వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై స్థానిక లిమ్రాస్ ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. పట్టణ ంలోని ఐజీ నగర్‌కు చెందిన గౌండ రమేశ్, సుజాత దంపతులు గేదెలు పెంచుకుంటూ పాలు విక్రయిస్తూ జీవిస్తున్నారు.వీరికి ఇద్దరు రుషిబాబు(14), విక్కీబాబు కుమారులు. సోమవారం తెల్లజామున వినియోగదారులకు పాలు పోసి వస్తానంటూ తమ్ముడుతో బైక్‌పై వెళ్లాడు. అయితే ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఓవర్ టేక్ చేయబోతుండగా వాహనం ఢీకొనడంతో రుషిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ విక్కీ బాబును కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు. రుషిబాబు కృష్ణగిరి మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంట్లో చెప్పకుండా బైక్ తీసుకెళ్లి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
విద్యుదాఘాతంతో రైతు మృతి
డోన్ రూరల్: కామగానిగుంట్ల గ్రామానికి చెందిన వడ్డే రమేష్ (40) అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని తన సొంత తోటలో నీరు వదలడానికి మోటర్ స్విచ్ ఆన్ చేస్తుంగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన రమేష్ ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబీకులు అనుమానంతో పొలం వద్దకు వెళ్లి చేశారు. బోరు వద్ద విగత జీవిగా పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
యువకుడి దుర్మరణం
● పుదుచ్చేరి వద్ద రోడ్డు ప్రమాదం
కోవెలకుంట్ల: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోవెలకుంట్లకు చెందిన ఓ యువకు డు దుర్మరణం చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని సంతమార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న పవన్‌కల్యాణ్(26) ఇదే పట్టణానికి చెందిన స్నేహితుడు శ్రీకర్‌రెడ్డితో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం క్షేత్ర దర్శనానికి కోవెలకుంట్ల నుంచి బైక్‌పై ఈ నెల 11వ తేదీన బయలుదేరారు. శనివారం రాత్రి దర్శనం ముగించుకుని పుదుచ్చేరికి వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. బైక్ నడుపుతున్న పవన్‌కల్యాణ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. బైక్ వెనుక ఉన్న శ్రీకర్‌రెడ్డి స్వల్పగాయా లతో బయటపడ్డాడు. స్నేహితుడి మరణవార్తను కుటుంబ సభ్యులకు చేరవేయగా కుటుంబ సభ్యు లు అక్కడికి బయలుదేరి వెళ్లారు. కాగా సుంకన్న, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కాగా ఎనిమి దేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో సుంకన్న మృత్యువాతపడ్డాడు. ఇప్పుడు ఒక్కగాననొక్క కుమారుడిని మృత్యువు కబళించడంతో తల్లి సుబ్బమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
లారీని ఢీకొని బాలుడి మృతి
లారీని ఢీకొని బాలుడి మృతి