Gentlemen counseling
-
ఈ ఒంపును చక్కదిద్దవచ్చా..?
నా వయుస్సు 26 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నాకు అంగస్తంభన కలిగినప్పుడు నా పురుషాంగం కిందికి వంగుతోంది. అంటే అంగస్తంభన జరిగినప్పుడు అది ఆర్చిలా ఉంది. దీన్ని కార్డీ అంటారని చదివాను. దీనికి సర్జరీ ఒక్కటే వూర్గవుని తెలిసింది. కానీ నాకు సర్జరీ అంటే భయం. నాకు తగిన సలహా ఇవ్వండి. - కె.వి.వై., గుంటూరు అంగస్తంభన కలిగినప్పుడు అంగం సాధారణంగా నిటారుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుడి, ఎడవు పక్కలకు కొద్దిగా ఒంగి ఉన్నా పర్లేదు. అయితే ఆ ఒంపు ూత్రవిసర్జనకూ, సెక్స్ చేయుడానికి అడ్డంకిగా ఉండకూడదు. ఒకవేళ అలా అంతరాయం కలిగించేంతగా ఒంగి ఉంటే ఆ కండిషన్‌ను కార్డీ అంటారు. ‘సర్జరీ కార్డీ కరెక్షన్’ అనే శస్త్రచికిత్స ద్వారా పురుషాంగంలో ఉన్న ఒంపును బట్టి ఓవైపు పొడవు పెంచడమో, వురోవైపు తగ్గించడమో చేసి అంగాన్ని వుళ్లీ నిటారుగా ఉండేలా సరిచేస్తాం. అయితే ఈ సర్జరీకి ందు యూరాలజిస్టులు ఆర్టిఫిషియుల్గా ఎరెక్షన్ తెప్పించి కార్డీ తీవ్రత (సివియూరిటీ) ఎంత ఉందో నిర్ధారణ చేస్తారు. దాన్నిబట్టే సర్జరీ చేయూల్సిన అవసరం ఉందా లేదా అన్నది నిర్ణయిస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను కలవండి. నా వయుస్సు 21. గత ఆరేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను. వారానికి కనీసం ూడు సార్లు హస్తప్రయోగం చేసుకుంటున్నాను. ఏడాది కిందట నాకు వృషణాల నొప్పి వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. వుందులు వాడితే నొప్పి తగ్గిపోయింది. ప్రస్తుతం హస్తప్రయోగం చేస్తున్న సవుయుంలోనూ, ఆ ప్రక్రియ పూర్తయ్యాక పురుషాంగంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. వీర్యం పోకపోతే నొప్పిరాదు. దయుచేసి నా సవుస్యకు పరిష్కారం చెప్పగలరు. - డి.కె.ఎస్.ఆర్., అనంతపురం మీ వయుస్సులో ఉన్నవాళ్లు తరచూ హస్తప్రయోగం చేసుకోవడం చాలా సాధారణమైన అంశం. ఇలాంటి సమయాల్లో వీర్యస్ఖలనం తర్వాత మూత్రనాళంలో, వృషణాల్లో కొద్దిపాటి అసౌకర్యం (డిస్కంఫర్ట్) కొద్ది నిమిషాలపాటు అనిపించవచ్చు. అయితే మీరు చెబుతున్నట్లుగా ప్రతిసారీ నొప్పి వస్తుంటే ఒకసారి యురాలజిస్ట్ను సంప్రదించడం వుంచిది. మూత్రంలో, వీర్యంలో ఇన్ఫెక్షన్ వచ్చినా, వీర్యం వచ్చే నాళాలు బ్లాక్ అరుునా ఇలా నొప్పి రావచ్చు. కానీ అది చాలా అరుదు. మీరు చెబుతున్నట్లుగా హస్తప్రయోగం వల్ల ఈ నొప్పి రాదు. అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఇది ఆందోళన చెందాల్సినంత పెద్ద సమస్యగా అనిపించడం లేదు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను కలవండి. నా వయుస్సు 20 ఏళ్లు. గత ఏడేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను. గతంలో వీర్యస్ఖలనం అయ్యేందుకు చాలా సవుయుం పట్టేది. కానీ ఇటీవల కొద్దిసేపటికే వీర్యం పడిపోతోంది. ఇలా వెంటనే పడిపోవడంతో నాకు అసంతృప్తిగా ఉంది. అదీగాక నా అంగం చిన్నగా ఉంది. సైజ్ పెరగడానికి వూర్గం చెప్పండి. ఇక నా వృషణాలు సంచిలో కిందికీ పైకీ జారుతూ, కదులుతూ ఉన్నాయి. హస్తప్రయోగం చేయుడం వల్ల హైట్ పెరగకుండా పోతుందా? - జె.ఎస్.వి., శ్రీకాకుళం జ: మీరు ఏడేళ్లుగా హస్తప్రయోగం చేస్తుండటంతో ఈ ప్రక్రియు కాస్తా మెకానికల్‌గా అయిపోయి మీకు మొదట్లో ఉన్న థ్రిల్ తగ్గింది. దాంతో ఇప్పుడు త్వరగా వీర్యస్ఖలనం అయిపోతోంది. మీరు పెళ్లి చేసుకుని భార్యతో సెక్స్‌లో పాల్గొంటే వుళ్లీ వూవుూలుగానే మొదట్లోని థ్రిల్‌ను, ఎక్సయిట్మెంట్ను, వుంచి తృప్తిని పొందగలుగుతారు. ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువసార్లు హస్తప్రయోగం చేసినందువల్ల అంగం సైజ్ తగ్గడం అంటూ ఉండదు. సెక్స్‌లో మీరు తృప్తి చెందేందుకు లేదా భార్యను తృప్తిపరచేందుకు అంగస్తంభనలు చక్కగా ఉంటే చాలు. మీ పురుషాంగం సైజ్‌కూ, మీ పార్ట్నర్ను సంతోషపెట్టడానికి ఎలాంటి సంబంధమూ లేదు. మీకున్న అపోహే చాలావుందిలో ఉంటుంది. కానీ అది తప్పు. ఇక వృషణాలు పైకీ, కిందికీ కదలడం అన్న విషయానికి వస్తే... అది చాలా సాధారణమైన ప్రక్రియు. ఇలా కావడాన్ని క్రిమేస్టరిక్ రిఫ్లక్స్ అంటారు. వృషణాల సంరక్షణ కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు ఇది. ఇలా కదులుతూ ఉండటం ఆరోగ్య లక్షణం. హస్తప్రయోగం వల్ల ఎలాంటి హానీ ఉండదు. మీరు నిశ్చింతగా ఉండండి. నా వయుస్సు 28 ఏళ్లు. పెళ్లయి మూడేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని పరీక్షలు చేయించుకున్నాం. ఆమెకు ఎలాంటి సవుస్య లేదన్నారు. అయితే నాకు వూత్రం వీర్యకణాల సంఖ్య తక్కువని చెప్పారు. మొదటిసారి చేసిన పరీక్షలో స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందన్నారు. డాక్టర్ ఇచ్చిన వుందులు వాడాను. రెండు నెలల తర్వాత వుళ్లీ పరీక్షలు చేయిస్తే పది మిలియున్కు పెరిగింది. తర్వాత కూడా వుందులు వాడాను. అయితే వుళ్లీ రెండు నెలలకు పరీక్ష చేయిస్తే కౌంట్ మళ్లీ ఐదు మిలియన్లకు పడిపోయింది. ఇలా తగ్గడానికి కారణం ఏమిటి? నా విషయం తగిన సలహా ఇవ్వండి. - కె.జె.కె., కరీంనగర్ మీరు ఆలిగోస్పెర్మియూ అనే సవుస్య వల్ల పిల్లలు కలగక బాధపడుతున్నారు. సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 60 మిలియున్ నుంచి 120 మిలియున్ల వరకు వీర్యకణాలు ఉండాలి. అయితే వీటి సంఖ్య 20 మిలియున్ల కంటే తగ్గితే పిల్లలు కలిగే అవకాశాలు తక్కువ. వీర్యకణాలు తగ్గడానికి సాధారణంగా వేరికోసిల్గాని, ఏవైనా ఇన్ఫెక్షన్లుగానీ లేదా హార్మోన్లలోపం వంటి అంశాలుగాని కారణవువుతాయి. మీకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, హార్మోన్ పరీక్షలు, వురికొన్ని రక్తపరీక్షలు చేసి... ఏ సవుస్య వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిందో నిర్ధారణ చేయూలి. సవుస్య వేరికోసిల్ అయితే సర్జరీ ద్వారా దాన్ని పరిష్కరించవచ్చు. ఇక హార్మోన్ల లోపం అయితే ఇంజెక్షన్ల ద్వారా చికిత్స చేసి వీర్యకణాల సంఖ్యను పెంచగలిగితే... అందరిలాగే మీకూ పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
కిడ్నీకీ... క్రియాటినిన్‌కు సంబంధం ఏమిటి?
నా వయసు 38. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కావడంతో రోజుకు కనీసం 10 -12 గంటలకు పైగా ఇంటర్నెట్ మీద కూర్చుంటాను. ఇటీవలే మా కంపెనీలో యాన్యువల్ హెల్త్ చెకప్ జరిగినప్పుడు, క్రియాటినిన్ 1.7 ఉన్నట్లుగా రిపోర్టు వచ్చింది. కిడ్నీ స్పెషలిస్ట్‌కు తప్పక చూపించాల్సిందిగా మా కంపెనీ డాక్టర్ సలహా ఇచ్చారు. క్రియాటినిన్కూ, కిడ్నీకీ సంబంధం ఏమిటి? క్రియాటినిన్ తగ్గడానికి ఏవైనా మార్గాలుంటే చెప్పండి. - కె.ఎన్.వి., హైదరాబాద్ మూత్రపిండాల (కిడ్నీ) పనితీరును తెలుసుకోవడానికి చేసే పరీక్షల్లో క్రియాటినిన్, బ్లడ్ యూరియా చాలా ముఖ్యమైనవి. సాధారణంగా శరీరంలో క్రియాటినిన్ పరిమాణం 0.5 ఎంజీ/డీఎల్ నుంచి 1.2 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. అదే బ్లడ్ యూరియా అయితే 20 ఎంజీ/డీఎల్ నుంచి 40 ఎంజీ/డీఎల్ ఉండవచ్చు. ఒకవేళ క్రియాటినిన్ పరిమాణం 1.5 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పనితీరు సామర్థ్యం తగ్గినదానికి ఒక సూచనగా పరిగణించాలి. అదే క్రియాటినిన్ పరిమాణం 4 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పనితీరు 80శాతం నుంచి 90శాతం వరకు తగ్గినట్లుగా భావించాలి. శరీరంలో క్రియాటినిన్ పెరగడానికి ప్రధానమైన కొన్ని కారణాలు... హైబీపీ, డయాబెటిస్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్రంథి వాపు, నొప్పి నివారణ మందులు దీర్ఘకాలంపాటు వాడటం, ఉప్పు,మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవడం వంటివి. ఒకవేళ క్రియాటినిన్ పరిమాణం1.5 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా వస్తే కేవలం కిడ్నీకి సంబంధించిన పరీక్షలే కాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి కూడా చెక్ చేయించుకుని కిడ్నీ స్పెషలిస్ట్‌ను కలవాలి. వయసు పెరిగేకొద్దీ శరీరంలో క్రియాటినిన్ పరిమాణం పెరగకుండా ఉండాలంటే రోజూ 3-4 లీటర్ల నీటిని తాగుతూ, అరగంటకు తగ్గకుండా ఒళ్లు అలిసేలా వ్యాయామం చేస్తూ, మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. మీరు చెప్పిన విధంగా ఇంటర్నెట్పై 10 గంటలు కూర్చుండటం వల్ల క్రియాటినిన్ పెరుగుతుందనే అంశంపై ఇంకా శాస్త్రీయమైన నిరూపణలేమీ లేవు. అయినా మీరు వైర్లెస్ ఇంటర్నెట్ ఉపయోగాన్ని వీలైనంతగా తగ్గించడం, బాగా వేడిని వెలువరించే ల్యాప్‌టాప్‌లను శరీరానికి వీలైనంత దూరంగా ఉంచి ఉపయోగిస్తే మంచిది. మధ్య మధ్య వీలైనంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. నా వయసు 28. చాలా సన్నగా ఉంటాను. ఎంత తిన్నా నా బరువు 48 కిలోలు దాటడం లేదు. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత చాలా నీరసంగా ఫీలవుతున్నాను. మాంసాహారం అలవాటు లేదు. రోజుకు 10 సిగరెట్స్ తాగే అలవాటు ఉంది. రెండు నెలల నుంచి అంగస్తంభన సరిగా జరగడం లేదు. ఏ ఆహారపదార్థాలు తీసుకుంటే సెక్స్ పొటెన్సీ పెరుగుతుంది? తగిన సలహా ఇవ్వగలరు. - సి.ఆర్.ఎమ్., ఒంగోలు ఎత్తుకు తగిన బరువు ఉండటం మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. చాలామంది సన్నగా ఉన్నవారు లావెక్కాలని, లావుగా ఉన్నవారు సన్నబడాలని ప్రయత్నిస్తుంటారు. ఎత్తు-బరువు ఛార్ట్ చూసుకుని, దానికి తగ్గట్లుగా ఉంటే మీ బరువును గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక సెక్స్ అనేది మీ మానసిక-శారీరక నిలకడను సూచిస్తుంది. శాకాహారమైనా, మాంసాహారమైనా సరైన మోతాదులో శరీరానికి అవసరమైన పాళ్లలో తీసుకుంటే శారీరక దృఢత్వంలో తేడా ఉండదు. మీరు శాకాహారం తిన్నా, మాంసాహారం తిన్నా అది సమతుల ఆహారమై ఉండి, అన్ని పోషకాలూ సమపాళ్లలో అందేలా తీసుకుంటే శరీరంలో, సెక్స్‌లో పటుత్వం ఎప్పటికీ తగ్గదు. మూడుపూటలా ఆకలవుతూ ఉండి, బాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉండటం కేవలం ఒక్క సెక్స్ విషయంలోనే గాక... శారీరక ఆరోగ్యానికీ మంచిది. మీరు సిగరెట్స్ పూర్తిగా మానేసి, సమతులాహారం తీసుకునేలా జాగ్రత్త తీసుకోండి. ఇక మీరు ఎంత ఎక్కువగా తింటున్నా లావెక్కడం లేదని బాధపడుతున్నారు కాబట్టి ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. నా వయసు 19. నాకు ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. స్నానం చేసే సమయంలో పురుషాంగంపై ఉన్న చర్మాన్ని వెనక్కి లాగి ప్రతిరోజూ శుభ్రపరచుకుంటాను. అయితే ఈవుధ్య అంగం మీది చర్మం బాగా పొడిగా అయిపోయి వుునుపటిలా వెనక్కు రావడం లేదు. బలవంతంగా వెనక్కు నెడితే క్రాక్స్ ఏర్పడి రక్తం వస్తోంది. ఈ సవుస్యతో చాలా ఆందోళనగా ఉంది. డాక్టర్‌కు చూపించాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి నాకు మంచి సలహా ఇవ్వండి. - ఎస్.ఎస్.ఆర్., అమలాపురం పురుషాంగం మీది చర్మం ఫ్రీగా వెనక్కు వెళ్లకుండా ఉండే కండిషన్‌ను ఫైమోసిస్ అంటారు. దీనివల్ల చర్మం చివరి భాగంలో క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు సెక్స్ చేస్తే నొప్పి రావచ్చు. ఒక్కోసారి చర్మం వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు రాకపోతే వాపు కూడా రావచ్చు. యుక్తవయుసులో ఇలా చర్మం ఫ్రీగా ముందుకు, వెనక్కు రాకపోతే సున్తీ చేయించుకోవడం మంచిది. దీనివల్ల వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం కూడా సులువు. సెక్స్ చేయడానికీ అనువుగా ఉంటుంది. మన ప్రైవేట్ పార్ట్స్ వద్ద వచ్చే సమస్యలు కూడా ఇతర సమస్యల్లాంటివే. ఇతర సమస్యలను ప్రస్తావించడానికి మనం ఎలా సిగ్గుపడమో, డాక్టర్ వద్ద ఈ సమస్యలను చెప్పడానికీ అలాగే సిగ్గుపడాల్సిన, బిడియ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు ఉన్నదే ఇలాంటి సమస్యలను చక్కదిద్దడానికి. అందుకే చెడు అలవాట్లు ఉన్నా లేకపోయినా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించి సమస్య నుంచి విముక్తి పొందడమే మనం చేయాల్సింది. ఏ డాక్టర్ కూడా దీనికి మిమ్మల్ని నిందించడు. తక్కువగా చూడడు. చెడుగా అనుకోడు. కాబట్టి మీ దగ్గర్లోని డాక్టర్‌కు చూపించి వెంటనే తగిన చికిత్స చేయించుకుని, మీ బాధల నుంచి విముక్తి పొందండి. నిర్వహణ: యాసీన్ డాక్టర్ వి.చంద్రమోహన్ యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
కిడ్నీలో రాయి తొలగించినప్పటినుంచీ ఆ టైమ్‌లో నొప్పి...?
నాకు కిడ్నీలో రాళ్లు ఉన్నందున లిథోట్రిప్సీ (ఈఎస్‌డబ్ల్యూఎల్) అనే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించారు. అప్నట్నుంచి మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడూ, సెక్స్ చేసేప్పుడూ మంట విపరీతంగా వస్తోంది. చికిత్స తర్వాత కూడా రాళ్లు పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి నా సమస్యలకు తగిన పరిష్కారం సూచించండి. - వి.ఎస్.ఆర్., నాయుడుపేట మూత్ర విసర్జన సమయంలో మంట మాత్రమే కాకుండా... సెక్స్ చేసినప్పుడు కూడా ఇలా మంట రావడం అనే సాధారణ లక్షణాలు మూత్రంలో ఇన్ఫెక్షన్ను సూచిస్తున్నాయి. కాబట్టి మీరు మొదట యూరిన్ కల్చర్ పరీక్షలు చేయించండి. వాటి ఆధారంగా మీ డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్‌ను పూర్తి కోర్సు వాడండి. దాంతో మీరు చెబుతున్న లక్షణాలు తగ్గిపోతాయి. ఇక మిగిలిపోయిన స్టోన్స్ విషయానికి వస్తే వాటిని లేజర్ చికిత్స ద్వారా తొలగించుకోవచ్చు. నాకు 38 ఏళ్లు. ఇటీవలే వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పట్నుంచి ఏమాత్రం పనిచేసినా చాలా ఎక్కువగా అలసట వస్తోంది. సెక్స్‌లో కూడా మునుపటిలా కాకుండా కాస్త వీక్‌గా అనిపిస్తోంది. ఇవన్నీ వ్యాసెక్టమీ వల్లనేమో అని అనుమానంగా ఉంది. నా సందేహాలకు సమాధానం చెప్పండి. - ఎస్.వి.కె.ఎమ్., ఒంగోలు వ్యాసెక్టమీ ఆపరేషన్ చాలా సులువైనది. దానివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలూ రావు. వ్యాసెక్టమీ అంటే... వీర్యకణాలు వచ్చే మార్గాన్ని బ్లాక్ చేయడం మాత్రమే. అంతేతప్ప... ఇక శరీరంలోని ఏ భాగాన్నీ ముట్టుకోరు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు చెప్పిన సమస్యలన్నీ మీ వయసు వారిలో దాదాపు అందరిలోనూ కనిపించేవే. కాకపోతే చాలామంది వాటిని వ్యాసెక్టమీకి ఆపాదిస్తూ, అవన్నీ దానివల్లనే అని అపోహ పడుతుంటారు. నిజానికి వ్యాసెక్టమీకి మీ బలహీనతలకూ ఎలాంటి సంబంధం లేదు. మీరు ఒకసారి మీ ఫ్యామిలీ ఫిజీషియన్‌ను లేదా మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకుని నిర్భయంగా ఉండండి. నాకు 29 ఏళ్లు. రెండు నెలల కిందట వివాహమయ్యింది. నా మొదటిరాత్రి పురుషాంగం బాగానే గట్టిపడింది. అయితే అంగప్రవేశం చేస్తున్న సమయంలో టెన్షన్ వల్ల అంగస్తంభన తగ్గింది. దాంతో సెక్స్ చేయాలేకపోయాను. అప్పట్నుంచి సెక్స్ చేయాలంటేనే భయం వేస్తోంది. మళ్లీ నెల రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనాలని ప్రయత్నించినా జంకుతో సెక్స్ చేయలేకపోతున్నాను. ఒకప్పుడు హస్తప్రయోగం బాగా చేసేవాణ్ణి. దాని వల్ల ఇలా జరుగుతోందా? ఇప్పుడు నా భార్య కూడా నాతో సహకరించడం లేదు. నేను సంసారానికి పనికిరానివాడినంటూ ఈసడిస్తోంది. దాంతో ఇంకా డిప్రెషన్లోకి వెళ్తున్నాను. నేను ఏం చేయాలో సలహా ఇవ్వండి. - ఎస్.కె.ఎమ్., ఖమ్మం మీరు యాంగ్జైటీ న్యూరోసిస్‌తో బాధపడుతున్నారు. కొత్తగా పెళ్లయినవారికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం, దాంతో ఆశాభంగం చెందడం చాలా సాధారణంగా జరిగేదే. సెక్స్ అనేది మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు చాలా స్వాభావికంగా జరిగిపోయే ప్రక్రియ. మీలాంటి స్థితి మీ ఒక్కరికేనని ఆందోళన చెందకండి. జంకు వల్ల మీలా బాధపడేవారెందరో ఉంటారు. ఆ పరిస్థితిని భార్య సహాకారంతో అధిగమిస్తే మీరూ అందరిలా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయగలరు. పరిస్థితిని అధిగమించడానికి ప్రస్తుతం మీ భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ చాలా ముఖ్యం. మీరు గతంలో చేసిన హస్తప్రయోగం వల్ల మీకు ఈ సమస్య రాలేదు. మీ భార్యతో సెక్స్ చేయబోయినప్పుడు... పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి లోనవ్వడం వల్ల ఇలా జరిగింది. మీరూ, మీ భార్య డాక్టర్‌ను కలిసి సెక్సువల్ కౌన్సెలింగ్ చేయించుకోండి. మీకు తాత్కాలికంగా కలిగిన అంగస్తంభన లోపాన్ని అధిగమించడానికి యూరాలజిస్ట్‌ను సంప్రదించి మందులు తీసుకోండి. ఈలోపే మీలో ఆత్మవిశ్వాసం పెరిగితే ఎలాంటి మందులూ అవసరం లేకుండానే మీ అంతట మీరే సెక్స్‌లో సమర్థంగా పాల్గొనగలరు. నాకు 42 ఏళ్లు. పెళ్లరుు పద్దెనిమిదేళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. నాకు సెక్స్ కోరికలు చాలా ఎక్కువ. అయితే నా భార్య సెక్స్ పట్ల ఆసక్తి చూపడం లేదు. బలవంతంగా సెక్స్ చేస్తే యూంత్రికంగా పాల్గొంటోంది. దాంతో నాకు వూనసికంగా సంతృప్తి కలగడం లేదు. ఎప్పుడూ చికాకుగా ఉంటున్నాను. దయచేసి ఈ విషయంలో నాకు తగిన సలహా చెప్పండి. - సి.వి.ఆర్., చెన్నై సాధారణంగా పెళ్లయిన పదిహేను ఇరవై ఏళ్ల తర్వాత జీవిత భాగస్వావుుల్లో ఒకరికి సెక్స్‌లో ఆసక్తి తగ్గిపోరుు ఇలా యాంత్రికంగా పాల్గొనడం సాధారణంగా జరిగేదే. దీనికి ప్రధాన కారణం వూనసిక, శారీరక ఒత్తిళ్లు కావచ్చు. ఆమె ఇంట్లో ఏ కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్నారో, ఎందుకు అలసిపోతున్నారో గుర్తించండి. ఆ కండిషన్‌ను చక్కదిద్దితే అంతా సర్దుకుపోవచ్చు. ఇక మీరు కూడా మీ వైపు నుంచి కాస్తంత రొమాంటిక్‌గా ఉంటూ ఆమెకు కూడా సెక్స్‌లో ఆసక్తి కలిగేలా ప్రయత్నించవచ్చు. అయితే ఆమెకు ఆసక్తిగా లేనప్పుడు మాత్రం మీరు సెక్స్ కావాల్సిందే అంటూ పట్టుబట్టకండి. మీరే సర్దుకుపోండి. ఇక మీకు వీలైతే ఒకసారి ఇద్దరూ కలిసి దగ్గర్లోని యాండ్రాలజిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి. డాక్టర్ వి.చంద్రమోహన్ యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
కిడ్నీలో రాళ్లు తొలగించినా... నొప్పి తగ్గడం లేదు
నా వయుస్సు 26. నాకు రెండు మూత్రపిండాల్లో రాళ్లు వస్తే ఆర్నెల్ల క్రితం లోపలే పేల్చివేశారు. అయితే ఇప్పటికీ నాకు నడుం నొప్పి, మూత్రంలో మంట ఉన్నాయి. చిన్న చిన్న రాళ్లు మూత్రంలో వస్తూనే ఉన్నాయి. ఒకసారి కిడ్నీలలో రాళ్లు వస్తే అవి మళ్లీ వుళ్లీ వస్తూనే ఉంటాయుని కొందరు చెబుతున్నారు. ఇది నిజమేనా? కిడ్నీలో రాళ్లు రాకుండా ఏవైనా ఆహార నియమాలు పాటించాలా? నాకింకా పెళ్లి కాలేదు. కిడ్నీలో రాళ్ల వల్ల అంగస్తంభన శక్తి తగ్గుతుందా? నేను వివాహం చేసుకోవచ్చా? - ఎమ్ఎమ్ఆర్., కర్నూలు ఇటీవల మూత్రపిండాల్లో రాళ్లను ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ విధానంతో పేల్చివేస్తున్నారు. ఈ పేల్చివేతలో భాగంగా పెద్ద ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా (అంటే మూడు మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజ్విగా) చేసి వదిలేస్తాం. దాంతో అవి పౌడర్‌లాగా మూత్రంలో వెళ్లిపోతాయి. అయితే ఒక్కోసారి ఏదైనా పెద్ద ముక్కను వదిలేసినా, రాయి పూర్తిగా పగలకపోయినా అది వుళ్లీ పెరగవచ్చు. కానీ ఇలా జరగడం అరుదు. పైగా అవి వుళ్లీ కొత్తగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. కాబట్టి ఎప్పుడో ఫామ్ అయ్యే స్టోన్ గురించి ఇప్పట్నుంచే భయుపడుతూ ఉండటం సరికాదు. ఇక మీరు అడిగిన ఆహార నియువూల విషయూనికి వస్తే... పాలకూర, క్యాబేజీ, టొవూటో, వూంసాహారం తక్కువగా తినడం వుంచిది. ఇక రోజూ మూడు లీటర్ల వరకు నీళ్లు తాగండి. మూత్రపిండాల్లో రాళ్లకూ సెక్స్‌కూ ఎలాంటి సంబంధం లేదు. మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినా అంగస్తంభన శక్తి తగ్గడం అంటూ ఉండదు. మీరు నిశ్చింతగా, నిర్భయుంగా పెళ్లి చేసుకోవచ్చు. నా వయుస్సు 22. నాకు వేరికోసిల్ ఉంది. డాక్టర్‌కు చూపిస్తే... అల్ట్రాసౌండ్ హై ఫ్రీక్వెన్సీ (స్క్రోటమ్) పరీక్షల చేసి, ఎడవువైపున గ్రేడ్-3, కుడివైపున గ్రేడ్-1 ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ అవసరవుని రెండువైపులా చేశారు. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకొమ్మన్నారు. ఇప్పటికీ వృషణాల్లో అప్పడప్పుడూ నొప్పి వస్తూనే ఉంది. ఈ శస్త్రచికిత్స తర్వాత అంగస్తంభన శక్తి తగ్గుతుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - జె.కె.బి., చిల్లకల్లు వృషణాల్లోని రక్తనాళాల్లో (వెయిన్స్) వాపును వేరికోసిల్ అంటారు. దానివల్ల వృషణాల్లో నొప్పి రావడమే గాక వీర్యకణాల సంఖ్య, క్వాలిటీ తగ్గుతుంది. నొప్పి విపరీతంగా ఉన్నా, పిల్లలు లేకున్నా ఈ సవుస్యను ఆపరేషన్ ద్వారా సరిచేస్తారు. ఆపరేషన్ తర్వాత నిల్చోవడం, బరువులు ఎత్తడం వంటివి చేస్తే నొప్పి వస్తుంది. అందువల్ల రెండు నెలల పాటు డాక్టర్లు శారీరక శ్రవు ఎక్కువగా ఉండే పనులు వద్దంటారు. ఎక్కువ దూరం నడవడాన్ని కూడా కొంతకాలం అవాయిడ్ చేయుండి. మూడు నెలల తర్వాత అన్ని పనులూ వూమూలుగానే చేసుకోవచ్చు. సర్జరీ తర్వాత కొంతవుందిలో నొప్పి అలాగే ఉంటుంది. అది నిదానంగా తగ్గిపోతుంది. స్క్రోటల్ సపోర్ట్ కోసం బిగుతైన లోదుస్తులు వేసుకొవ్ముని చెబుతాం. ఈ శస్త్రచికిత్స వల్ల అంగస్తంభన శక్తిని కోల్పోవడం జరగదు. ఆందోళన చెందకండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
ఆపరేషన్ తప్పనిసరా?
వూ నాన్నగారి వయస్సు 75 ఏళ్లు. మూత్ర సంబంధమైన సమస్య వస్తే యూరాలజిస్ట్‌ను కలిశాం. ప్రోస్టేట్ పెద్దదిగా ఉందని, ఆపరేషన్ చేస్తే మంచిదని చెప్పారు. ఆపరేషన్ చేయించుకోవడం అవసరమా? - సుకుమార్, వరంగల్ ఈ వయుస్సులో ప్రోస్టేట్ గ్రంథికి సమస్యలు రావడం చాలా సాధారణం. ఈ సమస్య ఉన్నవారికి మొదట వుందులు వాడి చూస్తాం. అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎండోస్కోపీ ద్వారా టీయూఆర్‌పీ అనే శస్త్రచికిత్స చేస్తాం. మాత్రం పూర్తిగా ఆగిపోయినా, మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, మూత్రాశయంలో రాళ్లు ఉన్నా, మూత్రపిండాల పనితీరు తగ్గినా, మూత్రంలో తరచు రక్తం కనిపిస్తున్నా... వుందులపై ఆధారపడకుండా శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఈ ఆపరేషన్‌కు పేషెంట్ ఫిట్‌గా ఉన్నారా లేదా తెలుసుకోవడం కోసం ముందుగా ఫిజీషియున్ను కలవండి. ఆ తర్వాత యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 35. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. ప్రస్తుతం సెక్స్ చేసిన ఒకటి రెండు నిమిషాల్లో వీర్యస్ఖలనం అయిపోతోంది. దాంతో ఇద్దరికీ చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకు మంచి సలహా ఇవ్వండి. - ఎస్.డి., ఖమ్మం మీ సమస్యను ప్రీ-మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సాధారణంగా సెక్స్ మొదలుపెట్టాక స్ఖలనానికి నిర్దిష్టంగా ఇంతే సమయం కావాలనే నియమం ఏదీ లేదు. దంపతులిద్దరూ తృప్తిపడేంత సేపు సెక్స్ జరిగితే చాలు. అయితే కొందరిలో సెక్స్ మొదలుపెట్టిన ఒకటి, రెండునిమిషాల్లోనే వీర్యస్ఖలనం అయిపోతుంది. దాంతో దంపతులిద్దరికీ సెక్స్‌లో తృప్తి కలగకపోవచ్చు. ఇలా దంపతులిద్దరూ సంతృప్తి పొందకముందే వీర్యస్ఖలనం జరిగిపోతే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా చెప్పవచ్చు. సెక్స్‌లో పురుషాంగంపైన ఏర్పడే కదలికల వల్ల ప్రేరేపణ జరిగి వీర్యస్ఖలనం అవుతుంది. ఇలాకాకుండా ఉండాలంటే... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మొదట అరగంట లేదా గంటసేపు ప్రీ-ప్లే చేసి ఆ తర్వాత సెక్స్ చేయడం మంచిది. మధ్యమధ్యలో ఆపడం వల్ల కూడా మెదడుకు అందే సిగ్నల్స్‌ను ఆపవచ్చు. ఇది కాకుండా ఫోగ్జటివ్ ఎపాక్సిటిన్ అనే మందులు మెదడు మీద పనిచేసి ఈ సిగ్నల్స్‌ను బలహీనపరుస్తాయి. అయితే ఈ మందులను కేవలం ఆండ్రాలజిస్ట్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
పొట్ట ఉబ్బటం కిడ్నీ సమస్యకు సంకేతమా?
నాకు 55 ఏళ్లు. మొదట్నుంచీ నేను కొంచెం లావుగానే ఉంటాను. కానీ ఈమధ్య కాలంలో పొట్ట మాత్రం విపరీతంగా ముందుకు వస్తూ ఉంది. ఉదయం వేళల్లో కాళ్ల వాపు, ముఖం వాపు కూడా ఉంటోంది. గత 20 ఏళ్లుగా నాకు మద్యం అలవాటు ఉంది. నా స్నేహితులంతా కిడ్నీ చెడిపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడతాయని అంటున్నారు. ఇతరత్రా నాకు ఎలాంటి సమస్యా లేదు. గత మూడేళ్లుగా హైబీపీ కూడా ఉంది. నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? పొట్ట విపరీతంగా ఉబ్బితే కిడ్నీ సమస్య ఉన్నట్లా? దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. - డి.ఎస్.ఎమ్., కరీంనగర్ సాధారణంగా పొట్టతోపాటు, శరీరం కూడా పెరిగితే స్థూలకాయం అంటారు. కానీ ముఖం మీద, కళ్ల చుట్టూ వాపు రావడం, పాదాల్లో వాపు వంటి లక్షణాలు స్థూలకాయంలో ఉండవు. కిడ్నీ, గుండె, కాలేయానికి సంబంధించిన సమస్య ఉన్నవాళ్లలో మాత్రమే ఇలాంటి వాపు కనిపిస్తుంటుంది. ఒకవేళ పై సమస్యల కారణంగా పొట్టలో కూడా నీరు చేరితే, పొట్ట ఉబ్బుతుంది. ఈ కండిషన్‌ను అసైటిస్ అంటారు. అయితే ఈ కండిషన్లో కాళ్లూ, చేతులు స్థూలకాయంలో ఉన్నంత లావుగా ఉండకుండా, మామూలుగానే ఉంటాయి. కిడ్నీ సమస్య ఉన్నవాళ్లలో పొట్ట వాపు కంటే కళ్ల చుట్టూ వాపు ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి క్రియాటినిన్ అనే కిడ్నీ పరీక్ష, ఎల్.ఎఫ్.టి. అనే కాలేయ పరీక్ష, ఎకో-కార్డియోగ్రామ్ అనే గుండె పరీక్ష చేయించుకుంటే... మీ లక్షణాలు దేనికి సంబంధించినవో తెలుస్తుంది. మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి, పై పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గమా?
