Dr. V. Chandramohan
-
పదేళ్లుగా ఆ అలవాటు ఉంది!
ప్రైవేట్ కౌన్సెలింగ్ నాకు 32 సంవత్సరాలు. ఈమధ్య నేను సెక్స్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పురుషాంగంలో నొప్పి వచ్చి, కలుక్కుమనే శబ్దం వచ్చింది. ఆ తర్వాత పురుషాంగం విపరీతంగా వాచింది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. నాకు మత్తు ఇచ్చి వెంటనే ఆపరేషన్ చేశారు. విషయం ఏమిటని అడిగితే ‘పెనిస్ ఫ్రాక్చర్ అయ్యింది, సరిచేసి కుట్లువేశామ’ని డాక్టర్ చెప్పారు. నా సందేహంమేమిటంటే... పురుషాంగంలో ఎముక ఉండదంటారు కదా. మరి ఫ్రాక్చర్ ఎలా అయ్యింది? నాకు పురుషాంగానికి వచ్చిన వాపు ఇప్పుడు తగ్గింది. అంగస్తంభన కూడా మామూలుగానే అవుతోంది. అయితే నాకు మునుపటిలా సెక్స్ చేయాలంటే భయంగా ఉంది. మళ్లీ ఇలా అయ్యే అవకాశం ఉందా? - వి.ఎస్.వి.ఆర్., హైదరాబాద్ సాధారణంగా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అంగస్తంభన సమయంలో పురుషాంగంలోకి రక్తం ప్రవేశించి బయటకు పోయే ద్వారాలు మూసుకుపోవడం వల్ల గట్టిగా మారుతుంది. పురుషాంగం లోపల కుడివైపు, ఎడమవైపు రెండు రబ్బరు షీట్లలాంటివి ఉంటాయి. వీటిలో రక్తం నిండటం వల్ల పురుషాంగం గట్టిగా అవుతుంది. కొన్ని సందర్భాల్లో చాలా అరుదైన భంగిమల్లో సెక్స్ చేసేటప్పుడుగాని, అకస్మాత్తుగా యోని నుంచి పురుషాంగం స్లిప్ అయి, దానిపై ఒకేసారి విపరీతమైన బరువు, ఒత్తిడి పడటం వల్ల ఈ రబ్బర్ షీట్ల వంటి నిర్మాణంలో ఒక పగులు (క్రాక్) ఏర్పడుతుంది. అప్పుడు రక్తనాళాల నుంచి రక్తం బయటకు రావడం వల్ల పురుషాంగానికి వాపు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీ డాక్టర్ చెప్పినట్లుగా శస్త్రచికిత్స చేసి, పగులు (క్రాక్)ను రిపేర్ చేస్తారు. ఇంతే జరుగుతుంది తప్ప... నిజానికి పురుషాంగంలో ఎముక ఏదీ ఉండదు. అది విరగదు. అయితే ఒకసారి ఇలా వచ్చిన సమస్యకు ఆపరేషన్ చేశాక... ఆ తర్వాత మళ్లీ మునుపటిలాగే అంగస్తంభనలు వస్తుంటాయి. సెక్స్ కూడా మునుపటిలాగే మామూలుగానే చేయవచ్చు. కాకపోతే కాస్తంత వేర్వేరు భంగిమల్లో సెక్స్‌ను ఎంజాయ్ చేయాలనుకునేవారు అకస్మాత్తుగా పురుషాంగం యోని నుంచి జారిపోకుండా, అలా జరిగినప్పుడు దానిపై ఒకేసారి విపరీతమైన ఒత్తిడి, బరువు పడకుండా చూసుకుంటే చాలు. ఆపరేషన్ అయిన మూడు నెలల తర్వాత మీరు మళ్లీ మునుపటిలాగే సెక్స్‌లో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆందోళన చెందడం అనవసరం. నాకు 65 ఏళ్లు. ముక్కుతూ మూత్రం పోయాల్సి వస్తోంది. ధార కూడా సన్నగా వస్తోంది, మంటగా ఉంది. యూరాలజిస్ట్‌ను సంప్రదించాను. ఆయన స్కానింగ్ చేయించారు. దాంట్లో ప్రోస్టేట్ గ్రంథి పెరిగినట్లుగా ఉంది. దాంతోపాటు పీఎస్ఏ అనే రక్తపరీక్ష చేశారు. పీఎస్ఏ 13 వచ్చిందని చెప్పి, ప్రోస్టేట్ బయాప్సీ చేయించుకోవాలంటున్నారు. నాకు సమస్య తీవ్రత అంత ఎక్కువగా లేదు. ఈ బయాప్సీ నిజంగా అవసరమా? పీఎస్ఏ అంటే ఏమిటి? - ఆర్.వి.ఎస్., ఒంగోలు పీఎస్ఏ అంటే... ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక పరీక్ష. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌ను కనుగొనడానికి ఒక స్క్రీనింగ్ పరీక్ష. సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారిలో పీఎస్ఏ రిజల్ట్స్ 4-6 నానోగ్రామ్ పర్ ఎంఎల్ కంటే ఎక్కువగా ఉంటే ప్రోస్టేట్ బయాప్సీ పరీక్షను చేయించమని డాక్టర్లు సూచిస్తారు. మీకు 13 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బయాప్సీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సులభమైన పరీక్ష. ఔట్‌పేషెంట్‌గా చేసే పరీక్ష మాత్రమే. కాబట్టి మీ డాక్టర్ సూచించినట్లుగా బయాప్సీ చేయించుకోండి. నా వయసు 42. నాకు గజ్జల వద్ద చర్మం కమిలిపోయినట్లుగా ఉంది. నల్లగా మారి దురద వస్తోంది. చేతికి కాస్త గరుకుగా తగులుతోంది. డాక్టర్‌కు చూపించుకోవాలంటే సిగ్గుగా అనిపించి సంప్రదించలేదు. నేను నా ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా ఉంచుకుంటాను. కాకపోతే ఈ వర్షాల సమయంలో టూ వీలర్‌పై వెళ్తుంటే రెండు మూడు సార్లు డ్రస్ అంతా తడిసిపోయింది. ఆఫీస్ నుంచి తిరిగి వెళ్లాక అండర్‌వేర్‌తో సహా డ్రస్ మార్చాను. అయినా ఈ సమస్య తగ్గడం లేదు. పరిష్కారం సూచించండి. - పి. రమేశ్, రాజమండ్రి మీరు చెబుతున్న సమస్య అక్కడ తగినంతగా గాలి ఆడకపోవడం వల్ల వచ్చినట్లుగా అనిపిస్తోంది. మీరు చెబుతున్నచోట రెండు శరీరభాగాలు ఒరుసుకుంటూ ఉండటం ఫలితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. మీరు చర్మవ్యాధి నిపుణుడికి చూపిస్తే, వారు పరీక్షించి మీకు యాంటీఫంగల్ క్రీమ్‌గానీ, పౌడర్‌గానీ ఇస్తారు. మీ సమస్య నయమవుతుంది. నాకు 25 ఏళ్లు. చాలా మంది అమ్మాయిలతో సెక్స్ చేసేవాణ్ణి. నాకు మూత్రంలో మంట, అప్పుడప్పుడు చీము వచ్చేది. ఈమధ్య మూత్రధార సరిగ్గా రావడం లేదు. జ్వరం వస్తోంది. బరువు తగ్గిపోతున్నాను. నాకు హెచ్ఐవీ వచ్చిందేమో అని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్.ఎన్., హైదరాబాద్ మీరు మొట్టమొదట చేయాల్సింది మీ వివాహేతర సంబంధాలను నిలిపివేయడం. ఆ తర్వాత సెక్స్ వల్ల వ్యాపించే అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించాలి. అంటే హెచ్ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, హెపటైటిస్-సి, వీడీఆర్ఎల్ వంటి పరీక్షలన్నీ మీరు చేయించుకోవాలి. ఇది కాకుండా మూత్ర ధార సరిగ్గా రావడం లేదు కాబట్టి మూత్రం కల్చర్ పరీక్ష, ఆర్జీయూ అనే ఎక్స్-రే చేయించుకోవాలి. మీకు మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి ఉందేమో చూడాలి. ఇలా ఉంటే దాన్ని స్ట్రిక్చర్ అంటారు. ఈ పరీక్షలన్నీ చేయించుకుని, ఆ ఫలితాల ఆధారంగా సరైన చికిత్స పొందండి. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను కలవండి. నా వయుస్సు 24 ఏళ్లు. గత పదేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను. గతంలో వీర్యస్ఖలనం అయ్యేందుకు చాలా సవుయుం పట్టేది. కానీ ఈమధ్య హస్తప్రయోగం మొదలుపెట్టగానే వీర్యం పడిపోతోంది. అదీగాక నా అంగం చిన్నగా ఉంది. సైజ్ పెరగడానికి వూర్గం చెప్పండి. - ఎం.కె.ఆర్., తుని మీరు గత పదేళ్ల నుంచి హస్తప్రయోగం చేస్తుండటంతో ఈ ప్రక్రియు కాస్తా మెకానికల్‌గా వూరింది. అందుకే మొదట్లో ఉన్న ఎక్సరుుట్మెంట్, థ్రిల్ తగ్గి ఇలా త్వరగా వీర్యస్ఖలనం అరుుపోతోంది. మీరు పెళ్లి చేసుకుని భార్యతో సెక్స్‌లో పాల్గొంటే వుళ్లీ వూవుూలుగా మొదట్లోని థ్రిల్‌ను, ఎక్సరుుట్మెంట్ను, వుంచి తృప్తిని పొందగలుగుతారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువసార్లు హస్తప్రయోగం చేసినందువల్ల అంగం సైజ్ తగ్గడం అంటూ ఉండదు. సెక్స్‌లో తృప్తి చెందేందుకు లేదా భార్యను తృప్తిపరచేందుకు అంగస్తంభనలు చక్కగా ఉంటే చాలు. సైజ్‌కూ తృప్తికీ ఎలాంటి సంబంధం లేదు. మీకున్న అపోహే చాలా వుందిలో ఉంటుంది. కానీ అది తప్పు. హస్తప్రయోగానికీ ఎత్తుపెరగకపోవడానికీ ఎలాంటి సంబంధం లేదు. నాకు 26 ఏళ్లు. నా పురుషాంగంపై పులిపిరి కాయల్లా వస్తున్నాయి. నాకు చాలా ఆందోళనగా ఉంది. దీనికి పరిష్కారం చెప్పండి.- కె.ఎమ్.ఆర్., నందిగామ మీరు చెప్పిన అంశాలను బట్టి మీకు హెచ్‌పీవీ సోకిందని తెలుస్తోంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది సెక్స్ వల్ల వ్యాపించే వ్యాధి. దీనికి కాటరీ చికిత్స (కొన్ని చోట్ల పెరిగే అవాంఛిత కండను తొలగించే చికిత్సను కాటరైజేషన్ అంటారు). కొన్ని రకాల రసాయనాలను వాడటం లేదా శస్త్రచికిత్స ద్వారా తగ్గించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని యూరోసర్జన్/యాండ్రాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
నిస్సహాయత ఫీలవ్వకండి... నిర్భయంగా ఉండండి!
