నిస్సహాయత ఫీలవ్వకండి... నిర్భయంగా ఉండండి! | Be open with others about problems | Sakshi
Sakshi News home page

నిస్సహాయత ఫీలవ్వకండి... నిర్భయంగా ఉండండి!

Published Wed, Jun 17 2015 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

నిస్సహాయత ఫీలవ్వకండి...  నిర్భయంగా ఉండండి!

నిస్సహాయత ఫీలవ్వకండి... నిర్భయంగా ఉండండి!

పురుషులు బయటికి చెప్పుకోలేని సమస్యలు
నాకు 30 ఏళ్లు. నాలుగు నెలల కిందట వివాహమయ్యింది. పెళ్లయిన మొదటిరాత్రి  అంగప్రవేశం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా  స్తంభన తగ్గింది. దాంతో టెన్షన్ వచ్చి చేయాలేకపోయాను. అప్పట్నుంచి సెక్స్ అంటే భయం వేస్తోంది. ఒకప్పుడు హస్తప్రయోగం బాగా చేసేవాణ్ణి. దానివల్లనే ఈ సమస్య వచ్చిందా? ఇప్పుడు కూడా సెక్స్‌లో పాల్గొనాలంటే ఆందోళనగా అనిపిస్తోంది. నా భార్య కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. దాంతో నేనెంతో  డిప్రెషన్‌లోకి వెళ్తున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - ఆర్.కె.డి.ఆర్., కర్నూలు


మీరు యాంగ్జైటీ న్యూరోసిస్‌తో బాధపడుతున్నారు. కొత్తగా పెళ్లయినవాళ్లలో చాలామందికి మీలాంటి అనుభవం కలగడం చాలా సహజం. ఇది చాలా సాధారణం.  సెక్స్ అనేది మానసిక, శారీరక సమన్వయంతో చేసే స్వాభావిక ప్రక్రియ. ఇందులో మీ భాగస్వామి సహకారం కూడా కావాలి. మీ భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ అన్నింటికంటే ముఖ్యం. అవి ఉండి మీ భార్య, మీరు పరస్పరం సహకరించుకుంటే మీరు ఈ సమస్యను చాలా తేలిగ్గా అధిగమించగలరు. మీరు గతంలో చేసిన హస్తప్రయోగం వల్ల మీకు ఈ సమస్య రాలేదు. పైగా మీరు గతంలో హస్తప్రయోగం బాగా చేశారంటే మీలో సెక్స్‌పరమైన లోపాలేమీ లేవని అర్థం. అదే మీరు మీ భార్య దగ్గర సెక్స్‌లో మీ పెర్‌ఫార్మార్మెన్స్‌ను చూపాలనేసరికి మీలో యాంగ్జైటీ మొదలైంది. దాంతో మీరు చెప్పిన పరిణామాలన్నీ జరిగాయి. మీరూ, మీ భార్యతో కలిసి ఒకసారి  డాక్టర్‌ను సంప్రదించి, తగిన కౌన్సెలింగ్ తీసుకోండి. కేవలం కౌన్సెలింగ్ మాత్రమే ప్రయోజనం ఇవ్వకపోతే, మీకు తాత్కాలికంగా కలిగిన అంగస్తంభన లోపాన్ని అధిగమించడానికి యాండ్రాలజిస్ట్ కొన్ని మందులు ఇస్తారు. వీటి సాయంతో మీరు మీ సమస్యను అధిగమించవచ్చు. ఈలోపు మీరు తగినంత ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం వల్ల ఆ తర్వాత మందులేవీ అవసరం లేకుండానే సెక్స్‌లో సమర్థంగా పాల్గొనగలరు.
 