నా వయస్సు 28. ఇంకా పెళ్లి కాలేదు. నాకు రెండువైపులా వేరికోసిల్ ఉంది. వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గం అని నేను చాలాసార్లు చదివాను. ఆపరేషన్ తప్ప మరోమార్గం లేదా? దయచేసి సలహా ఇవ్వండి. -పి.వి.ఆర్, హైదరాబాద్ వేరికోసిల్ రావడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏదీ లేదు. వేరికోసిల్ ఉన్నప్పుడు పెళ్లి కాకుండా ఉండి, నొప్పి లేకుండా ఉంటే వెంటనే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వివాహం అయిన వ్యక్తుల్లో వేరికోసిల్ కండిషన్ ఉండి పిల్లలు లేకపోతే... ముందుగా సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. వేరికోసిల్ ఉన్నవాళ్లలో సెమెన్ కౌంట్ తక్కువగా ఉండి, వీర్యకణాల కదలికలు తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ అనే పరీక్ష ద్వారా వేరికోసిల్ కండిషన్‌ను నిర్ధారణ చేసి, సర్జరీ చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. మీకింకా వివాహం కాలేదని రాశారు. కాబట్టి మీలాంటి వారి విషయంలో ముందుగానే సర్జరీ చేయించుకొమ్మనే సలహా ఇవ్వము. మరీ తీవ్రమైన నొప్పిగాని, గ్రేడ్-3 వేరికోసిల్ కండిషన్ ఉంటే సర్జరీతో మంచి ఉపశమనం దొరుకుతుంది. మీకు ఇంకా పెళ్లికానట్లయితే... వేరికోసిల్ వల్ల మీకు నొప్పి లేకపోతే... ఇప్పుడప్పుడే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నా వయుసు 32 ఏళ్లు. నా వృషణాల్లో నొప్పి వస్తోంది. లాగుతున్న ఫీలింగ్ కూడా ఉంది. వృషణాల సైజ్ చిన్నవిగా వూరాయుని అనిపిస్తోంది. దయుచేసి నా సవుస్యకు సలహా ఇవ్వండి. - బి. కిరణ్ కుమార్, కరీంనగర్ తవు వృషణాలు చిన్నవేమో అనే అపోహ చాలావుందిలో ఉంటుంది. మీకు ఇతరత్రా ఏ ఇబ్బందులూ లేకపోతే దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. అయితే తవు వృషణాలు వుుందు పెద్దవిగా ఉండి, ఇప్పుడు అవి చిన్నవిగా అయిపోయి ఉండి, నొప్పి కూడా ఉంటే మాత్రం దానికి కారణం వేరికోసిల్ అయివుండవచ్చునని అనువూనించాలి. కాబట్టి మీరు ఒకసారి యుూరాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు డాప్లర్ అల్ట్రాసౌండ్ అనే పరీక్ష చేయించి ఏదైనా సమస్య ఉందా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. మీ సమస్యను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
వృషణం చిన్నదైపోయింది... ఎందుకిలా?
నాకు 25 ఏళ్లు. ఐదేళ్ల కిందట కుడి వృషణంలో అకస్మాత్తుగా నొప్పి వచ్చి, ఆ తరవాత వాచింది. అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాను. ఆ తర్వాత ఆర్నెల్లకు కుడివైపు వృషణం బఠాణీ గింజంత అయిపోయింది. ఎడమవైపు వృషణం మాత్రం మామూలుగానే ఉంది. పెళ్లయిన తర్వాత ఇది దాంపత్య జీవితానికి ఏమైనా అడ్డంకా? - ఎస్.ఎస్., యలమంచిలి మీరు మొదటిసారి నొప్పి వచ్చినప్పుడు డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ పరీక్ష చేయించి ఉంటే అది వృషణంలో ఇన్ఫెక్షనా (ఎపిడైడమో ఆర్కయిటిస్) లేకపోతే వృషణం మడతపడటమా (టెస్టిక్యులార్ టార్షన్) అనే విషయం తెలిసి ఉండేది. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే... మడత పడినప్పుడు ఆరుగంటల్లోపు ఆపరేషన్ చేసి వృషణాన్ని నార్మల్ పొజిషన్‌కి ఉంచితే అది సక్రమంగా పనిచేసేది. అలా చేయకపోతే వృషణానికి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయి తర్వాత చిన్నదైపోతుంది. అప్పుడు వీర్యకణాలను ఉత్పత్తి చేయలేదు. కేవలం సెక్స్ హార్మోన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటివారిలో నొప్పి ఉన్నా, లేకపోయినా రెండో వైపు వృషణాన్ని ఫిక్స్ చేసుకోవడం (ఆర్కిడోపెక్సీ) మంచిది. అప్పుడు రెండోవైపు మడత పడే సమస్య రాదు. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను కలిసి ఆర్కిడోపెక్సీ గురించి వివరాలను తెలుసుకోండి. మా బాబుకు ఇటీవల కడుపునొప్పిగా ఉందంటే స్కానింగ్ చేయించాం. అందులో ఒక కిడ్నీలో వాపు ఉందని చెప్పారు. దీనివల్ల కిడ్నీకి ప్రమాదమని, సర్జరీ ద్వారా మూత్రవిసర్జన జరిగే దారి వెడల్పు చేయించుకోవాలని, అలా చేయకపోతే కిడ్నీ దెబ్బతినే అవకాశముందని డాక్టర్ చెప్పారు. మాది మేనరిక వివాహం. దాని వల్లనే ఇలాంటి సమస్య వచ్చిందా? - కె.ఎస్.పి.ఆర్., నెల్లూరు చిన్నపిల్లల్లో కిడ్నీలో వాపునకు చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది మూత్రనాళంలో, రీనల్ పెల్విస్ జంక్షన్లో అడ్డంకి ఉండటం. దీన్ని పెల్వి-యూరెటరిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటారు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మూత్రం కిందికి సరిగా వెళ్లక, కిడ్నీలో నిలిచిపోతుంది. ఈ కండిషన్‌ను హైడ్రోనెఫ్రోసిస్ (కిడ్నీ వాపు) అంటారు. ఇలా మూత్రం కిడ్నీలో నిలిచిపోవడం వల్ల కిడ్నీ మీద భారంపడి దాని కండ రోజురోజూ కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. కొద్దిసంవత్సరాల పాటు ఇలాగే కొనసాగుతూ ఉంటే, మూత్రపిండం కాస్తా క్రమేపీ పేపర్‌లాగా అయిపోయి పనిచేయడం మానేస్తుంది. అందువల్ల కిడ్నీలో వాపు ఉంటే ‘ఐవీపీ’ వంటి పరీక్ష చేయించుకుని, నిజంగానే మూత్ర ప్రవాహానికి ఏదైనా అడ్డుపడుతుంటే పైలోప్లాస్టీ అనే శస్త్రచికిత్స చేయించాలి. దీన్ని ఆపరేషన్ ద్వారా కాకుండా ‘కీ-హోల్’ (లాపరోస్కోపిక్) ప్రక్రియ ద్వారా కూడా చేయవచ్చు. ఇలాంటి సమస్య మేనరికం కారణంగానే రావాలని లేదు. మీరు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
ఇలా మడతపడితే...భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం ఉందా?