♦ పురుషులు బయటికి చెప్పుకోలేని సమస్యలు నాకు 30 ఏళ్లు. నాలుగు నెలల కిందట వివాహమయ్యింది. పెళ్లయిన మొదటిరాత్రి అంగప్రవేశం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్తంభన తగ్గింది. దాంతో టెన్షన్ వచ్చి చేయాలేకపోయాను. అప్పట్నుంచి సెక్స్ అంటే భయం వేస్తోంది. ఒకప్పుడు హస్తప్రయోగం బాగా చేసేవాణ్ణి. దానివల్లనే ఈ సమస్య వచ్చిందా? ఇప్పుడు కూడా సెక్స్‌లో పాల్గొనాలంటే ఆందోళనగా అనిపిస్తోంది. నా భార్య కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. దాంతో నేనెంతో డిప్రెషన్లోకి వెళ్తున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్.కె.డి.ఆర్., కర్నూలు మీరు యాంగ్జైటీ న్యూరోసిస్‌తో బాధపడుతున్నారు. కొత్తగా పెళ్లయినవాళ్లలో చాలామందికి మీలాంటి అనుభవం కలగడం చాలా సహజం. ఇది చాలా సాధారణం. సెక్స్ అనేది మానసిక, శారీరక సమన్వయంతో చేసే స్వాభావిక ప్రక్రియ. ఇందులో మీ భాగస్వామి సహకారం కూడా కావాలి. మీ భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ అన్నింటికంటే ముఖ్యం. అవి ఉండి మీ భార్య, మీరు పరస్పరం సహకరించుకుంటే మీరు ఈ సమస్యను చాలా తేలిగ్గా అధిగమించగలరు. మీరు గతంలో చేసిన హస్తప్రయోగం వల్ల మీకు ఈ సమస్య రాలేదు. పైగా మీరు గతంలో హస్తప్రయోగం బాగా చేశారంటే మీలో సెక్స్‌పరమైన లోపాలేమీ లేవని అర్థం. అదే మీరు మీ భార్య దగ్గర సెక్స్‌లో మీ పెర్ఫార్మార్మెన్స్ను చూపాలనేసరికి మీలో యాంగ్జైటీ మొదలైంది. దాంతో మీరు చెప్పిన పరిణామాలన్నీ జరిగాయి. మీరూ, మీ భార్యతో కలిసి ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, తగిన కౌన్సెలింగ్ తీసుకోండి. కేవలం కౌన్సెలింగ్ మాత్రమే ప్రయోజనం ఇవ్వకపోతే, మీకు తాత్కాలికంగా కలిగిన అంగస్తంభన లోపాన్ని అధిగమించడానికి యాండ్రాలజిస్ట్ కొన్ని మందులు ఇస్తారు. వీటి సాయంతో మీరు మీ సమస్యను అధిగమించవచ్చు. ఈలోపు మీరు తగినంత ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం వల్ల ఆ తర్వాత మందులేవీ అవసరం లేకుండానే సెక్స్‌లో సమర్థంగా పాల్గొనగలరు. నా వయుస్సు 18 ఏళ్లు. నా పురుషాంగం చాలా చిన్నగా ఉంటుంది. వృషణాలు కూడా చాలా చిన్నవి. అంగస్తంభనలు కూడా అంతగా లేవు. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే నా భార్యను సుఖపెట్టగలనా? నా సవుస్యకు చికిత్స ఉందా? - ఎస్.ఎమ్.ఎన్., కొత్తగూడెం మీ వయుస్సు వారిలో చాలా వుందికి తవు అంగం, వృషణాలు చిన్నవిగా అనిపించడం సహజం. ఇలా అనుకునే వాళ్లు డాక్టర్ చేత పరీక్ష చేరుుంచుకున్నప్పుడు చాలా సందర్భాల్లో అవి నార్మల్‌గానే ఉన్నాయని డాక్టర్లు చెప్పి వాళ్ల ఆందోళనలనూ, అపోహలనూ దూరం చేస్తారు. మీరు మీ పురుషాంగం, వృషణాలు మరీ బొటనవేలంతే ఉన్నాయంటున్నారు కాబట్టి ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను కలవండి. ఆయన కూడా మీ వయసుకు అవి చాలా చిన్నవని భావిస్తే కొన్ని హార్మోన్ల పరీక్ష, వీర్యపరీక్ష వంటివి చేసి లోపాలు ఏవైనా ఉంటే కనుగొని దానికి తగిన చికిత్స అందిస్తారు. ఇప్పుడున్న వైద్య పురోగతి వల్ల దాదాపు అన్ని వైద్య సవుస్యలకూ చికిత్సలు అందుబాటులో ఉన్నారుు. కాబట్టి ఇప్పటి పురుష సంబంధమైన సమస్యలనన్నింటినీ తప్పక పరిష్కరించగలిగేలా వైద్యరంగంలో పురోగతి ఉంది. కాబట్టి నిరాశపడాల్సిన అవసరమే లేదు. నాకు 25 ఏళ్లు. ఈమధ్యనే పెళ్లయ్యింది. ఈమధ్య ఒకసారి పార్ట్నర్తో కలయిక తర్వాత వీర్యంలో కొంచెం రక్తం వచ్చింది. దాని తర్వాత ఒకసారి హస్తప్రయోగంలో కూడా రక్తం వచ్చింది. నాకు భయంగా ఉంది. అయితే అంగస్తంభనలో, సెక్స్ ప్రక్రియ లోనూ ఎలాంటి మర్పూ లేదు. సెక్స్ బాగానే చేయగలుగుతున్నాను. కానీ వీర్యంలో రక్తం రావడానికి కారణం ఏమిటి? - ఎస్.వై.ఎమ్., కందుకూరు మీరు రాసినదాన్ని బట్టి మీ విషయంలో వీర్యంలో రక్తం రావడం పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి కాకపోవచ్చు. కొందరిలో వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, టీబీ ఉన్నా, వీర్యం వచ్చే మార్గంలో నీటిబుడగలు (సిస్ట్స్) ఉన్నా, ఏవైనా గడ్డలు ఉన్నా ఇలా వీర్యంతో పాటు రక్తం రావచ్చు. కాని ఎక్కువ మందిలో ఇలా జరగడానికి ఏ కారణం కనిపించదు. చికిత్స చేయకపోయినా ఒక్కోసారి ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవచ్చు. మీరు ఒకసారి యూరిన్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్‌ను కలవండి. మీ సమస్య చికిత్సతో తగ్గేదే కాబట్టి ఆందోళన పడకండి. నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది. రోజూ సెక్స్‌లైఫ్ ఉంది. అయితే అంగస్తంభన బాగానే ఉన్నా వీర్యస్ఖలనం మాత్రం త్వరగా అయిపోతోంది. ఒకసారి వీర్యస్ఖలనం అయ్యక మళ్లీ అంగస్తంబన కలగడం లేదు. దాంతో నా భార్య సంతృప్తి చెందలేకపోతోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. - జీ.ఆర్.ఆర్., హైదరాబాద్ మీరు చెప్పిన కండిషన్‌ను ప్రీ-మెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. ఇది పురుషుల్లో చాలా సాధారణం. వీర్యస్ఖలనం అన్నది ఒక నరాల స్పందన వల్ల కలిగే అద్భుతమైన అనుభూతి (రిఫ్లెక్స్ యాక్టివిటీ). సెక్స్ ప్రక్రియలో అంగం మీద ఉన్న చర్మం ఉద్వేగానికి లోనవుతుంది. ఇలా స్టిమ్యులేట్ కావడం అనేది వీర్యస్ఖలనం అనే రిఫ్లెక్స్ ప్రక్రియకు దారితీస్తుంది. కొంతమందిలో ఈ స్పందనలు (స్టిమ్యులేషన్స్) చాలా త్వరగా సంభవిస్తాయి. దాంతో వెంటనే వీర్యస్ఖలనం జరిగిపోతోంది. ఇలాంటి వాళ్లు సెక్స్‌లో నేరుగా పాల్గొనకూడదు. తన సెక్స్పార్ట్నర్తో తగినంత ప్రీ ప్లే చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు వీర్యస్ఖలనం ఫీలింగ్ రాగానే వెంటనే అంగాన్ని బయటకు తీసి పురుషాంగం చివర (శిశ్నం వెనక భాగంలో) గట్టిగా నొక్కి పట్టుకోవాలి. స్ఖలనం