Kurnool District News
-
ఇద్దరు సారా తయారీదారుల అరెస్ట్
నందికొట్కూరు: నాటు సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందికొట్కూరు పట్టణంలో జగనన్న కాలనీలో సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో బుధవారం ఎకై ్సజ్ సీఐ రామాంజనేయులు సిబ్బందితో దాడి చేశారు. మంగలి శ్రీనివాసులు ఇంటిలో 132 లీటర్ల నాటు సారా లభించడంతో సీజ్ చేసి, 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. శ్రీనివాసులు ఇంటిని షికారి రవి, షికారి నానా సింగ్, షికారి భారతి అద్దెకు తీసుకుని సారా తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మంగలి శ్రీనివాసులను, షికారి రవిని అరెస్టు చేసి చేసి రిమాండ్‌కు తరలించారు. నానా సింగ్ పరారీలో ఉన్నాడని, సారా కేసులో ఇప్పటికే షికారి భారతి జైల్లో ఉందని సీఐ తెలిపారు. అలాగే వీరికి నాటు సారా తయారీకి బెల్లం సరఫరా చేసిన నందికొట్కూరు షికారి కాలనీకి చెందిన షికారి రవి మీద కూడా కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐ జఫ్రూళ్ల, హెడ్ కానిస్టేబుల్ శంకర్ నాయక్, పద్మనాభం, కుమారి, కానిస్టేబుళ్లు మధుసూదన్, ప్రసాద్, శివన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మాధవస్వామి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మద్యం పట్టివేత శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళల వద్ద 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదరావు తెలిపారు. బుధవారం సాధారణ తనిఖీల్లో భాగంగా శ్రీశైలం టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా శ్రీశైలానికి చెందిన బీబీ, పిక్కిలి రేణుక సున్నిపెంట నుంచి ఆర్టీసీ బస్సులో 50 మద్యం సీసాలు తీసుకుని వస్తుండగా తనిఖీలో దొరికారన్నారు. మద్యం స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. క్షేత్రంలో దేవదాయచట్టం ప్రకారం ఎవరైనా మద్యం సేవించకూడదని, అలాగే మద్యం కూడా కలిగి ఉండకూడదని సీఐ హెచ్చరించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు రఘునాథుడు, బాలకృష్ణ, బలోజానాయక్, నానునాయక్, వెంకటనారాయణ, కృష్ణవేణి, దేవస్థాన హోంగార్డులు కిరణ్, దొరబాబు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేత హత్య కేసులో మరో ఏడుగురి అరెస్టు
ఆలూరు రూరల్: ఆలూరు కాంగ్రెస్ ఇన్చార్జ్, రాయలసీమ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హత్యకేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మేకల శ్రీనివాసులు, సారాయి పెద్దన్న, బోయ గోవిందు, బోయ రాము, వడ్డే నవీన్, జీర్ల ధనుంజయ, దొడ్ల మనోహర్‌లను బుధవారం ఉదయం అనంతపురం జిల్లా గుంతకల్లు–బళ్లారి రహదారిలోని విడపకల్లు వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఏఎస్పీ హుసేన్ పీరా ఆధ్వర్యంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, సీఐ రవి శంకర్ రెడ్డి, చిప్పగిరి, ఆలూరు, హొళగుంద ఎస్ఐలు శ్రీనివాసులు, మహబూబ్ బాషా, దిలీప్ కుమార్‌లతో కలిసి బుధవారం ఆలూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. గత నెల 27వ తేదీన గుంతకల్లు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఆలూరు కాంగ్రెస్ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ కారును లారీతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి చంపారన్నారు. ఓ భూ వివాదంలో లక్ష్మీ నారాయణ కలుగచేసుకుని గౌసియా, పెద్దన్న, గుమ్మనూరు నారాయణపై ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించాడన్నారు. దీంతో ముగ్గురు కలసి లక్ష్మీనారాయణను అంతమొందించారన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా మొదట 14 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ఇప్పటికే బేపర్ గౌసియా, రాజేష్, సౌభాగ్యలను ఈ నెల 2వ తేదీ అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. అనంతరం కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించామన్నారు. ఈ మేరకు అదుపులో తీసుకున్న ఏడుగురు లక్ష్మీనారాయణను హత్య చేసినట్లు చెప్పారు. అలాగే గుమ్మనూరు నారాయణ ప్రమేయం ఉండడంతో మంగళవారం ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. దీంతో ఈ హత్యకేసులో 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందన్నారు. కాగా లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు వైకుంఠం ప్రసాద్, వైంకుంఠం మల్లికార్జున, మల్లేష్, చికెన్ రామాంజిలపై కేసు నమోదు చేయగా విచారణలో వారి ప్రమేయం లేదని తేలిందన్నారు. హత్య కేసులో ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందని బాధితులు ఆధారాలతో నిరూపిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హుసేన్ పీరా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
సెలవులకు వెళ్లి.. విగతజీవులుగా తిరిగొచ్చి!
● మల్లేపల్లె చెరువు మృతుల్లో ఇద్దరు పెద్ద బోధనం చిన్నారులు ● కుమారుల మృతితో శోకసంద్రంలో తల్లిదండ్రులు చాగలమర్రి: వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరిలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా తిరిగివచ్చారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మంఠం మండలం మల్లేపల్లె గ్రామంలో మంగళవారం చెరువులో పడి ఐదుగురు విద్యార్థులు మృత్యువాత పడిన విషయం విదితమే. ఐదుగురులో ఇద్దరు చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన చిన్నారులు ఉండటంతో గ్రామంలో విషాదం నెలకొంది. పెద్దబోధనం గ్రామానికి చెందిన సుందరి పాపన్న, నారాయణమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు వెంకటసుబ్బయ్యకు బ్రహ్మాంగారి మఠం మండలం మల్లేపల్లికి చెందిన వెంకట భవానితో వివాహమైంది. వెంకట సుబ్బయ్య హోంగార్డుగా పని చేస్తూ హైదరాబాదులో నివాసముంటున్నాడు. వీరికి వెంకట చరణ్(15), వెంకట పార్థు(13) కుమారులు కాగా అక్కడే చదువుతున్నారు. ఎంతో అల్లారుముద్దగా చూసుకుంటున్న కుమారులను వెంకట సుబ్బయ్య వేసవి సెలవుల నేపథ్యంలో రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఊరు మల్లేపల్లెలో వదిలేసి వెళ్లాడు. కాగా మంగళవారం సాయంత్రం ఇద్దరు చిన్నారులు మరో ముగ్గురుతో కలసి గ్రామ చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ చెరువులో మట్టి కోసం తవ్విన లోతైన గుంతల వైపు వెళ్లి ఐదుగురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. ప్రొద్దుటూరు ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బుధవారం ఉదయం కుటుంబీకులకు అప్పగించారు. వెంకట చరణ్, వెంకట పార్థు మృతదేహాలను స్వగ్రామమైన పెద్దబోధనం గ్రామానికి తరలించారు. విగత జీవులుగా ఉన్న ఇద్దరు చిన్నారులను చూసి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వేసవి సెలవులు తమ కుమారులకు శాశ్వత సెలవులుగా మారాయని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
అక్రమ రవాణా.. అడ్డుకుంటే ఒట్టు!
నాగలదిన్నె వద్ద తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు నందవరం: అధికార దర్పానికి తల వంచారో లేక మామూళ్ల మత్తుకు చేతులు ముడుచుకున్నారో? ఏమో? ఇక్కడ అధికారుల కళ్లెదుటే ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డదిడ్డంగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నా అధికారులు పల్లెత్తు మాట అనడం లేదు. మచ్చుకు అభ్యంతరం కూడా చెప్పడం లేదు. నది నుంచి ఇసుకను తోడేస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కుర్చీలకు పరిమితమై నిర్లక్ష్యపు నీడలో నిద్దరోతున్నారు. మండలంలోని నాగలదిన్నె, నదికై రవాడి గ్రామాలను అనుకొని ఉన్న అడ్డదారుల్లో పచ్చముకలు మాఫియాగా ఏర్పడి తుంగభద్ర నదిపై వాలిపోతున్నారు. పట్టపగలు ట్రాక్టర్లతో ఇసుకను యథేచ్ఛగా దోచుకెళుతున్నారు. అక్రమ రవాణాతో విసుగెత్తిన గ్రామస్తులు ఎన్నోసార్లు రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. ఆ రెండు గ్రామాల స్థావరాల నుంచి రోజుకు 50 నుంచి 100 ట్రిప్పుల వరకు ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ఇక్కడి అధికారులు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు తమ తీరు మార్చుకొని ఇసుక మాఫీయాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
భయపెట్టిన ‘పిడుగు’లు
హొళగుంద: మండలంలోని హొళగుంద, చిన్నహ్యాట, వందవాగిలి, ఎం.డీ హళ్లి, పెద్దగోనెహాళ్, గజ్జహళ్లి తదితర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు భయం పుట్టించాయి. పక్కనే బాంబులు పడుతున్నట్లు పెద్దఎత్తున పిడుగుల శబ్దానికి ప్రజలు వణికిపోయారు. పెద్దగోనెహాళ్ గ్రామం బీసీ కాలనీలో కాశీంవలి అనే వ్యక్తి గుడిసెకు ముందున్న చెట్టుపై పిడుగు పడటంతో విరిగిపడింది. దీంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. కాశీంవలి కుటుంబ సభ్యులు బంధువుల ఊరికి వెళ్లడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని గ్రామస్తులు తెలిపారు. దాదాపు అరగంటకు పైగా ఉరుములు, మెరుపులు, పిడుగుల శాబ్ధాలతో పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పొలాల్లో నీరు నిలిచాయి. హొళగుంద తేరుబజారులో నీరు చేరింది. వరి ధాన్నాన్ని అమ్ముకోని రైతులు రైస్‌మిల్లులు, పొలాలు, ఎల్లెల్సీ గట్లపై వేసుకున్న ధాన్యం తడవకుండా టార్పిళ్లు కప్పి బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
సంజామల: మండల పరిధిలోని మెట్టుపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అవుకు పట్టణానికి చెందిన మూడవత్ రసూల్ నాయక్ (56) ఉదయం రామాపురం వద్ద ఉన్న టన్నెల్ వద్దకు పనికి వెళ్తున్నాడు. మెట్టుపల్లె సమీపంలో బైక్‌పై వెళ్లున్న రసూల్ నాయక్‌ను ఎదురుగా వచ్చిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు జనార్ధన్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రచారం లేకుండానే ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ తగదు
కర్నూలు(టౌన్): టీజీవీ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి బై ప్రోడక్ట్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఫ్యాక్టరీపై ముందుగా పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించకుండా, ప్రచారం లేకుండా ప్రజాభిప్రాయం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఎస్వీ మోహన్ రెడ్డిని ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రామక్రిష్ణ రెడ్డితో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు కలిశారు. కెమికల్ ఫ్యాక్టరీ యజమాన్యం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని ఈసందర్భంగా కోరారు. బైప్రోడక్ట్ వల్ల ప్రజలకు, రైతులకు తాగునీరు, సాగునీరు సమస్యలు వస్తాయని సూచించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని ప్రజలకు ప్రమాదకరంగా ఉన్నా.. అనుమతులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారన్నారు. పరిసర ప్రాంత ప్రజలకు ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయనున్న ప్రోడక్ట్ గురించి వివరించాలన్నారు. ఎస్వీని కలిసిన వారిలో సీఐటీయూ కన్వీనర్ రాధక్రిష్ణ, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కో కన్వీనర్ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయ సమాఖ్య నాయకులు రత్నం ఏసేపు, కెపీఎన్ఎస్ నాయకులు ఆనంద్‌బాబు, ఎస్డీపిఐ నాయకులు జహంగీర్, సుంకన్న ఉన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
ఆలూరు రూరల్: కారు, మినీ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మండలంలోని హులేబీడు సమీపంలోని హైవే–167లో మంగళవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. బళ్లారికి చెందిన రంగప్రసాద్ కుటుంబంతో కలిసి ఎమ్మిగనూరు నుంచి కారులో బళ్లారికి వెళ్తున్నాడు. మండలంలోని మొలగవల్లి గ్రామానికి చెందిన మినీ లారీ కందుల లోడుతో ఆదోనికి వెళ్తోంది. హులేబీడు గ్రామ సమీపంలో కారు, మినీ లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న రంగప్రసాద్ చెయ్యి విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. భార్య అనురాధ, కుమారులు గౌతం రంగ, మౌనిత్ రంగకు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే మినీలారీ డ్రైవర్ ప్రతాప్, కందులను విక్రయించేందుకు వెళ్తున్న రైతు గాదిలింగకు గాయాలయ్యాయి. అక్కడున్న వారు క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. -
పేదల ఆసుపత్రిలో ‘పెద్దాపరేషన్లు’
● ప్రొక్లెయిన్ పొట్ట చీల్చింది.. పెద్దాసుపత్రి ప్రాణం పోసింది ● మరో బాలుడికి అరుదైన శస్త్రచికిత్సతో సాధారణ జీవితం కర్నూలు(హాస్పిటల్): అరుదైన ఆపరేషన్లు చేస్తూ పెద్దాసుపత్రి మరింత ఖ్యాతిని సొంతం చేసుకుంటుంది. కార్పొరేట్ హాస్పిటళ్లలో జరిగే పెద్ద పెద్ద శస్త్రచికిత్సలను సర్వజన వైద్య సిబ్బంది చేస్తూ పేదల ప్రాణాలను నిలుపుతున్నారు. ఇటీవల ఇద్దరు బాలురకు అరుదైన ఆపరేషన్ చేయడంతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందిన ఇనాయతుల్లా కుమారుడు షేక్ తౌఫిక్(17) నంద్యాలలోని జేవీఆర్ కాలేజీలో ఐటీఐ చదువుతున్నాడు. గత మార్చిలో రంజాన్ పండుగకు సొంతూరికి వచ్చిన అతను పండుగకు ఒక రోజు ముందు స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతన్ని ప్రొక్లెయిన్(జేసీబీ) ఢీకొంది. వాహనానికి ముందు భాగం నేరుగా ఢీకొనడంతో అతని పొట్ట చీలిపోయి పేగులు, డియోడినమ్ ఛిద్రమయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు స్థానికంగా ప్రాథమిక వైద్యం చేయించి 31వ తేదీ రాత్రి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. పరిస్థితి చూసిన వైద్యులు సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ మాధవీశ్యామల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ శృతి, అనెస్తెటిస్ట్ డాక్టర్ సోమశేఖర్ చలించిపోయారు. వెంటనే రాత్రి 10 గంటలకు అత్యవసర ఆపరేషన్ థియేటర్‌కు తరలించి తెల్లవారుజామున 5 గంటల వరకు వివిధ దశల్లో ఆపరేషన్ నిర్వహించి ప్రాణం పోశారు. 43 రోజుల పాటు వివిధ రూపాల్లో చికిత్స నిర్వహించడంతో కోలుకున్నాడు. దీంతో మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పుట్టుకతోనే మలద్వారం లేకపోవడంతో.. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన వేణుగోపాల్(15)కు పుట్టుకతోనే మలద్వారం ఏర్పడలేదు. ఈ దశకు అతను శిశువుగా ఉన్నప్పుడే శస్త్రచికిత్స చేసి తాత్కాలిక మలద్వారాన్ని ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి అతనికి మలవిసర్జన సరిగ్గా ఉండేది కాదు. నిత్యం డైపర్స్ వాడాల్సి వచ్చేది. చికిత్స కోసం అతను గత ఏప్రిల్ 18న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జనరల్ సర్జరీ విభాగానికి వచ్చాడు. ప్రొఫెసర్ డాక్టర్ మాధవీశ్యామల నేతృత్వంలో అతనికి ఈ నెల 7న మలద్వారాన్ని ఏర్పాటు చేసి కండరాలు బలోపేతం అయ్యేలా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం అందరిలానే మలవిసర్జన చేయగలుగుతుండటంతో మంగళవారం అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. -
గరుడ వాహనంపై పాండురంగడు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలచార్యులు, సుదర్శనాచార్యులు స్వామివారికి పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, సంప్రోక్షణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి పాండురంగడు ప్రత్యేక అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. ఆలయం నుంచి గాంధీ సెంటర్ వరకు స్వామివారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. వివిధ కాలనీలకు చెందిన భక్తులు పాండురంగ విఠలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నెల్లూరు కళాకారులచే నిర్వహించిన ఆర్కెస్ట్రా అలరించింది. బుధవారం గజేంద్ర వాహనంతో స్వామివారి వాహన సేవలు ముగియనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి వెల్లడించారు. -
ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నది ప్రతి సీ్త్ర కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో సంతానలేమితో బాధపడే వారి వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మాత్రం కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే చేతులారా అబార్షన్ చేయించుకుంటున్నారు. ఆడ బిడ్డ పుడితే అత్తింట