మా బాబు వయసు 12 సంవత్సరాలు. వాడికి ఒకవైపు వృషణంలో విపరీతమైన నొప్పి రావడం వల్ల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ‘వృషణం మడతపడింది. వెంటనే ఆపరేషన్ చేయాలి’ అని చెప్పారు. ఆపరేషన్ చేసిన తర్వాత వృషణాన్ని పూర్తిగా తీసివేశారు. రెండోవృషణం అలా కాకుండా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఒక వృషణమే ఉంది. వృషణం ఒక్కటే ఉండే మా బాబు పెద్దయ్యాక నార్మల్ సెక్స్ చేయడానికి, పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందా? అందరికీ తెలుస్తుందేమోనని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం. - ఎమ్.ఎల్.ఎస్., మహబూబ్‌నగర్ యుక్తవయసు రాబోయే ముందు అకస్మాత్తుగా వృషణాల్లో నొప్పి వస్తే అది సాధారణంగా ఇన్ఫెక్షన్ (ఎపిడైడమో ఆర్కడైస్) కారణంగా గానీ, వృషణం మడత పడటం వల్ల గానీ (టెస్టిక్యులార్ టార్షన్) వల్లగాని కావచ్చు. విపరీతమైన నొప్పి వచ్చినప్పుడు కేవలం డాప్లర్ స్కాన్ ద్వారా వృషణాలకు రక్తప్రసరణ ఉందో లేదో చూసుకుని, ఒకవేళ వృషణం మడతపడి ఉంటే (టార్షన్ అయి ఉంటే) ఆరు గంటల లోపే ఆ మడతను విడదీయాలి. ఆర్కడైస్ ఉంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాలి. అందువల్ల సడన్‌గా వాపుతో వచ్చే వృషణం నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ఒక వృషణం తీసివేసినా దాదాపు చాలామందిలో సెక్స్ చేయడానికిగానీ, పిల్లలు పుట్టడానికి గానీ ఎలాంటి అవరోధం ఉండదు. కాబట్టి మీరు మీ బాబుకు తగిన వయసు వచ్చినప్పుడు నిర్భయంగా వివాహం చేయవచ్చు. నా వయస్సు 28 ఏళ్లు. నాకు హస్తప్రయోగం సమయంలో స్ఖలనం జరగగానే పురుషాంగంలో విపరీతంగా నొప్పి వస్తోంది. ఆ నొప్పిలోనే నాకు మరోసారి అంగస్తంభన అవుతోంది. ఆ టైమ్‌లో నరాలు లాగుతున్నట్లుగా ఉంటుంది. స్ఖలనం అయ్యాక దాదాపు గంటతర్వాత నొప్పి దానంతట అదే తగ్గిపోతోంది. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ చేయలేనేమో అనిపిస్తోంది. నాకు మంచి సలహా ఇవ్వండి. - జె.వి.ఆర్., ఒంగోలు వీర్యస్ఖలనం తర్వాత పురుషాంగంలో, మూత్రనాళంలో నొప్పి, కాస్తంత డిస్‌కంఫర్ట్‌గా ఉండటం కొందరిలో సాధారణం. కాకపోతే అది కొద్ది నిమిషాలే ఉంటుంది. మీకు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వీర్యం, మూత్రం పరీక్షలు చేయించుకుని, అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో చూడాలి. చాలావరకు ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి తీవ్రమైన లేదా ప్రమాదకరమైన కారణాలేవీ ఉండవు. ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గుతుంది. మీ సమస్య వల్ల భవిష్యత్తులో సెక్స్ చేయలేని పరిస్థితి ఏమీ రాదు. మీరు ఆందోళన పడకుండా ఒకసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 32 ఏళ్లు. నేను సెక్స్‌లో పాల్గొన్న వెంటనే స్ఖలనం అయిపోతోంది. సెక్స్‌లో పాల్గొనే సవుయుంలో శీఘ్రస్ఖలనాన్ని నివారించడానికి డీ-సెన్సిటైజర్ క్రీమ్స్, లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ దొరుకుతాయుని విన్నాను. వాటి విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎస్‌కెబి., గుంటూరు మీరు శీఘ్రస్ఖలనం అనే సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాధారణ సమస్య. మీ వయసులో ఉన్నవారు చాలామంది ఈ కంప్లయింట్ చేస్తుంటారు. శీఘ్రస్ఖలనాన్ని నివారించేందుకు మీరు చెప్పినట్లే కొన్ని లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ ఉంటాయి. అయితే మీకు ఉన్న సమస్యకు అదే చికిత్స కాదు. సెక్స్ చేస్తున్నప్పుడు పురుషాంగం మీద ఉండే నరాలు త్వరగా స్పందించడం (స్టిమ్యులేట్ అవడం) వల్ల మీకు స్ఖలనం త్వరగా అయిపోతుంది. మీరు చెబుతున్న ఆ లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ ఆ నరాలను మొద్దుబారేలా చేస్తాయి. కాబట్టి స్ఖలనం ఆలస్యమవుతుంది. అయితే దీనివల్ల సెక్స్‌లో సుఖం కూడా తగ్గుతుంది. మీరు చెప్పే డీ-సెన్సిటైజర్లు కూడా ఇదే పని చేస్తాయి . ఈ క్రీమ్స్, డీ-సెన్సిటైజర్స్ కంటే స్ఖలనం అయ్యే సమయంలో పురుషాంగం చివరను చేతి వేళ్లతో బిగించి పట్టుకుని, మళ్లీ ఆ ఫీలింగ్ తగ్గిన వెంటనే సెక్స్ కొనసాగించే పించ్ టెక్నిక్, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ వంటి వాటిని అనుసరించండి. మీ ఉద్వేగాలను అదుపు చేసే టెక్నిక్స్ వంటివి స్ఖలనం రిఫ్లక్స్పై నియంత్రణ సాధించేలా చేసి మీకు దీర్ఘకాలికంగా మేలు చేస్తాయి. నాకు 27 ఏళ్లు. ఇటీవలే పెళ్లయ్యింది. సెక్స్ చేస్తున్నప్పుడు పురుషాంగం ముందు చర్మం వెనక్కు పోయి తీవ్రమైన నొప్పి వచ్చింది. అప్పట్నుంచి సెక్స్ చేయడం లేదు. డాక్టర్‌కు చూపించుకుందామంటే సిగ్గుగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - జి.వి.ఎస్., కర్నూలు సాధారణంగా పురుషాంగం మీద చివరిభాగంలో ఉన్న చర్మం ఫ్రీగా ముందుకు-వెనక్కు కదలాలి. ఒకవేళ అలా కదలకపోతే దాన్ని ఫైమోసిస్ అంటారు. ఈ పరిస్థితుల్లో అంగస్తంభన జరిగినప్పుడు చర్మం బలం (ఫోర్సిబుల్) గా వెనక్కువెళ్లి తిరిగి ముందుకు రాకపోతే తీవ్రమైన వాపు, నొప్పి వస్తుంది. ఈ కండిషన్‌ను పారాఫైమోసిస్ అంటారు. దీనికి సున్తీ ఒక్కటే మార్గం. సున్తీ చేయించుకున్న తర్వాత సెక్స్‌లైఫ్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా ఉంటుంది. ఇందులో మీరు బిడియపడాల్సిందేమీ లేదు. దగ్గర్లోని డాక్టర్‌ను కలవండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
సిజేరియన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
నా భార్యకు సిజేరియున్ ద్వారా కాన్పు జరిగి మూడు నెలలవుతోంది. నేను నా భార్యతో ఎప్పట్నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు? సిజేరియున్ తర్వాత వురో రెండేళ్ల వరకు గర్భం రాకుండా చూసుకోవాలంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - ఎమ్.ఆర్.ఆర్., కొత్తగూడెం సాధారణ ప్రసవమైనా లేదా సిజేరియున్ అయినా- ప్రసవం తర్వాత మొదటి ఆరువారాలు సాధ్యమైనంత వరకు సెక్స్‌లో పాల్గొనకపోవడం వుంచిది. ప్రసవమైన వుహిళకు రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్ లేకుండా ఉండి, ఆమె కూడా సెక్స్ కోసం శారీరకంగా, వూనసికంగా సంసిద్ధంగా ఉంటే ఆరు వారాల తర్వాత నుంచి దంపతులిద్దరూ నిరభ్యంతరంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. బిడ్డకు పాలిస్తున్న తల్లులలో మొదటి మూడు నెలలు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ వుళ్లీ గర్భం వచ్చే అవకాశం తక్కువ. అయినప్పటికీ రిస్క్ తీసుకోకుండా రెండు సంవత్సరాల వరకు కచ్చితంగా వుళ్లీ గర్భం రాకుండా ఏదో ఒక గర్భనిరోధక సాధనాన్ని వాడాలి. (అంటే... పురుషులు కండోమ్గానీ, వుహిళలు కాపర్టీ, కాంట్రసెప్టివ్ పిల్స్ వంటివి). డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు సెక్స్ చేసినా వుళ్లీ గర్భం వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి. ఇది తల్లికి... మరీ ముఖ్యంగా సిజేరియున్ అయిన మహిళలకు... అస్సలు వుంచిది కాదు. కాబట్టి వచ్చే రెండేళ్ల పాటు మీకు సౌకర్యంగా ఉండే గర్భనిరోధక సాధనాలను ఎంచుకుని వాటిని వాడటం అన్నివిధాలా మంచిది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
కిడ్నీలో ఈ నీటిబుడగలేమిటి..?
