సిజేరియన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? | Precautions after cesarean operation | Sakshi
Sakshi News home page

సిజేరియన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Published Fri, Sep 6 2013 12:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

సిజేరియన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

సిజేరియన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

 నా భార్యకు సిజేరియున్ ద్వారా కాన్పు జరిగి మూడు నెలలవుతోంది. నేను నా భార్యతో ఎప్పట్నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు?  సిజేరియున్ తర్వాత వురో రెండేళ్ల వరకు గర్భం రాకుండా చూసుకోవాలంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
 - ఎమ్.ఆర్.ఆర్., కొత్తగూడెం

 
సాధారణ ప్రసవమైనా లేదా సిజేరియున్ అయినా- ప్రసవం తర్వాత మొదటి ఆరువారాలు సాధ్యమైనంత వరకు సెక్స్‌లో పాల్గొనకపోవడం వుంచిది. ప్రసవమైన వుహిళకు రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్ లేకుండా ఉండి, ఆమె కూడా సెక్స్ కోసం శారీరకంగా, వూనసికంగా సంసిద్ధంగా ఉంటే ఆరు వారాల తర్వాత నుంచి దంపతులిద్దరూ నిరభ్యంతరంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు.

బిడ్డకు పాలిస్తున్న తల్లులలో మొదటి మూడు నెలలు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ వుళ్లీ గర్భం వచ్చే అవకాశం  తక్కువ. అయినప్పటికీ రిస్క్ తీసుకోకుండా రెండు సంవత్సరాల వరకు కచ్చితంగా వుళ్లీ గర్భం రాకుండా ఏదో ఒక గర్భనిరోధక సాధనాన్ని వాడాలి. (అంటే... పురుషులు కండోమ్‌గానీ, వుహిళలు కాపర్‌టీ, కాంట్రసెప్టివ్ పిల్స్ వంటివి).

డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు సెక్స్ చేసినా వుళ్లీ గర్భం వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి. ఇది తల్లికి... మరీ ముఖ్యంగా సిజేరియున్ అయిన మహిళలకు... అస్సలు వుంచిది కాదు. కాబట్టి వచ్చే రెండేళ్ల పాటు మీకు సౌకర్యంగా ఉండే గర్భనిరోధక  సాధనాలను ఎంచుకుని వాటిని వాడటం అన్నివిధాలా మంచిది.
 
 డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement