వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గమా? | Is surgery the only solution for varicocele? | Sakshi
Sakshi News home page

వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గమా?

Published Fri, Oct 11 2013 12:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గమా?

వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గమా?

నా వయస్సు 28. ఇంకా పెళ్లి కాలేదు. నాకు రెండువైపులా వేరికోసిల్ ఉంది. వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గం అని నేను చాలాసార్లు చదివాను. ఆపరేషన్ తప్ప మరోమార్గం లేదా? దయచేసి సలహా ఇవ్వండి.
 -పి.వి.ఆర్, హైదరాబాద్
 
 వేరికోసిల్ రావడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏదీ లేదు. వేరికోసిల్ ఉన్నప్పుడు పెళ్లి కాకుండా ఉండి, నొప్పి లేకుండా ఉంటే వెంటనే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వివాహం అయిన వ్యక్తుల్లో వేరికోసిల్ కండిషన్ ఉండి పిల్లలు లేకపోతే...  ముందుగా  సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. వేరికోసిల్ ఉన్నవాళ్లలో సెమెన్ కౌంట్ తక్కువగా ఉండి, వీర్యకణాల కదలికలు తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ అనే పరీక్ష ద్వారా వేరికోసిల్ కండిషన్‌ను నిర్ధారణ చేసి, సర్జరీ చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. మీకింకా వివాహం కాలేదని రాశారు. కాబట్టి మీలాంటి వారి విషయంలో ముందుగానే సర్జరీ చేయించుకొమ్మనే సలహా ఇవ్వము.
 
మరీ తీవ్రమైన నొప్పిగాని, గ్రేడ్-3 వేరికోసిల్ కండిషన్ ఉంటే సర్జరీతో మంచి ఉపశమనం దొరుకుతుంది. మీకు ఇంకా పెళ్లికానట్లయితే... వేరికోసిల్ వల్ల మీకు నొప్పి లేకపోతే... ఇప్పుడప్పుడే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు.
 
 నా వయుసు 32 ఏళ్లు. నా వృషణాల్లో నొప్పి వస్తోంది. లాగుతున్న ఫీలింగ్ కూడా ఉంది. వృషణాల సైజ్ చిన్నవిగా వూరాయుని అనిపిస్తోంది. దయుచేసి నా సవుస్యకు సలహా ఇవ్వండి.
 - బి. కిరణ్ కుమార్, కరీంనగర్
 
 తవు వృషణాలు చిన్నవేమో అనే అపోహ చాలావుందిలో ఉంటుంది. మీకు ఇతరత్రా ఏ ఇబ్బందులూ లేకపోతే దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. అయితే తవు వృషణాలు వుుందు పెద్దవిగా ఉండి, ఇప్పుడు అవి చిన్నవిగా అయిపోయి ఉండి, నొప్పి కూడా ఉంటే మాత్రం దానికి కారణం వేరికోసిల్ అయివుండవచ్చునని అనువూనించాలి. కాబట్టి మీరు ఒకసారి యుూరాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు డాప్లర్ అల్ట్రాసౌండ్ అనే పరీక్ష చేయించి ఏదైనా సమస్య ఉందా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. మీ సమస్యను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.
 
 డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement