కిడ్నీలో రాళ్లు తొలగించినా... నొప్పి తగ్గడం లేదు | stones in kidney, what shall i do? | Sakshi
Sakshi News home page

కిడ్నీలో రాళ్లు తొలగించినా... నొప్పి తగ్గడం లేదు

Published Thu, Nov 7 2013 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM

కిడ్నీలో రాళ్లు తొలగించినా... నొప్పి తగ్గడం లేదు

కిడ్నీలో రాళ్లు తొలగించినా... నొప్పి తగ్గడం లేదు

నా వయుస్సు 26. నాకు రెండు మూత్రపిండాల్లో రాళ్లు వస్తే ఆర్నెల్ల క్రితం లోపలే పేల్చివేశారు. అయితే ఇప్పటికీ నాకు నడుం నొప్పి, మూత్రంలో మంట ఉన్నాయి. చిన్న చిన్న రాళ్లు మూత్రంలో వస్తూనే ఉన్నాయి. ఒకసారి కిడ్నీలలో రాళ్లు వస్తే అవి మళ్లీ వుళ్లీ వస్తూనే ఉంటాయుని కొందరు చెబుతున్నారు. ఇది నిజమేనా? కిడ్నీలో రాళ్లు రాకుండా ఏవైనా ఆహార నియమాలు పాటించాలా? నాకింకా పెళ్లి కాలేదు. కిడ్నీలో రాళ్ల వల్ల అంగస్తంభన శక్తి తగ్గుతుందా? నేను వివాహం చేసుకోవచ్చా?
 - ఎమ్‌ఎమ్‌ఆర్., కర్నూలు

 
 ఇటీవల మూత్రపిండాల్లో రాళ్లను ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ విధానంతో పేల్చివేస్తున్నారు. ఈ పేల్చివేతలో భాగంగా పెద్ద ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా (అంటే మూడు మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజ్‌విగా) చేసి వదిలేస్తాం. దాంతో అవి పౌడర్‌లాగా మూత్రంలో వెళ్లిపోతాయి. అయితే ఒక్కోసారి ఏదైనా పెద్ద ముక్కను వదిలేసినా, రాయి పూర్తిగా పగలకపోయినా అది వుళ్లీ పెరగవచ్చు. కానీ ఇలా జరగడం అరుదు. పైగా అవి వుళ్లీ కొత్తగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. కాబట్టి ఎప్పుడో ఫామ్ అయ్యే స్టోన్ గురించి ఇప్పట్నుంచే భయుపడుతూ ఉండటం సరికాదు. ఇక మీరు అడిగిన ఆహార నియువూల విషయూనికి వస్తే... పాలకూర, క్యాబేజీ, టొవూటో, వూంసాహారం తక్కువగా తినడం వుంచిది. ఇక రోజూ మూడు లీటర్ల వరకు నీళ్లు తాగండి. మూత్రపిండాల్లో రాళ్లకూ సెక్స్‌కూ ఎలాంటి సంబంధం లేదు.  మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినా అంగస్తంభన శక్తి తగ్గడం అంటూ ఉండదు. మీరు నిశ్చింతగా, నిర్భయుంగా పెళ్లి చేసుకోవచ్చు.
 
 నా వయుస్సు 22. నాకు వేరికోసిల్ ఉంది. డాక్టర్‌కు చూపిస్తే... అల్ట్రాసౌండ్ హై ఫ్రీక్వెన్సీ (స్క్రోటమ్) పరీక్షల చేసి, ఎడవువైపున గ్రేడ్-3, కుడివైపున గ్రేడ్-1 ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ అవసరవుని రెండువైపులా చేశారు. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకొమ్మన్నారు. ఇప్పటికీ వృషణాల్లో అప్పడప్పుడూ నొప్పి వస్తూనే ఉంది. ఈ శస్త్రచికిత్స తర్వాత అంగస్తంభన శక్తి తగ్గుతుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 - జె.కె.బి., చిల్లకల్లు

 
 వృషణాల్లోని రక్తనాళాల్లో (వెయిన్స్) వాపును వేరికోసిల్ అంటారు. దానివల్ల వృషణాల్లో నొప్పి రావడమే గాక వీర్యకణాల సంఖ్య, క్వాలిటీ తగ్గుతుంది. నొప్పి విపరీతంగా ఉన్నా, పిల్లలు లేకున్నా ఈ సవుస్యను ఆపరేషన్ ద్వారా సరిచేస్తారు. ఆపరేషన్ తర్వాత నిల్చోవడం, బరువులు ఎత్తడం వంటివి చేస్తే నొప్పి వస్తుంది. అందువల్ల రెండు నెలల పాటు డాక్టర్లు శారీరక శ్రవు ఎక్కువగా ఉండే పనులు వద్దంటారు. ఎక్కువ దూరం నడవడాన్ని కూడా కొంతకాలం అవాయిడ్ చేయుండి. మూడు నెలల తర్వాత అన్ని పనులూ వూమూలుగానే చేసుకోవచ్చు. సర్జరీ తర్వాత కొంతవుందిలో నొప్పి అలాగే ఉంటుంది. అది నిదానంగా తగ్గిపోతుంది. స్క్రోటల్ సపోర్ట్ కోసం బిగుతైన లోదుస్తులు వేసుకొవ్ముని చెబుతాం. ఈ శస్త్రచికిత్స వల్ల అంగస్తంభన శక్తిని కోల్పోవడం జరగదు. ఆందోళన చెందకండి.
 
 డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement