తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు
లక్డీకాపూల్: కేవలం 27 శాతం మాత్రమే కిడ్నీ పనితీరు ఉన్న ఓ వ్యక్తి మూత్రపిండాల నుంచి ఏఐఎన్‌యూ వైద్యులు ఏకంగా 418 రాళ్లను తొలగించారు. ఇదంతా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేయడం మరో విశేషం. 60 సంవత్సరాల వయస్సు గల మహేష్ కిడ్నీలో అసాధారణ సంఖ్యలో రాళ్లు ఉండటంటతో కిడ్నీ పనితీరు దెబ్బతినింది. ఆయనకు సంప్రదాయ శస్త్రచికిత్స కంటే మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలోనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్.టక్, డాక్టర్ దినేష్ నేతృత్వంలోని బృందం నిర్ణయించింది. అందుకోసం పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ (పీసీఎన్‌ఎల్) పద్ధతిని ఎంచుకున్నారు.
ఇందులో భాగంగా ప్రత్యేక పరికరాలతో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా కిడ్నీలోకి ఒక సూక్ష్మ కెమెరా, లేజర్ ప్రోబ్‌లను పంపారు. ఆ కెమెరా చూపించిన దృశ్యాలతో రాళ్లన్నింటినీ తొలగించగలిగారు. దీనివల్ల పెద్ద కోత అవసరం లేకపోవడంతో పాటు రోగికి నొప్పి అంతగా ఉండకపోవడం, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది.
మొత్తం వైద్య బృందం ప్రతి ఒక్క రాయినీ తొలగించి రోగికి ఊరట కలి్పంచింది. అద్భుతమైన ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు అత్యాధునిక పరికరాలు ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించాయి. దీంతో కిడ్నీ అతడి పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడింది. ఇలా చిన్న రంధ్రం పెట్టి, దాని ద్వారానే మొత్తం 418 రాళ్లను తొలగించడం వైద్యపరమైన నైపుణ్యానికి ప్రతీక. వేసవిలో కిడ్నీల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు ఉప్పు తక్కువగా, నీళ్లు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని ఏఐఎ¯Œన్‌యూ వైద్య నిపుణులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment