పస్ సెల్స్ ఉన్నాయి... పిల్లలు పుడతారా?
నా వయుస్సు 36 ఏళ్లు. నాకు వివాహం జరిగి 12 ఏళ్లు అయింది. వూకింకా సంతానం కలగలేదు. డాక్టర్‌ను కలిసి వైద్యపరీక్షలు చేయించుకున్నాను. గత కొద్దికాలంగా నా వీర్యం రిపోర్టుల్లో పస్ సెల్స్ ఎక్కువగా (ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్) ఉన్నట్లు చెబుతున్నారు. పస్‌సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
- మోహన్‌రాజు, మధిర
చాలాకాలంగా సంతానం లేనివారిలో మగవారికి మొదట సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు సెమెన్ క్వాలిటీ తగ్గుతుంది. తత్ఫలితంగా పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. డాక్టర్ సలహా మేరకు సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల వీర్యంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గితే సెమెన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. యూంటీబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ మరోసారి సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసి, ఈసారి వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉంటే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తప్పక మెరుగవుతాయి.
నాకు 38 ఏళ్లు. మూత్రవిసర్జన సమయంలో, సెక్స్ చేస్తున్నప్పుడు విపరీతమైన మంట వస్తోంది. డాక్టర్‌ను కలిసి స్కానింగ్ చేయించుకున్నాను. మూత్రాశయంలో 4 సెం.మీ. రాయి ఉందని, ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తీసేస్తామని చెప్పారు. ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ లోపాలు, అంగస్తంభన సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఏవైనా వస్తాయా? దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
- కె.కె.ఆర్., బెంగళూరు
మూత్రాశయంలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మంటగా అనిపించడం మామూలే. ఈ రాళ్లను ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఈ ప్రక్రియలో అంగస్తంభన కలిగించే నరాలకు చాలా దూరం నుంచి ఆ రాళ్లను తొలగిస్తారు. కాబట్టి ఎండోస్కోపీకీ, అంగస్తంభన సామర్థ్యం తగ్గడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రక్రియ తర్వాత మీకు ఈ కారణంగా ఎలాంటి అంగస్తంభన లోపాలు గాని, సెక్స్ సమస్యలు గాని వచ్చేందుకు అవకాశం లేదు. ఒకవేళ మీరు ఏదైనా ఆందోళనతో ఈ ఇన్ఫెక్షన్‌ను అలాగే వదిలేస్తే, అది కీడ్నీకి కూడా పాకి సమస్య మరింత తీవ్రం అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించి వెంటనే ఎండోస్కోపీ చేయించుకోండి.
డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్