 నా వయుస్సు 18 ఏళ్లు. నా పురుషాంగం చాలా చిన్నగా ఉంటుంది. వృషణాలు కూడా చాలా చిన్నవి. అంగస్తంభనలు కూడా అంతగా లేవు. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే నా భార్యను సుఖపెట్టగలనా? నా సవుస్యకు చికిత్స ఉందా?
 - ఎస్.ఎమ్.ఎన్., కొత్తగూడెం


మీ వయుస్సు వారిలో చాలా వుందికి తవు అంగం, వృషణాలు చిన్నవిగా అనిపించడం సహజం. ఇలా అనుకునే వాళ్లు డాక్టర్ చేత పరీక్ష చేరుుంచుకున్నప్పుడు చాలా సందర్భాల్లో అవి నార్మల్‌గానే ఉన్నాయని డాక్టర్లు చెప్పి వాళ్ల ఆందోళనలనూ, అపోహలనూ దూరం చేస్తారు. మీరు మీ పురుషాంగం, వృషణాలు మరీ బొటనవేలంతే ఉన్నాయంటున్నారు కాబట్టి ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను కలవండి. ఆయన కూడా మీ వయసుకు అవి చాలా చిన్నవని భావిస్తే కొన్ని హార్మోన్ల పరీక్ష, వీర్యపరీక్ష వంటివి చేసి లోపాలు ఏవైనా ఉంటే కనుగొని దానికి తగిన చికిత్స అందిస్తారు. ఇప్పుడున్న వైద్య పురోగతి వల్ల దాదాపు అన్ని వైద్య సవుస్యలకూ చికిత్సలు అందుబాటులో ఉన్నారుు. కాబట్టి ఇప్పటి పురుష సంబంధమైన సమస్యలనన్నింటినీ తప్పక పరిష్కరించగలిగేలా వైద్యరంగంలో  పురోగతి ఉంది. కాబట్టి నిరాశపడాల్సిన అవసరమే లేదు.
 
నాకు 25 ఏళ్లు. ఈమధ్యనే పెళ్లయ్యింది. ఈమధ్య ఒకసారి పార్ట్‌నర్‌తో కలయిక తర్వాత వీర్యంలో కొంచెం రక్తం వచ్చింది. దాని తర్వాత ఒకసారి హస్తప్రయోగంలో కూడా రక్తం వచ్చింది. నాకు భయంగా ఉంది. అయితే అంగస్తంభనలో, సెక్స్ ప్రక్రియ లోనూ ఎలాంటి మర్పూ లేదు. సెక్స్ బాగానే చేయగలుగుతున్నాను. కానీ వీర్యంలో రక్తం రావడానికి కారణం ఏమిటి?
- ఎస్.వై.ఎమ్., కందుకూరు


మీరు రాసినదాన్ని బట్టి మీ విషయంలో వీర్యంలో రక్తం రావడం పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి కాకపోవచ్చు. కొందరిలో వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, టీబీ ఉన్నా, వీర్యం వచ్చే మార్గంలో నీటిబుడగలు (సిస్ట్స్) ఉన్నా, ఏవైనా గడ్డలు ఉన్నా ఇలా వీర్యంతో పాటు రక్తం రావచ్చు. కాని ఎక్కువ మందిలో ఇలా జరగడానికి ఏ కారణం కనిపించదు. చికిత్స చేయకపోయినా ఒక్కోసారి ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవచ్చు. మీరు ఒకసారి యూరిన్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్‌ను కలవండి. మీ సమస్య చికిత్సతో తగ్గేదే కాబట్టి ఆందోళన పడకండి.

నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది.  రోజూ సెక్స్‌లైఫ్ ఉంది. అయితే అంగస్తంభన బాగానే ఉన్నా వీర్యస్ఖలనం మాత్రం త్వరగా అయిపోతోంది. ఒకసారి వీర్యస్ఖలనం అయ్యక మళ్లీ అంగస్తంబన కలగడం లేదు. దాంతో నా భార్య సంతృప్తి చెందలేకపోతోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
- జీ.ఆర్.ఆర్., హైదరాబాద్


