ఈ ఒంపును చక్కదిద్దవచ్చా..? | Gentlemen Counseling | Sakshi
Sakshi News home page

ఈ ఒంపును చక్కదిద్దవచ్చా..?

Published Thu, Jan 2 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

ఈ ఒంపును చక్కదిద్దవచ్చా..?

ఈ ఒంపును చక్కదిద్దవచ్చా..?

నా వయుస్సు 26 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నాకు అంగస్తంభన కలిగినప్పుడు నా పురుషాంగం కిందికి వంగుతోంది. అంటే అంగస్తంభన జరిగినప్పుడు అది ఆర్చిలా ఉంది. దీన్ని కార్డీ అంటారని చదివాను. దీనికి సర్జరీ ఒక్కటే వూర్గవుని తెలిసింది. కానీ నాకు సర్జరీ అంటే భయం. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - కె.వి.వై., గుంటూరు

 
అంగస్తంభన కలిగినప్పుడు అంగం సాధారణంగా నిటారుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుడి, ఎడవు పక్కలకు కొద్దిగా ఒంగి ఉన్నా పర్లేదు. అయితే ఆ ఒంపు ూత్రవిసర్జనకూ, సెక్స్ చేయుడానికి అడ్డంకిగా ఉండకూడదు. ఒకవేళ అలా అంతరాయం కలిగించేంతగా ఒంగి ఉంటే ఆ కండిషన్‌ను కార్డీ అంటారు. ‘సర్జరీ కార్డీ కరెక్షన్’ అనే శస్త్రచికిత్స ద్వారా పురుషాంగంలో ఉన్న ఒంపును బట్టి ఓవైపు పొడవు పెంచడమో, వురోవైపు తగ్గించడమో చేసి అంగాన్ని వుళ్లీ నిటారుగా ఉండేలా సరిచేస్తాం. అయితే ఈ సర్జరీకి ందు యూరాలజిస్టులు ఆర్టిఫిషియుల్‌గా ఎరెక్షన్ తెప్పించి కార్డీ తీవ్రత (సివియూరిటీ) ఎంత ఉందో నిర్ధారణ చేస్తారు. దాన్నిబట్టే సర్జరీ చేయూల్సిన అవసరం ఉందా లేదా అన్నది నిర్ణయిస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను కలవండి.
 
 నా వయుస్సు 21. గత ఆరేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను. వారానికి కనీసం ూడు సార్లు హస్తప్రయోగం చేసుకుంటున్నాను. ఏడాది కిందట నాకు వృషణాల నొప్పి వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. వుందులు వాడితే నొప్పి తగ్గిపోయింది. ప్రస్తుతం హస్తప్రయోగం చేస్తున్న సవుయుంలోనూ, ఆ ప్రక్రియ పూర్తయ్యాక పురుషాంగంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. వీర్యం పోకపోతే నొప్పిరాదు. దయుచేసి నా సవుస్యకు పరిష్కారం చెప్పగలరు.
 - డి.కె.ఎస్.ఆర్., అనంతపురం


 మీ వయుస్సులో ఉన్నవాళ్లు తరచూ హస్తప్రయోగం చేసుకోవడం చాలా సాధారణమైన అంశం. ఇలాంటి సమయాల్లో వీర్యస్ఖలనం తర్వాత మూత్రనాళంలో, వృషణాల్లో కొద్దిపాటి అసౌకర్యం (డిస్‌కంఫర్ట్) కొద్ది నిమిషాలపాటు అనిపించవచ్చు. అయితే మీరు చెబుతున్నట్లుగా ప్రతిసారీ నొప్పి వస్తుంటే ఒకసారి యురాలజిస్ట్‌ను సంప్రదించడం వుంచిది. మూత్రంలో, వీర్యంలో ఇన్ఫెక్షన్ వచ్చినా, వీర్యం వచ్చే నాళాలు బ్లాక్ అరుునా ఇలా నొప్పి రావచ్చు. కానీ అది చాలా అరుదు. మీరు చెబుతున్నట్లుగా హస్తప్రయోగం వల్ల ఈ నొప్పి రాదు. అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఇది ఆందోళన చెందాల్సినంత పెద్ద సమస్యగా అనిపించడం లేదు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను కలవండి.
 