ఫీలింగ్ తగ్గగానే మళ్లీ సెక్స్ చేయడం ప్రారంభించాలి. ఇలా నొక్కి పట్టుకుని స్ఖలనాన్ని నియంత్రించే ప్రక్రియను ‘పించ్ అండ్ స్టార్’ టెక్నిక్ అంటారు. ఈ పించ్ అండ్ స్టార్ట్ టెక్నిక్‌తోనూ మీ సమస్య తగ్గకపోతే యాండ్రాలజిస్ట్‌ను కలవండి. కౌన్సెలింగ్‌తో, మందులతో మీ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. ఇదీమీ పెద్ద సమస్య కాదు. కాబట్టి ఆందోళన అనవసరం. నా వయస్సు 65 ఏళ్లు. నాకు చిన్నతనం నుంచి పురుషాంగం చివరన ఉన్న చర్మం చాలా బిగుతుగా ఉండేది. నాకు పాతికేళ్ల వయసులో పెళ్లయ్యింది. కానీ ఆ సమస్య ఏలాంటి అడ్డంకీ కలిగించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ చర్మం చాలా బిగుతై పోయింది. దాంతో కలయికలో విపరీతమైన నొప్పి వస్తోంది. అందువల్ల హస్తప్రయోగంతో తృప్తిపడుతున్నాను. ఇప్పుడు నాకు బీపీ, షుగర్ ఉన్నాయి. ఈ వయసులో సున్తీ చేయించుకోక తప్పదా? సలహా ఇవ్వండి. - ఎస్.జి.ఆర్. విశాఖపట్నం ఏ వయసువారిలోనైనా పురుషాంగం మీద చర్మం ఫ్రీగా వెనక్కు రావాలి. ఇలా రాకపోతే చర్మానికి ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లలో చర్మం లోపలి భాగం షుగర్‌తో ఉన్న మూత్రంతో తడిచి పూర్తిగా గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల పురుషాంగంపై చర్మం వెనక్కి రావడం ఇబ్బందిగా ఉంటే సున్తీ చేయించుకోవడం అవసరం. సున్తీ అనేది చాలా సందర్భాల్లో అక్కడి చర్మానికి బాధ తెలియకుండా చేసి (లోకల్ అనస్థీషియా ఇచ్చి) సున్తీ ప్రక్రియ పూర్తయ్యాక అదేరోజు ఇంటికి పంపించి వేస్తాం. ఆ ఆపరేషన్ వల్ల ప్రమాదమేమీ ఉండదు. ఆ తర్వాత కూడా నొప్పి లేకుండా సెక్స్‌కు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ షుగర్ పాళ్లను కంట్రోల్ చేసుకొని సున్తీ చేయించుకోండి. ఆ తర్వాత హాయిగా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. నాకు 52 ఏళ్లు. షుగర్, బీపీ లేవు. షుగర్ వల్ల అంగస్తంభన సమస్య వచ్చింది. దాంతో వయాగ్రా లాంటి మందులు చాలా వాడాను. అయినా కొంచెం కూడా అంగస్తంభన కలగడం లేదు. పైప్ టెస్ట్, రెజీస్కాన్ టెస్ట్ వంటి పరీక్షలు చేశారు. నిద్రలో కూడా నాకు అంగస్తంభనలు కలగడం లేదు. దీంతో నాకు చాలా బెంగగా ఉంటోంది. అంగస్తంభన కోసం కృత్రిమ రాడ్స్ అమర్చవచ్చని కొద్దిరోజుల క్రితం చదివాను. వాటివల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా? సెక్స్‌లో తృప్తి మామూలుగానే ఉంటుందా? వాటివల్ల మూత్రవిసర్జనకు ఏదైనా అవరోధాలు ఉంటాయా? వివరాలు చెప్పండి. - జీ.వి.ఆర్., కోదాడ ఈమధ్యకాలంలో బీపీ, షుగర్ లాంటి సమస్యల వల్ల, జీవనశైలిలోని ఒత్తిళ్ల వల్ల రక్తనాళాలు ముడుచుకుపోయేందుకు ఆస్కారం ఉన్న గుండెపోటు, స్ట్రోక్ (పక్షవాతం) వంటి జబ్బులు వస్తున్నాయి. అలాగే రక్తనాళాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఈ అంగస్తంభన సమస్య కూడా వస్తుంది. అలాంటిప్పుడు చాలామంది అంగస్తంభన లేకపోవడం అన్న సమస్యను బయటకు చెప్పుకోలేక దాచేస్తుంటారు. అది అంగస్తంభనకు చెందిన సమస్యగా మాత్రమే చూడకూడదు. ఇతరత్రా అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుందా లేదా అని కూడా పరిశీలించాల్సిన సమస్య. అందుకే... ఇలాంటి సమస్య వచ్చినప్పుడు బిడియపడకుండా డాక్టర్‌ను కలవాలి. ఫలితంగా భవిష్యత్తులో వచ్చే గుండెజబ్బులను, స్ట్రోక్ వంటి ఎన్నో సమస్యలను ముందుగానే నివారించడం సాధ్యమవుతుంది. ఇక మీరు పేర్కొన్న రిజీస్కాన్, పైప్టెస్ట్ వంటివి అంగస్తంభనలు ఉన్నాయా లేవా అన్నది తెలుసుకోడానికే. అయితే మీరు ప్రస్తావించిన రాడ్స్ అమర్చడం అన్నది చిటచివరి ఆప్షన్‌గా మాత్రమే చేసే చికిత్స. ఇక ఎలాంటి అంగస్తంభనలు లేనప్పుడు మాత్రమే దీన్ని చివరి ఆప్షన్‌గా చేయించుకోవాలన్నది గుర్తుంచుకోండి. ఇందులో పురుషాంగంలోపల ఇరువైపులా రెండు రాడ్స్ అమర్చుతారు. దీనివల్ల మూత్రవిసర్జనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి అంగస్తంభనలూ లేనివారికి సెక్స్‌లో తృప్తికోసం దీన్ని శాశ్వత చికిత్సగా పరిగణించవచ్చు. మీరు మీ యాండ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. నాకు 60 ఏళ్లు. భార్యతో రోజూ కలుస్తున్నాను. అంగస్తంభన సమస్య లేదు. కాకపోతే ఈమధ్యకాలంలో వీర్యం తక్కువగా వస్తోంది. త్వరగా పడిపోతోంది కూడా. ఇందువల్ల పూర్తిగా తృప్తిపరచలేకపోతున్నానని బెంగపడుతున్నాను. నాకు చాలా రోజుల నుంచి బీపీ ఉంది. దానికి సంబంధించిన మందులు వాడుతున్నాను. వీర్యం పెరగడానికి మందులు సూచించగలరు. - ఆర్.కె.ఎమ్., ఆదిలాబాద్ మీరు 60 ఏళ్ల వయసులో రోజూ సెక్స్‌లో పాల్గొనగలగడం మీ మంచి ఆరోగ్యాన్ని సూచిస్తోంది. ఇక మీ సమస్య విషయానికి వస్తే - వయసు పెరిగిన కొద్దీ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ప్రోస్టేట్ గ్రంథి నుంచి వీర్యం తక్కువగా తయారుకావచ్చు. వీర్యం పరిమాణాన్ని బట్టే సెక్స్‌లో తృప్తి ఉంటుందన్నది కేవలం ఒక అపోహ మాత్రమే. మీ భాగస్వామి తృప్తి పడటానికి అవసరమైనది అంగస్తంభన మాత్రమే. కాబట్టి మీరు శీఘ్రస్ఖలనాన్ని నివారించడం కోసం మందులు వాడవచ్చు. వాటికోసం ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్ -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
నాకు 55 ఏళ్లు. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యిందని ఏడాది క్రితం టీయూఆర్‌పీ అనే ఆపరేషన్ చేశారు. అప్పట్నుంచి అంగస్తంభనలు లేవు. ఈ ఆపరేషన్ వల్ల అంగస్తంభనలు తగ్గుతాయా? ముందు ముందు ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందా? పీఎస్ఏ పరీక్ష చేయించాలా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? - ఏ.కె.ఆర్., చెన్నై టీయూఆర్‌పీ అంటే... ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. ఈ సర్జరీలో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా పెరిగిన ప్రోస్టేట్ను తీసివేసి మూత్రం రావడానికి గల అడ్డును తొలగిస్తారు. ఇది 50 ఏళ్లు పైబడ్డ వాళ్లలో చాలా సాధారణంగా నిర్వహించే సర్జరీ. దీనికీ అంగస్తంభనలకు సంబంధం లేదు. అంతకుమునుపు ఉన్నట్లే సర్జరీ తర్వాత కూడా అంగస్తంభనలు ఉంటాయి. కాకపోతే 50 ఏళ్ల పైబడ్డవారిలో సాధారణంగా కనిపించే బీపీ, షుగర్ వంటి వాటి వల్లనో లేదా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్లనో మీకు అంగస్తంభనలు తగ్గి ఉండవచ్చు. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వారు ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) పరీక్ష రెండేళ్లకు ఓసారి చేయించుకోవడం మంచిది. టీయూఆర్‌పీ సర్జరీ తర్వాత కూడా పీఎస్ఏ పరీక్ష తరచూ చేయించాలి. ఈ పరీక్ష చేయించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే పూర్తిగా నయమయ్యేలా చికిత్స తీసుకోడానికి అవకాశం ఉంది. నా వయస్సు 25 ఏళ్లు. నా పురుషాంగం లోపల అంటే ముందుచర్మం వెనక్కిలాగితే బయటకు కనిపించే ప్రాంతంలో చిన్న చిన్న బుడిపెలు ఉన్నాయి. ఇవి రావడం ప్రమాదమా? చికిత్స అవసరమా? వివరించండి. - సీ.ఆర్.ఆర్., విశాఖపట్నం అంగం ముందు భాగం (గ్లాన్స్) మీద చిన్న చిన్న బుడిపెలు ఉండటం చాలా సాధారణం. ముఖం మీద మొటిమల్లాగే వీటిల్లోంచి కూడా స్రావాలు తయారవుతూ ఉంటాయి. కొందరికి చుట్టూరా తెల్లగా బుడిపెలు బుడిపెలుగా సాధారణంగా కంటే పెద్దగా కూడా ఉండవచ్చు. గట్టిగా నొక్కితే తెల్లటి స్రావం కూడా వస్తుంది. ఇవన్నీ మామూలుగా ఉండేవే. చాలామంది వీటిని ఇన్ఫెక్షన్ అనుకుంటారు. నొప్పి, మంట, దురద లేకుంటే ఈ చిన్న బుడిపెల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్ -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
నా వయస్సు 29 ఏళ్లు. నేను మూడేళ్ల క్రితం ఓ మహిళతో శారీరకంగా కలిశాను. ఆమెకు హెచ్ఐవీ ఉందేమోననే అనుమానంతో ఆమెకు హెచ్ఐవీ పరీక్ష చేయించాను. వెస్ట్రన్బ్లాట్ పరీక్ష కూడా చేయించాను. అన్ని రిపోర్టులూ నెగెటివ్ వచ్చాయి. ఆ మహిళకూ, నా భార్యకు కూడా పరీక్షలు చేయించాను. ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. అయితే విండో పిరియడ్ అని ఒకటి ఉంటుందని, ఆ సమయంలో వ్యాధి ఉన్నా బయటపడదని స్నేహితులు అంటున్నారు. ఈ విండో పిరియడ్ అంటే ఏమిటి? ఎన్నాళ్లుంటుంది? వివరించండి. - పి.వి.ఆర్., రాజమండ్రి వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు హెచ్ఐవీ వస్తుం దేమో అని భయం ఉంటుంది. దానికి ప్రధాన కారణం... కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొనడం. కండోమ్ వాడితే ఈ సమస్యను చాలా సులువుగా ఎదుర్కోవచ్చు. కండోమ్ వాడకుండా సెక్స్‌లో పాల్గొంటే హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఆ వైరస్ల విండో పిరియడ్ కొన్ని వారాల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. ఇక విండో పీరియడ్ అంటే ఏమిటనే విషయానికి వస్తే - ఏదైనా వైరస్‌ను వాటి యాంటీబాడీస్ ద్వారా గుర్తిస్తాం. ఓ వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటి యాంటీబాడీస్ ఉత్పత్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ వ్యవధినే విండో పీరియడ్ అంటాం. ఈ విండో పీరియడ్‌లో యాంటీబాడీస్ ఉండవు. అయితే శరీరంలో వైరస్ మాత్రం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వైరస్ ఉన్నవాళ్లతో సెక్స్‌లో పాల్గొంటే (యాంటీబాడీస్ పరీక్షలో హెచ్ఐవీ టెస్ట్ నెగెటివ్ అని వచ్చినా) ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ఆర్నెల్ల తర్వాత ఇద్దరికీ హెచ్ఐవీ పరీక్షలో నెగెటివ్ వస్తే దాదాపు వ్యాధి లేనట్లే అనుకోవచ్చు. ఇక కండోమ్ కంటే కూడా ఎలాంటి వివాహేతర సంబంధాలు లేకపోవడమే ముఖ్యం. అదే అన్నిటికంటే సురక్షితం. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్ -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
నా వయస్సు 28 ఏళ్లు. నాకు ఎడమవైపున ఉన్న వృషణం కుడివైపు దానికంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంటుంది. ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకొని సెక్స్‌లో పాల్గొంటే ఇబ్బందులు వస్తాయా? - సీహెచ్.ఎమ్.ఆర్. విజయవాడ సాధారణంగా ఎడమవైపున ఉండే వృషణం కుడివైపు కంటే కొంచెం కిందికే ఉంటుంది. ఇలా వృషణాలు సమానమైన లెవెల్లో లేకపోవడం సర్వసాధారణం. వృషణాల లెవెల్ సమానంగా లేకపోవడానికీ, సెక్స్ సామర్థ్యానికి సంబంధం లేదు. మీకు సెక్స్ కోరికలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభన నార్మల్‌గా ఉంటే, వృషణాల్లో నొప్పి లేకపోతే నిర్భయంగా పెళ్లిచేసుకోవచ్చు. ఇది మీ దాంపత్య సుఖానికి ఏ విధంగానూ అడ్డు కానేకాదు. నా వయస్సు 18 ఏళ్లు. నాకు గత నాలుగేళ్లుగా రొమ్ములు ఉన్నాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరుడు, హైదరాబాద్ మీ సమస్యను గైనకోమేజియా అంటారు. కొన్ని సందర్భాల్లో హార్మోన్ల అసమతౌల్యం (హార్మోనల్ ఇంబ్యాలెన్స్)వల్ల ... అంటే ఈస్ట్రోజెన్, ప్రొలాక్టిన్ హార్మోన్లు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ తక్కువైనప్పుడు ఇలా జరగవచ్చు. మీ రొమ్ము భాగం బయటకు కనిపించేంత పెద్దగా ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల వచ్చిన లైపోసక్షన్ ప్రక్రియ ద్వారా ఈ బ్రెస్ట్‌లోని ఫ్యాట్‌ను ఆపరేషన్ లేకుండా కూడా తొలగించుకోవచ్చు. కాకపోతే ఈ సమస్య ఎందుకు వచ్చిందని తెలుసుకోడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో తెలుసుకొని, ఒకవేళ ఉంటే దాన్ని చక్కదిద్దడానికి ఓసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్ -
బిడియపడే సందేహం... తీర్చుకునే మార్గం!
అడగటానికి బిడియపడే ప్రశ్నలెన్నో వుంటాయి. అలాంటి వాటికోసం నిపుణుల దగ్గరకు వెళ్లి సందేహాలు తీర్చుకోవాలన్నా ఒకింత బిడియం ఉంటుంది. మీకు ఆ అవస్థ తప్పించడం కోసమే ఈ వేదిక. నా వయుసు 36. నా భార్య వయుస్సు 27. పెళ్లరుున ఏడాదికి బాబు పుట్టాడు. కొద్దికాలం పిల్లలు వద్దనుకొని ఐదేళ్లపాటు కండోమ్ వాడాము. ఈవుధ్య మరో బిడ్డ కోసం కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటున్నాం. అరుుతే నాకు వెంటనే వీర్యం పడిపోతోంది. నా భార్య ఇంకా సెక్స్ కావాలంటోంది. శీఘ్రస్ఖలనం వల్ల ఆమెను సంతృప్తిపరచలేకపోతున్నాను. నాకు సలహా ఇవ్వండి. - ఓ సోదరుడు, నిజామాబాద్ మీరు శీఘ్రస్ఖలనం (ప్రీ మెచ్యూర్ ఇజాక్యులేషన్) సమస్యతో బాధపడుతున్నారు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత సెక్స్ చేయడం అన్నది ఒక యూంత్రికమైన చర్యగా మారవచ్చు. అప్పుడీ సవుస్య రావడం చాలా సాధారణం. మీరు ఈ వయుస్సులో మీ శారీరక ఆరోగ్యం, దారుఢ్యం (ఫిజికల్ ఫిట్నెస్) కాపాడుకోవడం అవసరం. దాంతోపాటు బీపీ, షుగర్ వంటి సవుస్యలు లేకుండా చూసుకోవడంతో పాటు సామాజికంగా మీపై పడే ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం. ఇవన్నీ చేస్తూ మీ భార్య పట్లప్రేవూనురాగాలను పెంచుకొని సెక్స్‌లో పాల్గొనండి. దాంతో మీ పెర్ఫార్మెన్స్తో పాటు సెక్స్‌లో పాల్గొనే వ్యవధి తప్పక పెరుగుతుంది. ఈ జాగ్రత్తలతోనూ మీ పరిస్థితిలో వూర్పు రాకపోతే ఒకసారి ఆండ్రాలజిస్ట్‌ను కలిస్తే మీకు సరైన వుందులు సూచిస్తారు. నా వయస్సు 65 ఏళ్లు. సెక్స్ తర్వాత నాకు చాలా తక్కువ వీర్యం వస్తోంది. చాలామంది డాక్టర్లను కలిసి మందులు వాడినా ప్రయోజనం లేదు. నా వీర్యం పరిమాణం పెరిగేందుకు మందులు తెలియజేయండి. - ఎన్.ఎస్.పి.ఆర్., ఖమ్మం వయసు అరవై దాటాక వీర్యం తక్కువగా రావడం అనేది పెద్ద సమస్య కానే కాదు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వీర్యం ప్రధానంగా సంతానోత్పత్తికి మాత్రమే దోహదం చేస్తుంది. సెక్స్‌లో సంతృప్తికి వీర్యం పరిమాణం ఎంత అన్నది అంత ముఖ్యమైన అంశం కాదు. ఈ వయస్సులో హార్మోన్ల స్రావం తగ్గడం వల్ల వీర్యం పరిమాణం తగ్గవచ్చు. మీరు సెక్స్‌లో నార్మల్‌గా సంతృప్తి పొందుతూ ఉంటే వీర్యం పరిమాణం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. నాకు నెల రోజుల క్రితమే సిజేరియన్ ద్వారా ప్రసవం అయ్యింది. మావారు కోరికలను అణచుకోలేక సెక్స్ కోసం నన్ను బలవంతం చేస్తున్నారు. ప్రవసం అయిన ఎన్ని రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. సిజేరియన్ అయినందున ఆర్నెల్లలోపు సెక్స్‌లో పాల్గొంటే ప్రమాదమని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు నిజమేనా? - ఓ సోదరి, విజయవాడ సిజేరియన్ ద్వారా ప్రసవం తర్వాత ఆ కుట్లు మానడానికీ, యోని కండరాలు మళ్లీ మామూలు దశకు రావడానికి కనీసం ఆరు వారాల వ్యవధి (అంటే నెలన్నర) పడుతుంది. ఈ ఆరువారాల తర్వాత యోని వద్ద ఎలాంటి నొప్పిగానీ లేదా రక్తప్రావం గానీ మరే సమస్యా లేకుండా ఉండి, మీరు కూడా శారీరకంగా, మానసికంగా సెక్స్‌కు సిద్ధంగా ఉంటే మీవారి కోరికను నిర్భయంగా మన్నించవచ్చు. అంతేగానీ... సిజేరియన్ అయినందున ఆర్నెల్ల పాటు సెక్స్‌కు దూరంగా ఉండాలన్నది కేవలం అపోహ మాత్రమే. నా వయుస్సు 20 ఏళ్లు. గత ఆరేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను. రోజుకు చాలా సార్లు చేసేవాణ్ణి. గతంలో వీర్యస్ఖలనం అయ్యేందుకు చాలా సవుయుం పట్టేది. కానీ ఇటీవల చాలా త్వరగా వీర్యం పడిపోతోంది. అదీగాక నా అంగం చిన్నగా ఉంది. సైజ్ పెరగడానికి వూర్గం చెప్పండి. నా వృషణాలు కిందికీ పైకీ జారుతూ, కదులుతూ ఉన్నారుు. ఇలా జారకుండా ఉండటానికి వూర్గం చెప్పండి. హస్తప్రయోగం వల్ల హైట్ పెరగదా? నేను పెళ్లయ్యాక నా భార్యను సుఖపెట్టగలనా? - శ్రీనివాస్, కోదాడ మీరు ఆరేళ్లుగా హస్తప్రయోగం చేస్తుండటం వల్ల మీరు ఈ ప్రక్రియను చాలా యాంత్రికంగా చేస్తుండవచ్చు. దాంతో మొదట్లో ఉన్న ఎక్సరుుట్మెంట్, థ్రిల్ కాస్త తగ్గి ఇలా త్వరగా వీర్యస్ఖలనం అరుుపోతోంది. మీరు పెళ్లి చేసుకుని భార్యతో సెక్స్‌లో పాల్గొంటే వుళ్లీ వూవుూలుగా మొదట్లోని థ్రిల్‌ను, ఎక్సరుుట్మెంట్ను, వుంచి తృప్తిని పొందగలుగుతారు. కాబట్టి ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. ఎక్కువసార్లు హస్తప్రయోగం చేసినందువల్ల అంగం సైజ్ తగ్గడం అంటూ ఉండదు. సెక్స్‌లో తృప్తి చెందేందుకు లేదా భార్యను తృప్తిపరచేందుకు అంగస్తంభనలు చక్కగా ఉంటే చాలు. పురుషాంగం సైజ్‌కూ తృప్తికీ ఎలాంటి సంబంధం లేదు. మీకున్న అనుమానమే చాలావుందిలో ఉంటుంది. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. ఇక వృషణాలు పైకీ, కిందికీ కదలడం అన్నది సర్వసాధారణమైన ప్రక్రియు. ఇలా కావడాన్ని క్రిమేస్టరిక్ రిఫ్లెక్స్ అంటారు. వృషణాల సంరక్షణ కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు ఇది. హస్తప్రయోగానికీ ఎత్తుపెరగకపోవడానికీ ఎలాంటి సంబంధం లేదు. హస్తప్రయోగం వల్ల ఎలాంటి హానీ ఉండదు. నాకు 55 సంవత్సరాలు. ఏడాది క్రితం ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యిందని టీయూఆర్‌పీ ఆపరేషన్ చేశారు. అప్పట్నుంచి అంగస్తంభనలు లేవు. ఈ ఆపరేషన్ వల్ల అంగస్తంభనలు తగ్గుతాయా? ముందు ముందు ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందా? పీఎస్ఏ పరీక్ష చేయించాలా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? - కె. నాగేశ్వరరావు, గుంటూరు టీయూఆర్‌పీ అంటే... ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. ఈ సర్జరీలో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా పెరిగిన ప్రోస్టేట్ను తీసివేసి మూత్రం రావడానికి గల అడ్డును తొలగిస్తారు. ఇది 50 ఏళ్లు పైబడ్డ వాళ్లలో సాధారణంగా చేసే ఆపరేషన్. ఈ సర్జరీకి అంగస్తంభనలకు సంబంధం లేదు. అంతకుమునుపు ఉన్న స్తంభనలే సర్జరీ తర్వాత కూడా ఉంటాయి. కాకపోతే 50 ఏళ్ల పైబడ్డవారిలో సాధారణంగా కనిపించే బీపీ, షుగర్ వంటి వాటి వల్లనో లేదా ఇతరత్రా శారీరక దారుఢ్యం (ఫిజికల్ ఫిట్నెస్) లేకపోవడం వల్లనో మీకు స్తంభనలు తగ్గి ఉండవచ్చు. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వారు ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) పరీక్ష రెండేళ్లకు ఓసారి చేయించడం మంచిది. టీయూఆర్‌పీ సర్జరీ తర్వాత కూడా పీఎస్ఏ పరీక్ష తరచూ చేయించాలి. ఈ పరీక్ష చేయించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోడానికి అవకాశం ఉంది. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్ -
కిడ్నీలో రాళ్లు తొలగించినా... నొప్పి తగ్గడం లేదు
నా వయుస్సు 26. నాకు రెండు మూత్రపిండాల్లో రాళ్లు వస్తే ఆర్నెల్ల క్రితం లోపలే పేల్చివేశారు. అయితే ఇప్పటికీ నాకు నడుం నొప్పి, మూత్రంలో మంట ఉన్నాయి. చిన్న చిన్న రాళ్లు మూత్రంలో వస్తూనే ఉన్నాయి. ఒకసారి కిడ్నీలలో రాళ్లు వస్తే అవి మళ్లీ వుళ్లీ వస్తూనే ఉంటాయుని కొందరు చెబుతున్నారు. ఇది నిజమేనా? కిడ్నీలో రాళ్లు రాకుండా ఏవైనా ఆహార నియమాలు పాటించాలా? నాకింకా పెళ్లి కాలేదు. కిడ్నీలో రాళ్ల వల్ల అంగస్తంభన శక్తి తగ్గుతుందా? నేను వివాహం చేసుకోవచ్చా? - ఎమ్ఎమ్ఆర్., కర్నూలు ఇటీవల మూత్రపిండాల్లో రాళ్లను ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ విధానంతో పేల్చివేస్తున్నారు. ఈ పేల్చివేతలో భాగంగా పెద్ద ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా (అంటే మూడు మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజ్విగా) చేసి వదిలేస్తాం. దాంతో అవి పౌడర్‌లాగా మూత్రంలో వెళ్లిపోతాయి. అయితే ఒక్కోసారి ఏదైనా పెద్ద ముక్కను వదిలేసినా, రాయి పూర్తిగా పగలకపోయినా అది వుళ్లీ పెరగవచ్చు. కానీ ఇలా జరగడం అరుదు. పైగా అవి వుళ్లీ కొత్తగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. కాబట్టి ఎప్పుడో ఫామ్ అయ్యే స్టోన్ గురించి ఇప్పట్నుంచే భయుపడుతూ ఉండటం సరికాదు. ఇక మీరు అడిగిన ఆహార నియువూల విషయూనికి వస్తే... పాలకూర, క్యాబేజీ, టొవూటో, వూంసాహారం తక్కువగా తినడం వుంచిది. ఇక రోజూ మూడు లీటర్ల వరకు నీళ్లు తాగండి. మూత్రపిండాల్లో రాళ్లకూ సెక్స్‌కూ ఎలాంటి సంబంధం లేదు. మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినా అంగస్తంభన శక్తి తగ్గడం అంటూ ఉండదు. మీరు నిశ్చింతగా, నిర్భయుంగా పెళ్లి చేసుకోవచ్చు. నా వయుస్సు 22. నాకు వేరికోసిల్ ఉంది. డాక్టర్‌కు చూపిస్తే... అల్ట్రాసౌండ్ హై ఫ్రీక్వెన్సీ (స్క్రోటమ్) పరీక్షల చేసి, ఎడవువైపున గ్రేడ్-3, కుడివైపున గ్రేడ్-1 ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ అవసరవుని రెండువైపులా చేశారు. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకొమ్మన్నారు. ఇప్పటికీ వృషణాల్లో అప్పడప్పుడూ నొప్పి వస్తూనే ఉంది. ఈ శస్త్రచికిత్స తర్వాత అంగస్తంభన శక్తి తగ్గుతుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - జె.కె.బి., చిల్లకల్లు వృషణాల్లోని రక్తనాళాల్లో (వెయిన్స్) వాపును వేరికోసిల్ అంటారు. దానివల్ల వృషణాల్లో నొప్పి రావడమే గాక వీర్యకణాల సంఖ్య, క్వాలిటీ తగ్గుతుంది. నొప్పి విపరీతంగా ఉన్నా, పిల్లలు లేకున్నా ఈ సవుస్యను ఆపరేషన్ ద్వారా సరిచేస్తారు. ఆపరేషన్ తర్వాత నిల్చోవడం, బరువులు ఎత్తడం వంటివి చేస్తే నొప్పి వస్తుంది. అందువల్ల రెండు నెలల పాటు డాక్టర్లు శారీరక శ్రవు ఎక్కువగా ఉండే పనులు వద్దంటారు. ఎక్కువ దూరం నడవడాన్ని కూడా కొంతకాలం అవాయిడ్ చేయుండి. మూడు నెలల తర్వాత అన్ని పనులూ వూమూలుగానే చేసుకోవచ్చు. సర్జరీ తర్వాత కొంతవుందిలో నొప్పి అలాగే ఉంటుంది. అది నిదానంగా తగ్గిపోతుంది. స్క్రోటల్ సపోర్ట్ కోసం బిగుతైన లోదుస్తులు వేసుకొవ్ముని చెబుతాం. ఈ శస్త్రచికిత్స వల్ల అంగస్తంభన శక్తిని కోల్పోవడం జరగదు. ఆందోళన చెందకండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
ఆపరేషన్ తప్పనిసరా?
