తీవ్ర వ్యాయామాల వల్ల సామర్థ్య లోపం..? | Over exercising causes Sexual Weakness? | Sakshi
Sakshi News home page

తీవ్ర వ్యాయామాల వల్ల సామర్థ్య లోపం..?

Published Thu, Oct 17 2013 11:33 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

తీవ్ర వ్యాయామాల వల్ల సామర్థ్య లోపం..? - Sakshi

తీవ్ర వ్యాయామాల వల్ల సామర్థ్య లోపం..?

నేను ఇటీవల సిక్స్ ప్యాక్ బాడీ కోసం కాస్త తీవ్రంగానే ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నాను. అయితే, అతిగా ఎక్సర్‌సైజ్ చేయుడం వల్ల సెక్స్ బలహీనత వస్తుందని కొందరు మిత్రులు భయపెడుతున్నారు. నాకు కోరికలు కలిగినప్పుడు అంగం గట్టిపడుతోంది. కానీ నా ఫ్రెండ్స్ ఈ మాట చెప్పినప్పటి నుంచి నాకు ఆందోళనగా ఉంది. ఈ విషయంలో  నాకు మంచి సలహా ఇవ్వండి.
 - ఎస్.వి.ఆర్., భీమవరం

 
హార్డ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నవారిలో సెక్స్ బలహీనత వస్తుందన్న అపోహ కొందరిలో ఉంటుంది. కానీ వ్యాయామం చేయడం వల్ల శరీర దారుఢ్యం బాగుండి సెక్స్ సావుర్థ్యం మరింత పెరుగుతుంది. అయితే ఒక్కోసారి విపరీతంగా వ్యాయామం చేయడం వల్ల బాగా అలసిపోయి నొప్పుల వల్ల సెక్స్ చేయలేకపోవచ్చు. కాని, ఇది అలసట ఉన్నంతసేపు ఉండే తాత్కాలిక ప్రభావం మాత్రమే. ఎప్పుడూ జిమ్ ఎక్సర్‌సైజ్‌లు వూత్రమేగాక ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు (సైక్లింగ్, వాకింగ్, జాగింగ్ వంటివి) చేయడం వల్ల ఆరోగ్యం వురింత బాగుంటుంది. మీకు సెక్స్ కోరికలు కలిగినప్పుడు పురుషాంగం గట్టిపడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్సర్‌సైజ్ మీకు మరింత మేలు చేస్తుంది. అంతే తప్ప అపోహలు వ్యాప్తి చేసే ఈ స్నేహితుల్లాంటి వారి మాటలు వినకండి.
 
 నాకు 37 ఏళ్లు. పెళ్లయి పదేళ్లు అయ్యింది. గతంలో ప్రతి రోజూ కనీసం ఒకసారైనా సెక్స్ చేయగలిగే వాణ్ణి. ఇప్పుడు వారానికి రెండు లేదా ఒకసారి మాత్రమే సెక్స్ చేయగలుగుతున్నాను. ఈమధ్య నాకు షుగర్ కూడా వచ్చింది. దీని వల్లనే ఈ సమస్య వచ్చిందా? నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
 - ఎస్.ఎస్.ఆర్., నేలకొండపల్లి

 
సాధారణంగా సెక్స్ కోరికలు 20 నుంచి 30 ఏళ్ల మధ్య చాలా ఉద్ధృతంగా ఉంటాయి. సెక్స్ విషయంలో పెళ్లయిన కొత్తలో ఉన్నంత ఉత్సాహం ఆ తర్వాత ఉండకపోవడం సహజం. షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లలో, ముఖ్యంగా ఒకేచోట కూర్చుని పనిచేసేవాళ్లలో (సెడెంటరీ లైఫ్‌స్టైల్ ఉన్నవాళ్లలో) సెక్స్ సామర్థ్యం కాస్తంత తగ్గుతుంది. దీనికితోడు ఆ ఈడులో ఉండే బాధ్యతల వల్ల వచ్చే మానసిక సమస్యల మూలంగా కూడా కొంత సెక్స్ సామర్థ్య లోపం ఏర్పడుతుంది. దీనిని చాలావరకు కౌన్సెలింగ్ ద్వారా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో నార్మల్ సెక్స్‌ను పొందేలా చేయవచ్చు. మీ బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో పెట్టుకుని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, మానసికంగా ఉల్లాసంగా ఉండటం ద్వారా మీ సామర్థ్య లోపాన్ని నివారించుకోవచ్చు. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా, ధైర్యంగా ఉండండి.
 
 డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement