కూటమి ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. పప్పులు, బెల్లాలు పంచుతూ.. కీలక ప్రయోజనాల విషయంలో మౌనం వహిస్తోంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పిల్లల వివాహాలు, ఇంటి నిర్మాణం.. భవిష్యత్‌ అవసరాలకు దిక్కులు చూడాల్సి వస్తోంది. రెండేళ్లు గడుస్తున్నా వీరి విషయం | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. పప్పులు, బెల్లాలు పంచుతూ.. కీలక ప్రయోజనాల విషయంలో మౌనం వహిస్తోంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పిల్లల వివాహాలు, ఇంటి నిర్మాణం.. భవిష్యత్‌ అవసరాలకు దిక్కులు చూడాల్సి వస్తోంది. రెండేళ్లు గడుస్తున్నా వీరి విషయం

Published Sat, Apr 12 2025 2:19 AM | Last Updated on Sat, Apr 12 2025 2:19 AM

కూటమి

కూటమి ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. పప్పులు

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాంటి డీఏలు పెండింగ్‌లో పెట్టకుండా విడుదల చేసింది. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు కూడా చెల్లించింది.

అరచేతిలో వైకుంఠం చూపుతున్న ప్రభుత్వం

2024 జనవరి నుంచి వెయ్యి మందికి

పైగా పదవీ విరమణ

ఇప్పటి వరకు ఒక్కరికీ అందని

ఆర్థిక ప్రయోజనాలు

ప్రతి ఉద్యోగికి రూ.40 లక్షలకు పైగా

బకాయి

రెగ్యులర్‌ ఉద్యోగులకు అందని

మూడు సరండర్‌ లీవ్‌లు

11వ పీఆర్‌సీ లేదు.. ఐఆర్‌ ఊసే లేదు

ప్రభుత్వం ఏర్పాటయ్యాక

మూడు డీఏలు పెండింగ్‌

త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను చెల్లించడంలో కూటమి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్‌ అందక ఇబ్బంది పడుతున్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల్లో ఒక్కటీ చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసం. ఉద్యోగులకు వెంటనే మధ్యంతర భృతి ఇవ్వాలి. పెండింగ్‌ ఆర్థిక ప్రయోజనాలను రాబట్టుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. – హృదయరాజు, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీటీఎఫ్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తమకు ఏదో జరిగిపోతుందని భావించినా.. పది నెలల్లోనే అనుకున్న స్థాయిలో ప్రయోజనాలు లేకపోవడంతో గుర్రుమంటున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీ వేతనాలు, పెన్షన్‌ ఇవ్వడం మినహా ఆర్థిక ప్రయోజనాలకు మోక్షం లభించని పరిస్థితి. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.30 వేల కోట్లు ఉండగా.. రెండు నెలల క్రితం రాష్ట్రం మొత్తానికి రూ.1,300 కోట్లు, ఇటీవల రూ.6,200 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రూ.6,200 కోట్లలో రూ.2,300 కోట్లు సీపీఎస్‌ ఉద్యోగుల మ్యాచింగ్‌ గ్రాంటుకే సరిపోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లా విషయానికొస్తే రూ.2వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో రూ.300 కోట్లను మాత్రమే ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఏమైన చేసిందా అంటే ఆరేడు నెలలు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి అధికమవుతుండటంతో సంక్రాంతి సమయంలో రూ.1,300 కోట్లు విడుదల చేసింది. అరకొరగా నిధులు విడుదల చేయడం, బకాయిలు పేరుకపోతుండటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ రూ.6,200 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఏపీజీఎల్‌ఐ బకాయిలకు రూ.1,000 కోట్లు, జీపీఎస్‌ బకాయిలకు రూ.2,500 కోట్లు, సీపీఎస్‌ ఉద్యోగుల మ్యాచింగ్‌ గ్రాంటు కోసం రూ.2,300 కోట్లు సర్దుబాటు చేశారు.

కొండలా విశ్రాంత ఉద్యోగుల బకాయిలు

● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 జనవరి నుంచి దాదాపు 1000 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు.

● 2024 జనవరి నుంచి జూన్‌ వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్‌ ప్రపోజల్స్‌ సిద్ధం కావడంలో ఆలస్యం, ఆలోపే ఎన్నికల కోడ్‌ రావడంతో ఆర్థిక ప్రయోజనాలు చెల్లించలేదు.

● చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయినప్పటికీ ఆర్థిక ప్రయోజనాల విషయంలో నోరెత్తని పరిస్థితి.

● పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్‌ ఇస్తున్నారు తప్ప మిగిలిన ప్రయోజనాలైన గ్రాట్యూటీ, కమిటేషన్‌, ఎన్‌క్యాష్‌మెంటు ఎర్న్‌డ్‌ లీవ్‌లు(10 నెలల వేతనం) పెండింగ్‌లోనే ఉండిపోయాయి.

● ప్రతి ఉద్యోగికి గ్రాట్యూటీ రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షలు, కమిటేషన్‌ రూ.15 లక్షలు, 10 నెలల వేతం క్యాడర్‌ను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంది.

మూడు సరండర్‌ లీవ్‌లు బకాయిలే...

ఇటీవల విడుదల చేసిన నిధుల నుంచి ఉద్యోగులకు లభించిన ప్రయోజనం నామమాత్రమే. పోలీసులకు ఐదు సరండర్‌ లీవ్‌లు పెండింగ్‌లో ఉంటే రెండు మాత్రమే చెల్లించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు మూడు సరండర్‌ లీవ్‌లు బకాయిలుగా ఉండిపోయాయి. డీఏ అరియర్స్‌, 10వ పీఆర్‌సీ అరియర్స్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల టీఏ బిల్లులకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో తెలియని పరిస్థితి.

ఐఆర్‌ ఎప్పుడిస్తారో!

కూటమి ప్రభుత్వం వస్తే ఐఆర్‌ ఇస్తుందని ఆశించిన ఉద్యోగులకు 10 నెలల్లో వాస్తవం అర్థమైంది. 11వ వేతన సవరణకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వం పడిపోవడంతో దాని ఉనికి కోల్పోయింది. 11వ పీఆర్‌సీ కమిషన్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉంటే మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇస్తారు. పీఆర్‌సీ కమిషన్‌ లేకపోతే.. ఐఆర్‌ ఊసే కరువైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడు డీఏలు పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటిని ఎప్పటీకి ఇస్తారనేది ప్రశ్నార్థకం.

కూటమి ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. పప్పులు1
1/2

కూటమి ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. పప్పులు

కూటమి ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. పప్పులు2
2/2

కూటమి ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. పప్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement