Andralajist
-
కిడ్నీలో రాళ్లు తొలగించినా... నొప్పి తగ్గడం లేదు
నా వయుస్సు 26. నాకు రెండు మూత్రపిండాల్లో రాళ్లు వస్తే ఆర్నెల్ల క్రితం లోపలే పేల్చివేశారు. అయితే ఇప్పటికీ నాకు నడుం నొప్పి, మూత్రంలో మంట ఉన్నాయి. చిన్న చిన్న రాళ్లు మూత్రంలో వస్తూనే ఉన్నాయి. ఒకసారి కిడ్నీలలో రాళ్లు వస్తే అవి మళ్లీ వుళ్లీ వస్తూనే ఉంటాయుని కొందరు చెబుతున్నారు. ఇది నిజమేనా? కిడ్నీలో రాళ్లు రాకుండా ఏవైనా ఆహార నియమాలు పాటించాలా? నాకింకా పెళ్లి కాలేదు. కిడ్నీలో రాళ్ల వల్ల అంగస్తంభన శక్తి తగ్గుతుందా? నేను వివాహం చేసుకోవచ్చా? - ఎమ్ఎమ్ఆర్., కర్నూలు ఇటీవల మూత్రపిండాల్లో రాళ్లను ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ విధానంతో పేల్చివేస్తున్నారు. ఈ పేల్చివేతలో భాగంగా పెద్ద ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా (అంటే మూడు మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజ్విగా) చేసి వదిలేస్తాం. దాంతో అవి పౌడర్‌లాగా మూత్రంలో వెళ్లిపోతాయి. అయితే ఒక్కోసారి ఏదైనా పెద్ద ముక్కను వదిలేసినా, రాయి పూర్తిగా పగలకపోయినా అది వుళ్లీ పెరగవచ్చు. కానీ ఇలా జరగడం అరుదు. పైగా అవి వుళ్లీ కొత్తగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. కాబట్టి ఎప్పుడో ఫామ్ అయ్యే స్టోన్ గురించి ఇప్పట్నుంచే భయుపడుతూ ఉండటం సరికాదు. ఇక మీరు అడిగిన ఆహార నియువూల విషయూనికి వస్తే... పాలకూర, క్యాబేజీ, టొవూటో, వూంసాహారం తక్కువగా తినడం వుంచిది. ఇక రోజూ మూడు లీటర్ల వరకు నీళ్లు తాగండి. మూత్రపిండాల్లో రాళ్లకూ సెక్స్‌కూ ఎలాంటి సంబంధం లేదు. మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినా అంగస్తంభన శక్తి తగ్గడం అంటూ ఉండదు. మీరు నిశ్చింతగా, నిర్భయుంగా పెళ్లి చేసుకోవచ్చు. నా వయుస్సు 22. నాకు వేరికోసిల్ ఉంది. డాక్టర్‌కు చూపిస్తే... అల్ట్రాసౌండ్ హై ఫ్రీక్వెన్సీ (స్క్రోటమ్) పరీక్షల చేసి, ఎడవువైపున గ్రేడ్-3, కుడివైపున గ్రేడ్-1 ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ అవసరవుని రెండువైపులా చేశారు. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకొమ్మన్నారు. ఇప్పటికీ వృషణాల్లో అప్పడప్పుడూ నొప్పి వస్తూనే ఉంది. ఈ శస్త్రచికిత్స తర్వాత అంగస్తంభన శక్తి తగ్గుతుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - జె.కె.బి., చిల్లకల్లు వృషణాల్లోని రక్తనాళాల్లో (వెయిన్స్) వాపును వేరికోసిల్ అంటారు. దానివల్ల వృషణాల్లో నొప్పి రావడమే గాక వీర్యకణాల సంఖ్య, క్వాలిటీ తగ్గుతుంది. నొప్పి విపరీతంగా ఉన్నా, పిల్లలు లేకున్నా ఈ సవుస్యను ఆపరేషన్ ద్వారా సరిచేస్తారు. ఆపరేషన్ తర్వాత నిల్చోవడం, బరువులు ఎత్తడం వంటివి చేస్తే నొప్పి వస్తుంది. అందువల్ల రెండు నెలల పాటు డాక్టర్లు శారీరక శ్రవు ఎక్కువగా ఉండే పనులు వద్దంటారు. ఎక్కువ దూరం నడవడాన్ని కూడా కొంతకాలం అవాయిడ్ చేయుండి. మూడు నెలల తర్వాత అన్ని పనులూ వూమూలుగానే చేసుకోవచ్చు. సర్జరీ తర్వాత కొంతవుందిలో నొప్పి అలాగే ఉంటుంది. అది నిదానంగా తగ్గిపోతుంది. స్క్రోటల్ సపోర్ట్ కోసం బిగుతైన లోదుస్తులు వేసుకొవ్ముని చెబుతాం. ఈ శస్త్రచికిత్స వల్ల అంగస్తంభన శక్తిని కోల్పోవడం జరగదు. ఆందోళన చెందకండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
పస్ సెల్స్ ఉన్నాయి... పిల్లలు పుడతారా?
నా వయుస్సు 36 ఏళ్లు. నాకు వివాహం జరిగి 12 ఏళ్లు అయింది. వూకింకా సంతానం కలగలేదు. డాక్టర్‌ను కలిసి వైద్యపరీక్షలు చేయించుకున్నాను. గత కొద్దికాలంగా నా వీర్యం రిపోర్టుల్లో పస్ సెల్స్ ఎక్కువగా (ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్) ఉన్నట్లు చెబుతున్నారు. పస్‌సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - మోహన్‌రాజు, మధిర చాలాకాలంగా సంతానం లేనివారిలో మగవారికి మొదట సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు సెమెన్ క్వాలిటీ తగ్గుతుంది. తత్ఫలితంగా పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. డాక్టర్ సలహా మేరకు సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల వీర్యంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గితే సెమెన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. యూంటీబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ మరోసారి సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసి, ఈసారి వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉంటే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తప్పక మెరుగవుతాయి. నాకు 38 ఏళ్లు. మూత్రవిసర్జన సమయంలో, సెక్స్ చేస్తున్నప్పుడు విపరీతమైన మంట వస్తోంది. డాక్టర్‌ను కలిసి స్కానింగ్ చేయించుకున్నాను. మూత్రాశయంలో 4 సెం.మీ. రాయి ఉందని, ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తీసేస్తామని చెప్పారు. ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ లోపాలు, అంగస్తంభన సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఏవైనా వస్తాయా? దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - కె.కె.ఆర్., బెంగళూరు మూత్రాశయంలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మంటగా అనిపించడం మామూలే. ఈ రాళ్లను ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఈ ప్రక్రియలో అంగస్తంభన కలిగించే నరాలకు చాలా దూరం నుంచి ఆ రాళ్లను తొలగిస్తారు. కాబట్టి ఎండోస్కోపీకీ, అంగస్తంభన సామర్థ్యం తగ్గడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రక్రియ తర్వాత మీకు ఈ కారణంగా ఎలాంటి అంగస్తంభన లోపాలు గాని, సెక్స్ సమస్యలు గాని వచ్చేందుకు అవకాశం లేదు. ఒకవేళ మీరు ఏదైనా ఆందోళనతో ఈ ఇన్ఫెక్షన్ను అలాగే వదిలేస్తే, అది కీడ్నీకి కూడా పాకి సమస్య మరింత తీవ్రం అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించి వెంటనే ఎండోస్కోపీ చేయించుకోండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ నొప్పి ఎందుకు వస్తోంది?
నా వయసు 26. కుడివైపు నడుము భాగంలో నొప్పిగా ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పి ఈఎస్డబ్ల్యూల్ అనే ప్రక్రియ ద్వారా బ్లాస్టింగ్ చేశారు. వారం తర్వాత పొత్తికడుపులో, కుడివైపు వృషణంలో విపరీతమైన నొప్పి వచ్చింది. మళ్లీ స్కానింగ్ చేయించారు. రాళ్లు పూర్తిగా తొలగిపోలేదని, మళ్లీ చికిత్స చేయాలంటున్నారు. కిడ్నీలో రాళ్లు ఉంటే వృషణంలో నొప్పి ఎందుకు వస్తోంది. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి. - ఎస్.కె.ఆర్., పాలకొండ కిడ్నీలో రాళ్లను తొలగించడానికి ఈఎస్‌డబ్ల్యూఎల్ ప్రక్రియద్వారా బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ రాళ్లు ముక్కలైపోయి యురేటర్లో ఇరుక్కున్నప్పుడు ఇలా నొప్పి వస్తుంది. ఈ యురేటర్కీ, వృషణానికీ ఒకే నరం వెళ్తుంది. అందువల్ల ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు అక్కడ కూడా నొప్పి వచ్చినట్లుగా అనిపిస్తుంది. దీన్ని రిఫర్డ్ పెయిన్ అంటారు. అంతేగాని మీ సమస్య వృషణానికి సంబంధించిన సమస్య కానేకాదు. ఇప్పుడు వైద్యరంగంలోని సాంకేతిక పురోగతితో ఇలా మిగిలిపోయిన రాళ్లను లేజర్ ప్రక్రియతో పూర్తిగా పౌడర్లా చేసి తీసేయవచ్చు. దీన్ని ఆర్ఐఆర్ఎస్ (రెట్రోగ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ) ప్రక్రియ ద్వారా తీసేయవచ్చు. ఈ ప్రక్రియలో గాటు లేకుండా కుట్టు లేకుండా ముక్కలైన మిగతా రాళ్లను 15 నిమిషాల్లో తొలగించవచ్చు. అదేరోజు ఇంటి కి కూడా వెళ్లవచ్చు. ఒకసారి మీరు మీ యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్