మీరు చెప్పిన కండిషన్‌ను ప్రీ-మెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. ఇది పురుషుల్లో  చాలా సాధారణం. వీర్యస్ఖలనం అన్నది ఒక నరాల స్పందన వల్ల కలిగే అద్భుతమైన అనుభూతి (రిఫ్లెక్స్ యాక్టివిటీ). సెక్స్ ప్రక్రియలో అంగం మీద ఉన్న చర్మం ఉద్వేగానికి లోనవుతుంది. ఇలా స్టిమ్యులేట్ కావడం అనేది వీర్యస్ఖలనం అనే రిఫ్లెక్స్ ప్రక్రియకు దారితీస్తుంది. కొంతమందిలో ఈ స్పందనలు (స్టిమ్యులేషన్స్) చాలా త్వరగా సంభవిస్తాయి. దాంతో వెంటనే వీర్యస్ఖలనం జరిగిపోతోంది. ఇలాంటి వాళ్లు సెక్స్‌లో నేరుగా పాల్గొనకూడదు. తన సెక్స్‌పార్ట్‌నర్‌తో తగినంత ప్రీ ప్లే చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు వీర్యస్ఖలనం ఫీలింగ్ రాగానే వెంటనే అంగాన్ని బయటకు తీసి పురుషాంగం చివర (శిశ్నం వెనక భాగంలో) గట్టిగా నొక్కి పట్టుకోవాలి. స్ఖలనం ఫీలింగ్ తగ్గగానే మళ్లీ సెక్స్ చేయడం ప్రారంభించాలి. ఇలా నొక్కి పట్టుకుని స్ఖలనాన్ని నియంత్రించే ప్రక్రియను ‘పించ్ అండ్ స్టార్’ టెక్నిక్ అంటారు. ఈ పించ్ అండ్ స్టార్ట్ టెక్నిక్‌తోనూ మీ సమస్య తగ్గకపోతే యాండ్రాలజిస్ట్‌ను కలవండి. కౌన్సెలింగ్‌తో, మందులతో మీ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. ఇదీమీ పెద్ద సమస్య కాదు. కాబట్టి ఆందోళన అనవసరం.

నా వయస్సు 65 ఏళ్లు. నాకు చిన్నతనం నుంచి పురుషాంగం చివరన ఉన్న చర్మం చాలా బిగుతుగా ఉండేది. నాకు పాతికేళ్ల వయసులో పెళ్లయ్యింది. కానీ ఆ సమస్య  ఏలాంటి అడ్డంకీ కలిగించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ చర్మం చాలా బిగుతై పోయింది. దాంతో కలయికలో విపరీతమైన నొప్పి వస్తోంది. అందువల్ల హస్తప్రయోగంతో తృప్తిపడుతున్నాను. ఇప్పుడు నాకు బీపీ, షుగర్ ఉన్నాయి. ఈ వయసులో సున్తీ చేయించుకోక తప్పదా? సలహా ఇవ్వండి.
 - ఎస్.జి.ఆర్. విశాఖపట్నం


ఏ వయసువారిలోనైనా పురుషాంగం మీద చర్మం ఫ్రీగా వెనక్కు రావాలి. ఇలా రాకపోతే చర్మానికి ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లలో చర్మం లోపలి భాగం షుగర్‌తో ఉన్న మూత్రంతో తడిచి పూర్తిగా గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల పురుషాంగంపై చర్మం వెనక్కి రావడం ఇబ్బందిగా ఉంటే సున్తీ చేయించుకోవడం అవసరం. సున్తీ అనేది చాలా సందర్భాల్లో అక్కడి చర్మానికి బాధ తెలియకుండా చేసి (లోకల్ అనస్థీషియా ఇచ్చి) సున్తీ ప్రక్రియ పూర్తయ్యాక అదేరోజు ఇంటికి పంపించి వేస్తాం. ఆ ఆపరేషన్ వల్ల ప్రమాదమేమీ ఉండదు. ఆ తర్వాత కూడా నొప్పి లేకుండా సెక్స్‌కు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ షుగర్ పాళ్లను కంట్రోల్ చేసుకొని సున్తీ చేయించుకోండి. ఆ తర్వాత హాయిగా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
 
నాకు 52 ఏళ్లు. షుగర్, బీపీ లేవు.  షుగర్ వల్ల అంగస్తంభన సమస్య వచ్చింది. దాంతో వయాగ్రా లాంటి మందులు చాలా వాడాను. అయినా కొంచెం కూడా అంగస్తంభన కలగడం లేదు. పైప్ టెస్ట్, రెజీస్కాన్ టెస్ట్ వంటి పరీక్షలు చేశారు. నిద్రలో కూడా నాకు అంగస్తంభనలు కలగడం లేదు. దీంతో నాకు చాలా బెంగగా ఉంటోంది. అంగస్తంభన కోసం కృత్రిమ రాడ్స్ అమర్చవచ్చని కొద్దిరోజుల క్రితం చదివాను. వాటివల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా? సెక్స్‌లో తృప్తి మామూలుగానే ఉంటుందా? వాటివల్ల మూత్రవిసర్జనకు ఏదైనా అవరోధాలు ఉంటాయా? వివరాలు చెప్పండి.
 - జీ.వి.ఆర్., కోదాడ


ఈమధ్యకాలంలో బీపీ, షుగర్ లాంటి సమస్యల వల్ల, జీవనశైలిలోని ఒత్తిళ్ల వల్ల రక్తనాళాలు ముడుచుకుపోయేందుకు ఆస్కారం ఉన్న గుండెపోటు, స్ట్రోక్ (పక్షవాతం) వంటి జబ్బులు వస్తున్నాయి. అలాగే రక్తనాళాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఈ అంగస్తంభన సమస్య కూడా వస్తుంది. అలాంటిప్పుడు చాలామంది అంగస్తంభన లేకపోవడం అన్న సమస్యను బయటకు చెప్పుకోలేక దాచేస్తుంటారు. అది అంగస్తంభనకు చెందిన సమస్యగా మాత్రమే చూడకూడదు. ఇతరత్రా అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుందా లేదా అని కూడా పరిశీలించాల్సిన సమస్య. అందుకే... ఇలాంటి సమస్య వచ్చినప్పుడు బిడియపడకుండా డాక్టర్‌ను కలవాలి. ఫలితంగా భవిష్యత్తులో వచ్చే గుండెజబ్బులను, స్ట్రోక్ వంటి ఎన్నో సమస్యలను ముందుగానే నివారించడం సాధ్యమవుతుంది. ఇక మీరు పేర్కొన్న రిజీస్కాన్, పైప్‌టెస్ట్ వంటివి అంగస్తంభనలు ఉన్నాయా లేవా అన్నది తెలుసుకోడానికే. అయితే మీరు ప్రస్తావించిన రాడ్స్ అమర్చడం అన్నది చిటచివరి ఆప్షన్‌గా మాత్రమే చేసే చికిత్స. ఇక ఎలాంటి అంగస్తంభనలు లేనప్పుడు మాత్రమే దీన్ని చివరి ఆప్షన్‌గా చేయించుకోవాలన్నది గుర్తుంచుకోండి. ఇందులో పురుషాంగంలోపల ఇరువైపులా రెండు రాడ్స్ అమర్చుతారు. దీనివల్ల మూత్రవిసర్జనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి అంగస్తంభనలూ లేనివారికి సెక్స్‌లో తృప్తికోసం దీన్ని శాశ్వత చికిత్సగా పరిగణించవచ్చు.  మీరు మీ యాండ్రాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
నాకు 60 ఏళ్లు. భార్యతో రోజూ కలుస్తున్నాను. అంగస్తంభన సమస్య లేదు. కాకపోతే ఈమధ్యకాలంలో వీర్యం తక్కువగా వస్తోంది. త్వరగా పడిపోతోంది కూడా. ఇందువల్ల పూర్తిగా తృప్తిపరచలేకపోతున్నానని బెంగపడుతున్నాను. నాకు చాలా రోజుల నుంచి బీపీ ఉంది. దానికి సంబంధించిన మందులు వాడుతున్నాను. వీర్యం పెరగడానికి మందులు సూచించగలరు.
 - ఆర్.కె.ఎమ్., ఆదిలాబాద్


మీరు 60 ఏళ్ల వయసులో రోజూ సెక్స్‌లో పాల్గొనగలగడం మీ మంచి ఆరోగ్యాన్ని సూచిస్తోంది. ఇక మీ సమస్య విషయానికి వస్తే - వయసు పెరిగిన కొద్దీ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ప్రోస్టేట్ గ్రంథి నుంచి వీర్యం తక్కువగా తయారుకావచ్చు. వీర్యం పరిమాణాన్ని బట్టే సెక్స్‌లో తృప్తి ఉంటుందన్నది కేవలం ఒక అపోహ మాత్రమే. మీ భాగస్వామి తృప్తి పడటానికి అవసరమైనది అంగస్తంభన మాత్రమే. కాబట్టి మీరు శీఘ్రస్ఖలనాన్ని నివారించడం కోసం మందులు వాడవచ్చు. వాటికోసం ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను కలవండి.
 
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్,
కె.పి.హెచ్.బి, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement