Kidney Hospital
-
ఉద్దానం కిడ్నీ బాధితులతో సీఎం వైఎస్ జగన్
-
Live: వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
పలాసలో కిడ్నీ ఆస్పత్రి ప్రారంభానికి 12న సీఎం జగన్
కాశీబుగ్గ: పలాసలో కిడ్నీ ఆస్పత్రి ప్రారంభించేందుకు డిసెంబర్ 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలాస రానున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను బుధవారం ప్రజాసంఘాల ప్రతినిధులతో కలిసి సందర్శించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజాసంఘాలు, వామపక్షాలతో కలిసి కిడ్నీ బాధితుల పక్షాన గళం వినిపించామని, ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.50 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రాలు కార్యరూపం దాల్చాయని చెప్పారు. రూ.700 కోట్లతో మంచినీటి పథకం సైతం నిర్మించినట్టు తెలిపారు. వీటిని ప్రారంభించేందుకు సీఎం జగన్ డిసెంబర్ 12న పలాస వస్తున్నారని చెప్పారు. అన్నిరకాల వైద్యసేవలూ పొందేలా.. పలాసలో ప్రభుత్వం నిర్మించిన కిడ్నీ ఆస్పత్రి కేవలం కిడ్నీ వ్యాధిగ్రస్తులకేననే అపోహ ఉందని మంత్రి అప్పలరాజు అన్నారు. కానీ.. ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, న్యూరాలజీ, పల్మనాలజీ, ఆడియోగ్రఫీ, ఐసీయూ వంటి అత్యవసర వైద్యసేవలు 24 గంటలూ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి అత్యవసర వైద్యం అవసరమున్నా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే సేవలు పొందవచ్చన్నారు. డయాలసిస్ యూనిట్లో 40 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, మూడు నుంచి నాలుగు షిఫ్ట్‌లలో రోజుకు 120 నుంచి 200 మందికి రోజుకు డయాలసిస్ చేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. ఆయన వెంట మహేంద్ర రైతు కూలీ సంఘం, ఉద్దాన రైతు కూలీ సంఘం, జీడి రైతు సంఘం, యూటీఎఫ్, యూవీవీ సేవా సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, పలాస యూత్ అసోసియేషన్, శ్రీవివేకానంద సేవాసమితి, గ్రీన్ ఆర్మీ అసోసియేషన్, సీపీఐ ప్రతినిధులు ఉన్నారు. -
ఉద్దానం కిడ్నీకి రక్షణ కవచం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌కు “డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్’గా నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కిడ్నీ బాధితులకు కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో రూ.50 కోట్లు వెచ్చించి రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మి0చారు. ర్యాంప్ బ్లాక్‌తో కలిపి మూడు బ్లాక్‌లుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్ స్టోర్స్, సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్/ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. అందుబాటులో అన్నిరకాల చికిత్సలు కిడ్నీ వ్యాధులకు సంబంధించి అన్నిరకాల చికిత్సలతో పాటు పరిశోధనలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పరికరాలను సమకూరుస్తోంది. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్సరే (డిజిటల్), ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు పూర్తిగా రిమోట్ కంట్రోల్ ఐసీయూ సౌకర్యాలను కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో అందుబాటులోకి రానున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, వంటి వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టులు 46, స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు 60 చొప్పున మంజూరు చేశారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించనున్నట్టు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యలివీ ♦ గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 చొప్పున ఇచ్చే పెన్షన్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10వేలకు పెంచింది. ప్రతినెలా 1వ తేదీనే లబి్ధదారుల గుమ్మం చెంతకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ను వలంటీర్లు అందజేస్తున్నారు. ♦ టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 69 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. హరిపురంలో డయాలసిస్ సెంటర్‌ను 2020లో ప్రారంభించారు. మరో 25 మెషిన్లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020–21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో (మే నాటికి) 55,708 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశారు. ♦ ఇచ్చాపురం, కంచిలీ సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్‌సీల్లో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ♦ వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను అందుబాటులో ఉంచారు. ♦ టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే అరకొరగా ఇక్కడి ఆస్పత్రుల్లో అందించేవారు. ప్రస్తుతం ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. ♦కొత్త కేసుల గుర్తింపునకు వైద్య శాఖ నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగిస్తోంది. ఇందుకోసం వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లకు ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు. వీరు ఈ ప్రాంతంలోని ప్రజలను స్క్రీనింగ్ చేసి అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సమీపంలోని పీహెచ్‌సీలకు సీరమ్ క్రియాటినిన్ పరీక్షలకు తరలిస్తున్నారు. -
వ్యక్తిగతం : ఆపరేషన్ తప్పదా?