నాకు 45 ఏళ్లు. ఈమధ్యకాలంలో బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. దాంతో హెల్త్ చెక్ అప్స్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. ‘కిడ్నీ పనితీరు కొంచెమే మారింది, పెద్దగా ప్రమాదమేమీ లేద’న్నారు. అసలీ నీటి బుడగల జబ్బేమిటి? నాకు భయమేస్తుంది. మా నాన్నగారు కూడా ఏదో కిడ్నీ సమస్యతోనే చనిపోయారు. ఈ జబ్బు విషయంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అసలు కిడ్నీ చెడిపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నా ఈ జబ్బుకు ఏదైనా ఆపరేషన్ అవసరం ఉంటుందా? - సుదర్శన్, వరంగల్ మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండవచ్చునని అనిపిస్తోంది. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే జబ్బు . ఈ జబ్బు ఉన్నవారిలో 30 ఏళ్ల వయసప్పటి నుంచి 50 ఏళ్ల మధ్యన మూత్రపిండాల్లో నీటిబుడగలు తయారవ్వడం మొదలవుతుంది. ఈ నీటిబుడగల సంఖ్య, పరిమాణం పెరిగేకొద్దీ కిడ్నీ సైజ్ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల కిడ్నీ కండ తగ్గడానికి అవకాశం ఉంటుంది. క్రమేపీ నీటిబుడగల సంఖ్య పెరగడం వల్ల కిడ్నీ పనితీరు కూడా నెమ్మదిగా మందగిస్తూ పోతుంది. ఈ జబ్బుకు నిర్దిష్టంగా ఏ మందులూ లేకపోయినా, బీపీని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు తక్కువ మాంసకృత్తులను తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరును కాపాడుకోవచ్చు. ఈ జబ్బు ఉన్నవారు క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్ స్కాన్, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుంటూ, మూత్రపిండాల వ్యాధి నిపుణులను సంప్రదిస్తూ ఉండటం అవసరం. ఈ జబ్బు ఉన్నవారు దీన్ని నిర్లక్ష్యం చేసినా కిడ్నీ పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దీర్ఘకాలం పాటు సాధారణజీవితాన్ని గడపవచ్చు. కాబట్టి ఆందోళన చెందకండి. నాకు 56 ఏళ్లు. పదేళ్లుగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నాను. ఇటీవల పురుషాంగం మీద చర్మం పగిలినట్లుగా ఉండి, మంటగా ఉంటోంది. చర్మం కూడా ఫ్రీగా వెనక్కి రావడం లేదు. షుగర్ అప్పుడప్పుడూ 200 పైన కూడా ఉంటోంది. దీనివల్ల సెక్స్‌లో కూడా ఇబ్బంది కలుగుతోంది. దయచేసి ఎలాంటి చికిత్స తీసుకోవాలో చెప్పండి. - డి.ఆర్.ఎస్., నందిగామ షుగర్ ఉన్నవారిలో పురుషాంగం చివరన ఉన్న చర్మానికి ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావడం చాలా సాధారణంగా జరిగేదే. ఇలా జరిగినప్పుడు ఒకటి రెండుసార్లు యాంటీఫంగల్, యాంటీబయాటిక్ మందులు వాడినప్పటికీ ఇలాగే జరుగుతుంటే సున్తీ ఆపరేషన్ చేయించుకుంటే దీర్ఘకాలికంగా ఉపయోగం ఉంటుంది. పురుషాంగం చర్మం వెనక్కి రానివారిలో లోపల మూత్రనాళం (యురెథ్రా) కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా సున్తీ ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా సలహా ఇస్తాం. మీరు మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నాకు పెళ్లయి ఏడాది అయ్యింది. పెళ్లయిన మొదటి రెండు రోజులు జంకుతో నేను సెక్స్‌లో పాల్గొనలేకపోయాను. తర్వాత కూడా సెక్స్ చేయబోతే అంగస్తంభన సరిగా కాలేదు. మొదట్లో ఏమీ అనకపోయినా ఇటీవల నా భార్య నా పట్ల చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకేమో కొద్దిగా అంగస్తంభన అయి మళ్లీ చాలా త్వరగా వీర్యస్ఖలనం అయిపోతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - డి.ఎన్.పి., సత్తుపల్లి సాధారణంగా పెళ్లయిన కొత్తలో కాస్త బెరుకుగా ఉన్నా, దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగాక అంగస్తంభన మామూలుగానే జరిగిపోవాలి. కానీ చాలా సందర్భాలలో మానసిక కారణాల వల్లగాని, ఒకరిపై మరొకరికి పూర్తిగా ఇష్టం కలగకపోవడం వల్లగాని, పార్ట్నర్స్ మధ్య మనస్పర్థల వల్లగాని ఇలా మీకు జరిగినట్లుగా అంగస్తంభన పూర్తిగా జరగకపోవడం, వీర్యం త్వరగా పడిపోవడం వంటివి జరగవచ్చు. అందువల్ల మీరు సెక్స్ కౌన్సెలింగ్ చేయించుకుని, సెక్స్‌లో పాల్గొనండి. అప్పటికీ ప్రయోజనం లేకపోతే సెక్స్‌ను ప్రేరేపించే మందులు వాడటం వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది. మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 36 ఏళ్లు. గత రెండేళ్లుగా మూత్రంలో విపరీతమైన వుంట. నాకు మూత్రధార సరిగా రావడం లేదు. సెక్స్ చేసినప్పుడు వీర్యం సరిగా రావడం లేదు. పై సమస్యలతో తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాను. సెక్స్ చేసినా, మూత్రం పోసినా పొత్తికడుపులో బిగదీసుకుపోయినట్లుగా ఉంటోంది. దాంతో సెక్స్ అంటేనే భయుమేస్తోంది. పెళ్లికి ముందు కండోమ్ లేకుండా చాలాసార్లు చాలావుంది అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నాను. అప్పుడు అలా చేయడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయేమోనని యూంటిబయూటిక్స్ ఎక్కువగా మింగుతున్నాను. నాకు వుంచి సలహా ఇవ్వండి. - ఆర్.కె.ఆర్., విజయవాడ మీరు ముందుగా ఇరట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్ (ఆర్జీయూ) అనే పరీక్ష చేయించుకోవాలి. దీనిల్ల మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి(బ్లాక్) ఉందేమో తెలుస్తుంది. అలా ఉంటే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా మూత్రనాళాన్ని వెడల్పు చేయించుకుంటే మూత్రం, వీర్యం రెండూ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్