వూ నాన్నగారి వయస్సు 75 ఏళ్లు. మూత్ర సంబంధమైన సమస్య వస్తే యూరాలజిస్ట్‌ను కలిశాం. ప్రోస్టేట్ పెద్దదిగా ఉందని, ఆపరేషన్ చేస్తే మంచిదని చెప్పారు. ఆపరేషన్ చేయించుకోవడం అవసరమా? - సుకుమార్, వరంగల్ ఈ వయుస్సులో ప్రోస్టేట్ గ్రంథికి సమస్యలు రావడం చాలా సాధారణం. ఈ సమస్య ఉన్నవారికి మొదట వుందులు వాడి చూస్తాం. అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎండోస్కోపీ ద్వారా టీయూఆర్‌పీ అనే శస్త్రచికిత్స చేస్తాం. మాత్రం పూర్తిగా ఆగిపోయినా, మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, మూత్రాశయంలో రాళ్లు ఉన్నా, మూత్రపిండాల పనితీరు తగ్గినా, మూత్రంలో తరచు రక్తం కనిపిస్తున్నా... వుందులపై ఆధారపడకుండా శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఈ ఆపరేషన్‌కు పేషెంట్ ఫిట్‌గా ఉన్నారా లేదా తెలుసుకోవడం కోసం ముందుగా ఫిజీషియున్ను కలవండి. ఆ తర్వాత యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 35. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. ప్రస్తుతం సెక్స్ చేసిన ఒకటి రెండు నిమిషాల్లో వీర్యస్ఖలనం అయిపోతోంది. దాంతో ఇద్దరికీ చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకు మంచి సలహా ఇవ్వండి. - ఎస్.డి., ఖమ్మం మీ సమస్యను ప్రీ-మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సాధారణంగా సెక్స్ మొదలుపెట్టాక స్ఖలనానికి నిర్దిష్టంగా ఇంతే సమయం కావాలనే నియమం ఏదీ లేదు. దంపతులిద్దరూ తృప్తిపడేంత సేపు సెక్స్ జరిగితే చాలు. అయితే కొందరిలో సెక్స్ మొదలుపెట్టిన ఒకటి, రెండునిమిషాల్లోనే వీర్యస్ఖలనం అయిపోతుంది. దాంతో దంపతులిద్దరికీ సెక్స్‌లో తృప్తి కలగకపోవచ్చు. ఇలా దంపతులిద్దరూ సంతృప్తి పొందకముందే వీర్యస్ఖలనం జరిగిపోతే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా చెప్పవచ్చు. సెక్స్‌లో పురుషాంగంపైన ఏర్పడే కదలికల వల్ల ప్రేరేపణ జరిగి వీర్యస్ఖలనం అవుతుంది. ఇలాకాకుండా ఉండాలంటే... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మొదట అరగంట లేదా గంటసేపు ప్రీ-ప్లే చేసి ఆ తర్వాత సెక్స్ చేయడం మంచిది. మధ్యమధ్యలో ఆపడం వల్ల కూడా మెదడుకు అందే సిగ్నల్స్‌ను ఆపవచ్చు. ఇది కాకుండా ఫోగ్జటివ్ ఎపాక్సిటిన్ అనే మందులు మెదడు మీద పనిచేసి ఈ సిగ్నల్స్‌ను బలహీనపరుస్తాయి. అయితే ఈ మందులను కేవలం ఆండ్రాలజిస్ట్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
పొట్ట ఉబ్బటం కిడ్నీ సమస్యకు సంకేతమా?
నాకు 55 ఏళ్లు. మొదట్నుంచీ నేను కొంచెం లావుగానే ఉంటాను. కానీ ఈమధ్య కాలంలో పొట్ట మాత్రం విపరీతంగా ముందుకు వస్తూ ఉంది. ఉదయం వేళల్లో కాళ్ల వాపు, ముఖం వాపు కూడా ఉంటోంది. గత 20 ఏళ్లుగా నాకు మద్యం అలవాటు ఉంది. నా స్నేహితులంతా కిడ్నీ చెడిపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడతాయని అంటున్నారు. ఇతరత్రా నాకు ఎలాంటి సమస్యా లేదు. గత మూడేళ్లుగా హైబీపీ కూడా ఉంది. నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? పొట్ట విపరీతంగా ఉబ్బితే కిడ్నీ సమస్య ఉన్నట్లా? దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. - డి.ఎస్.ఎమ్., కరీంనగర్ సాధారణంగా పొట్టతోపాటు, శరీరం కూడా పెరిగితే స్థూలకాయం అంటారు. కానీ ముఖం మీద, కళ్ల చుట్టూ వాపు రావడం, పాదాల్లో వాపు వంటి లక్షణాలు స్థూలకాయంలో ఉండవు. కిడ్నీ, గుండె, కాలేయానికి సంబంధించిన సమస్య ఉన్నవాళ్లలో మాత్రమే ఇలాంటి వాపు కనిపిస్తుంటుంది. ఒకవేళ పై సమస్యల కారణంగా పొట్టలో కూడా నీరు చేరితే, పొట్ట ఉబ్బుతుంది. ఈ కండిషన్‌ను అసైటిస్ అంటారు. అయితే ఈ కండిషన్లో కాళ్లూ, చేతులు స్థూలకాయంలో ఉన్నంత లావుగా ఉండకుండా, మామూలుగానే ఉంటాయి. కిడ్నీ సమస్య ఉన్నవాళ్లలో పొట్ట వాపు కంటే కళ్ల చుట్టూ వాపు ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి క్రియాటినిన్ అనే కిడ్నీ పరీక్ష, ఎల్.ఎఫ్.టి. అనే కాలేయ పరీక్ష, ఎకో-కార్డియోగ్రామ్ అనే గుండె పరీక్ష చేయించుకుంటే... మీ లక్షణాలు దేనికి సంబంధించినవో తెలుస్తుంది. మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి, పై పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
తీవ్ర వ్యాయామాల వల్ల సామర్థ్య లోపం..?
నేను ఇటీవల సిక్స్ ప్యాక్ బాడీ కోసం కాస్త తీవ్రంగానే ఎక్సర్సైజ్లు చేస్తున్నాను. అయితే, అతిగా ఎక్సర్సైజ్ చేయుడం వల్ల సెక్స్ బలహీనత వస్తుందని కొందరు మిత్రులు భయపెడుతున్నారు. నాకు కోరికలు కలిగినప్పుడు అంగం గట్టిపడుతోంది. కానీ నా ఫ్రెండ్స్ ఈ మాట చెప్పినప్పటి నుంచి నాకు ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు మంచి సలహా ఇవ్వండి. - ఎస్.వి.ఆర్., భీమవరం హార్డ్ ఎక్సర్సైజ్లు చేస్తున్నవారిలో సెక్స్ బలహీనత వస్తుందన్న అపోహ కొందరిలో ఉంటుంది. కానీ వ్యాయామం చేయడం వల్ల శరీర దారుఢ్యం బాగుండి సెక్స్ సావుర్థ్యం మరింత పెరుగుతుంది. అయితే ఒక్కోసారి విపరీతంగా వ్యాయామం చేయడం వల్ల బాగా అలసిపోయి నొప్పుల వల్ల సెక్స్ చేయలేకపోవచ్చు. కాని, ఇది అలసట ఉన్నంతసేపు ఉండే తాత్కాలిక ప్రభావం మాత్రమే. ఎప్పుడూ జిమ్ ఎక్సర్సైజ్లు వూత్రమేగాక ఏరోబిక్ ఎక్సర్సైజ్లు (సైక్లింగ్, వాకింగ్, జాగింగ్ వంటివి) చేయడం వల్ల ఆరోగ్యం వురింత బాగుంటుంది. మీకు సెక్స్ కోరికలు కలిగినప్పుడు పురుషాంగం గట్టిపడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజ్ మీకు మరింత మేలు చేస్తుంది. అంతే తప్ప అపోహలు వ్యాప్తి చేసే ఈ స్నేహితుల్లాంటి వారి మాటలు వినకండి. నాకు 37 ఏళ్లు. పెళ్లయి పదేళ్లు అయ్యింది. గతంలో ప్రతి రోజూ కనీసం ఒకసారైనా సెక్స్ చేయగలిగే వాణ్ణి. ఇప్పుడు వారానికి రెండు లేదా ఒకసారి మాత్రమే సెక్స్ చేయగలుగుతున్నాను. ఈమధ్య నాకు షుగర్ కూడా వచ్చింది. దీని వల్లనే ఈ సమస్య వచ్చిందా? నా సమస్యకు పరిష్కారం చూపగలరు. - ఎస్.ఎస్.ఆర్., నేలకొండపల్లి సాధారణంగా సెక్స్ కోరికలు 20 నుంచి 30 ఏళ్ల మధ్య చాలా ఉద్ధృతంగా ఉంటాయి. సెక్స్ విషయంలో పెళ్లయిన కొత్తలో ఉన్నంత ఉత్సాహం ఆ తర్వాత ఉండకపోవడం సహజం. షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లలో, ముఖ్యంగా ఒకేచోట కూర్చుని పనిచేసేవాళ్లలో (సెడెంటరీ లైఫ్‌స్టైల్ ఉన్నవాళ్లలో) సెక్స్ సామర్థ్యం కాస్తంత తగ్గుతుంది. దీనికితోడు ఆ ఈడులో ఉండే బాధ్యతల వల్ల వచ్చే మానసిక సమస్యల మూలంగా కూడా కొంత సెక్స్ సామర్థ్య లోపం ఏర్పడుతుంది. దీనిని చాలావరకు కౌన్సెలింగ్ ద్వారా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో నార్మల్ సెక్స్‌ను పొందేలా చేయవచ్చు. మీ బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో పెట్టుకుని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, మానసికంగా ఉల్లాసంగా ఉండటం ద్వారా మీ సామర్థ్య లోపాన్ని నివారించుకోవచ్చు. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా, ధైర్యంగా ఉండండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గమా?
నా వయస్సు 28. ఇంకా పెళ్లి కాలేదు. నాకు రెండువైపులా వేరికోసిల్ ఉంది. వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గం అని నేను చాలాసార్లు చదివాను. ఆపరేషన్ తప్ప మరోమార్గం లేదా? దయచేసి సలహా ఇవ్వండి. -పి.వి.ఆర్, హైదరాబాద్ వేరికోసిల్ రావడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏదీ లేదు. వేరికోసిల్ ఉన్నప్పుడు పెళ్లి కాకుండా ఉండి, నొప్పి లేకుండా ఉంటే వెంటనే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వివాహం అయిన వ్యక్తుల్లో వేరికోసిల్ కండిషన్ ఉండి పిల్లలు లేకపోతే... ముందుగా సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. వేరికోసిల్ ఉన్నవాళ్లలో సెమెన్ కౌంట్ తక్కువగా ఉండి, వీర్యకణాల కదలికలు తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ అనే పరీక్ష ద్వారా వేరికోసిల్ కండిషన్‌ను నిర్ధారణ చేసి, సర్జరీ చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. మీకింకా వివాహం కాలేదని రాశారు. కాబట్టి మీలాంటి వారి విషయంలో ముందుగానే సర్జరీ చేయించుకొమ్మనే సలహా ఇవ్వము. మరీ తీవ్రమైన నొప్పిగాని, గ్రేడ్-3 వేరికోసిల్ కండిషన్ ఉంటే సర్జరీతో మంచి ఉపశమనం దొరుకుతుంది. మీకు ఇంకా పెళ్లికానట్లయితే... వేరికోసిల్ వల్ల మీకు నొప్పి లేకపోతే... ఇప్పుడప్పుడే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నా వయుసు 32 ఏళ్లు. నా వృషణాల్లో నొప్పి వస్తోంది. లాగుతున్న ఫీలింగ్ కూడా ఉంది. వృషణాల సైజ్ చిన్నవిగా వూరాయుని అనిపిస్తోంది. దయుచేసి నా సవుస్యకు సలహా ఇవ్వండి. - బి. కిరణ్ కుమార్, కరీంనగర్ తవు వృషణాలు చిన్నవేమో అనే అపోహ చాలావుందిలో ఉంటుంది. మీకు ఇతరత్రా ఏ ఇబ్బందులూ లేకపోతే దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. అయితే తవు వృషణాలు వుుందు పెద్దవిగా ఉండి, ఇప్పుడు అవి చిన్నవిగా అయిపోయి ఉండి, నొప్పి కూడా ఉంటే మాత్రం దానికి కారణం వేరికోసిల్ అయివుండవచ్చునని అనువూనించాలి. కాబట్టి మీరు ఒకసారి యుూరాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు డాప్లర్ అల్ట్రాసౌండ్ అనే పరీక్ష చేయించి ఏదైనా సమస్య ఉందా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. మీ సమస్యను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
పస్ సెల్స్ ఉన్నాయి... పిల్లలు పుడతారా?
నా వయుస్సు 36 ఏళ్లు. నాకు వివాహం జరిగి 12 ఏళ్లు అయింది. వూకింకా సంతానం కలగలేదు. డాక్టర్‌ను కలిసి వైద్యపరీక్షలు చేయించుకున్నాను. గత కొద్దికాలంగా నా వీర్యం రిపోర్టుల్లో పస్ సెల్స్ ఎక్కువగా (ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్) ఉన్నట్లు చెబుతున్నారు. పస్‌సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - మోహన్‌రాజు, మధిర చాలాకాలంగా సంతానం లేనివారిలో మగవారికి మొదట సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు సెమెన్ క్వాలిటీ తగ్గుతుంది. తత్ఫలితంగా పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. డాక్టర్ సలహా మేరకు సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల వీర్యంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గితే సెమెన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. యూంటీబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ మరోసారి సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసి, ఈసారి వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉంటే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తప్పక మెరుగవుతాయి. నాకు 38 ఏళ్లు. మూత్రవిసర్జన సమయంలో, సెక్స్ చేస్తున్నప్పుడు విపరీతమైన మంట వస్తోంది. డాక్టర్‌ను కలిసి స్కానింగ్ చేయించుకున్నాను. మూత్రాశయంలో 4 సెం.మీ. రాయి ఉందని, ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తీసేస్తామని చెప్పారు. ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ లోపాలు, అంగస్తంభన సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఏవైనా వస్తాయా? దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - కె.కె.ఆర్., బెంగళూరు మూత్రాశయంలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మంటగా అనిపించడం మామూలే. ఈ రాళ్లను ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఈ ప్రక్రియలో అంగస్తంభన కలిగించే నరాలకు చాలా దూరం నుంచి ఆ రాళ్లను తొలగిస్తారు. కాబట్టి ఎండోస్కోపీకీ, అంగస్తంభన సామర్థ్యం తగ్గడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రక్రియ తర్వాత మీకు ఈ కారణంగా ఎలాంటి అంగస్తంభన లోపాలు గాని, సెక్స్ సమస్యలు గాని వచ్చేందుకు అవకాశం లేదు. ఒకవేళ మీరు ఏదైనా ఆందోళనతో ఈ ఇన్ఫెక్షన్ను అలాగే వదిలేస్తే, అది కీడ్నీకి కూడా పాకి సమస్య మరింత తీవ్రం అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించి వెంటనే ఎండోస్కోపీ చేయించుకోండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
సిజేరియన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
నా భార్యకు సిజేరియున్ ద్వారా కాన్పు జరిగి మూడు నెలలవుతోంది. నేను నా భార్యతో ఎప్పట్నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు? సిజేరియున్ తర్వాత వురో రెండేళ్ల వరకు గర్భం రాకుండా చూసుకోవాలంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - ఎమ్.ఆర్.ఆర్., కొత్తగూడెం సాధారణ ప్రసవమైనా లేదా సిజేరియున్ అయినా- ప్రసవం తర్వాత మొదటి ఆరువారాలు సాధ్యమైనంత వరకు సెక్స్‌లో పాల్గొనకపోవడం వుంచిది. ప్రసవమైన వుహిళకు రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్ లేకుండా ఉండి, ఆమె కూడా సెక్స్ కోసం శారీరకంగా, వూనసికంగా సంసిద్ధంగా ఉంటే ఆరు వారాల తర్వాత నుంచి దంపతులిద్దరూ నిరభ్యంతరంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. బిడ్డకు పాలిస్తున్న తల్లులలో మొదటి మూడు నెలలు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ వుళ్లీ గర్భం వచ్చే అవకాశం తక్కువ. అయినప్పటికీ రిస్క్ తీసుకోకుండా రెండు సంవత్సరాల వరకు కచ్చితంగా వుళ్లీ గర్భం రాకుండా ఏదో ఒక గర్భనిరోధక సాధనాన్ని వాడాలి. (అంటే... పురుషులు కండోమ్గానీ, వుహిళలు కాపర్టీ, కాంట్రసెప్టివ్ పిల్స్ వంటివి). డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు సెక్స్ చేసినా వుళ్లీ గర్భం వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి. ఇది తల్లికి... మరీ ముఖ్యంగా సిజేరియున్ అయిన మహిళలకు... అస్సలు వుంచిది కాదు. కాబట్టి వచ్చే రెండేళ్ల పాటు మీకు సౌకర్యంగా ఉండే గర్భనిరోధక సాధనాలను ఎంచుకుని వాటిని వాడటం అన్నివిధాలా మంచిది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
కిడ్నీలో ఈ నీటిబుడగలేమిటి..?
నాకు 45 ఏళ్లు. ఈమధ్యకాలంలో బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. దాంతో హెల్త్ చెక్ అప్స్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. ‘కిడ్నీ పనితీరు కొంచెమే మారింది, పెద్దగా ప్రమాదమేమీ లేద’న్నారు. అసలీ నీటి బుడగల జబ్బేమిటి? నాకు భయమేస్తుంది. మా నాన్నగారు కూడా ఏదో కిడ్నీ సమస్యతోనే చనిపోయారు. ఈ జబ్బు విషయంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అసలు కిడ్నీ చెడిపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నా ఈ జబ్బుకు ఏదైనా ఆపరేషన్ అవసరం ఉంటుందా? - సుదర్శన్, వరంగల్ మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండవచ్చునని అనిపిస్తోంది. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే జబ్బు . ఈ జబ్బు ఉన్నవారిలో 30 ఏళ్ల వయసప్పటి నుంచి 50 ఏళ్ల మధ్యన మూత్రపిండాల్లో నీటిబుడగలు తయారవ్వడం మొదలవుతుంది. ఈ నీటిబుడగల సంఖ్య, పరిమాణం పెరిగేకొద్దీ కిడ్నీ సైజ్ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల కిడ్నీ కండ తగ్గడానికి అవకాశం ఉంటుంది. క్రమేపీ నీటిబుడగల సంఖ్య పెరగడం వల్ల కిడ్నీ పనితీరు కూడా నెమ్మదిగా మందగిస్తూ పోతుంది. ఈ జబ్బుకు నిర్దిష్టంగా ఏ మందులూ లేకపోయినా, బీపీని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు తక్కువ మాంసకృత్తులను తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరును కాపాడుకోవచ్చు. ఈ జబ్బు ఉన్నవారు క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్ స్కాన్, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుంటూ, మూత్రపిండాల వ్యాధి నిపుణులను సంప్రదిస్తూ ఉండటం అవసరం. ఈ జబ్బు ఉన్నవారు దీన్ని నిర్లక్ష్యం చేసినా కిడ్నీ పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దీర్ఘకాలం పాటు సాధారణజీవితాన్ని గడపవచ్చు. కాబట్టి ఆందోళన చెందకండి. నాకు 56 ఏళ్లు. పదేళ్లుగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నాను. ఇటీవల పురుషాంగం మీద చర్మం పగిలినట్లుగా ఉండి, మంటగా ఉంటోంది. చర్మం కూడా ఫ్రీగా వెనక్కి రావడం లేదు. షుగర్ అప్పుడప్పుడూ 200 పైన కూడా ఉంటోంది. దీనివల్ల సెక్స్‌లో కూడా ఇబ్బంది కలుగుతోంది. దయచేసి ఎలాంటి చికిత్స తీసుకోవాలో చెప్పండి. - డి.ఆర్.ఎస్., నందిగామ షుగర్ ఉన్నవారిలో పురుషాంగం చివరన ఉన్న చర్మానికి ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావడం చాలా సాధారణంగా జరిగేదే. ఇలా జరిగినప్పుడు ఒకటి రెండుసార్లు యాంటీఫంగల్, యాంటీబయాటిక్ మందులు వాడినప్పటికీ ఇలాగే జరుగుతుంటే సున్తీ ఆపరేషన్ చేయించుకుంటే దీర్ఘకాలికంగా ఉపయోగం ఉంటుంది. పురుషాంగం చర్మం వెనక్కి రానివారిలో లోపల మూత్రనాళం (యురెథ్రా) కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా సున్తీ ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా సలహా ఇస్తాం. మీరు మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నాకు పెళ్లయి ఏడాది అయ్యింది. పెళ్లయిన మొదటి రెండు రోజులు జంకుతో నేను సెక్స్‌లో పాల్గొనలేకపోయాను. తర్వాత కూడా సెక్స్ చేయబోతే అంగస్తంభన సరిగా కాలేదు. మొదట్లో ఏమీ అనకపోయినా ఇటీవల నా భార్య నా పట్ల చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకేమో కొద్దిగా అంగస్తంభన అయి మళ్లీ చాలా త్వరగా వీర్యస్ఖలనం అయిపోతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - డి.ఎన్.పి., సత్తుపల్లి సాధారణంగా పెళ్లయిన కొత్తలో కాస్త బెరుకుగా ఉన్నా, దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగాక అంగస్తంభన మామూలుగానే జరిగిపోవాలి. కానీ చాలా సందర్భాలలో మానసిక కారణాల వల్లగాని, ఒకరిపై మరొకరికి పూర్తిగా ఇష్టం కలగకపోవడం వల్లగాని, పార్ట్నర్స్ మధ్య మనస్పర్థల వల్లగాని ఇలా మీకు జరిగినట్లుగా అంగస్తంభన పూర్తిగా జరగకపోవడం, వీర్యం త్వరగా పడిపోవడం వంటివి జరగవచ్చు. అందువల్ల మీరు సెక్స్ కౌన్సెలింగ్ చేయించుకుని, సెక్స్‌లో పాల్గొనండి. అప్పటికీ ప్రయోజనం లేకపోతే సెక్స్‌ను ప్రేరేపించే మందులు వాడటం వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది. మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 36 ఏళ్లు. గత రెండేళ్లుగా మూత్రంలో విపరీతమైన వుంట. నాకు మూత్రధార సరిగా రావడం లేదు. సెక్స్ చేసినప్పుడు వీర్యం సరిగా రావడం లేదు. పై సమస్యలతో తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాను. సెక్స్ చేసినా, మూత్రం పోసినా పొత్తికడుపులో బిగదీసుకుపోయినట్లుగా ఉంటోంది. దాంతో సెక్స్ అంటేనే భయుమేస్తోంది. పెళ్లికి ముందు కండోమ్ లేకుండా చాలాసార్లు చాలావుంది అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నాను. అప్పుడు అలా చేయడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయేమోనని యూంటిబయూటిక్స్ ఎక్కువగా మింగుతున్నాను. నాకు వుంచి సలహా ఇవ్వండి. - ఆర్.కె.ఆర్., విజయవాడ మీరు ముందుగా ఇరట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్ (ఆర్జీయూ) అనే పరీక్ష చేయించుకోవాలి. దీనిల్ల మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి(బ్లాక్) ఉందేమో తెలుస్తుంది. అలా ఉంటే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా మూత్రనాళాన్ని వెడల్పు చేయించుకుంటే మూత్రం, వీర్యం రెండూ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ నొప్పి ఎందుకు వస్తోంది?
నా వయసు 26. కుడివైపు నడుము భాగంలో నొప్పిగా ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పి ఈఎస్డబ్ల్యూల్ అనే ప్రక్రియ ద్వారా బ్లాస్టింగ్ చేశారు. వారం తర్వాత పొత్తికడుపులో, కుడివైపు వృషణంలో విపరీతమైన నొప్పి వచ్చింది. మళ్లీ స్కానింగ్ చేయించారు. రాళ్లు పూర్తిగా తొలగిపోలేదని, మళ్లీ చికిత్స చేయాలంటున్నారు. కిడ్నీలో రాళ్లు ఉంటే వృషణంలో నొప్పి ఎందుకు వస్తోంది. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి. - ఎస్.కె.ఆర్., పాలకొండ కిడ్నీలో రాళ్లను తొలగించడానికి ఈఎస్‌డబ్ల్యూఎల్ ప్రక్రియద్వారా బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ రాళ్లు ముక్కలైపోయి యురేటర్లో ఇరుక్కున్నప్పుడు ఇలా నొప్పి వస్తుంది. ఈ యురేటర్కీ, వృషణానికీ ఒకే నరం వెళ్తుంది. అందువల్ల ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు అక్కడ కూడా నొప్పి వచ్చినట్లుగా అనిపిస్తుంది. దీన్ని రిఫర్డ్ పెయిన్ అంటారు. అంతేగాని మీ సమస్య వృషణానికి సంబంధించిన సమస్య కానేకాదు. ఇప్పుడు వైద్యరంగంలోని సాంకేతిక పురోగతితో ఇలా మిగిలిపోయిన రాళ్లను లేజర్ ప్రక్రియతో పూర్తిగా పౌడర్లా చేసి తీసేయవచ్చు. దీన్ని ఆర్ఐఆర్ఎస్ (రెట్రోగ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ) ప్రక్రియ ద్వారా తీసేయవచ్చు. ఈ ప్రక్రియలో గాటు లేకుండా కుట్టు లేకుండా ముక్కలైన మిగతా రాళ్లను 15 నిమిషాల్లో తొలగించవచ్చు. అదేరోజు ఇంటి కి కూడా వెళ్లవచ్చు. ఒకసారి మీరు మీ యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్