హలో డాక్టర్! నేను వివాహితుణ్ని. నా వయసు 29 ఏళ్లు. సంభోగంలో పాల్గొన్న వెంటనే స్ఖలనం అవుతోంది. శీఘ్రస్ఖలనాన్ని నివారించడానికి డీ-సెన్సిటైజర్ క్రీమ్స్, లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ దొరుకుతాయుని చెబుతారుగదా! వాటిని నేను వాడొచ్చా? సలహా ఇవ్వగలరు. - ఎన్.డి.ఆర్., హైదరాబాద్ శీఘ్రస్ఖలనం చాలా సాధారణ సమస్య. మీ వయసులో ఉన్నవారు చాలామంది ఈ కంప్లయింట్ చేస్తుంటారు. ఈ సమస్యను నివారించేందుకు మీరు రాసినట్టుగానే లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ ఉంటాయి. అరుుతే మీకు ఉన్న సమస్యకు అదే చికిత్స (ప్రైవురీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) కాదు. శృంగారం జరుపుతున్నప్పుడు పురుషాంగం మీద ఉండే నరాలు త్వరగా స్పందించడం అంటే స్టిమ్యులేట్ అవడం వల్ల మీకు స్ఖలనం త్వరగా అయిపోతోంది. అనస్థీషియా క్రీమ్స్గానీ, డీ సెన్సిటైజర్స్గానీ ఏం చేస్తాయంటే పురుషాంగం మీది నరాలను మొద్దుబారేలా చేస్తాయి. కాబట్టి స్ఖలనం ఆలస్యమవుతుంది. కానీ దీనివల్ల లైంగిక సుఖం తగ్గుతుంది. అందుకే ఈ క్రీమ్స్ వాడటం కంటే, స్ఖలనం అవబోతున్న సమయంలో పురుషాంగం చివరను చేతి వేళ్లతో బిగించి పట్టుకుని, మళ్లీ ఆ ఫీలింగ్ తగ్గిన వెంటనే శృంగారాన్ని కొనసాగించే పించ్ టెక్నిక్, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ వంటి వాటిని అనుసరించడం ఉత్తమం. నా వయస్సు 25 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నాకు రెండువైపులా వేరికోసిల్ ఉంది. దీనికి నేను ఆపరేషన్ చేయించుకోవాలా? ఆపరేషన్ తప్ప ఇంకో మార్గం ఏమైనా ఉందా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఎస్.కె.వై., సూర్యాపేట వేరికోసిల్ రావడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. వేరికోసిల్ ఉన్నప్పుడు పెళ్లి కాకుండా ఉండి, నొప్పి లేకుండా ఉంటే వెంటనే ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వివాహం అయిన వ్యక్తుల్లో గనక వేరికోసిల్ ఉండి, పిల్లలు లేకపోతే... ముందుగా వీర్య పరీక్ష చేయించుకోవాల్సిందిగా చెబుతాం. ఈ సమస్య ఉన్నవాళ్లలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటమేగాకుండా, కణాల కదలికలు చురుకుగా ఉండవు. అలాంటప్పుడు డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ అనే పరీక్ష ద్వారా వేరికోసిల్ కండిషన్‌ను నిర్ధారించి, సర్జరీ చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. మీకింకా పెళ్లి కాలేదు కాబట్టి, అప్పుడే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మరీ తీవ్రమైన నొప్పిగానీ, గ్రేడ్-3 వేరికోసిల్ కండిషన్గానీ ఉంటే మాత్రం శస్త్రచికిత్సతో ఉపశమనం లభిస్తుంది. మాకు పెళ్లయి ఎంతో కాలం కాలేదు. పిల్లలు పుట్టకుండా ఏ జాగ్రత్తా తీసుకోకపోవడం వల్ల నా భార్య వెంటనే గర్భం దాల్చింది. లైంగిక జీవితం తృప్తిగా అనుభవించినట్టు లేదు. మేము ఎప్పటి వరకు శృంగారంలో పాల్గొనవచ్చు? ప్రసవానంతరం మళ్లీ ఎప్పుడు మొదలుపెట్టవచ్చు? - డి.బి., వరంగల్ గర్భంతో ఉన్నప్పుడు మొదటి మూడు నెలలూ, చివరి మూడు నెలలూ శృంగారంలో అంతగా పాల్గొనకపోవడమే మంచిది. మధ్యలో మూడు నెలలు మాత్రం మామూలుగానే గడపవచ్చు. అయితే, శృంగారంలో పాల్గొన్నా అంత సమస్యేమీ ఉండదుగానీ, ఇన్ఫెక్షన్స్, నొప్పి, బ్లీడింగ్ అయితే అబార్షన్ అవుతుందేమోననే అనుమానంతో వైద్యులు ఈ సలహా ఇస్తుంటారు. ఇక ప్రసవం అయిన ఒక్క నెల తర్వాత మీరూ, మీ భాగస్వామీ ఇద్దరూ శారీరకంగా, మానసికంగా ఎప్పుడు సుముఖంగా ఉంటే అప్పుడే పాల్గొనవచ్చు. మీ వయసులో ఉన్నవారు చాలామంది ఈ కంప్లయింట్ చేస్తుంటారు. ఈ సమస్యను నివారించేందుకు మీరు రాసినట్టుగానే క్రీమ్స్ ఉంటాయి. అరుుతే అదే చికిత్స (ప్రైవురీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) కాదు. డా. వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
వ్యక్తిగతం: అలా చేయడం మంచిది కాదు!
సమస్య గురించి అదే పనిగా అలోచిస్తుంటే... ఆలోచన ఔషధమైపోదు. ప్రతి సమస్యకూ తప్పకుండా పరిష్కారం ఉంటుందని మరచిపోకండి. నా వయసు 42 ఏళ్లు. కొన్ని నెలల కిందట వరిబీజం వస్తే, నాకు తెలిసిన ఆర్ఎంపీ సిరంజీతో వృషణాల్లో నీరు తీసేశాడు. ఇప్పుడు మళ్లీ అక్కడ వాపుగా ఉంది. తగు సలహా ఇవ్వగలరు. - ఎం.ఎస్., శ్రీకాకుళం జిల్లా వృషణాల చుట్టూ నీరు చేరితే దాన్ని హైడ్రోసిల్ అంటారు. ఈ సవుస్య వచ్చినప్పుడు వైద్యుడు శస్త్రచికిత్స చేసి అక్కడి నీటిని తొలగిస్తాడు. అలాగే, నీరు మాటిమాటికీ వచ్చే సంబంధిత పొరను తీసి దాన్ని వెనక్కి మడతపెట్టడం కూడా చేస్తాడు. మీరు చేయించుకున్నట్టుగా సిరంజీతో నీటిని తీసేస్తే తాత్కాలికంగానే ఫలితం ఉంటుంది. అప్పటికి వృషణాల పరిమాణం తగ్గినట్టు అనిపించినా, మళ్లీ నీరు చేరుతుంది. సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి సిరంజీ విధానం ఎంతమాత్రమూ సురక్షితం కాదు. వరిబీజానికి చేసే ఆపరేషన్ చాలా చిన్నది. భయపడకుండా వెంటనే చేయించుకోండి. నాకు అరవై ఏళ్ల వయసు. రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలేమీ లేవు. ఇప్పటికీ మా లైంగిక జీవితం సంతృప్తికరంగా ఉంది. కాకపోతే ఇటీవల రాత్రి పూట మూత్రం ఎక్కువగా వస్తోంది. డాక్టర్ని కలిస్తే ప్రోస్టేట్ గ్రంథి పెరిగిందన్నారు. శృంగారానికీ దీనికీ ఏమైనా సంబంధం ఉందా? దీనికి వయసు పరమైన హద్దులు ఏమైనా ఉంటాయా? - కె.ఎస్.