కర్నూలు(హాస్పిటల్): కిడ్నీలో రాళ్లను ఆపరేషన్ లేకుండా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక యంత్రాన్ని సమకూర్చింది. గత సంవత్సరం రూ.1.5కోట్ల ఖర్చుతో ఈఎస్‌డబ్ల్యుఎల్ మిషన్‌ను ఆసుపత్రిలోని యురాలజి విభాగానికి అందజేసింది. ఇప్పటి వరకు 200 మంది రోగులకు కిడ్నీలో రాళ్లను ఆపరేషన్, ఎలాంటి అనెస్తీషియా లేకుండానే వైద్యులు తొలగించారు.
దీంతో పాటు రోగిని అదేరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే వెసలుబాటు సైతం ఈ మిషన్ వల్ల కలుగుతోంది. ఈ మిషన్ ద్వారా నిర్వహించిన కేసుల వివరాలను ఇటీవల దుబాయిలో నిర్వహించిన అంతర్జాతీయ యురాలజి కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సేపూరి బాలరవితేజ వివరించారు. ఇందుకు ఆయన ప్రశంసలను సైతం అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment