంట తర్వాత ఉప్పు, కారం వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. చిక్కుడుకాయ తీపికూర కావలసినవి: చిక్కుడుకాయలు - అర కిలో; శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండుమిర్చి - 8; చింతపండుగుజ్జు - టేబుల్ స్పూను; బెల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; పసుపు - చిటికెడు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా తయారి: చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి పెద్దపెద్ద ముక్కలు చేయాలి బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేయాలి చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి బాగా ఉడుకుపట్టాక బెల్లం తురుము, చింతపండు గుజ్జు, బియ్యప్పిండి, పసుపు వేసి కలిపి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. కర్టెసీ: కల్యాణలక్ష్మి, హైదరాబాద్ సేకరణ: డా.వైజయంతి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ పందిరి చిక్కుడును ప్రాచీనకాలం నుంచి పండిస్తున్నారు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దీన్ని విస్తారంగా పండిస్తున్నారు. ఇప్పుడిప్పుడే చిక్కుడు ఉత్తరభారతదేశంలోకి కూడా వ్యాపించింది ప్రతి వంద గ్రాముల చిక్కుడు కాయలలో 48 క్యాలరీల శక్తి ఉంటుంది చిక్కుడును ఆహారంలో ఎక్కువ తీసుకుని, వరి అన్నం తక్కువ తీసుకుంటే డయాబెటిస్‌ను 25 శాతం నియంత్రించవచ్చని కోస్టారికా అధ్యయనంలో తెలిపింది వారంలో కనీసం మూడు కప్పుల చిక్కుడు తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడ తాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూస్తాయి సన్నబడాలని డైటింగ్ చేసేవాళ్లు చిక్కుడును అధికంగా తింటే మంచిది అరకప్పు చిక్కుళ్లలో 7 గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. వీటిని కూరలలోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు బీకాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లు వీటిలో లభిస్తాయి కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు వంటి అనేక భాగాలకు చిక్కుడు నుంచి శక్తి అందుతుంది. -
ఆపరేషన్ తప్పనిసరా?
వూ నాన్నగారి వయస్సు 75 ఏళ్లు. మూత్ర సంబంధమైన సమస్య వస్తే యూరాలజిస్ట్‌ను కలిశాం. ప్రోస్టేట్ పెద్దదిగా ఉందని, ఆపరేషన్ చేస్తే మంచిదని చెప్పారు. ఆపరేషన్ చేయించుకోవడం అవసరమా? - సుకుమార్, వరంగల్ ఈ వయుస్సులో ప్రోస్టేట్ గ్రంథికి సమస్యలు రావడం చాలా సాధారణం. ఈ సమస్య ఉన్నవారికి మొదట వుందులు వాడి చూస్తాం. అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎండోస్కోపీ ద్వారా టీయూఆర్‌పీ అనే శస్త్రచికిత్స చేస్తాం. మాత్రం పూర్తిగా ఆగిపోయినా, మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, మూత్రాశయంలో రాళ్లు ఉన్నా, మూత్రపిండాల పనితీరు తగ్గినా, మూత్రంలో తరచు రక్తం కనిపిస్తున్నా... వుందులపై ఆధారపడకుండా శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఈ ఆపరేషన్‌కు పేషెంట్ ఫిట్‌గా ఉన్నారా లేదా తెలుసుకోవడం కోసం ముందుగా ఫిజీషియున్ను కలవండి. ఆ తర్వాత యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 35. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. ప్రస్తుతం సెక్స్ చేసిన ఒకటి రెండు నిమిషాల్లో వీర్యస్ఖలనం అయిపోతోంది. దాంతో ఇద్దరికీ చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకు మంచి సలహా ఇవ్వండి. - ఎస్.డి., ఖమ్మం మీ సమస్యను ప్రీ-మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సాధారణంగా సెక్స్ మొదలుపెట్టాక స్ఖలనానికి నిర్దిష్టంగా ఇంతే సమయం కావాలనే నియమం ఏదీ లేదు. దంపతులిద్దరూ తృప్తిపడేంత సేపు సెక్స్ జరిగితే చాలు. అయితే కొందరిలో సెక్స్ మొదలుపెట్టిన ఒకటి, రెండునిమిషాల్లోనే వీర్యస్ఖలనం అయిపోతుంది. దాంతో దంపతులిద్దరికీ సెక్స్‌లో తృప్తి కలగకపోవచ్చు. ఇలా దంపతులిద్దరూ సంతృప్తి పొందకముందే వీర్యస్ఖలనం జరిగిపోతే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా చెప్పవచ్చు. సెక్స్‌లో పురుషాంగంపైన ఏర్పడే కదలికల వల్ల ప్రేరేపణ జరిగి వీర్యస్ఖలనం అవుతుంది. ఇలాకాకుండా ఉండాలంటే... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మొదట అరగంట లేదా గంటసేపు ప్రీ-ప్లే చేసి ఆ తర్వాత సెక్స్ చేయడం మంచిది. మధ్యమధ్యలో ఆపడం వల్ల కూడా మెదడుకు అందే సిగ్నల్స్‌ను ఆపవచ్చు. ఇది కాకుండా ఫోగ్జటివ్ ఎపాక్సిటిన్ అనే మందులు మెదడు మీద పనిచేసి ఈ సిగ్నల్స్‌ను బలహీనపరుస్తాయి. అయితే ఈ మందులను కేవలం ఆండ్రాలజిస్ట్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్