కె., హైదరాబాద్ శృంగారానికి ఎలాంటి వయోపరిమితీ లేదు. మీరు ఇప్పటికీ సంభోగించగలగడం మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తోంది. ప్రోస్టేట్ గ్రంధి పెరగడానికి, శృంగారానికీ ఎటువంటి సంబంధమూ లేదు. జన్యుపరంగా కొందరిలో ఈ గ్రంథి వయసు పైబడిన వారిలో పెరిగి, మూత్ర సమస్యలు వస్తూంటాయి. దానికి ఎక్కువమందికి మందులతోనే నయం చేయవచ్చు. మూత్రం అసలు రానివాళ్లకు ఆపరేషన్ లేకుండానే ప్రోస్టేట్ గ్రంధిని లేజర్‌తో తొలగించినా, శృంగారపరమైన ఇబ్బందులేమీ ఉండవు. కాకపోతే వీర్యం తక్కువగా వస్తుంది. ఇది మినహా సమస్యేమీ ఉండదు. కాబట్టి, మీ అపోహలన్నీ వదిలేసుకుని మీ లైంగిక జీవితాన్ని ఆనందించండి. ప్రోస్టేట్ విషయంలో మాత్రం యూరాలజిస్టు దగ్గర చికిత్స తీసుకోండి. నాకు వివాహమై పదేళ్లు దాటింది. శృంగారం తర్వాత ఒకటే నీరసంగా ఉంటోంది. సంభోగానికీ సంభోగానికీ మధ్య గ్యాప్ కూడా బాగా పెరుగుతోంది. ఇంతకుముందు రోజుకు ఒక్కసారి పాల్గొనేది, ఇప్పుడు వారానికి రెండుసార్లు కూడా పాల్గొనడం లేదు. నాకు మధుమేహం ఉందని ఇటీవలే తెలిసింది. దానివల్లే ఇలా జరుగుతోందా? - బి.బి.కె., హైదరాబాద్ శృంగారపరమైన కోరికలు సాధారణంగా 20- 30 ఏళ్ల మధ్య ఎక్కువగా ఉంటాయి. పెళ్లయి పదేళ్లు అవుతోంది కాబట్టి, మునుపటి ఉత్సాహం ఉండకపోవడం సహజమే. మధుమేహం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లలో, ముఖ్యంగా ఒకేచోట అదేపనిగా కూర్చుని పనిచేసేవాళ్లలో లైంగిక సామర్థ్యం కొంచెం తగ్గుతుంది. అలాగే వయసుతో పాటు వచ్చే బాధ్యతలు, మానసిక ఇబ్బందులు కూడా లైంగిక జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. దీనికి కొన్నిసార్లు కౌన్సిలింగ్గానీ, మరికొన్నిసార్లు మందులుగానీ అవసరం అవుతాయి. మధుమేహాన్ని నియంత్రించుకోండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోవడం ద్వారా మీరు మునుపటి శృంగార జీవితాన్ని పొందగలరు. మీ సందేహాలను పంపవలసిన చిరునామా: వ్యక్తిగతం, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. vyaktigatam.sakshi@gmail.com డా. వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
ఈ ఒంపును చక్కదిద్దవచ్చా..?
నా వయుస్సు 26 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నాకు అంగస్తంభన కలిగినప్పుడు నా పురుషాంగం కిందికి వంగుతోంది. అంటే అంగస్తంభన జరిగినప్పుడు అది ఆర్చిలా ఉంది. దీన్ని కార్డీ అంటారని చదివాను. దీనికి సర్జరీ ఒక్కటే వూర్గవుని తెలిసింది. కానీ నాకు సర్జరీ అంటే భయం. నాకు తగిన సలహా ఇవ్వండి. - కె.వి.వై., గుంటూరు అంగస్తంభన కలిగినప్పుడు అంగం సాధారణంగా నిటారుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుడి, ఎడవు పక్కలకు కొద్దిగా ఒంగి ఉన్నా పర్లేదు. అయితే ఆ ఒంపు ూత్రవిసర్జనకూ, సెక్స్ చేయుడానికి అడ్డంకిగా ఉండకూడదు. ఒకవేళ అలా అంతరాయం కలిగించేంతగా ఒంగి ఉంటే ఆ కండిషన్‌ను కార్డీ అంటారు. ‘సర్జరీ కార్డీ కరెక్షన్’ అనే శస్త్రచికిత్స ద్వారా పురుషాంగంలో ఉన్న ఒంపును బట్టి ఓవైపు పొడవు పెంచడమో, వురోవైపు తగ్గించడమో చేసి అంగాన్ని వుళ్లీ నిటారుగా ఉండేలా సరిచేస్తాం. అయితే ఈ సర్జరీకి ందు యూరాలజిస్టులు ఆర్టిఫిషియుల్గా ఎరెక్షన్ తెప్పించి కార్డీ తీవ్రత (సివియూరిటీ) ఎంత ఉందో నిర్ధారణ చేస్తారు. దాన్నిబట్టే సర్జరీ చేయూల్సిన అవసరం ఉందా లేదా అన్నది నిర్ణయిస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను కలవండి. నా వయుస్సు 21. గత ఆరేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను. వారానికి కనీసం ూడు సార్లు హస్తప్రయోగం చేసుకుంటున్నాను. ఏడాది కిందట నాకు వృషణాల నొప్పి వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. వుందులు వాడితే నొప్పి తగ్గిపోయింది. ప్రస్తుతం హస్తప్రయోగం చేస్తున్న సవుయుంలోనూ, ఆ ప్రక్రియ పూర్తయ్యాక పురుషాంగంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. వీర్యం పోకపోతే నొప్పిరాదు. దయుచేసి నా సవుస్యకు పరిష్కారం చెప్పగలరు. - డి.కె.ఎస్.ఆర్., అనంతపురం మీ వయుస్సులో ఉన్నవాళ్లు తరచూ హస్తప్రయోగం చేసుకోవడం చాలా సాధారణమైన అంశం. ఇలాంటి సమయాల్లో వీర్యస్ఖలనం తర్వాత మూత్రనాళంలో, వృషణాల్లో కొద్దిపాటి అసౌకర్యం (డిస్కంఫర్ట్) కొద్ది నిమిషాలపాటు అనిపించవచ్చు. అయితే మీరు చెబుతున్నట్లుగా ప్రతిసారీ నొప్పి వస్తుంటే ఒకసారి యురాలజిస్ట్ను సంప్రదించడం వుంచిది. మూత్రంలో, వీర్యంలో ఇన్ఫెక్షన్ వచ్చినా, వీర్యం వచ్చే నాళాలు బ్లాక్ అరుునా ఇలా నొప్పి రావచ్చు. కానీ అది చాలా అరుదు. మీరు చెబుతున్నట్లుగా హస్తప్రయోగం వల్ల ఈ నొప్పి రాదు. అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఇది ఆందోళన చెందాల్సినంత పెద్ద సమస్యగా అనిపించడం లేదు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను కలవండి. నా వయుస్సు 20 ఏళ్లు. గత ఏడేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను. గతంలో వీర్యస్ఖలనం అయ్యేందుకు చాలా సవుయుం పట్టేది. కానీ ఇటీవల కొద్దిసేపటికే వీర్యం పడిపోతోంది. ఇలా వెంటనే పడిపోవడంతో నాకు అసంతృప్తిగా ఉంది. అదీగాక నా అంగం చిన్నగా ఉంది. సైజ్ పెరగడానికి వూర్గం చెప్పండి. ఇక నా వృషణాలు సంచిలో కిందికీ పైకీ జారుతూ, కదులుతూ ఉన్నాయి. హస్తప్రయోగం చేయుడం వల్ల హైట్ పెరగకుండా పోతుందా? - జె.ఎస్.వి., శ్రీకాకుళం జ: మీరు ఏడేళ్లుగా హస్తప్రయోగం చేస్తుండటంతో ఈ ప్రక్రియు కాస్తా మెకానికల్‌గా అయిపోయి మీకు మొదట్లో ఉన్న థ్రిల్ తగ్గింది. దాంతో ఇప్పుడు త్వరగా వీర్యస్ఖలనం అయిపోతోంది. మీరు పెళ్లి చేసుకుని భార్యతో సెక్స్‌లో పాల్గొంటే వుళ్లీ వూవుూలుగానే మొదట్లోని థ్రిల్‌ను, ఎక్సయిట్మెంట్ను, వుంచి తృప్తిని పొందగలుగుతారు. ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువసార్లు హస్తప్రయోగం చేసినందువల్ల అంగం సైజ్ తగ్గడం అంటూ ఉండదు. సెక్స్‌లో మీరు తృప్తి చెందేందుకు లేదా భార్యను తృప్తిపరచేందుకు అంగస్తంభనలు చక్కగా ఉంటే చాలు. మీ పురుషాంగం సైజ్‌కూ, మీ పార్ట్నర్ను సంతోషపెట్టడానికి ఎలాంటి సంబంధమూ లేదు. మీకున్న అపోహే చాలావుందిలో ఉంటుంది. కానీ అది తప్పు. ఇక వృషణాలు పైకీ, కిందికీ కదలడం అన్న విషయానికి వస్తే... అది చాలా సాధారణమైన ప్రక్రియు. ఇలా కావడాన్ని క్రిమేస్టరిక్ రిఫ్లక్స్ అంటారు. వృషణాల సంరక్షణ కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు ఇది. ఇలా కదులుతూ ఉండటం ఆరోగ్య లక్షణం. హస్తప్రయోగం వల్ల ఎలాంటి హానీ ఉండదు. మీరు నిశ్చింతగా ఉండండి. నా వయుస్సు 28 ఏళ్లు. పెళ్లయి మూడేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని పరీక్షలు చేయించుకున్నాం. ఆమెకు ఎలాంటి సవుస్య లేదన్నారు. అయితే నాకు వూత్రం వీర్యకణాల సంఖ్య తక్కువని చెప్పారు. మొదటిసారి చేసిన పరీక్షలో స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందన్నారు. డాక్టర్ ఇచ్చిన వుందులు వాడాను. రెండు నెలల తర్వాత వుళ్లీ పరీక్షలు చేయిస్తే పది మిలియున్కు పెరిగింది. తర్వాత కూడా వుందులు వాడాను. అయితే వుళ్లీ రెండు నెలలకు పరీక్ష చేయిస్తే కౌంట్ మళ్లీ ఐదు మిలియన్లకు పడిపోయింది. ఇలా తగ్గడానికి కారణం ఏమిటి? నా విషయం తగిన సలహా ఇవ్వండి. - కె.జె.కె., కరీంనగర్ మీరు ఆలిగోస్పెర్మియూ అనే సవుస్య వల్ల పిల్లలు కలగక బాధపడుతున్నారు. సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 60 మిలియున్ నుంచి 120 మిలియున్ల వరకు వీర్యకణాలు ఉండాలి. అయితే వీటి సంఖ్య 20 మిలియున్ల కంటే తగ్గితే పిల్లలు కలిగే అవకాశాలు తక్కువ. వీర్యకణాలు తగ్గడానికి సాధారణంగా వేరికోసిల్గాని, ఏవైనా ఇన్ఫెక్షన్లుగానీ లేదా హార్మోన్లలోపం వంటి అంశాలుగాని కారణవువుతాయి. మీకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, హార్మోన్ పరీక్షలు, వురికొన్ని రక్తపరీక్షలు చేసి... ఏ సవుస్య వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిందో నిర్ధారణ చేయూలి. సవుస్య వేరికోసిల్ అయితే సర్జరీ ద్వారా దాన్ని పరిష్కరించవచ్చు. ఇక హార్మోన్ల లోపం అయితే ఇంజెక్షన్ల ద్వారా చికిత్స చేసి వీర్యకణాల సంఖ్యను పెంచగలిగితే... అందరిలాగే మీకూ పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గమా?
నా వయస్సు 28. ఇంకా పెళ్లి కాలేదు. నాకు రెండువైపులా వేరికోసిల్ ఉంది. వేరికోసిల్‌కు ఆపరేషన్ ఒక్కటే మార్గం అని నేను చాలాసార్లు చదివాను. ఆపరేషన్ తప్ప మరోమార్గం లేదా? దయచేసి సలహా ఇవ్వండి. -పి.వి.ఆర్, హైదరాబాద్ వేరికోసిల్ రావడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏదీ లేదు. వేరికోసిల్ ఉన్నప్పుడు పెళ్లి కాకుండా ఉండి, నొప్పి లేకుండా ఉంటే వెంటనే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వివాహం అయిన వ్యక్తుల్లో వేరికోసిల్ కండిషన్ ఉండి పిల్లలు లేకపోతే... ముందుగా సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. వేరికోసిల్ ఉన్నవాళ్లలో సెమెన్ కౌంట్ తక్కువగా ఉండి, వీర్యకణాల కదలికలు తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ అనే పరీక్ష ద్వారా వేరికోసిల్ కండిషన్‌ను నిర్ధారణ చేసి, సర్జరీ చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. మీకింకా వివాహం కాలేదని రాశారు. కాబట్టి మీలాంటి వారి విషయంలో ముందుగానే సర్జరీ చేయించుకొమ్మనే సలహా ఇవ్వము. మరీ తీవ్రమైన నొప్పిగాని, గ్రేడ్-3 వేరికోసిల్ కండిషన్ ఉంటే సర్జరీతో మంచి ఉపశమనం దొరుకుతుంది. మీకు ఇంకా పెళ్లికానట్లయితే... వేరికోసిల్ వల్ల మీకు నొప్పి లేకపోతే... ఇప్పుడప్పుడే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నా వయుసు 32 ఏళ్లు. నా వృషణాల్లో నొప్పి వస్తోంది. లాగుతున్న ఫీలింగ్ కూడా ఉంది. వృషణాల సైజ్ చిన్నవిగా వూరాయుని అనిపిస్తోంది. దయుచేసి నా సవుస్యకు సలహా ఇవ్వండి. - బి. కిరణ్ కుమార్, కరీంనగర్ తవు వృషణాలు చిన్నవేమో అనే అపోహ చాలావుందిలో ఉంటుంది. మీకు ఇతరత్రా ఏ ఇబ్బందులూ లేకపోతే దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. అయితే తవు వృషణాలు వుుందు పెద్దవిగా ఉండి, ఇప్పుడు అవి చిన్నవిగా అయిపోయి ఉండి, నొప్పి కూడా ఉంటే మాత్రం దానికి కారణం వేరికోసిల్ అయివుండవచ్చునని అనువూనించాలి. కాబట్టి మీరు ఒకసారి యుూరాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు డాప్లర్ అల్ట్రాసౌండ్ అనే పరీక్ష చేయించి ఏదైనా సమస్య ఉందా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. మీ సమస్యను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
పస్ సెల్స్ ఉన్నాయి... పిల్లలు పుడతారా?
నా వయుస్సు 36 ఏళ్లు. నాకు వివాహం జరిగి 12 ఏళ్లు అయింది. వూకింకా సంతానం కలగలేదు. డాక్టర్‌ను కలిసి వైద్యపరీక్షలు చేయించుకున్నాను. గత కొద్దికాలంగా నా వీర్యం రిపోర్టుల్లో పస్ సెల్స్ ఎక్కువగా (ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్) ఉన్నట్లు చెబుతున్నారు. పస్‌సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - మోహన్‌రాజు, మధిర చాలాకాలంగా సంతానం లేనివారిలో మగవారికి మొదట సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు సెమెన్ క్వాలిటీ తగ్గుతుంది. తత్ఫలితంగా పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. డాక్టర్ సలహా మేరకు సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల వీర్యంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గితే సెమెన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. యూంటీబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ మరోసారి సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసి, ఈసారి వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉంటే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తప్పక మెరుగవుతాయి. నాకు 38 ఏళ్లు. మూత్రవిసర్జన సమయంలో, సెక్స్ చేస్తున్నప్పుడు విపరీతమైన మంట వస్తోంది. డాక్టర్‌ను కలిసి స్కానింగ్ చేయించుకున్నాను. మూత్రాశయంలో 4 సెం.మీ. రాయి ఉందని, ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తీసేస్తామని చెప్పారు. ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ లోపాలు, అంగస్తంభన సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఏవైనా వస్తాయా? దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - కె.కె.ఆర్., బెంగళూరు మూత్రాశయంలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మంటగా అనిపించడం మామూలే. ఈ రాళ్లను ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఈ ప్రక్రియలో అంగస్తంభన కలిగించే నరాలకు చాలా దూరం నుంచి ఆ రాళ్లను తొలగిస్తారు. కాబట్టి ఎండోస్కోపీకీ, అంగస్తంభన సామర్థ్యం తగ్గడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రక్రియ తర్వాత మీకు ఈ కారణంగా ఎలాంటి అంగస్తంభన లోపాలు గాని, సెక్స్ సమస్యలు గాని వచ్చేందుకు అవకాశం లేదు. ఒకవేళ మీరు ఏదైనా ఆందోళనతో ఈ ఇన్ఫెక్షన్ను అలాగే వదిలేస్తే, అది కీడ్నీకి కూడా పాకి సమస్య మరింత తీవ్రం అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించి వెంటనే ఎండోస్కోపీ చేయించుకోండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్