 నా వయుస్సు 20 ఏళ్లు. గత ఏడేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను.  గతంలో వీర్యస్ఖలనం అయ్యేందుకు చాలా సవుయుం పట్టేది. కానీ ఇటీవల కొద్దిసేపటికే వీర్యం పడిపోతోంది. ఇలా వెంటనే పడిపోవడంతో నాకు అసంతృప్తిగా ఉంది. అదీగాక నా అంగం చిన్నగా ఉంది. సైజ్ పెరగడానికి వూర్గం చెప్పండి. ఇక నా వృషణాలు సంచిలో కిందికీ  పైకీ జారుతూ, కదులుతూ ఉన్నాయి. హస్తప్రయోగం చేయుడం వల్ల హైట్ పెరగకుండా పోతుందా?
 - జె.ఎస్.వి., శ్రీకాకుళం


 జ: మీరు ఏడేళ్లుగా హస్తప్రయోగం చేస్తుండటంతో ఈ ప్రక్రియు కాస్తా మెకానికల్‌గా అయిపోయి మీకు మొదట్లో ఉన్న థ్రిల్ తగ్గింది. దాంతో ఇప్పుడు త్వరగా వీర్యస్ఖలనం అయిపోతోంది. మీరు పెళ్లి చేసుకుని భార్యతో సెక్స్‌లో పాల్గొంటే వుళ్లీ వూవుూలుగానే  మొదట్లోని థ్రిల్‌ను, ఎక్సయిట్‌మెంట్‌ను, వుంచి తృప్తిని పొందగలుగుతారు. ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువసార్లు హస్తప్రయోగం చేసినందువల్ల అంగం సైజ్ తగ్గడం అంటూ ఉండదు. సెక్స్‌లో మీరు  తృప్తి చెందేందుకు లేదా భార్యను తృప్తిపరచేందుకు అంగస్తంభనలు చక్కగా ఉంటే చాలు. మీ పురుషాంగం సైజ్‌కూ, మీ పార్ట్‌నర్‌ను సంతోషపెట్టడానికి ఎలాంటి  సంబంధమూ లేదు. మీకున్న అపోహే చాలావుందిలో ఉంటుంది. కానీ అది తప్పు. ఇక వృషణాలు పైకీ, కిందికీ కదలడం అన్న విషయానికి వస్తే... అది చాలా  సాధారణమైన ప్రక్రియు. ఇలా కావడాన్ని క్రిమేస్టరిక్ రిఫ్లక్స్ అంటారు. వృషణాల సంరక్షణ కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు ఇది. ఇలా కదులుతూ ఉండటం ఆరోగ్య లక్షణం. హస్తప్రయోగం వల్ల ఎలాంటి హానీ ఉండదు. మీరు నిశ్చింతగా ఉండండి.
 
నా వయుస్సు 28 ఏళ్లు. పెళ్లయి మూడేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని పరీక్షలు  చేయించుకున్నాం. ఆమెకు ఎలాంటి సవుస్య లేదన్నారు. అయితే నాకు వూత్రం వీర్యకణాల సంఖ్య తక్కువని చెప్పారు. మొదటిసారి చేసిన పరీక్షలో స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందన్నారు. డాక్టర్ ఇచ్చిన వుందులు వాడాను. రెండు నెలల తర్వాత వుళ్లీ పరీక్షలు చేయిస్తే పది మిలియున్‌కు పెరిగింది. తర్వాత కూడా వుందులు వాడాను. అయితే వుళ్లీ రెండు నెలలకు పరీక్ష చేయిస్తే కౌంట్ మళ్లీ ఐదు మిలియన్లకు పడిపోయింది. ఇలా తగ్గడానికి కారణం ఏమిటి? నా విషయం తగిన సలహా ఇవ్వండి.
 - కె.జె.కె., కరీంనగర్


 మీరు ఆలిగోస్పెర్మియూ అనే సవుస్య వల్ల పిల్లలు కలగక బాధపడుతున్నారు. సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 60 మిలియున్ నుంచి 120 మిలియున్ల వరకు వీర్యకణాలు ఉండాలి. అయితే వీటి సంఖ్య 20 మిలియున్ల కంటే తగ్గితే పిల్లలు కలిగే అవకాశాలు తక్కువ. వీర్యకణాలు తగ్గడానికి సాధారణంగా వేరికోసిల్‌గాని, ఏవైనా ఇన్ఫెక్షన్లుగానీ లేదా హార్మోన్లలోపం వంటి అంశాలుగాని కారణవువుతాయి. మీకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, హార్మోన్ పరీక్షలు, వురికొన్ని రక్తపరీక్షలు చేసి... ఏ సవుస్య వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిందో నిర్ధారణ చేయూలి. సవుస్య వేరికోసిల్ అయితే సర్జరీ ద్వారా దాన్ని పరిష్కరించవచ్చు. ఇక హార్మోన్ల లోపం అయితే ఇంజెక్షన్ల ద్వారా చికిత్స చేసి వీర్యకణాల సంఖ్యను పెంచగలిగితే... అందరిలాగే మీకూ పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది.
 
 డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement