ఆపరేషన్ తప్పనిసరా?
వూ నాన్నగారి వయస్సు 75 ఏళ్లు. మూత్ర సంబంధమైన సమస్య వస్తే యూరాలజిస్ట్‌ను కలిశాం. ప్రోస్టేట్ పెద్దదిగా ఉందని, ఆపరేషన్ చేస్తే మంచిదని చెప్పారు. ఆపరేషన్ చేయించుకోవడం అవసరమా?
- సుకుమార్, వరంగల్
ఈ వయుస్సులో ప్రోస్టేట్ గ్రంథికి సమస్యలు రావడం చాలా సాధారణం. ఈ సమస్య ఉన్నవారికి మొదట వుందులు వాడి చూస్తాం. అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎండోస్కోపీ ద్వారా టీయూఆర్‌పీ అనే శస్త్రచికిత్స చేస్తాం. మాత్రం పూర్తిగా ఆగిపోయినా, మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, మూత్రాశయంలో రాళ్లు ఉన్నా, మూత్రపిండాల పనితీరు తగ్గినా, మూత్రంలో తరచు రక్తం కనిపిస్తున్నా... వుందులపై ఆధారపడకుండా శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఈ ఆపరేషన్‌కు పేషెంట్ ఫిట్‌గా ఉన్నారా లేదా తెలుసుకోవడం కోసం ముందుగా ఫిజీషియున్‌ను కలవండి. ఆ తర్వాత యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
నా వయసు 35. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. ప్రస్తుతం సెక్స్ చేసిన ఒకటి రెండు నిమిషాల్లో వీర్యస్ఖలనం అయిపోతోంది. దాంతో ఇద్దరికీ చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకు మంచి సలహా ఇవ్వండి.
- ఎస్.డి., ఖమ్మం
మీ సమస్యను ప్రీ-మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సాధారణంగా సెక్స్ మొదలుపెట్టాక స్ఖలనానికి నిర్దిష్టంగా ఇంతే సమయం కావాలనే నియమం ఏదీ లేదు. దంపతులిద్దరూ తృప్తిపడేంత సేపు సెక్స్ జరిగితే చాలు. అయితే కొందరిలో సెక్స్ మొదలుపెట్టిన ఒకటి, రెండునిమిషాల్లోనే వీర్యస్ఖలనం అయిపోతుంది. దాంతో దంపతులిద్దరికీ సెక్స్‌లో తృప్తి కలగకపోవచ్చు. ఇలా దంపతులిద్దరూ సంతృప్తి పొందకముందే వీర్యస్ఖలనం జరిగిపోతే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా చెప్పవచ్చు. సెక్స్‌లో పురుషాంగంపైన ఏర్పడే కదలికల వల్ల ప్రేరేపణ జరిగి వీర్యస్ఖలనం అవుతుంది. ఇలాకాకుండా ఉండాలంటే... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మొదట అరగంట లేదా గంటసేపు ప్రీ-ప్లే చేసి ఆ తర్వాత సెక్స్ చేయడం మంచిది. మధ్యమధ్యలో ఆపడం వల్ల కూడా మెదడుకు అందే సిగ్నల్స్‌ను ఆపవచ్చు. ఇది కాకుండా ఫోగ్జటివ్ ఎపాక్సిటిన్ అనే మందులు మెదడు మీద పనిచేసి ఈ సిగ్నల్స్‌ను బలహీనపరుస్తాయి. అయితే ఈ మందులను కేవలం ఆండ్రాలజిస్ట్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్