● యథేచ్ఛగా భ్రూణ హత్యలు ● ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ ● ప్రోత్సహిస్తున్న వైద్యులు, పలు ప్రైవేట్ ఆసుపత్రులు ● స్కానింగ్ సెంటర్లపై నిఘా శూన్యం ● తూతూ మంత్రంగా తనిఖీలు ● గత నెలలో 40 సెంటర్లలో తనిఖీలు.. అంతా బాగుందని సర్టిఫికెట్కర్నూలు(హాస్పిటల్): ‘భ్రూణ హత్యలు వద్దు.. ఆడ పిల్లలను బతకనిద్దాం.. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు’.. అంటూ అధికారులు పలు వేదికలపైఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. జిల్లాలో భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 240 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవి 8, రెన్యువల్ కోసం వచ్చినవి మరో 15 దాకా ఉన్నాయి. వీటికి జిల్లా కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. అధికారికంగా ఉన్న స్కానింగ్ కేంద్రాలే గాక అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అనుమతులు లేకుండా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుని స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కొందరు వైద్యులు స్కానింగ్ ద్వారా లింగనిర్ధ్దారణ చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు నిర్ధ్దాక్షిణ్యంగా అబార్షన్(భ్రూణహత్య)లు చేయించుకుంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా అప్పుడప్పుడూ కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిసర ప్రాంతాలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని శివారు ప్రాంతాల్లో మృతశిశువులు వెలుగు చూస్తుంటాయి. ఇలా లభించిన వాటి గురించి ఏ ఒక్క అధికారి కూడా విచారణ చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు జిల్లాలో నమోదు కాలేదు. అంతెందుకు గత పదేళ్లలో ఒక్క స్కానింగ్ కేంద్రం, వైద్యులపై కూడా స్కానింగ్ అక్రమాల గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ నెలలో జిల్లాలో వైద్యుల బృందం 40 స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లింది. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిపోర్టులు, మిషన్లు, వైద్యుల వివరాలు, గర్భిణిల వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని అధికారులకు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. ఆర్ఎంపీలకు నజరానాలు జిల్లాలో డోన్, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, కోసిగి, హొళగుంద, పెద్దతుంబళం, చిన్నతుంబళం, మంత్రాలయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కౌతాళం వంటి వెనుకబడిన ప్రాంతాలే గాక తెలంగాణా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం స్కానింగ్ కోసం గర్భిణులు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరుకు వస్తుంటారు. ఇందులో కొందరికి అప్పటికే ఆడపిల్లలు జన్మించి ఉండటంతో మళ్లీ ఆడబిడ్డ జన్మిస్తే కుటుంబంలో పెద్దలు ఒప్పుకోరని భావించి స్కానింగ్‌లో ఆడబిడ్డ అని తేలితే అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధపడి వస్తారు. ఈ మేరకు కర్నూలులోని కొత్తబస్టాండ్, గాయత్రి ఎస్టేట్, బుధవారపేట, ఎన్ఆర్ పేట, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలకు గర్భిణులను తీసుకొస్తారు. లింగ నిర్ధారణతో పాటు అవసరమైతే భ్రూణహత్య(అబార్షన్) చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ తతంగంలో మొత్తం సూత్రధారులు ఎక్కువగా ఆర్ఎంపీలే ఉంటున్నారు. లింగనిర్ధారణకు రూ.4వేల నుంచి రూ.5వేలు, అబార్షన్‌కు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా తీసుకుంటున్నారు. ఇందులో ఆర్ఎంపీలకు 20 నుంచి 40 శాతం వరకు కమీషన్ ముట్టజెబుతున్నారు. -
● గోరుకల్లు జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల బృందం
పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే నీటి నిల్వ పాణ్యం: గోరుకల్లు జలాశయం పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే నీటి నిల్వకు అవకాశం ఉంటుందని నిపుణుల బృందం సభ్యులు అధికారులకు సూచించారు. జలాశయం కట్ట కుంగిపోతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఎక్స్‌ఫర్ట్ కమిటీ సభ్యు లు సందర్శించారు. కమిటీలోని సీడీఓ సీఈ విజయభాస్కర్, సీఈ కబీర్‌బాషా, ఎస్ఈ శివకుమార్‌రెడ్డి, ఈఈ మనోహరెడ్డి, సుభకుమార్, డీఈలు రీనా, కేధారేశ్వరరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఈఈ ప్రసూనాదేవి తదితరులు జలాశయాన్ని సందర్శించారు. ముందుగా డ్యామ్ డిజైన్, కట్ట కుంగిన ప్రాంతం, జారుతున్న రాతిపరుపు, లీకేజీలు తదితర అంశాలను పరిశీలించారు. ఒకే చోట కట్ట కుంగడంపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం కట్ట కుంగిన చోటా ఎత్తు 259 మీటర్లు మాత్రమే ఉందని, 265.06 మీటర్లు ఎత్తు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కట్ట పూర్తి స్థాయిలో నిర్మించి కాంక్రీట్ చానెళ్లు ఏర్పాటు చేస్తే వర్షపు నీరు కట్టలోకి వెళ్లకుండా నేరుగా జలాశయంలోకి వెళ్తుందన్నారు. భూమి లోపల పొరల వల్ల కూడా కట్ట కుంగే ప్రమాదం ఉందన్నారు. కట్టలోని 7 ప్యానెళ్లలో రాతి పరుపు దెబ్బతిన్నట్లు గుర్తించి లూస్ సాయిల్‌ను తొలగించాలన్నారు. కొత్తగా కంకర, ఇసుకతో ఫిల్ చేసి కట్టను పటిష్టం చేయాలని సూచించారు. జలాశయంలో పరిశీలించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. వారి వెంట డీఈఈలు జ్యోతి, గీతా, శివప్రసాద్, ఏఈలు, జేఈఈలు పాల్గొన్నారు. -
ఖరీఫ్‌కు సిద్ధమవుదాం
● లోతు దుక్కులతో ఎన్నో ఉపయోగాలు ● పొలాల్లో గొర్రెలు మంద కట్టడం వల్ల సేంద్రియ పదార్థం పెరుగుదల ● నేల గుల్ల బారుతుంది.. సకాలంలో విత్తనం వేసుకోవచ్చు ● కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి సూచనలు కర్నూలు అగ్రికల్చర్: వేసవి.. పొలాల్లో పంటలు లేని సమయం. అతి ముఖ్యమైన పొలం పనులు చేపట్టాల్సింది వేసవిలోనే. తొలకరితో మొదలయ్యే ఖరీఫ్ సీజన్‌కు ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. వేసవిలో చేపట్టే పొలం పనులను బట్టే పంటల పెరుగుదల, దిగుబడులు వస్తాయి. వేసవిలో చేపట్టాల్సిన పనులను కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి వివరించారు. లోతు దుక్కులు ఇటీవల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. ప్రస్తుతం దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న పొలాల్లో ట్రాక్టర్లు లేదా ఎద్దుల నాగళ్లతో లోతు దుక్కులు దున్నాలి. దుక్కుల లోతు సుమారుగా 9 అంగుళాలకు తగ్గకుండా ఉండాలి. అలా లోతు దుక్కులు చేసినప్పుడు పలు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. వాలుకు అడ్డంగా దున్నుకోవడం అవసరం. వర్షాలు తగ్గినందున వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకిపోతుంది. నేలలోని చీడ పీడలు నశిస్తాయి లోతు దుక్కులు దున్నినప్పుడు నేలపై పొరల్లో ఉండే పురుగులు, తెగుళ్లను నశింపజేయడానికి అవకాశం ఉంది. నేలను లోతుగా దున్నినప్పుడు నేలలో దాక్కునే లేదా నిద్రావస్థలో ఉంటే పురుగులు, నేలలో ఉండి తెగుళ్లను కలగజేసే శిలీంద్రాలు ఎండల బారిన పడి నశిస్తాయి. అందువల్ల వేసవిలో పొలాలను లోతు దుక్కి చేసుకుంటే తొలకరిలో విత్తుకునే పంటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేల గుల్లబారుతుంది వేసవిలో లోతుగా దుక్కి దున్ని తొలకరి వర్షాలకు గొ ర్రు తిప్పి గుంటలతో సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేల అధికంగా నీటిని పీల్చుకుంటుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, గుంటక, దంతె వంటి పరికరాలు నేల లోపలికి 3–5 అంగుళాల లోతు వరకు చొచ్చుకొనిపోతాయి. ఈ పరికరాలను ఉపయోగించి పదే పదే సేద్యం చేయడం వల్ల నేల లోపల సుమారుగా 3–5 అంగుళాల లోతులో ఒక గట్టి పొర ఏర్పడుతుంది. అందువల్ల నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. కావున నేలను లోతుగా దున్నినప్పుడు ఈ గట్టి పొర ఛేదింపబడి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది. సేంద్రియ పదార్థం నేలలో కలుస్తుంది... పంటల కోతల తర్వాత నేలపై మిగిలే పంటల మొదళ్లు పొలంలో మిగిలిన కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకులు వంటి వివిధ సేంద్రియ పదార్థాలన్నీ లోతు దుక్కి దున్నినప్పుడు నేలలో కలిసి కుళ్లిపోతాయి. అందువల్ల నేలలో సేంద్రియ పదార్థాలు, పోషక విలువలు పెరగడానికి అవకాశం ఉంది. పశువుల ఎరువులను తోలడం సంవత్సరం పొడవునా నిల్వ చేసిన పశువుల ఎరువులను ఎండాకాలంలోనే పొలాల్లోకి తోలా లి. వర్షాలు పడిన తర్వాత పొలాలకు తోలిన పశువుల ఎరువులను నేలపై చల్లి లోతు దుక్కి దున్నితే మట్టిలో బాగా కలుస్తుంది. దీనివల్ల పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయి. వేసవి దుక్కులు చేస్తున్న దృశ్యం పశువులు/గొర్రెలు మందకట్టడం ఈ పని కూడా రైతులు వేసవిలో చేసుకోవచ్చు. లోగడ ప్రతి రైతుకు ఎద్దులు, ఆవులు, గేదెలు ఉండేవి. వాటిని రాత్రిళ్లు పొలంలో కట్టేసేవారు. వాటి మల మూత్రాలు పొలానికి తిన్నగా చేరి పంటలకు ఉపయోగపడేవి. ఇందువల్ల ఎరువుల ఖర్చు తగ్గేది. ఇప్పుడు పాంచకట్టేసే పశుగణాలు తగ్గిపోయాయి. పశుగణం ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఈ పని ఇప్పటికై నా చేయవచ్చు. గొర్రెలను పొలంలో మందకట్టడం రైతులకు పరిపాటే. ఈ పని ఎండాకాలంలోనే చేయాలి. నిద్రలో ఉన్న గొర్రెల మందలను రాత్రిళ్లు ఎక్కువసార్లు లేపితే ఎక్కువసార్లు పెంటికలను వేస్తాయి. దీనివల్ల చేనుకు అవసరమైనంత గొర్రెల ఎరువు, మూత్రం లభ్యమవుతుంది. ఇలా నేలకు సేంద్రియ ఎరువులను అందించవచ్చు.మొండిజాతి కలుపు నివారణ తుంగ, గరిక, దర్బ వంటి మొండిజాతి కలుపు మొక్కలు పొలంలో పెరిగి పంటలకు నష్టం కలగజేస్తుంటాయి. వీటి వేర్లు, కాయలు, దుబ్బులు నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టం అవుతుంది. పంటలు వేసినప్పుడు వాటితో పాటు పెరిగి నష్టం కలగచేస్తాయి. వేసవిలో దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు మొక్కల కాయలు, వేర్లు దుంపలు పెకలింపబడి, వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలకు నశించడానికి అవకాశం ఉంటుంది. నేలపైకి తేలిన కాయలు, వేర్లు దుంపలను ఏరివేసి వీటిని అరికట్టవచ్చు. -
తిరిగి దాడులు, తనిఖీలు నిర్వహిస్తాం
జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గత ఏప్రిల్‌లో 40 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే ఆయా కేంద్రాలను తిరిగి తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను నిగ్గు తేలుస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం గాకుండా చేసి, సదరు స్కానింగ్ కేంద్రంపై దాడులు నిర్వహిస్తాం. రెగ్యులర్‌గా ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్‌వో, కర్నూలు ● -
భార్య హత్యకేసులో భర్త అరెస్టు
బేతంచెర్ల: పట్టణంలోని గౌరిపేటలో ఈనెల 9న షేక్ జకీయా బేగంను హత్య చేసిన కేసులో ఆమె భర్త షేక్ రసూల్‌ను అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్ల్లో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడైన షేక్ రసూల్ కోసం గాలింపు చేపట్టి బనగానపల్లె రహదారిలోని చెలిమె వద్దనున్న మౌలాలి స్వామి దర్గా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసు విచారణలో తానే భార్యను హత్య చేసినట్లు నేరం ఒప్పుకోవడంతో అరెస్టు చేసి డోన్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెల్లడించారు. ఎస్ఐ రమేష్‌బాబు, పోలీస్ సిబ్బంది రాఘవేంద్ర, దస్తగిరి, చంద్రశేఖరప్ప, మహేష్ పాల్గొన్నారు. -
12 మండలాల్లో అకాల వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 12 మండలాల్లో వర్షాలు కురిశాయి. నందవరంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 69.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలు రూరల్‌లో 32.2, కర్నూలు అర్బన్‌లో 25.4, కల్లూరులో 23.2, మద్దికెరలో 7.6, ఓర్వకల్లో 6.8 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 7.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 14న 3 మి.మీ, 15న 7.4, 16న 9, 17న 8.3 మిమీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో 14న 2.1, 15న 9.8, 16న 12.1, 17న 10.1 మిమీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. యూజీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ యూజీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం వర్సిటీలోని వీసీ ఛాంబర్లో ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీఎస్ షావలి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.లోకనాథ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి వీసీ మాట్లాడుతూ యూజీ నాల్గవ సెమిస్టర్ బీఏ ఎకనామిక్స్ (హానర్స్), బీకాం (హానర్స్), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ జువాలజీ, ఆరో సెమిస్టర్ బీఏ (హెచ్ఈపీ), బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, ఎనిమిదో సెమిస్టర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ బాటనీ, జువాలజీ, పదో సెమిస్టర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ బాటనీ, జువాలజీ ఫలితాలను విడుదల చేశామన్నారు. ఫలితాలు వర్సిటీ వెబ్సైట్ htt pr://ah uuk.-a-c.i n లో అందుబాటు ఉన్నాయన్నారు. వాము వ్యాపారులు సిండికేట్ ● తగ్గిన ధరలతో నష్టపోతున్న రైతులు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నష్టాలకు గురి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌కు మంగళవారం 88 మంది రైతులు 280 క్వింటాళ్ల వాము తెచ్చారు. కనిష్ట ధర రూ.611, గరిష్ట ధర రూ.24,306 లభించింది. సగటు ధర కేవలం రూ.10,288 మాత్రమే నమోదైంది. వ్యాపారులు ఒకటి, రెండు లాట్లకు మాత్రమే ఎక్కువ ధర వేసి మిగిలిన లాట్లకు తక్కువ ధరలు కోట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే సగటు ధర రూ.10 వేలు మాత్రమే నమోదైందని రైతులు వాపోతున్నారు. కాగా వాము వ్యాపారులు టెండర్ హాల్లో యథేచ్ఛగా తిరుగుతూ ధరలను తారుమారు చేస్తున్నట్లు తెలుస్తోంది. టెండర్ హాల్లో కంప్యూటర్ ఆపరేటర్లను లోబరుచుకొని తమకు అనుకూలంగా ధరలు మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది. -
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
ఆస్పరి/ఆదోని రూరల్: ఆదోని మండలం నాగనాథహళ్లి గ్రామ సమీపంలో మంగళవారం పిడుగు పడటంతో ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన శంకరబండ గోవిందు (33) అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ములుగుందం గ్రామానికి చెందిన గోవిందుతో పాటు మరోఆరుగురు కాపరులు నాగనాథహళ్లి గ్రామ సమీపంలో గొర్రెలను మేపేందుకు వెళ్లారు. మంగళవారం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. గొర్రెల వద్ద ఉన్న గోవిందుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడుకి భార్య రంగవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గోవిందు మృతితో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ముత్తుకూరులో ఎద్దు మృత్యువాత ఆస్పరి: మండలంలోని ముత్తుకూరు గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు కారుమంచి మల్లికార్జున రెడ్డి అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. రైతు మల్లికార్జునరెడ్డి ఎద్దులను వామిదొడ్డి వద్ద కట్టి ఉంచాడు. ఒక్కసారిగా ఉరుములు ఏర్పడి పిడుగు ఎద్దులపై పడడంతో ఒక ఎద్దు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఎద్దుకు స్వల్ప గాయాలయ్యాయని రైతు తెలిపారు. ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎద్దు మృతితో రూ.80 వేలు నష్టం వాటిల్లిందని, ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని బాధిత రైతు ప్రభుత్వాన్ని కోరారు. -
22న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కర్నూలు(అర్బన్): జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు ఈ నెల 22వ తేదీన ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు సంఘం నేతలు తెలిపారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ భవన్లో జరిగిన సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రధాన కార్యదర్శి అనిత పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. గతంలో ప్రకటించిన మేరకు ఈ నెల 5వ తేదీలోపు తమకు అందిన మార్కుల జాబితాలు, కుల ధ్రువీకరణ పత్రాల మేరకు ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. పెద్దపాడు రోడ్డులోని బీరప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. -
సబ్సిడీ తగ్గి.. ధర పెరిగి!
నాణ్యత ప్రశ్నార్థకమే! ఉమ్మడి జిల్లాకు అవసరమైన వేరుశనగను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీసీడ్స్) సరఫరా చేస్తోంది. వేరుశనగ విత్తనోత్పత్తి లేకపోవడంతో దళారులే ఆధార మయ్యారు. గత ఏడాది పంపిణీ చేసిన వేరుశనగ నాణ్యతపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విత్తనం కాయల ప్యాకెట్లలో రాళ్లు, మట్టి పెళ్లలు, చెత్త చెదారం ఉండటం, విత్తనం నాసిరకంగా ఉండటం పట్ల రైతులు ఆందోళనకు గురయ్యారు. వేరుశనగ నాణ్యత బాగాలేదని వ్యవసాయ అధికారులు కూడా వెనక్కి పంపించారు. ఈ సారైన వేరుశనగ విత్తనం కాయల్లో నాణ్యత ఉంటుందా అదే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వేరుశనగ కోసం దళారులపై ఆధారపడుతుండటంతోనాణ్యత కొండెక్కుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు కూటమి ప్రభుత్వం ఆరకొరగా వేరుశనగ విత్తనాలు కేటాయించింది. వీటికి బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా ధర ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు ఖరీఫ్‌లో వేరుశనగ విత్తనం కాయలను 35 శాతం సబ్సిడీపై పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం 25 శాతం సబ్సిడీతో పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80 వేల హెక్టార్లలో వేరుశనగ పంటశ సాగు చేస్తారు. మొత్తం 32,181 క్వింటాళ్ల విత్తనం కాయలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు. కానీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు అంతంత మాత్రంగా 11,108 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. వేరుశనగ పూర్తి ధర నిర్ణయించినప్పటికీ సబ్సిడీ ప్రకటించలేదు. గత ఏడాది 25 శాతం మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. ఈ సారి కూడా 25 శాతం వరకే సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఆలూరు, పత్తికొండ, ఎమ్మగనూరు, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, పెద్దకడుబూరు, కల్లూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు, ఓర్వకల్లు, ఆదోని, కొసిగి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నంద్యాల జిల్లాలో డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, నందికొట్కూరు మండలాల్లో సాగు చేస్తారు. కేటాయింపులు నామమాత్రం గత ఏడాది ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 13,804, నంద్యాల జిల్లాలో 3,063 క్వింటాళ్ల వేరుశనగ విత్తనం కాయలు పంపిణీ అయ్యాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాకు 9,099, నంద్యాల జిల్లాకు 2,009 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది. వేరుశనగ సాగు కర్నూలు జిల్లాలో 55 వేల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 30 వేల హెక్టార్ల వరకు సాగవుతంది. కర్నూలు జిల్లాకు 18,310, నంద్యాల జిల్లాకు 14,181 ప్రకారం 32,491 క్వింటాళ్లు అవసరమని జిల్లా వ్యవసాయ యంత్రాంగం నివేదించింది. ఈ ప్రకారం కేటాయించకపోయినా.. గత ఏడాది మేరకు కేటాయించాలి. కాని తూతూ మంత్రంగా కేటాయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. మార్కెట్లో వేరుశనగ క్వింటాకు రూ.6,500 వరకు ధర ఉంది. ప్రభుత్వం మాత్రం రైతులకు పంపిణీ చేసే వేరుశనగ ధర రూ.9,300గా నిర్ణయించింది. దళారులకు మేలు చేసే విధంగా ధర నిర్ణయించిందనే విమర్శలు ఉన్నాయి. కేటాయింపులు ఇలా... కర్నూలు జిల్లాకు 9,099 క్వింటాళ్లు కేటయించగా.. సాగు విస్తీర్ణాన్ని బట్టి సబ్ డివిజన్లు, మండలాలకు జిల్లా వ్యవసాయ కేటాయించింది. కర్నూలు సబ్ డివిజన్‌కు 495, ఆదోని సబ్‌డివిజన్‌కు 1,182, ఎమ్మిగనూరు సబ్‌డివిజన్‌కు 320, ఆలూరు సబ్ డివిజన్‌కు 1017, పత్తికొండ సబ్ డివిజన్‌కు 6,085 క్వింటాళ్లు ప్రకారం కేటాయించారు. నంద్యాల జిల్లాకు కేటాయించిన 2,009 క్వింటాళ్ల విత్తనాలను ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, నందికొట్కూరు, కోవెలకుంట్ల తదితర మండలాలకు కేటయించారు. వేరుశనగ రైతును ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు అవసరం 32,471 క్వింటాళ్లు కేటాయింపు 11,108 క్వింటాళ్లు మాత్రమే మార్కెట్లో ధర రూ.6,500 అయితే.. ప్రభుత్వం ధర రూ.9,300 -
ప్రాణం తీసిన ఇనుప కడ్డీలు
మంత్రాలయం రూరల్: ఇనుప కడ్డీలు మీద పడి వెల్డింగ్ కార్మికుడు గొల్ల పవన్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ శివాంజల్ తెలిపిన వివరా లు ఇవి.. నందవరం మండలం నదికై రవాడి గ్రామానికి చెందిన గొల్ల పవన్ మంత్రాలయంలో వెల్డింగ్ పని చేస్తున్నాడు. సోమవారం పనుల నిమిత్తం ఎమ్మిగనూరుకి వెళ్లి ఆటోలో ఇనుప కడ్డీలు తీసుకువచ్చాడు. మంత్రాలయంలోని పరిమళ లాడ్జ్ సమీపంలో ఆటో టైర్ బురదలో కూరుకుపోయింది. అక్కడ ఉన్న కొంత మందితో ఆటోను బురదలోంచి పైకి ఎత్తడంతో ముందుకెళ్లి బోల్తా పడింది. వెనుక భాగంలో ఉన్న గొల్ల పవన్‌పై ఆటోపై ఉన్న ఇనుప కడ్డీలు మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. గొల్ల పవన్‌కు భార్య గొల్ల పవిత్ర, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
కౌతాళంలో ప్రసాదం పంపిణీ
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసులో భాగంగా సోమవారం కౌతాళంలో సఫ్రాలుట్న (ప్రసాదం పంపిణీ) కార్యక్రమం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించారు. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చీష్తీ ఇంట్లో మట్టి కుండల్లో ప్రత్యేంగా తయారు చేసిన తీపి పదర్థాన్ని డప్పువాయిద్యాల మధ్య దర్గాకు తీసుకొచ్చారు. ప్రత్యేక ఫాతెహాలు, ప్రార్థనల అనంతరం ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ ప్రసాదాన్ని ముగ్గురు భక్తులకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదం పొలంలో పాతితే పంట బాగా పండుతుందని, రోగం ఉన్నవారు తింటే వారికి రోగం తగ్గుతుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ ప్రసాదం కోసం పోటీపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ అశోక్‌కుమార్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
ప్రాథమిక పాఠశాల విద్య ఇక నిర్వీర్యం
కర్నూలు సిటీ: పాఠశాలల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాథమిక విద్యను ఇక నిర్వీర్యం చేస్తుందని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. పాఠశాల పునఃవ్యవస్థీకరణ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్ కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉల్చాల రవికుమార్, నవీన్ పాటి, జిల్లా ఉపాధ్యక్షులు హేమంత్‌కుమార్ మాట్లాడారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం విస్మరించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే జీఓ 117 రద్దు చేసి, పాత విధానాన్నే తీసుకొస్తామని హామీనిచ్చిన విషయం మర్చిపోయారన్నారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణ గందరగోళంగా మారిందన్నారు. వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసి, డీఎస్సీ నియామకాలను పూర్తి చేయాలని కోరారు. ఎస్జీటీలకు మ్యానువల్‌గానే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని, పదోన్నతుల్లో సీనియారిటీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే అన్ని సంఘాలతో కలిసి పెద్ద ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం డీఈఓ శామ్యూల్ పాల్కి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో ఆ సంఘం నాయకులు జయరాజు, హనుమంతు, యేహోషువా, కౌలన్న, భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్లప్ప, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలి డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ధర్నా -
మాజీ మంత్రి రజినీపై పోలీసుల తీరు దారుణం
కర్నూలు(టౌన్): చిలకలూరి పేటలో మాజీ మంత్రి విడదల రజనీపై పోలీసులు వ్యవహరించిన తీరును దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, మహిళా విభా గం జిల్లా అధ్యక్షురాలు శశికళ అన్నారు. కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొనినిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. మహిళలపై అమానీయంగా వ్యవహరిస్తున్న పోలీసు శాఖపై చర్యలు తీసుకోవడంలో సాటి మహిళా హోంమంత్రి అనిత ఘోరంగా విఫ లం చెందారన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు కల్పనపై రాత్రికి రాత్రి కేసు పెట్టి పోలీసు స్టేషన్‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. రౌడీలా వ్యవహరించిన సీఐ సుబ్బరాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు. ఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు భారతి, నగర అధ్యక్షురాలు మంగమ్మ, 4 వ వార్డు కార్పోరేటర్ ఆర్షియా ఫర్హీన్ పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన -
శేషవాహనంపై విహరించిన పాండురంగడు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో ఆరవ రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యులు పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, సంప్రోక్షణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి పాండురంగడు శేష వాహనంపై కొలువుదీరగా పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు ఆలయాన్ని చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం నుంచి గాంధీసెంటర్ వరకు గ్రామోత్సవం కొనసాగింది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పాండురంగ విఠలేశ్వరుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. బీఈడీ పరీక్ష ఫలితాల విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన బీఈడీ స్పెషల్ సప్లిమెంటరీ (2015–19) 1,2,3,4, సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి సెమిస్టర్‌కు 155 మంది పరీక్ష రాయగా 108, రెండో సెమిస్టర్‌కు 47కు 34, మూడో సెమిస్టర్‌కు 76కు 43, నాలుగో సెమిస్టర్‌కు 72కు 51 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మల్లేశ్వరస్వామి జాతరకు తరలిన భక్తులు హొళగుంద: కర్ణాటక రాష్ట్రం తెక్కలకోట గ్రామ కొండల్లో నిర్వహిస్తున్న మల్లేశ్వరస్వామి జాతరకు హొళగుంద మండలం నుంచి భక్తులు సోమవారం తరలివెళ్లారు. మల్లేశ్వరస్వామిని వాల్మీకులు కొలుస్తారు. ఏటా స్వామి రథోత్సవానికి ముందు బండారం సమర్పించేందుకు భక్తులు డోలు, మేళ తాళాలతో హొళగుంద నుంచి కర్ణాటకకు ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితీ. హొళగుందకు 30 కి.మీ. దూరంలో ఉన్న స్వామి సన్నిధికి చేరుకునేందుకు సోమవారం చెప్పులు లేకుండా కాలినడకతో బయలుదేరారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 52 పరీక్షలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 3,842 మంది విద్యార్థులకుగాను 3,660 మంది హాజరు కాగా 182 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షలకు 660 మంది విద్యార్థులకుగాను 601 మంది హాజరు కాగా 59 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ గురవయ్య శెట్టితో పాటు డీఈసీ మెంబర్లు, కస్టోడియన్స్, స్క్వాడ్ బృందాలు మొత్తం 30 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 19 నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలను ఎంపిక చేసినట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 18 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్స్‌ను వాట్సాప్ మన మిత్ర(వాట్సాప్ గవర్నెన్స్)నుంచి 9552300009కు హాయ్ అని పంపి విద్యా సేవలను ఎంచుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చునని సూచించారు. -
విద్యార్థులకు తప్పిన ముప్పు
మహానంది: గాజులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్ గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. రైల్వే ఏఎస్ఐ హనుమంత రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మహానంది వ్యవసాయ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కర్నూలు నుంచి కళాశాలకు వస్తున్నారు. అదే సమయంలో తిరుపతి నుంచి గుంటూరు వెళ్లే రైలు వస్తుండటంతో గాజులపల్లి రైల్వే స్టేషన్ వద్ద గేటు మూశారు. అయితే కారు వేగంగా రావడంతో అదుపుతప్పి రైల్వే గేటును ఢీకొని పట్టాల పైకి వచ్చి ఆగింది. వెంటనే గేట్మెన్ అప్రమత్తతతో దూరంగా వస్తున్న రైలు ఆగి పోయింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా రైల్వే గేటు దెబ్బ తినడంతో మరమ్మతులు చేపట్టారు. కాగా దాదాపు మూడు గంటల మేర మహానంది, గాజులపల్లి నుంచి మహానందికి వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో ఆగిపోగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే గేటును ఢీకొని పట్టాలపైకి చేరుకున్న కారు గేట్‌మన్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం -
వైభవంగా పట్టాభిషేక మహోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాన్ని స్వామిజీ సుబుధేంద్రతీర్థులు అధిరోహించి 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామిజీ పూజా మందిరంలో రాములోరి సంస్థాన పూజలో తరించారు. పట్టాభిషేక దినాన్ని పురస్కరించుకుని యాగశాలలో మృత్యుంజయ, ఆయుష్షు, మార్కండేయ హోమాలు చేపట్టారు. వాస్తు పూజతోపాటు హోమాల పూజల్లో పీఠాధిపతి పాల్గొన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో లోక కళ్యాణార్థం హోమాలు చేసినట్లు స్వామిజీ తెలిపారు. భారత్ సైనికులు సురక్షితంగా ఉండాలని, విజయం వరించాలని కోరారు. లోక కళ్యాణార్థం హోమాలు -
67 మందికి గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 67 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 31 మందికి, నంద్యాల జిల్లాలో 36 మందికి పదోన్నతి లభించిందన్నారు. వీరిలో కర్నూలు జిల్లాకు 10 మందిని, నంద్యాల జిల్లాకు 10 మందిని కేటాయించి మిగిలిన వారిని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు కేటాయిస్తు సీపీఆర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందేందుకు 34 మంది జూనియర్ అసిస్టెంట్లకు అర్హత ఉందన్నారు. ఈ మేరకు అనుమతి కోరుతున్నామని డీపీఓ వెల్లడించారు. 17న పాణ్యంకు సీఎం రాక పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17వ తేదీన పాణ్యం రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష చేపట్టారు. సీఎం పర్యటన షెడ్యూల్డ్ అధికారకంగా రావడంతో ఆర్డీఓ, తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి కలిసి హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాణ్యం హైవేలోని చందమామ హోటల్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ వెంచర్‌ను పరిశీలించారు. మరో స్థలాన్ని పరిశీలించనున్నారు. పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో బహిరంగ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు గురించి ఆర్డీఓ అడిగి తెలుసుకున్నారు. అధికారికంగా సీఎం పర్యటన ఖరారైనట్లు ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మైనారిటీ రుణాల దరఖాస్తుకు 25న ఆఖరు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిష్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిష్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకొని ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హత కలిగిన వ్యక్తులు తమ వివరాలను htt pr://apbommr.apcfrr.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయంలో, లేదా 9848864449, 9440822219 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): భానుడి భగభగలు పెరిగాయి. కొద్ది రోజులుగా 40 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యంలో 40.5, రుద్రవరంలో 40.2, శిరువెళ్లలో 40, గూడూరులో 39.3, కోడుమూరులో 39.2, వెల్దుర్తిలో 39.1 డిగ్రీల ప్రకారం నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ తెలిపారు. పడిపోయిన మిర్చి ధర ● క్వింటా ధర రూ.8వేలు మించని వైనం కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి ధరలు మరింత పడిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం ఉన్న ధరతో అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కదనే ఉద్దేశంతో ఏసీ గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో మిర్చి సాగు చేసి లాభాల పంట పండించుకున్న రైతులు 2024లో కోలుకోలేని విధంగా నష్టపోయారు. మిర్చి రైతులను ఆదుకుంటామని మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావుడి చేసినా ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం. 2024 ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 95,478 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 22,390 ఎకరాల్లో మిర్చి సాగయింది. చీడపీడల సమస్యలు పెరగడంతో ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడులు కూడా పడిపోయాయి. ఇదే సమయంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధరలు మరింత పడిపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 2022లో మిర్చి ధర రికార్డు స్థాయిలో రూ.53 వేలకు పైగా పలికింది. 2023లో రూ.30 వేల ధర లభించింది. తాజాగా ఎరువు రకం ధర క్వింటాకు కనిష్టంగా రూ.2,299, గరిష్టంగా రూ.8,259 , సగటు ధర రూ.5,669 నమోదైంది. తేజా రకం ధర రూ.7,293 పలికింది. -
పల్లెకు రాని ‘వెలుగు’
బస్సులు వెళ్లని గ్రామాల సంఖ్య.. మండలం బస్సు వెళ్లని గ్రామాలు కృష్ణగిరి 28 వెల్దుర్తి 27 తుగ్గలి 37 పత్తికొండ 8 మద్దికెర 6కృష్ణగిరి: గ్రామీణ ప్రాంతాలకు ‘పల్లె వెలుగు’ బస్సులు వెళ్లడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధిలేని పరిస్థితుల్లో ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఉండగా.. మొత్తం 106 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. కేవలం 65 గ్రామాలకు మాత్రమే రోజుకు ఒకటి, రెండు ట్రిప్పుల చొప్పున బస్సులు నడుస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ద్విచక్ర, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇదీ దుస్థితి.. ● గతంలో డోన్ నుంచి కంబాలపాడు, వెల్దుర్తి, కోడుమూరు నుంచి పలు బస్సు సర్వీసులు కృష్ణగిరికి ఉండేవి. నేడు కర్నూలు జిల్లాలో బస్సు సౌకర్యం లేని మండల కేంద్రంగా కృష్ణగిరి నిలిచింది. ప్రజలకు ఆటోలే శరణ్యమయ్యాయి. ● పత్తికొండ నియోజవర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాలకు తారు రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సు సౌకర్యాలు లేవు. ● రామకృష్ణాపురం, ఎస్‌హెచ్ ఎర్రగుడి, మన్నెకుంట, జి.మల్లాపురం, ఎరుకల చెరువు, పోతుగల్లు, పెనుమాడ, కంబాలపాడు, అమకతాడు, కర్లకుంట, తొగర్చేడు, టి.గోకులపాడు, బోయబొంతిరాళ్ల, ఆలంకొండ, కటారుకొండ, పెద్దొడ్డి, గుడెంపాడు, బాపనదొడ్డి, పుట్లూరు తదితర గ్రామాలకు చెందిన రెండు వేల మంది ప్రజలు డోన్, వెల్దుర్తి, కోడుమూరు ప్రాంతాలకు వెళ్లడానికి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ● వెల్దుర్తి మండలంలోని చిన్న కులుములపల్లె, శ్రీరంగాపురం, లక్ష్మింపల్లె, చెర్లకొత్తూరు. గోవర్ధనగిరి, కొట్టాల, పేరేముల, ఎల్.నగరం, బింగిదొడ్డి, ఎల్ తాండ, కాశాపురం, సూదాపల్లె, బోగోలు, గువ్వలకుంట, గుంటుపల్లి, అల్లుగుండు, మల్లెపల్లె, నార్లాపురం, వెంకటాపురం, బుక్కాపురం, బోయినపల్లె, సర్సాపురం, తిమ్మాపురం, పిక్కిలివానిపల్లె, బాలాపురం, లింగాలపల్లె, కొసనాపల్లె, మంగంపల్లె గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ● తుగ్గలి మండలంలో 37, మద్దికెర మండలంలో 6 గ్రామాలకు, పత్తికొండ మండలంలో కూడా పుచ్చకాయలమాడ, అటికెలగుండు, కొత్తపల్లి, చక్రాళ్ల, కురవలదొడ్డి, పెద్దహుళ్తి, కోతిరాళ్ల, నలకదొడ్డి గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ప్రయాణం.. ప్రమాదకరం బస్సులు లేని కారణంగా భద్రతలేని ఆటోల్లో ప్రయాణించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాది కాలంలో పత్తికొండ నియోజకవర్గంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆటోల్లో, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఆటో ప్రయాణం ప్రమాదమని తెలిసినా విధిలేని పరిస్థితుల్లో వాటిపైనే ఆధారపడాల్సి వస్తుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పాఠశాలలకు విద్యార్థులు సైతం ఆట్లోనే వెళ్లుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాల్లో విషాదం నెలకొననుంది. ఆర్టీసీ బస్సుల్లేక గ్రామీణ ప్రజల అవస్థలు ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణం తరచూ ప్రమాదాలు -
నడిచి వెళ్లాలి
మా గ్రామానికి అసలు బస్సు సౌకర్యమే లేదు. మా గ్రామస్తులు ఎక్కడికై నా నడిచి వెళ్లాల్సి వస్తోంది. హంద్రీ నది దాటి గోరంట్ల గ్రామానికి వెళ్తున్నారు. అక్కడి నుంచి వెల్దుర్తి, కోడుమూరు, కర్నూలుకు బస్సులు ఉన్నాయి. వర్షాలు వచ్చి హంద్రీ నది వస్తే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. – కృష్ణయ్య, ఎస్‌హెచ్ ఎర్రగుడి ఒక్క బస్సు లేదు గతంలో డోన్ నుంచి ఓబులాపురం మీదుగా మా గ్రామం నుంచి కోడుమూరుకు ప్రతి రోజూ ఐదు సార్లు బస్సులు తిరిగేవి. ఇప్పుడు ఒక్క బస్సు సౌకర్యం లేదు. డోన్‌కు రావాల న్నా, మండల కేంద్రమైన కృష్ణగిరి వెళ్లాలన్నా ఆటోలు దిక్కు అవుతున్నాయి. బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. – రామచంద్రుడు, కటారుకొండ చర్యలు తీసుకుంటాం డోన్ బస్సు డిపో పరిధిలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండల్లాలోని పలు గ్రామాలకు గతంలో బస్సులు తిరిగేవి. కానీ ఆ దారుల్లో ఆటోలు ఎక్కవ కావడంతో బస్సు సర్వీసులు నిలిపివేశారు. ఇప్పుడు మరోమారు ఆ దారుల్లో అవసరాన్ని బట్టి బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటాం. – శశిభూషణ్, ఆర్డీసీ డీఎం, డోన్ -
ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే నిదర్శనం. అర్హులు రుణాలు అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అడ్డదారిలో రుణాలు దక్కించుకున్న వాళ్లు ఎంచక్కా షి‘కారు’ చేస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగులను బుట్టలో వేసుకొని రుణాలు తిరిగి చెల్లించకుండా
గడువులోగా అర్జీలకు పరిష్కారం కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇన్చార్జ్ కలెక్టర్‌తో పాటు డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. సీఎంఓ గ్రీవెన్స్‌లకు సంబంధించి కర్నూలు ఆర్డీఓ దగ్గర 23, ఆదోని సబ్ కలెక్టర్ దగ్గర 23, పత్తికొండ ఆర్డీఓ దగ్గర 7, సర్వే ఏడీ దగ్గర 2 వ్యవసాయ, డీఆర్డీఏ, డ్వామా పీడీల దగ్గర ఒక్కో అర్జీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని గడువులోపు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి కౌలు రైతులను గుర్తించాలన్నారు. జిల్లాకు 25 వేల సీసీఆర్సీ కార్డులను ఇప్పించేలా లక్ష్యం నిర్దేశించారన్నారు.హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.రూ.16,58,300లకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎస్టీఎఫ్డీసీ లోన్ రూ.9,94,980 కాగా, ట్రైకార్ సబ్సిడీ రూ.5,80,405లుగా నిర్ణయించారు. అలాగే లబ్ధిదారుని వాటా రూ.82,915 చెల్లించిన వారికి వాహనాలు కేటాయించారు. రూ.10.60 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎస్టీఎఫ్డీసీ లోన్ రూ.6.36 లక్షలు, సబ్సిడీ రూ.3.71 లక్షలు కాగా.. లబ్ధిదారుని వాటా రూ.53 వేలు చెల్లించిన వారికి బొలెరో వాహనాలను అందించారు. ఇన్నోవా కారు రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో లోన్ రూ.6 లక్షలు కాగా, సబ్సిడీ రూ.3.50 లక్షలు. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి ట్రాక్టర్లు మంజూరైంది. ఇన్నోవా కారురెడిమేడ్ గార్మెంట్ యూనిట్ యూనిట్ ఏర్పాటుకు రూ.10 లక్షలను మంజూరు చేశారు. ఇందులో లోన్ 8.50 లక్షలు, సబ్సిడీ రూ.లక్ష. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి రుణం మంజూరు చేశారు. ఫైల్‌పై ఆరా తీస్తున్నాం ఎన్ఎస్టీఎఫ్డీసీ రుణాలకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిన విషయంపై ఆరా తీస్తున్నాం. ఎవరైనా కావాలని ఫైల్‌ను మాయం చేశారా? లేక కార్యాలయంలోనే ఎక్కడైనా మిస్ అయ్యిందా? అనే కోణంలో విచారణ చేయిస్తున్నాం. అప్పట్లో కార్యాలయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులు ఫైల్‌ను తమ ప్లేస్‌లోకి వచ్చిన వారికి అప్పగించారా, లేదా అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. ఫైల్ కనిపించకుండా పోవడం వల్ల ఈ పథకం కింద తీసుకున్న రుణాల రికవరీ కష్టతరమవుతోంది. – కె.తులసీదేవి, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారిణిగిరిజన సంక్షేమ శాఖలో రుణాల ఫైల్ గల్లంతు ● 2018–19లో 11 మందికి రూ.1.57 కోట్ల రుణాలు ● ఇందులో 7 ఇన్నోవా, 2 బొలేరో వాహనాలు ● కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన రుణం రూ.96.86 లక్షలు ● ఇప్పటి వరకు చెల్లించింది రూ.10.45 లక్షలు ● రికవరీ తక్కువగా ఉందని ఉన్నతాధికారుల అసహనం ● షూరిటీ ఇచ్చిన వారికి నోటీసులు పంపేందుకు కనిపించని ఫైల్ బొలెరో వాహనం -
కూరగాయల సాగుకు తగ్గిన ప్రోత్సాహం
● సబ్సిడీపై విత్తనాల పంపిణీ సున్నా ● గత ఏడాది 6,976 ఎకరాల్లో కూరగాయల సాగు ● అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు ● భారీగా పెరుగుతున్న ధరలు ● ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులుకర్నూలు(అగ్రికల్చర్): నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. కూరగాయల సాగుకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడం ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రసుత్తం మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులు పండించిన ధాన్యం, వేరుశనగ, కందులు, కొర్రలు, సజ్జలతో సహా కూరగాయలు అమ్మడానికి పోతే తక్కువ ధరలు లభిస్తున్నాయి. కొనడానికి పోతే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా రైతులకు సాగు భారమవుతోంది. డిమాండ్‌కు తగినట్టు మార్కెట్లోకి కూరగాయల సరఫరా లేకపోవడం కొరతకు కారణమవుతోంది. అంతంతమాత్రం సాగు చేసిన కూరగాయల పంటలు కూడా అకాల వర్షాలకు దెబ్బతింటుండటంతో దిగబడులు పడిపోయాయి. గత మూడు, నాలుగేళ్లతో పోలిస్తే రబీ కూరగాయల సాగు పడిపోయింది. వేసవిలో కూరగాయల కొరత ఉత్పన్నం కాకుండా సమ్మర్ క్రాప్స్‌ను ప్రోత్సహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఫలితంగా కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. కలసిరాని కూరగాయల సాగు రైతుల్లో కూరగాయల సాగుపై ఆసక్తి తగ్గిపోతోంది. 2023–24 ఈక్రాప్ ప్రకారం ఉల్లి, టమాట సహా కూరగాయల సాగు 80,614 ఎకరాల్లో ఉంది. వీటిని మినహాయిస్తే కూరగాయల పంటలు 31,868 ఎకరాల్లో సాగయ్యాయి. సాగు పుష్కలంగా ఉండటంతో కూరగాయల కొరత ఏర్పడలేదు. ధరలు పెరిగిన దాఖలాలు లేవు. 2024–25 సంవత్సరంలో టమాట, ఉల్లితో సహా కూరగాయల సాగు 26,087 ఎకరాల్లో ఉంది. ఉల్లి, టమాట పంటలే 22,736 ఎకరాల్లో సాగయ్యాయి. ఈ పంటలను మినహాయిస్తే కేవలం కూరగాయల పంటలు 3,351 ఎకరాలకే పరిమితం అయ్యాయి. 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25లో కూరగాయల సాగు కలసి రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతంతమాత్రం సాగైన పంటలు కూడా అధిక వర్షాలు, అకాల వర్షాలతో దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడులు పడిపోయి కొరత ఏర్పడటం ధర పెరుగుదలకు కారణమవుతోంది. టమాట ధర పెరిగే అవకాశం గత ఏడాది మే నెలతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం టమాట, బెండ ధరలు మాత్రమే ఊరట కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో టమాట ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం టమాట సాగు పూర్తిగా పడిపోయింది. మదనపల్లి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి టమాట దిగుమతి అవుతోంది. అక్కడ కూడా పంట క్రమంగా తగ్గుతోంది. దీంతో రానున్న రోజుల్లో టమాట ధరలు కూడా పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వెల్దుర్తి, కోడుమూరు, క్రిష్ణగిరి, గూడూరు, సీ.బెళగల్, డోన్ తదితర ప్రాంతాల్లో కూరగాయల ధర మండుతోంది. చాలాచోట్ల కూరగాయల ధరలు రూ.100 వరకు చేరాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువు ● కూరగాయల కొరత ఏర్పడకుండా సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ● కూటమి ప్రభుత్వంలో కూరగాయల సాగుకు ఎ లాంటి ప్రోత్సాహం లభించని పరిస్థితి నెలకొంది. ● సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు ఉన్నా ఆచరణలో అమలు కావడం లేదు. ● 50 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉన్నా 2024–25 సంవత్సరంలో ఒక్క రైతుకు కూడా విత్తనాలు ఇవ్వకపోవడం గమనార్హం.ధరల పెరుగుదల ఇలా.. కూరగాయ ఏప్రిల్ మే పేరు 11న ధర 11న ధర వంకాయ 16/24 34/48 కాకర 30 54 క్యాలీఫ్లవర్ 30 44 క్యారెట్ 24 40 బీన్స్ 80 100 చిక్కుడు 50 70 క్యాప్సికం 50 64 పచ్చిమిర్చి 30 54 బీర 36 50 -
మంత్రాలయంలో కన్నడ సినీ నటులు
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థమై కన్నడ సినీ నటులు మంత్రాలయం వచ్చారు. ఆదివారం రాత్రి కన్నడ సినీ నటుడు ఉపేంద్ర కుటుంబ సభ్యులు, కన్నడ సినీ నటి శ్రీమతి తార వేర్వేరుగా మంత్రాలయం వచ్చారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుదేంధ్ర తీర్థులు నటులకు రాఘవేంద్రుల జ్ఞాపిక, శేషవస్త్రం, ఫలపూలమంత్రాక్షితులతో ఆశీర్వాదం చేశారు. -
రాష్ట్రంలో అరాచక పాలన!
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు చేసిన దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సీఐ సుబ్బరాయుడిపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ... రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు కల్పన విషయంలోను పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. మహిళ అని చూడకుండా రాత్రి పోలీసు స్టేషన్‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవ రెడ్డి విషయంలోను పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. పవన్‌కళ్యాణ్ ఎక్కడ? ఎన్నికల ముందు 30 వేల మంది మహిళలు కనిపించడంలేదంటూ ఊగి..ఊగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సభల్లో మాట్లాడారని ఎస్వీ గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్క మహిళనైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అవుతుందని, ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు చేయడం చేతకాక ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. సినీ నటుడు పోసాని మురళిపై అక్రమంగా 16 కేసులు నమోదు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని..వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. తప్పు చేసిన పోలీసులకు శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు, కల్లా నరసింహారెడ్డి, ధనుంజయ ఆచారీ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసుల దాష్టీకం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
అప్పులే ఉరితాడై..
● ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి కర్నూలు: కుమారుడు చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో తండ్రి వెంకటేశ్వర్లు (50) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కర్నూలు పాతబస్తీలోని చిత్తారి వీధిలో నివసిస్తున్నాడు. కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న స్వర్ణ కార కాంప్లెక్స్‌లో బంగారు దుకాణం నడుపుతున్నాడు. ఈయన భార్య పద్మావతి ఐదు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందింది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉండేవాడు. ఈయన కొడుకు రాఘవేంద్ర బీటెక్ పూర్తి చేసి వెంకాయపల్లె వద్ద ఒక ఇంజినీరింగ్ కళాశాలలో పెయింగ్ గెస్ట్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం దాదాపు రూ.30 లక్షలు వరకు అప్పు చేశాడు. ఈయన కూతురు హర్షవర్ధిని డెన్మార్క్‌లో చదువుతోంది. కొడుకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం, భార్య గుండెపోటుతో మృతిచెందడంతో ఈయన మనోవేదనకు గురై ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో వైర్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఈయన తల్లి రామకోటమ్మ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుండగా వెంకటేశ్వర్లు రెండో అంతస్థులో ఉంటాడు. మధ్యాహ్నాం భోజనం కోసం తల్లి రామకోటమ్మ బెల్ కొట్టినప్పటికీ కొడుకు రాకపోవడంతో పైకెక్కి చూడగా ఉరికి వెళాడుతూ కనిపించాడు. ఇరుగు పోరుగు సాయంతో ఉరి నుంచి తప్పించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సింహ వాహనంపై పాండురంగడు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం స్వామివారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యులు స్వామివారికి పంచామృతాభిషేకం, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, గణపతి పూజ, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి ప్రత్యేక అలంకరణలో పాండురంగడు సింహ వాహనంపై దర్శన మివ్వడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం నుంచి గాంధీసెంటర్ వరకు గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి శేషవాహనంపై దర్శనమిస్తారని ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
శ్రీమఠం... భక్తజన సంద్రం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయానికి కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగాతీరం, మధ్వ కారిడార్, నది కారిడార్, మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి దర్శన క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. మూలబృందావన దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. అన్నపూర్ణ భోజన, పరిమళ ప్రసాదం కౌంటర్లు రద్దీగా దర్శనమిచ్చాయి. ముందుగా భక్తులు గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకుని రాఘవేంద్రుల దర్శనం చేసుకున్నారు. భక్తుల రాకతో పురవీధులు కళకళలాడాయి.శ్రీశైలంలో భక్తుల సందడి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
వైభవంగా నరసింహ జయంతి
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి జయంతి వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు, సూపరింటెండెంట్ రామ్ మోహన్‌రావు ఆధ్వర్యంలో వేదపండితులు జ్వాళా చక్రవర్తి, కళ్యాణ చక్రవర్తి, ప్రధాన అర్చకుడు మద్దిలేటి స్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమద్దిలేటి నరసింహస్వామికి సుప్రభాత సేవలు, ప్రత్యేక పూజలు, విశ్వక్సేనారాధన, నరసింహహోమం పంచామృత సహిత విశేష ద్రవ్య తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రంలో మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణల మధ్య స్వామి, అమ్మవార్లను పల్లకీలో కొలువుంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. -
పాతికేళ్ల తర్వాత..
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం వేడుకగా సాగింది. 1999–20లో 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూదూర ప్రాంతాల్లో స్థిరపడిన సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై చేరి ఒకరినొకరు పలకరించుకోని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి గురువులు భాస్కర్‌రెడ్డి, జోజిరెడ్డి, మౌలాళి, ఆంథోనమ్మ, చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్, రాజ్‌కుమార్‌రెడ్డి, సుందరయ్యలను ఘనంగా సన్మానించారు. -
రైతును కాటేసిన రాత్రి కరెంట్
కోసిగి: వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళ విద్యుత్ సరఫరా ఇస్తుండటంతో రైతు ప్రాణం కోల్పోయాడు. పగటి సమయంలో విద్యుత్ సరఫరా ఉంటే ఇంటి పెద్ద బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన బాపుల దొడ్డి మునిస్వామి(63) పొలంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... మునిస్వామికి మూడు ఎకరాల పొలం ఉంది. ఇటీవల వేరుశనగ పంట సాగు చేశాడు. పొలంలోని వ్యవసాయ బోరులో నీరు అడుగంటడంతో శనివారం అదనంగా పైపులైన్లు వేశారు. తెల్లవారుజామున 3గంటలకు విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. పైరుకు నీళ్ల పెట్టాలని తన చిన్న కుమారుడు నల్లారెడ్డితో కలిసి బాపుల దొడ్డి మునిస్వామి పొలానికి వెళ్లాడు. పైరుకు నీళ్లు కట్టే పనిలో కుమారుడు నిమగ్నమై ఉన్నాడు. కొత్తగా పైప్‌లైన్ దింపిన బోరు నుంచి నీళ్లు వస్తున్నాయా లేదా అని మునిస్వామి పరిశీలిస్తున్నాడు. పైప్‌లైన్ పట్టుకోగా విద్యుత్ ఎర్తింగ్ కావడంతో షాక్‌కు గురై అక్కడే కుప్పకూలిపోయాడు. కుమారుడు గమనించి తండ్రిని లేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రైవేట్ వాహనంలో కోసిగి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతినికి భార్య పార్వతి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాత్రి వేళ విద్యుత్ సరఫరా ఇవ్వడంతోనే మునిస్వామి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో అన్నదాత మృతి -
ఖర్చు పెరిగింది
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. వీటికి తోడు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ తీసుకున్నా కిలో ధర రూ. 50 పైగా ఉంది. మా కుటుంబానికి నెలకు రూ. 15,000 ఆదాయం ఉంది. ఇందులో కూరగాయలు, నిత్యావసర వస్తువులకే రూ.6,000 వరకు ఖర్చు అవుతుంది. నాలుగు నెలల క్రితంతో పోలిస్తే రూ.2000 వరకు ఖర్చు పెరిగింది. ప్రభుత్వం చొరవ తీసుకొని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. – నిర్మలభాయి, కృష్ణానగర్, కర్నూలు కొనలేం తినలేం ధరలు పెరగడంతో కూరగాయలు కొని తినలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబానికి ఆదాయం పెరగడం లేదు. నిత్యావసర ధరలు ఇంకా పెరుగుతాయి అంటున్నారు. ఇప్పటికే బియ్యం, పప్పులు, వంటనూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. నెలకు నాలుగైదు వేల రూపాయల వరకు ఖర్చులు ఉన్నాయి. ప్రభుత్వం ధరల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. – కె. రత్నమ్మ, కర్నూలు -
జిల్లా అంతటా అప్రమత్తం
కర్నూలు: దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులతో ఆదివారం జిల్లా అంతటా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటలకు తావులేకుండా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ అధికారుల పర్యవేక్షణలో తనిఖీలు సాగుతున్నాయి. ముఖ్యంగా రవాణా వాహనాలపై దృష్టి సారించారు. పార్సల్ కార్యాలయాలు, మార్కెట్ల నుంచి సరుకులు తరలించే వాహనాలను క్షుణంగా తనిఖీ చేశారు. తనిఖీలు ఇలా.. జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వ్యాపార వాణిజ్య సముదాల ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్త్రృత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసపుకోని విచారిస్తున్నారు. కర్నూలు రైల్వే స్టేషన్లో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శ్రీధర్, నాగరాజారావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రైల్వే పరిసర ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్లను అప్రమత్తం చేసి వారికి ముందస్తూ జాగ్రత్తల గురించి తెలియజేశారు. యాంటీసబోటేజ్(విధ్వంస వ్యతిరేక)తనిఖీ చేపట్టారు. అదే సమయంలో కాచిగూడ నుంచి గుంతకల్లుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో అగుగడుగున తనిఖీలు చేసి అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో కూడా బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులు తారస పడితే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు -
రసవత్తరంగా గార్ధభాల పోటీలు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన గార్ధభాల పోటీలు రసవత్తరంగా సాగాయి. దేవాలయం నుంచి అంకాలమ్మ చౌరస్తా వరకు గార్ధభాలల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. జిల్లాలోని ఆళ్లగడ్డ, చాగమర్రి, అవుకు, వెలుగోడు మండలాలకు చెందిన 13 గార్ధభాలు పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలను ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బీవీ ప్రసాదరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు కానాల రవీంద్రనాథరెడ్డి ప్రారంభించారు. 220 కిలోల ఇసుక బస్తాలతో నిర్ణీత పది నిమిషాల వ్యవధిలో ఎక్కువ దూరం పరిగెత్తి విజేతగా నిలిచిన అవుకు మండలం మెట్టుపల్లెకు చెందిన నరసింహ గార్ధభం రూ. 15 వేలు కై వసం చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం బాచిపల్లెకు చెందిన చిన్నరంగ గార్ధభం రెండవస్థానంలో నిలిచి రూ. 10 వేలు, చాగలమర్రి మండలం పెద్దవంగలి పాములేటి గార్ధభం మూడవస్థానంలో నిలిచి రూ. 7,500 గెలుపొందాయి. వెలుగోడు మండలం వేల్పనూరు సురేంద్ర గార్ధభం నాల్గవస్థానంలో నిలిచి రూ. 5వేలు, ఆళ్లగడ్డ మండలం బాచిపల్లె నాగేషు గార్ధభం ఐదవస్థానంలో నిలిచి రూ. 2,500 దక్కించుకున్నాయి. కార్యక్రమంలో నిర్వాహకులు కరిమద్దెల మురళీ, గడ్డం నాగేశ్వరరెడ్డి, గడ్డం రామకృష్ణారెడ్డి, సహదేవరెడ్డి, మనోహర్, రాజు, నాగేంద్ర, శిలువయ్య పాల్గొన్నారు. -
కమనీయం.. కల్యాణోత్సవం
కౌతాళం: నరసింహస్వామి జయంతి వేడుకల సందర్భంగా ఉరుకుంద దేవాలయంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఉదయం సుదర్శన హోమం పూర్తి చేశారు. తరువాత భక్తులు కూడా పాల్గొని హోమాలు చేపట్టారు. స్వామి వారి మూలవిరాట్‌ను వెండి ఆలంకరణలో ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చస్త్రశారు. దేవాలయపు డిప్యూటీ కమిషనర్ విజయరాజు, తహసీల్దారు రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.తెలంగాణ ఈఏపీసెట్‌లో 18వ ర్యాంక్● పత్తికొండ విద్యార్థి ప్రతిభపత్తికొండ రూరల్: తెలంగాణ ఈఏపీసెట్‌లో పత్తికొండ విద్యార్థి కప్పట్రాళ్ల చెన్నకేశవ ప్రతిభ కనబరిచాడు. మొత్తం 160కి గాను 136.69 మార్కులు సాధించి 18వ ర్యాంకు సాధించాడు. ఉపాధ్యాయురాలు కల్యాణికుమారి, రమేష్ దంపతుల కుమారుడైన కప్పట్రాళ్ల చెన్నకేశవ పదో తరగతిలో 579 మార్కులు సాధించాడు. హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్ చదివి 991మార్కులు తెచ్చుకున్నాడు. ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా 206 ర్యాంకు సాధించాడు. తెలంగాణ ఈఏపీసెట్‌లో 18వ ర్యాంకు సాధించిన కుమారుడిని తల్లిదండ్రులు అభినందించారు.రేపు గోరుకల్లుకు ఎక్స్‌ఫర్ట్ కమిటీ రాకపాణ్యం: మండల పరిధిలోని గోరుకల్లు జలాశయానికి మంగళవారం( రేపు) ఎక్స్‌ఫర్ట్ కమిటీ రానున్నట్లు ఇంజినీర్లు ఆదివారం తెలిపారు. ఇటీవల గోరుకల్లు జలాశయం కట్ట కుంగిన విషయం తెలిసిందే. అయితే పదేపదే కట్ట ఒకే చోట కుంగిపోవడంతో ఇంజినీర్ల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎక్స్‌ఫర్ట్ కమిటీని నియమించింది. దీంతో ఈ కమిటీ 13న పర్యటించనుంది. డ్యామ్‌ను పరిశీలించిన తర్వాత తగు సూచనలు జారీ చేయనున్నారు.ఆర్యూ, పీజీ కళాశాలలకు వేసవి సెలవులుకర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ, అనుబంధ పీజీ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. వర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు ఆదేశాల మేరకు జూన్ 15వ తేదీ వరకు సెలవులు ఇచ్చినట్లు వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ భరత్‌కుమార్ పేర్కొన్నారు. 16వ తేదీ పునఃప్రారంభమవుతుందని తెలిపారు. పీజీ కళాశాలల ప్రిన్సిపాల్స్ షెడ్యూల్‌ను పాటించాలని పేర్కొన్నారు.నేటి పరిష్కార వేదిక రద్దుకర్నూలు(సెంట్రల్): ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు ఇన్చార్జి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎక్కువ మంది పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో ఉండడంతోనే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.రూ.10.25 లక్షల మోసంకర్నూలు(సెంట్రల్): సెల్‌ఫోన్‌కు వచ్చిన చిన్న సందేశాన్ని చూసి ఒక వ్యక్తి మోసం పోయి రూ.10.25 లక్షలు పోగొట్టుకున్నాడు. కర్నూలు రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కర్నూలులోని అమీన్ అబ్బాస్ నగర్లో ఉదయ్‌కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆయన సెల్‌ఫోన్‌కు అలైస్ బ్లూ అనే సంస్థలో పెట్టుబడి పెడితే పెద్ద లాభాలు వస్తాయని మెస్సేజ్ వచ్చింది. దానిని చూసిన ఆయన తన వద్ద ఉన్న రూ.10.25 లక్షలను అందులో పెట్టాడు. చివరకు మోసపోయానని తెలుసుకుని ఆదివారం రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సైబర్ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుకర్నూలు సిటీ: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి(సోమ వారం)నుంచి మొదలై ఈ నెల 20వ తేదీ వరకు సాగనున్నాయి. ఇందుకు జిల్లాలో 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంచాలి
డోన్ టౌన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంచాలని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. పట్టణంలోని శ్రీసుధ సీబీఎస్సీ సిలబస్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన జన విజ్ఞాన ప్రాంతీయ ఉమ్మడి జిల్లాల వేదిక వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అభివృద్ధితో పాటు సైన్స్ ఆలోచనలు పెరగాలని, శాస్త్ర పరిశోధనలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. పిల్లల్లో ప్రశ్నించే తత్వం పెరగాలన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రజల ప్రగతి కోసం, స్వావలంబన కోసం, దేశ అభివృద్ధి కోసం, సామాజిక విప్లవం కోసం పని చేస్తుందన్నారు. జేవీవీ కార్యకర్తలు సైతం ఆ దిశగా పనిచేయాలన్నారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందించాలని చెప్పారు. శాసీ్త్రయ దృక్పథం పెంచేందుకు విరివిగా కళా జాతలు, చెకుముకి టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్ఫేర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి మాణిక్యం శెట్టి, రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంగన్న, నాయకులు భాస్కర్, కర్నూలు, అనంతపురం ఉమ్మడి నాలుగు జిల్లాల ప్రధాన కార్యదర్శులు రామిరెడ్డి, లక్ష్మీనారాయణ, ఆదేశేషు, మహేందర్‌రెడ్డి, ఖాజా హుస్సేన్, సుధీర్, జేవీవీ సమతా నాయకులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నర్సెస్ అసోసియేషన్ రూమ్‌ను మరమ్మతు చేయించాలి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా హెడ్‌నర్సు, నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు పెంచాలి. ఆసుపత్రిలో పనిచేస్తున్న హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులకు ఐదు రోజులు అదనపు క్యాజువల్ లీవ్‌లు మంజూరు చేయాలి. కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులను రెగ్యులరైజ్ చేయాలి. వారికి వంద శాతం వేతనం ఇవ్వాలి. –శాంతిభవానీ, ఉపాధ్యక్షురాలు, ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం, కర్నూలు ఎంతో సంతృప్తి నేను 2020 నుంచి మేల్ నర్సుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నా. మధ్యలో కోవిడ్ సమయంలో కర్నూలులోని టిడ్కో గృహాల్లో కోవిడ్ డ్యూటీ చేశా. ఆ సమయంలో రోగులకు అందించిన సేవలు మరువలేనివి. ఎంతో ధైర్యం, మనోనిబ్బరంతో వారికి ధైర్యం చెబుతూ వైద్యసేవలు అందించా. ఆ తర్వాత తిరిగి గోనెగండ్ల పీహెచ్సీలో స్టాఫ్‌నర్సుగా చేరి, ప్రస్తుతం కోసిగి పీహెచ్సీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నా. ఇక్కడ ప్రతిరోజూ 150 మంది దాకో ఓపీ రోగులు వస్తుంటారు. వారందరికీ ఎంతో ఓపికతో వైద్యసేవలు అందిస్తున్నా. –పి. సుధాకర్, మేల్ నర్సు, కోసిగి పీహెచ్సీ -
రోగంతో బాధపడుతూ.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రుల్లో చేరిన వారికి మేమున్నామని ఆదరణ, ఆప్యాయతతో ధైర్యం చెప్పే వారే నర్సులు. కుటుంబసభ్యులు కూడా చేయలేని సేవలను ఆసుపత్రుల్లో రోగులకు నర్సులు చేస్తున్నారు. అపస్మారక స్థితిలో వైద్యం అందుకుంటున్న వారి
క్యాజువాలిటీలో రోగులకు చికిత్స చేస్తున్న నర్సులు (ఫైల్)కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 776 మంది వివిధ రకాల హోదాల్లో నర్సులు పనిచేస్తున్నారు. వీరే గాక జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరో 1200 మందికి పైగా నర్సులు సేవలందిస్తున్నారు. వీరితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 2వేల మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు గ్రామాల్లో 400లకు పైగా కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లు(ఎంఎల్‌హెచ్‌పీలు), వెయ్యి మంది దాకా ఏఎన్ఎంలు నర్సింగ్ సేవలు అందిస్తున్నారు. గత రెండు వారాలుగా జిల్లాలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లు పనిచేయడం లేదు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సీహెచ్‌వోలు సమ్మె చేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామీణ ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలకు వెళ్తున్నారు. సాధారణంగా వైద్యులు రోగికి అవసరమైన పరీక్షలు చేయించి చికిత్స అందిస్తే ఆ తర్వాత ఆ చికిత్సను పర్యవేక్షించాల్సిన బాధ్యత నర్సులదే. రోగికి మందులు అందించడంతో పాటు అవసరమైతే వారికి సపర్యలు కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి ఎంతో ఓపిక, సహనం అవసరం. ఈ మేరకు అవసరమైన మెళకువలన్నీ నర్సింగ్ విద్యలో వారికి నేర్పిస్తారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు నర్సింగ్ వృత్తి వ్యవస్థాపకులు మిస్ ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820వ సంవత్సరం మే 12వ తేది ఇటలీ దేశ సందర్శనకు వెళ్లిన సమయంలో ఇంగ్లిష్ దంపతులకు జన్మించారు. నైటింగేల్ బాగా ఆర్థిక, ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబంలో జన్మించిన కారణంగా ఆ తరంలోనే ఆమె స్కూల్ స్థాయి వరకు చదువుకున్నారు. క్రిమియన్ యుద్ధ సమయంలో క్షతగాత్రులకు ఆమె అందించిన వైద్యసేవలకు గాను అక్కడి ప్రభుత్వం ఆమెకు లేడి ఆఫ్ ల్యాంప్ అవార్డునిచ్చి సత్కరించింది. ఆ తర్వాత ఆమె లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో నైటింగేల్ స్కూల్‌ను ప్రారంభించింది. నర్సింగ్ వృత్తికి ఆమె చేసిన సేవలకు గాను ప్రతి సంవత్సరం ఆమె జయంతి మే 12వ తేదిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా పాటిస్తున్నారు. సేవకు ప్రతిరూపం నర్సులు రోగుల చికిత్సలో వైద్యుల తర్వాత వారే జిల్లా వ్యాప్తంగా 4 వేల మంది నర్సులు గ్రామాల్లో సీహెచ్ఓలదే ముఖ్యపాత్ర వైద్యుల తరహా సేవలందిస్తున్న వైనం నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం -
రాష్ట్రంలో దళితుల హత్యలు బాధాకరం
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని మాదిగ జేఏసీ కమిటీ చైర్మన్ ఆర్జే ప్రకాష్ మాదిగ అన్నారు. మొత్తం 11 నెలల కాలంలో ఇద్దరు దళిత నేతలను హత్య చేయడం బాధాకరమన్నారు. కర్నూలు జిల్లాలో దళిత నేతలు చిప్పగిరి లక్ష్మీనారాయణ, కర్నూలులో మాజీ కార్పొరేటర్ సంజన్న దారుణ హత్యకు గురైనా సరైనా విచారణ చేయడంలో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ప్రశ్నించారు. కర్నూలులోని మీడియా పాయింట్లో ఆదివారం మాదిగ నేతలు సమావేశమై జేఏసీగా ఏర్పాడ్డారు. చైర్మన్‌గా ఆర్జే ప్రకాష్, ఉపాధ్యక్షుడిగా టీఎంరమేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పత్తికొండ సుభాష్ మాదిగలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చిప్పగిరి లక్ష్మీనారాయణ కేసులో సూత్రధారులపై ఎందుకు విచారణ జరపడంలేదని ప్రశ్నించారు. వైకుంఠం కుటుంబీకులపై అనుమానం ఉందని హతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అక్రమాలు, షటిల్మెంట్ల గొడవలతోనే చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకు గురైనట్లు పోలీసులు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేటర్ సంజన్న హత్యపై కూడా పోలీసుల సరైన విచారణ చేయలేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకల్లు సోమసుందరం పాల్గొన్నారు. మాదిగ జేఏసీ కమిటీ చైర్మన్ ఆర్జే ప్రకాష్ మాదిగ -
ఘనంగా ఖాదర్‌లింగ స్వామి ఉరుసు
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఆదివారం ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దర్గా ప్రాంతం కిటకిటలాడింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే తెల్లవారు జామున 3 గంటలకు దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తి ఇంటి నుంచి గంధం తీసుకెళ్లారు. డప్పువాయిద్యాలు, బ్యాండు మేళాల మధ్య ఈ ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా ఫక్కీర్లు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గంధం దర్గాకు చేరిన అనంతరం ధర్మకర్తతో కలిసి దర్గా పీఠాధిపతి ప్రత్యేక ఫాతెహాలు నిర్వహించారు. దీంతో ఉరుసు ప్రారంభమైనట్లు ప్రకటించారు. కాగా ఈఉత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధర్మకర్త పూర్థిసాయిలో ఏర్పాట్లు చేశారు. దర్గాలో ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి వరకు తగ్గలేదు. దర్శనం కోసం గంటకుపైగా వేచి ఉండాల్సి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గంధం ఉత్సవానికి తరలివచ్చిన దర్గా పీఠాధిపతులు గంధం ఉత్సవానికి వివిధ దర్గాల పీఠాధిపతులు తరలివచ్చారు. బీదర్, రాయచూర్, సిందనూర్, కర్నూలు ఖాలిక్ లింగ దర్గాల పీఠాధిపతులు స్వామి సన్నిధిలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో కర్ణాటకలోని సర్మస్వలి దర్గా నిర్వాహకుడు దూద్బాష, తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఆకట్టుకున్న ఫక్కీర్ల విన్యాసాలు -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
గడివేముల: ఎల్కే తండా గ్రామంలో ప్రమాదవశా త్తూ విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రా మానికి చెందిన వెంకట్ నాయక్ (50) మేకలు మేపు కుంటూ జీవనం సాగించేవాడు. మేక పిల్లలకు మేత కోసం చెట్టు పైకి ఎక్కి మేత కోస్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి భార్య పార్వతి బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుమానంతో చంపేశాడు!
బేతంచెర్ల: ఓ వ్యక్తి అనుమానంతో భార్యను కడతేర్చాడు. భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పరారయ్యాడు. ఈ ఘటన బేతంచెర్లలో చోటు చేసుకుంది. స్థానిక గౌరిపేట కాలనీకి చెందిన షేక్ రసూల్‌తో నంద్యాల పట్టణానికి చెందిన జకియా బేగం(37)కు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. షేక్ రసూల్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. సవ్యంగా సాగిపోతున్న వీరి సంసారంలో గత కొన్ని రోజులుగా భార్యను అనుమానంతో వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గొడవ పడి కోపంతో భార్య గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు. జకియా బేగం కుటుంబీకులకు ఆత్మహత్య చేసుకుందని రసూల్ నమ్మించే ప్రయత్నం చేశాడు. కాగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లభించకపోవడంతో అందరూ నిలదీయడంతో పరారయ్యాడు. మృతురాలి తమ్ముడు సయ్యద్ అజ్మతుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
వివాహిత బలవన్మరణం
నందవరం: క్షణికావేశంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జోహరాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కేశవ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురవ శంకర్‌తో కొన్నేళ్ల క్రితం మెరుగుదొడ్డికి చెందిన కురవ మల్లేశ్వరి(34)కి వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. శంకర్ మూడేళ్ల క్రితం గంగవరం గ్రామ సమీపంలో 1.88 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. అయితే ఆ పొలానికి రస్తా లేకపోవడంతో మల్లేశ్వరి తరచూ భర్తతో గొడవ పడేది. శుక్రవారం ఉదయం కూడా వారి మధ్య ఈ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మన స్తాపం చెందిన మల్లేశ్వరి అదే రోజు రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోవడంతో భర్త గమనించి చికిత్స నిమిత్తం వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మల్లేశ్వరి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి సోదరుడు రుద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. వెరిటాస్ సైనిక్ స్కూల్‌కు భారత ప్రభుత్వ అనుమతి తిరుపతి కల్చరల్: తిరుపతిలో గత 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్యతో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందడం జరిగిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాపటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారిచే అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యను అందస్తూ ఆదరణ పొందామన్నారు. భారత ప్రభుత్వం గుర్తింపుతో మరింత బాద్యతగా దేశ భద్రత కోసం వెరిటాస్ సైనిక్ స్కూల్ ముందడుగు వేస్తోందన్నారు. విద్యాసంస్థలో ప్లస్–1 ఇంటర్ మీడియట్‌తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వైరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి.శ్రీకర్‌రెడ్డి, బి.సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. -
చెరువులో చేపలు.. అడవిలో చిటిమిటి పండ్లు
‘వేసవి సెలవుల జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోలేం. మిత్రులతో ఆటలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో గిల్లికజ్జాలు, అమ్మకు తోడుగా చిన్న చిన్న పనులు, చెరువులో ఈత.. ఇలా ఎన్నో సరదాలు. వేసవి సెలవులు ఒక్క రోజూ కూడా వృథా కాకుండా సద్వినియోగం చేసుకున్నాం’ అంటూ వెల్దుర్తి ఐసీడీఎస్ సీడీపీఓ పసుపుల లూక్ మనోహర్ చెబుతున్నారు. మిగతా వివరాలు ఆయన మాటల్లో.. వెల్దుర్తి: వేసవి సెలవులు వస్తే అమ్మకు సహాయం చేసేందుకు హాస్టల్ నుంచి పరిగెత్తుకు వచ్చేవాడిని. నాది కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం మహానంది పల్లె గ్రామం. మా అమ్మ లలిత, నాన్న జోజప్ప. మేము ఆరుగురు అన్నదమ్ములం, మాకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. నేను 5వ వాడిని. నాన్న టీచర్‌గా, అమ్మ గ్రామంలోనే శిశు విహార్‌లో టీచర్‌గా పని చేసేది. 9, 10వ తరగతులు రైల్వేకోడూరు మండలం బుక్కవానిపల్లెలోని ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. సెలవులు రాగానే ఇంటికి వెళ్లి అమ్మకు తోడుగా దూర ప్రాంతం నుంచి చేతిబోరు, చేదుడు బావుల నుంచి తాగునీరు తెచ్చేవాడిని. కొండల్లో కెళ్లి వంటకు కట్టెలు కొట్టుకొచ్చేవాడిని. శిశు విహార్‌లో పిల్లలకు రైమ్స్, చదువు నేర్పేవాడిని. అమ్మ గ్రామంలోను, చుట్టు పక్కల గ్రామాలకు నర్సు సేవలకు వెళ్లినపుడు నేనే శిశువిహార్‌ను చూసుకుంటూ ఆయాతో కలిసి చిన్నారులకు వడియాలు, పిండి పంచడం తదితరాలు చూసుకునేవాడిని. చేపలు కాల్చుకుని తినేవాళ్లం.. మా గ్రామం ఆనుకుని ఉన్న పెండ్లిమర్రి చెరువు ఎండాకాలం సెలవులకు వెళ్లేటప్పటికి కొంత ఎండిపోయేది. ఇక ఫ్రెండ్స్‌తో కలిసి కొద్దిపాటి నీటిలో ఈత నేర్చుకున్నాను. ఈత కొడుతూ, చేపలు పడుతూ, ఆ చేపలు అక్కడే కాల్చుకు తింటూ, ఇంటికి తెచ్చి వండుకుంటూ భలే మజా వచ్చేది. హాస్టల్లో ఎక్కువగా ఆడే బలపం ఊదే ఆట (బలపాన్ని ఫస్టు ఎవరు లైన్వరకు ఊదుతారో వారికి ఓడిన వాళ్లు తెచ్చుకున్న సజ్జరొట్టె ముక్క ఇచ్చేలా ఆడేవాళ్లం)ను సెలవులకు ఇంటికి వచ్చి అన్నదమ్ములు, అక్కచెళ్లెల్లతో, ప్రెండ్స్‌తో ఆడేవాడిని. స్వాతంత్య్రానికి పూర్వమే మా ఊర్లో మా ముత్తాత వారు స్కూలు కట్టించి, ప్రైవేట్ టీచర్‌తో చదువు చెప్పించేవారు. తర్వాత బ్రిటీష్ వారు మా స్కూల్‌ను తీసుకుని మా కుటుంబానికి ఒక టీచర్ పోస్టు ఇచ్చి రోమన్ కాథలిక్ మిషన్ పేరుతో నడిపారు. అందులోనే నేను 3వ తరగతి వరకు చదువుకున్నాను. పీజీ పూర్తి చేసుకుని మహబూబ్‌నగర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఉన్న ఐకేపీలో ఉద్యోగం చేస్తూ, ఆ తర్వాత ఐసీడీఎస్‌లో సీడీపీఓగా నా 27వ ఏట ఉద్యోగం సంపాదించాను. ప్రస్తుతం నాకు 51 ఏళ్లు. బాల్యం జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మరణీయమే. మూడు రోజుల్లో సైకిల్ నేర్చుకున్నా.. చిన్నతనం సెలవుల్లోనే మూడు రోజుల్లో సైకిల్ నేర్చుకున్నాను. 8వ తరగతి వేసవి సెలవుల్లో ఆ సైకిల్ నేర్పుతోనే 3 కి.మీలు అవతల ఉండే కలసపాడుకు వెళ్లి ట్యూషన్ చెప్పించుకుని వచ్చి ఏపీఆర్ఎస్ 9వ తరగతి ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు సంపాదించి సీటు సంపాదించాను. ఇక కట్టెలు తెచ్చేందుకు కొండల్లో కెళ్లినపుడు కుటుంబ సభ్యులం, ఫ్రెండ్స్ అంతా రేగిపండ్లు, బలిజ(పరికె) పండ్లు, చిటిమిటి పండ్లు తెంపుకుని ఇష్టంగా తినేవాళ్లం. ఎక్కువగా గ్రామంలోని ఫ్రెండ్స్‌తో ఖోఖో ఆడేవాళ్లం. అప్పుడప్పుడు గోళీకాయలు ఆడేవాళ్లం. -
పట్టుబడిన యువకుడు
డోన్ టౌన్: పట్టణంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న శ్రీనివాస నగర్లో ఓ ఇంట్లోకి చోరీకి యత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించా రు. కామగానికుంట్ల గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాసనగర్‌లో ఓ ఇంటికి తాళం వేసి ఉండగా శని వారం పట్ట పగలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అంతలోనే ఇంటి యజమానులు తిరిగి రావడంతో యువకుడిని కాలనీవాసుల సహాయంతో పట్టుకున్నారు. చెట్టుకు కట్టివేసి పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. స్నేహితులకు ఆర్థిక సాయం కొలిమిగుండ్ల: ఒకే పా ఠశాలలో చదువుకు న్న స్నేహితులు పేదరికంతో ఆర్థిక సమస్యల తో ఇబ్బందులు పడుతుండటంతో ఓ స్నేహితురాలు ఆర్థిక సాయం అందించింది. కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలలో 2002–03 పదో తరగతి బ్యాచ్ శనివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కొలిమిగుండ్లకు చెందిన కత్తి సునీత తన స్నేహితులు మీర్జాపురానికి చెందిన గోపాల్‌కు రూ.30వేలు, కనకాద్రిపల్లెకు చెందిన శ్రీలక్ష్మికి రూ.20 వేలు అందించారు. -
ఆకట్టుకున్న ఫక్కీర్ల విన్యాసాలు
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగస్వామి ఉరుసు సందర్భంగా శనివారం సాయంత్రం ఫక్కీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి తర్వాత జరిగే గంధం కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఫక్కీర్లు స్థానిక పీర్లకట్టా వద్దకు చేరుకున్నారు. వీరిని దర్గా ధర్మకర్త, వారి శిష్యరిక బృందం ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చీష్తీ, పీఠాధిపతి ఖాదర్‌బాషా చిష్తీలు ఫక్కీర్లకు స్వాగతం పలికారు. ఊరేగింపులో వారు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం దర్గాలో ప్రత్యేక ఫాతెహలు నిర్వహించారు. స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. రాత్రి నిర్వహించిన ఖవ్వాలి పోటీలు భక్తులను అలరించాయి. ఆదివారం తెల్లవారు జామున గంధం కార్యక్రమం వైభవంగా జరుగుతుందని ధర్మకర్త సయ్యద్ మున్న పాషా తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
గడివేముల: మండల కేంద్రమైన గడివేముల సమీపంలోని పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిలకల గూడూరుకు వెళ్లే రహదారి పక్కన పొలంలో వ్యక్తికి చెందిన అస్థికలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో శనివారం పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో లభ్యమైన ఎముకలను స్వాధీనం చేసుకొని వీఆర్వో హరిచంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా గడివేముల గ్రామానికి చెందిన సత్తార్ తన పొలంలో కొన్ని రోజుల క్రితం మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పుంటించడంతో ఏదో చనిపోయిన వాసన రావడంతో జంతువు కళేబరం తగలబడినట్లు రైతు భావించాడు. పొలంలో దుర్వాసన వస్తుండటంతో అనుమానంతో పరిశీలించడంతో పూర్తిగా కుళ్లిన మృతదేహం కనిపిచింది. ఈ విషయాన్ని మరో రైతుతో ఫోన్లో మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు పరిశీలించి, మృతదేహాన్ని గుర్తించడంతో దర్యాప్తు చేపట్టారు. -
భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి
● శృంగేరి పీఠాధిపతి పురుషోత్తమ భారతీ మహాస్వామి ఉయ్యాలవాడ: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని శృంగేరి పీఠాధిపతి పురుషోత్తమ భారతీ మహాస్వామి ప్రభోదించారు. గోవిందపల్లె గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన విగ్రహాల పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ధార్మికోపన్యాసంలో మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు చెప్పి జీవితాన్ని తీర్చిదిద్దిన గురువుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేమన్నారు. తల్లిదండ్రులను ప్రేమించలేని, గౌరవించలేని వారు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగినా వృథా అన్నారు. సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం, పుణ్య కార్యక్రమాలకు వెచ్చించాలన్నారు. కార్యక్రమంలో వేద పండితులు దక్షిణామూర్తి, గ్రామ సర్పంచ్ చామల ఉమాదేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు. -
ఆల్ మేవా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోిసియేషన్ (ఆల్‌మేవా)కు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పాటయ్యింది. శనివారం జిల్లా పరిషత్‌లోని మండలపరిషత్ సమావేశ మందిరంలో నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమం చేపట్టారు. నంద్యాల జిల్లా ఆల్ మేవా జనరల్ సెక్రటరీ ఎస్ఎండీ సలీమ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్రాన్‌పాషా, గౌరవ అధ్యక్షుడు ఎస్ఎండీ అబులైస్, జనరల్ సెక్రటరీ అంజాద్పాషా పర్యవేక్షించారు. జిల్లా ఆల్ మేవా అధ్యక్షుడు ముక్తార్ బాషా (పంచాయతీ రాజ్), వర్కింగ్ ప్రసిడెంటుగా మౌలీబాషా (రెవెన్యూ), అసోసియేట్ ప్రశిడెంటుగా హుస్సేన్ (నీటిపారుదల), ఉపాధ్యక్షులుగా జాకీర్ హుస్సేన్, పీఎండీ అబ్దుల్ ఖలీల్, మహ్మమ్మద్ హక్, హుస్సేన్ సాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ మహమ్మద్ రియాజ్ బాషా, అడిషినల్ జనరల్ సెక్రటరీగా సైపుల్లా బేగ్, ఇలియాస్ ఖాన్, అల్లాబకాష్, కోశాధి కారి షఫీఅహ్మద్, మహిళ సెక్రటరీగా సహరాబాను, దిల్షాద్ బేగం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుభాన్‌బాషా, షంషుల్లాఖాన్, ఎస్ఎండీ ఇంతియాజ్, జాయింట్ సెక్రటరీగా అక్బర్‌బాషా ఎన్నికయ్యారు. రాష్ట్ర నేతలు, ఎన్నికల అధికారి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు -
మనం బాగుంటే చాలు.. అవతల ఎవరేమైపోతేనేం అనుకునే రోజులివి. ప్రపంచం అరచేతిలోకి వచ్చి చేరడంతో బద్దకం ఎవరి గురించీ ఆలోచించని పరిస్థితి. నా కొడుకు డాక్టర్.. నా కూతురు ఇంజినీరు.. మా అల్లుడు ఫారిన్లో ఉద్యోగం.. మా కోడలు సాఫ్ట్వేర్.. అని చెప్పుకోవడం ఆ కుటుంబానిక
తుగ్గలి: ఆపరేషన్ సింధూర్. దేశమంతటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన పదం. ఉగ్రమూకలు చెలరేగుతున్న వేళ.. అమాయకులను పొట్టున పెట్టుకుంటున్న తరుణంలో సైన్యం ఎక్కుపెట్టిన తుపాకీ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చింది. మనమంతా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నామంటే.. సరిహద్దులో సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతుండటంతోనే సాధ్యమవుతోంది. అక్కడ ఏం జరుగుతుందో.. వాళ్లు ఎలా ఉంటున్నారో.. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటో.. కదనరంగం దృశ్యాలను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుల్లెట్ల మోత.. విరుచుకుపడే మిసైళ్లు.. దూసుకొచ్చే డ్రోన్లు.. అత్యాధునిక ఆయుధాలకు ఎదురొడ్డి నిలుస్తున్న సైనికులను చూస్తే కన్నీళ్లతో సెల్యూట్ చేయాలనిపిస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తతల వేళ అమినాబాద్ గ్రామం నిద్రలేని రాత్రులను గడుపుతోంది. ఇందుకు కారణం ఆ చిన్న గ్రామం నుంచి ప్రస్తుతం 15 మంది దాకా ఆర్టీలో పని చేస్తుండటమే. ఈ గ్రామంలో ఇప్పుడు ఎవరిని పలుకరించినా మా పిల్లలు సైన్యంలో ఉండటం తమకెంతో గర్వకారణం అనడం ఎంతో స్ఫూర్తినిస్తోంది. తుగ్గలి మండలంలోని గిరిగెట్ల పంచాయతీ మజరా గ్రామమైన అమినాబాద్‌లో 201 కుటుంబాలు ఉండగా.. 873 మంది జనాభా ఉన్నారు. గత 30 ఏళ్లలో 25 మంది ఆర్మీలో చేరారు. యువకులే కాకుండా యువతులు మేము సైతమని దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుండటం విశేషం. ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందుతూ గ్రామం తలెత్తుకునేలా సైన్యంలో సేవలందిస్తుండటం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దేశభక్తికి మారుపేరు కుటుంబాలకు దూరంగా సైన్యంలో సేవలు ప్రస్తుతం వివిధ విభాగాల్లో 15 మంది మేముసైతం అని ఇద్దరు యువతులు గర్వంగా ఉందంటున్న సైనిక కుటుంబాలు ఇప్పటికై నా యుద్ధానికి సిద్ధమంటున్న మాజీలు -
దేశ రక్షణకు ఇప్పటికై నా సిద్ధమే
నేను 1992లో బీఎస్ఎఫ్లో చేరా. జమ్మూకశ్మీర్, గుజరాత్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మణిపూర్, రాజస్థాన్, ఢిల్లీలో పనిచేశా. 2013లో రిటైర్డ్ అయ్యాను. కార్గిల్ యుద్ధంలో రాత్రింబవళ్లు అక్కడే ఉంటూ శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాం. మా గ్రామం నుంచి ఏటా కొందరు సైన్యంలో చేరి దేశరక్షణలో పాల్గొంటుండటం గర్వకారణం. అమాయకులైన పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల స్థావరాలను తుద ముట్టడించడమే లక్ష్యంగా భారత సేనలు ముందుకు వెళ్లడం గొప్ప విషయం. ఆ దేశ పౌరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత సైన్యంలో 21 ఏళ్లపాటు పని చేసిన అనుభవం ఉంది. దేశ భద్రత కోసం బాధ్యతలు చేపట్టేందుకు ఎప్పుడూ సిద్ధమే. – మండపాటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ జవాన్, అమినాబాద్ -
దేశ సేవలో హెబ్బటం యువకులు
హొళగుంద: మండల పరిధిలోని హెబ్బటం గ్రామానికి చెందిన యువకులు దేశం రక్షణకు తమవంతు సేవలందిస్తున్నారు. మండలంలో ఈ గ్రామం నుంచే అధిక సంఖ్యలో యువకులు సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకుంటున్నారు. బావిదొడ్డి రామాంజనేయులు, లింగన్న, వెంకటేశ్వర్లు, అంజి, టి.రాము, లక్ష్మన్న, సతీష్, మునేష్, గంగాధర్, శ్రీనివాసులు, తిమ్మప్ప, ప్రకాష్, విజయ్, వీరేశ్‌తో కలిపి మొత్తం 13 మంది ఆర్మీలో కొనసాగుతున్నారు. వీరిలో బావిదొడ్డి రామాంజనేయులు అమరుడు కాగా.. లింగన్న, వెంకటేశ్వర్లు పదవీ విరమణ పొందారు. బీఎస్ఎఫ్ జవాను బావిదొడ్డి రామాంజనేయులు 2008 మే 15న పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధి నిర్వహణలో ఉండగా నక్సలైట్లు జరిపిన బాంబు పేలుడులో మరణించాడు. ప్రస్తుతం గ్రామానికి చెందిన 11 మంది సైన్యంలో సేవలు అందిస్తుండగా.. ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో వీరిని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తున్నారు. -
అమ్మా.. నాన్న క్షమించండి
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. అక్క క్షమించు.. అమ్మ నాన్న క్షమించు’ అంటూ ఒక లేఖ రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి ఈడిగ వంశీక్రిష్ణ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులోని రామచంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఈడిగ వంశీక్రిష్ణ ఎంఎస్సీ వరకు చదువుకున్నాడు. తండ్రి శ్రీనివాసగౌడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి. శ్రీనివాసగౌడ్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు రాకేష్ గౌడ్ పెళ్లి అయిన 20 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు వంశీక్రిష్ణ పెళ్లి కాకుండానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశమైంది. రైలు పట్టాలపై మృతదేహంలా.. వివాహ వేడుకకు ఈనెల 7వ తేదీన వేరే ఊరికి శ్రీనివాసగౌడ్, శ్రీదేవి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చారు. కుమారుడు వంశీక్రిష్ణ ఇంట్లో లేకపోవడంతో కర్నూలు చుట్టుపక్కల అంతా గాలించారు. ఎండోమెంట్ కాలనీ సమీపంలో అబ్బాస్ నగర్ రైల్వే పట్టాల పక్కన శనివారం వంశీక్రిష్ణ మృతదేహమై కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు రైల్వే ఎఎస్ఐ కేవీఎం ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్న మృతిని తట్టుకోలేక.. ఈడిగ వంశీక్రిష్ణ అన్న రాకేష్ గౌడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. పెళ్లి అయిన 20 రోజులకే నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి వంశీక్రిష్ణ మానసిక కుంగుబాటుతో బాధపడేవాడు. అన్న మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో ఎమ్మెస్సీ చదివిన విద్యార్థి ఆత్మహత్య -
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎస్.వి.ఎస్ గురువయ్యశెట్టి తెలిపారు. శనివారం స్థానిక ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల పరీక్షలు జరుగనున్నాయన్నారు. పరీక్షలకు ఫస్ట్ ఇయర్ చెందిన 16,292 మంది, సెకండ్ ఇయర్‌కు చెందిన 5032 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. జిల్లాలో 7 కేంద్రాలు సమస్యాత్మకమై కేంద్రాలు గుర్తించామని, వీటిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు పరీక్షలపై ఏవైనా ఫిర్యాదులు చేయాలంటే 08518–222047 నంబరును సంప్రదించవచ్చునని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్ మాత్రమే తెచ్చుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డీఈసీ మెంబర్లు జి.లాలెప్ప, యు.పద్మావతి, జి.ఎస్ సురేష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహణ ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి -
గ్రామం నుంచి పారా మిలటరీలో మొట్టమొదటి మహిళను
మాది వ్యవసాయం కుటుంబం. అమ్మ ప్రమీల, నాన్న జయరాముడు. తొమ్మిదేళ్ల క్రితం నాన్న చనిపోయారు. నాకు అక్క పద్మావతి, తమ్ముడు వేణు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్నా. మా ఊరి నుంచి మిలిటరీకి వెళ్లిన వాళ్లను చూసి నేను కూడా సైన్యంలో చేరాలనుకున్నా. ఆ దిశగా చేసిన ప్రయత్నంతోనే న్యూ ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేసేందుకు అవకాశం దక్కింది. మా గ్రామం పారా మిలటరీలో చేరిన మొట్టమొదటి మహిళను కావడం ఎంతో గర్వంగా ఉంది. తల్లి, అక్క, తమ్ముడుతో పాటు భర్త ప్రోత్సాహం మరువలేనిది. దేశం కోసం పని చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. – జరగల స్వాతి, సీఐఎస్ఎఫ్, అమినాబాద్ -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య కర్నూలు(సెంట్రల్): దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రజలను సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచడానికి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులపై నిఘా ఉంచాలని సూచించారు. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. రేషన్, మందులు, నూనెలు తదితర నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని , ఆయా వస్తులు ధరలు పెరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞఫ్తి చేశారు. అలాగే అర్జీదారులు meekoram.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పడిపోయిన ధాన్యం ధరలు ● కర్నూలు మార్కెట్లో క్వింటా రూ.1,761 మాత్రమే ● మద్దతు ధర రూ.2,320 కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం ధరలు పడిపోయాయి. మద్దతు ధర రూ.2,320 ఉండగా.. మార్కెట్లో రూ.1,760 ధర మాత్రమే లభించడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్లో కొద్ది రోజులుగా ధాన్యం క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మొదట్లో ధాన్యానికి కాస్త మెరుగ్గానే ధరలు లభించాయి. ఇంతవరకు గరిష్టంగా క్వింటాకు రూ.1,981 వరకు ధర లభించింది. శుక్ర, శనివారాల్లో ధరలు పడిపోయాయి. ఈ నెల 9న ధాన్యం క్వింటా ధర రూ.1,841 పలికింది. 10న కేవలం రూ.1,761 మాత్రమే లభించింది. మద్దతు ధరతో పోలిస్తే మార్కెట్లో అతి తక్కువ ధర లభిస్తుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం ధరలు పడిపోయి రైతులు అల్లాడుతున్నా మద్దతు ధరతో కొనుగోలుకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
యుద్ధ సమయంలో అండగా ఉంటాం
నిజమైన హీరో మురళీనాయక్ కర్నూలు(అగ్రికల్చర్): పాకిస్తాన్‌తో పోరాడుతూ అమరుడైన మురళీనాయక్‌ను తెలుగు రాష్ట్రాలు ఎన్నటికీ మరచిపోలేవని కర్నూలు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తెలిపారు. శనివారం కర్నూలు అబ్బాస్ నగర్‌లోని కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆర్మీ జవాన్ మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. యుద్ధంలో అసువులు బాసిన ఆర్మీజవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. దేశ రక్షణకు అమరుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ ప్రజలందరి దృష్టిలో నిజమైన హీరో అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు.పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత దారుణం. దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలను నిర్మూలించేందుకు భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. యుద్ధ సమయంలో దేశానికి అండగా ఉంటాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 7 వేలకుపైగా మాజీ సైనికులు ఉన్నాం. ఐదేళ్లలోపు పదవీ విరమణ పొందిన వారి వివరాలను డిఫెన్స్ అధికారులు అడిగారు. 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న మాజీ సైనికులు దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. – నర్రా పేరయ్య చౌదరి, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కర్నూలు -
ఇప్పుడు విధుల్లో 15 మంది..
అమినాబాద్ గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. గ్రామం నుంచి మచ్చా రంగనాయకులు, సురేంద్ర, కురవ వంశీ, దాసరి ప్రభాకర్, ఎంబాయి విజయ్‌కుమార్, రమేష్, పురిమెట్ల హరి, దండు రామాంజిని, రాజు, తిమ్మాపురం హనుమేష్, బాలకృష్ణ, కె.హరినాథ్, సుద్దాల మురళి, జరగల స్వాతి, గొల్ల రాధ(ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బి, ఎయిర్‌ఫోర్స్, ఐటీబీపీ) విభాగాల్లో పని చేస్తున్నారు. ఇక దివాకర్చౌదరి, లక్ష్మినారాయణ, మండపాటి వెంకటేశ్వర్లు, దాసరి రంగడు, మచ్చా నాగరాజు, హరినాథ్, మోటుపల్లి కరుణాకర్, రాము, నవీన్, నాగరాజు ఆర్మీ, బీఎస్ఎఫ్, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి పదవీ విరమణ పొందారు. గ్రామం నుంచి పలువురు యువకులు దేశ రక్షణకు సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ ఊరికి వన్నె తెచ్చారని గ్రామస్తులు గర్వంగా చెప్పుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వీరిలో పలువురిని ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. -
దేశ భద్రత కోసం పోలీసుల అప్రమత్తం
కర్నూలు: దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. దేశ భద్రత కోసం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తులు, అక్రమ చొరబాటుదారుల కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఏపీ డీజీపీ ఆదేశాలతో జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఆదిరాజ్సింగ్ రాణా పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి వరకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అనుమానాస్పద వ్యక్తులు వాహనాలను తనిఖీ చేశారు. అలాగే లాడ్జీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బార్డర్ చెక్‌పోస్టులతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలకు అనుమానాస్పద వ్యక్తులు కాని, కొత్తగా ఎవరైనా తారసపడితే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. సామాజిక మాధ్యమాలపై దృష్టి... దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇతర రాష్ట్రాల వారి వివరాలపై ఆరా... ఉత్తర భారత దేశం, ఈశాన్య రాష్ట్రాల నుంచి కార్మికులు జీవనోపాధి కోసం ఉమ్మడి జిల్లాకు వలస వచ్చి ఉంటున్నారు. వీరు ఎక్కువగా గృహ నిర్మాణ రంగం, రైస్ మిల్లులు, ఇతర పరిశ్రమల్లో కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. బెంగాల్, బిహార్ ప్రాంతాల నుంచి వచ్చినవారు అపార్ట్మెంట్ నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. అలాంటి వారిలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడి జిల్లాకు వచ్చారా అనే కోణంలో ఇంటెలిజెన్స్, ఎస్బీ2 విభాగం పోలీసులు రహస్యంగా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పోలీసులు పరిస్థితులను సమీక్షిస్తూ ముమ్మర తనిఖీలకు శ్రీకారం చుట్టారు. అసాంఘిక శక్తుల కార్యకలాపాలపై దృష్టి లాడ్జీలు, రైల్వేస్టేషన్లలో అర్ధరాత్రి వరకు తనిఖీలు అనుమానిత వ్యక్తుల వివరాలపై ఆరా! -
ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం
నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు, అనుమతి లేని విత్తనాల కోసం తనిఖీలు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక టీమ్‌లు కూడా ఏర్పాటు చేశాం. వీటితో పాటు హెచ్‌టీ పత్తి విత్తనాల కోసం తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాదికి సంబంధించి ఇంతవరకు అనధికార విత్తనాలు, నకిలీలు పట్టుబడలేదు. ఎక్కడైన అనుమతి లేని విత్తనాలు అమ్ముతుంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
మధ్యంతర భృతి ప్రకటించాలి
నంద్యాల(న్యూటౌన్): 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రారెడ్డి, కేవీ శివయ్య, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు విద్యారంగంలో సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం గందరగోళ పరిస్థితుల ను సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న సంస్కరణ విధానాలతో పాఠశాల విద్యకు నష్టం కలుగుతుందన్నారు. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈనెల 14న విజయవాడలో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం డీఆర్ఓ రామునాయక్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు భాస్కరరెడ్డి, జాకీర్‌హుసేన్, మధు, రమేష్, శైలజ, రాములమ్మ, రమాబాయి, సునిత తదితరులు పాల్గొన్నారు. -
లూపస్ ఎలా వస్తుంది?
● ముఖంపై సీతాకోక చిలుక ఆకారం ● లూపస్ వ్యాధితో అవయవాలపై ప్రభావం ● ప్రధానంగా కిడ్నీలకు దెబ్బ ● రోగ నిరోధక వ్యవస్థచే దాడి ● సమాజంలో ఒక శాతం మందికి వ్యాధి ● నేడు వరల్డ్ లూపస్ డే అరుదైన రోగం.. అల్లకల్లోలం కర్నూలు(హాస్పిటల్): లూపస్.. ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది శరీరంలోని అనేక అవయవాలు, వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా రక్షణాధికారిగా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ వ్యతిరేక దిశలో పనిచేసి ఈ వ్యాధికి కారణం అవుతుంది. దీనిని సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసస్(ఎల్ఎల్ఈ) అని కూడా పిలుస్తారు. ఈనెల 10న వరల్డ్ లూపస్ డే సందర్భంగా ఈ వ్యాధిపై ప్రత్యేక కథనం. శరీరంలోని కణాలు, కణజాలంపై వ్యక్తి సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినప్పుడు లూపస్ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు, చర్మం, కీళ్లు, మూత్రపిండాలు, రక్తనాళాలు, మెదడు వంటి వివిధ అవయవాలు, శరీర వ్యవస్థకు హాని జరుగుతుంది. ఈ వ్యాధి సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసస్, డిస్కోయిడ్ లూపస్, సబ్ అక్యూట్ క్యూటేనియస్ ల్యూపస్, డ్రగ్ ఇండ్యూసెడ్ లూపస్, నియోనెటాల్ లూపస్ అనే రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధిని చాలా మంది తమ అవగాహన లోపంతో ముందుగా గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధితో జిల్లాలోని రుమటాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లు, నెఫ్రాలజిస్టుల వద్దకు ప్రతి నెలా 80 నుంచి 120 మంది దాకా ఈ వ్యాధి బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 5వేల మంది దాకా లూపస్‌తో బాధపడుతున్నట్లు అంచనా. లూపస్‌ను గుర్తించేందుకు.. లూపస్ ఉన్న వారిలో ముఖంపై సీతాకోకచిలుక లాంటి దద్దుర్లు, కీళ్లనొప్పులు, త్వరగా అలసిపోవడం, చాలా రోజులుగా జ్వరం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం, గాఢంగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతిలో నొప్పి, చేతి, కాలివేళ్లు గోధుమరంగు, ఊదా రంగులోకి మారిపోవడం, నోటిలో పుండ్లు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కిడ్నీ, గుండె, మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ లక్షణాలు ఉంటే లూపస్గా అనుమానించి వైద్యులను కలవాలి. అణువణువూ ఇబ్బంది పెట్టే లూపస్ లూపస్‌ను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. ఒకవేళ సరిగా గుర్తించకపోవడం, మందులు సరిగా వాడకపోవడం వల్ల శరీరంలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉండి అనేక అవయవాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొందరిలో కిడ్నీ ప్రభావితమై మూత్రంలో ప్రొటీన్స్ ఎక్కువ మోతాదులో బయటకు వెళ్లిపోయి ఇబ్బంది అవుతుంది. మెదడు, నరాలు దెబ్బతినడం వల్ల తలనొప్పి, చూపు దెబ్బతినడం, మానసిక వ్యాధులు, పక్షవాతం, మూర్ఛవ్యాధి లాంటివి కూడా లూపస్‌లో భాగంగా వచ్చే ప్రమాదం ఉంది. గుండెకండరాలు దెబ్బతిని హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధకశక్తి తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ అధికమయ్యే అవకాశం ఉంది. రక్తసరఫరా సరిగా లేకపోవడం వల్ల ఎముకల్లో కణాలు చనిపోతాయి. ఫలితంగా సులభంగా ఎముకలు విరిగిపోతాయి. ఈ వ్యాధి ఉండే గర్భిణుల్లో అబార్షన్స్ ఎక్కువగా అవుతుంటాయి. కొందరిలో బీపీ ఎక్కువగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు సాధారణంగా జీన్స్, పర్యావరణం(ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల మందులు, ఒత్తిడి, అధిక యువీ కిరణాలు) ప్రభావం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా 15 నుంచి 45 ఏళ్లలోపు(9ః1 నిష్పత్తి) ఉన్న వారిలో లూపస్ వస్తుంది. వీరిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావం వల్ల సహజంగానే ఇది వస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి ఎవ్వరికై నా రావచ్చు. లూపస్ ముందుగా చర్మం, అనంతరం కీళ్లలో మొదలుకావచ్చు. కొందరిలో జ్వరం, నీరసం, ఆకలి తగ్గిపోవడం వంటివి కనిపిస్తాయి. ముక్కుపై, చెంపపై మచ్చలు సీతాకోకచిలుక ఆకారంలో ఎర్రని దద్దుర్లు కనిపిస్తాయి. జుట్టురాలిపోవడం, కీళ్లనొప్పి, ఉదయం లేవగానే కండరాలు పట్టేయడం(30 నిమిషాల పాటు) వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇది మూత్రపిండాలు, నరాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఒళ్లునొప్పులు, రక్తకణాలు తగ్గిపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి కొందరి గర్భిణుల్లో సాధారణంగా కీళ్లనొప్పులు, జ్వరం, దద్దుర్లు, అలసట, వాపు వస్తుంది. అంతమాత్రాన వీరికి లూపస్ ఉన్నట్లు కాదు. అయితే అప్పటికే లూపస్ ఉన్నట్లయితే లక్షణాలు ఎక్కువ అవుతాయి. వీరికి బీపీ పెరగడం, కిడ్నీ దెబ్బతినడం, ప్లేట్లెట్లు తగ్గడం, తలనొప్పి, బరువు తక్కువ ఉన్న పిల్లలు జన్మించడమే గాక కొన్నిసార్లు అబార్షన్లు అవుతాయి. లూపస్ ఉండి గర్భిణులుగా మారిన వారు సాధారణ గర్భిణుల కంటే ఎక్కువసార్లు వైద్యుల వద్ద చెకప్ చేయించుకుంటూ మందులు వాడితే వారి ప్రసవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – డాక్టర్ పి.శిరీషారెడ్డి, గైనకాలజిస్టు, కర్నూలు అపోహలు తొలగించుకోవాలి లూపస్ పట్ల ఉన్న అపోహలు తొలగించుకోవాలి. వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. లూపస్‌తో జీవించే రోగులకు మద్దతు ఇవ్వాలి. ఈ వ్యాధికి ఇమ్యునో సప్రెసెంట్స్, బైలాజిక్స్ మందులు వాడాలి. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేం కానీ అదుపు చేయవచ్చు. ఇందుకోసం దీర్ఘకాలంగా మందులు వాడాల్సి ఉంటుంది. సాధారణ వ్యాయామం, ఎండకు తిరగకుండా ఉండటం, సన్ ప్రొటెక్షన్ క్రీమ్ వాడటం, సరైన నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటం చేయాలి. – డాక్టర్ ఎ.సృజన, రుమటాలజిస్టు, కర్నూలు -
ప్రైవేట్ బస్సు ఢీకొని కాడెద్దులు మృతి
– రైతుకు గాయాలు ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో కాడెద్దులు మృతిచెందగా రైతు గాయాలపాలయ్యాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ఉదయం పొలానికి ఎడ్ల బండితో బయలుదేరాడు. కర్నూలు నుంచి ఆదోని వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు వేగంగా వెనుకనుంచి ఎడ్ల బండిని ఢీకొంది. ప్రమాదంలో రెండు ఎద్దులు మృతి చెందగా, రైతు ఆంజనేయులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంరతం కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు గడివేముల: మండల కేంద్రానికి చెందిన గువ్వల రాజు అదృశ్యమయ్యాడనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగార్జునరెడ్డి శుక్రవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. గువ్వల రాజు (38) గ్రామంలో జీవాలు మేపుకుంటూ జీవనం కొనసాగించేవాడు. మనస్పర్థల కారణంగా భార్య బండిఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో కొన్నేళ్ల నుంచి కుమారుడితో విడిగా జీవనం సాగిస్తోంది. గత నెల 26న జీవాలను మేపుకోవడానికి వెళ్లి ఇంటికి తిరగిరాలేదు. దీంతో రాజు అన్న జనార్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
ఆలయానికి గోవు దానం చేసిన ముస్లిం
● కోవెలలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు పత్తికొండ రూరల్: హోసూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీవేణుగోపాల స్వామి దేవాలయానికి ఓ ముస్లిం కుటుంబం గోవును దానంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకుంది. నూతన ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. బెళడోణ రామనాథశాస్త్రి ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేపట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గ్రామస్తుడు గుడిసె నరసింహులు రూ.10లక్షల విరాళంతో నిర్మించిన ఆలయ ప్రధాన గోపురంపై కలశ ప్రతిష్ట మహోత్సవం కనుల పండువగా సాగింది. కులమతాలకు అతీతంగా భక్తులు తరలిరాగా, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ముల్లా నాదేల్లి బాషా గోవును స్వామివారి ఆలయానికి సమర్పించారు. ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుటుంబ సమేతంగా వచ్చి అర్చకులకు అప్పగించారు. వేద పండితులు గోవుకు ప్రత్యేక పూజలు చేసి స్వీకరించారు. -
వర్షాలు కురిస్తే ఈనెల 20 తర్వాత పత్తి సాగు
● మొదలైన బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల అమ్మకాలు ● పల్లెలకు చేరుతున్న నకిలీ, లూజు విత్తనాలు ● రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు అధికం ● తమ ఆధీనంలోని కంపెనీల్లో వ్యవసాయ శాఖ తనిఖీలు ● ప్రత్యేక ఏజెంట్ల ద్వారా అమ్మకాలు గత ఏడాది నకిలీ పత్తి విత్తనాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతినింది. బనగానపల్లి, దొర్నిపాడు, ఎమ్మిగనూరు ప్రాంతల్లో నకిలీ విత్తనాలతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25లో నకిలీ విత్తనాలు, లూజు విత్తనాల అమ్మకాలు, అనధికార విత్తనాలు, స్టాప్ సేల్స్ తదితరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. రూ.2.40 కోట్ల విలువ చేసే పత్తి, ఇతర విత్తనాలు 100.79 క్వింటాళ్లు సీజ్ చేశారు. ఐదు 6ఏ కేసులు కూడా నమోదయ్యాయి. -
న్యాయ సహాయానికి డయల్ 15100
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణంలో ఉన్న దిశ వన్‌స్టాప్ సెంటర్, మహిళా ప్రాంగణం (శక్తి సదన్)ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన వారితో మాట్లాడుతూ.. ఏమైనా న్యాయ సమస్యలు ఉంటే 15100 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. వన్‌స్టాప్ సెంటర్లో ప్రభుత్వం ద్వారా అందజేసే బాధితుల పరిహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాంగణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అందరూ అర్హులని చెప్పారు. వక్ఫ్ చట్ట సవరణ మలివిడత పోరాటాలకు 21న ప్రణాళిక కర్నూలు(సెంట్రల్): ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ చట్ట సవరణ నిలిపివేతకు మలివిడత పోరాటాలకు సిద్ధం కానున్నట్లు సేవ్ వక్ఫ్ జేఏసీ కన్వీనర్ సయ్యద్ జాకీర్ మౌలానా రషది తెలిపారు. శుక్రవారం రిసల్దార్ మసీదులో సయ్యద్ మస్సూర్ మౌలానా అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 21న మలివిడత పోరాటాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించన్నుట్లు చెప్పారు. కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ముఖ్యనాయకులతో పాటు మండలాలు, తాలుకాల జేఏసీ నాయకులు హాజరు కావాలని కోరారు. ఆ సందర్భంగా భవిష్యత్ కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో కోకన్వీనర్లు ఎంఏ హమీద్, మౌలానా జబీవుల్లా, మౌలానా ముస్తాక్ అహ్మద్‌ఖాన్, హఫీజ్, హుస్సేన్ సాహెబ్, ఎస్ఎండీ షరీఫ్ పాల్గొన్నారు. దోపిడీకి అడ్డు‘కట్ట’ ఏదీ? కృష్ణగిరి: అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల దోపిడీ పెరిగిపోయింది. చెరువు కట్ట రాళ్లను సైతం అక్రమంగా తరలిస్తున్నారు. కృష్ణగిరి మండలంలో పోతుగల్లు చెరువు ఉంది. ఈ చెరువు కట్టకు ఉన్న రాళ్లను శుక్రవారం గ్రామానికి చెందిన టీడీపీ వాళ్లు ఏకంగా జేసీబీని పెట్టి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ఇలా ధ్వంసం చేయడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. చెరువును అభివృద్ధి చేయాల్సింది పోయి.. ఇలా కట్ట రాళ్లను తొలగిస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీఆర్వో వెంకటేశ్వర్లు వచ్చి చూసి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటరా, అధికార పార్టీకి చెందిన వారని వదిలేస్తారో చూడాలి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షల్లో శుక్రవారం ఆరుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 8,188 మందికి 7,404 మంది హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో సెయింట్ జోసప్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇద్దరు, పత్తికొండ సాయి డిగ్రీ కళాశాల కేంద్రంలో శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇద్దరు, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థి, డోన్ సాయిశ్రీ డిగ్రీ కళాశాల కేంద్రంలో ప్యాపిలి ఎస్వీ డిగ్రీ కళాశాల విద్యార్థి ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు చూచిరాతలకు పాల్పడుతుండగా గుర్తించి డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. -
అక్రమ మద్యం, నాటుసారా పట్టివేత
కర్నూలు: ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి 48 మద్యం బాటిళ్లు, 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్, ఈఎస్టీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్ తదితరులు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి శుక్రవారం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కాల్వ గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వైకే తండాకు చెందిన లౌడ్య నరేష్ నాయక్ ద్విచక్ర వాహనంపై 30 లీటర్ల నాటుసారాను తీసుకెళ్తూ ఎకై ్సజ్ అధికారులను చూసి బైక్, సారాను వదిలేసి పారిపోయాడు. సారాతో పాటు బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కర్నూలు మండలం మునగాలపాడు గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో మధుక్రిష్ణను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 48 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జైలుకు పంపారు. దాడుల్లో కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్స్ ఎస్ఐ నవీన్ బాబు, సిబ్బంది మురహరి రాజు, చంద్రపాల్, ఈరన్న, మధు పాల్గొన్నారు జనవిజ్ఞాన వేదిక వర్క్ షాప్‌ను విజయవంతం చేయండి డోన్ టౌన్: ఈనెల 11న స్థానిక శ్రీసుధ సీబీఎస్సీ ఇంగ్లీషు మీడియం స్కూల్లో నిర్వహించనున్న జనవిజ్ఞాన వేదిక నాలుగు జిల్లాల ప్రాంతీయ వర్క్ షాప్‌ను విజయవంతం చేయాలని వేదిక రాష్ట్ర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యంశెట్టి కోరారు. కొత్తపేట జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన వర్క్ షాపు నిర్వాహణపై కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల జన విజ్ఞాన వేదిక నాయకులు, కార్యకర్తలతోపాటు మాజీ శాసన మండలి సభ్యులు, ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు పాల్గొననున్నట్లు తెలిపారు. సమావేశంలో డివిజన్ అధ్యక్షులు సర్వజ్ఞమూర్తి, నాయకులు ఎన్ఎస్ బాబు, జిల్లా నాయకులు లతీఫ్, రామ్మూర్తి పాల్గొన్నారు. . -
బాల్య వివాహాలతో ఆరోగ్య సమస్యలు
నందికొట్కూరు: బాల్య వివాహాలతో ఆరోగ్య సమస్యలు వస్తాయని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్వప్నప్రియదర్శిని అన్నారు. శుక్రవారం కోట వీధి, పగిడ్యాల రోడ్డు బైరెడ్డి నగర్‌లోని అంగన్వాడీ కేంద్రాల్లో కిశోర బాలికల సాధికారత–మనందరి బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. 12 నుంచి 18 ఏళ్ల బాలికలకు బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కాల్పించారు. చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో మాతా, శివు మరణాలకు, ఇతర ప్రమాదాలకు దారి తీస్తాయన్నారు. కార్యక్రమంలో బాలికల తల్లులు, ఎంపీహెచ్‌ఏఎఫ్ విజయలక్ష్మి, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి లావణ్య, అంగన్వాడీ టీచర్లు లక్ష్మీదేవి, ఆశా వర్కర్ కృష్ణవేణి పాల్గొన్నారు. -
ఏటా బెస్ట్ కాలేజీ అవార్డు
● ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ కర్నూలు(హాస్పిటల్): ఏటా ప్రతిభ కనపరిచిన కాలేజీకి బెస్ట్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ అవార్డు అందజేస్తామని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన నగర శివారులోని జి.పుల్లారెడ్డి దంత వైద్యకళాశాలను సందర్శించారు. ముందుగా జి.పుల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కాలేజీని అభివృద్ధి పథంలో నిర్వహిస్తున్నారని అభినందించారు. అనంతరం జి.నారాయణమ్మ పుల్లారెడ్డి ఆడిటోరియంలో జరిగిన ఉపాధ్యాయ, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో కాలేజీలో దంత వైద్యపరికరాలు, మౌలిక సదుపాయాలు, వీటితో పాటు అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది ఉండటం సంతోషకరమన్నారు. రీసెర్చ్ విద్యార్థులకు అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ యూనిట్లో అవకాశం కల్పించి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. శిక్షణపై ఆసక్తి ఉన్న సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్‌ను ప్రోత్సహిస్తూ వారి సేవలను ఉపయోగించుకునేందుకు ప్రొఫెసర్ అమెనిటీస్ సౌకర్యం తీసుకొచ్చామన్నారు. అనంతరం డాక్టర్ చంద్రశేఖర్‌ను కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మురళీధర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నాగలక్ష్మిరెడ్డి, ఆర్థో డాంటిక్స్ హెచ్ఓడీ డాక్టర్ ఎం.భారతి, డాక్టర్ దుగ్గినేని శ్రీనివాసులు, డాక్టర్ వి.సాయిరామ్ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి
ఎమ్మిగనూరురూరల్: ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి, ఏడీఏ మహమ్మద్‌ఖాద్రి సూచించారు. శుక్రవారం మండల పరిఽధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఖరీఫ్ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్‌లో కంది, పత్తి, ఆముదం, వేరుశనగ, వరి, కొర్ర పంటల సాగులో రైతులు సస్యరక్షణ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలని, భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాలకు అనుగుణంగా ఎరువులు, పంటలు వేసుకోవాలని సూచించారు. కూలిన ట్యాంకుపై విచారణ మంత్రాలయం: మండల కేంద్రంలో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఓహెచ్‌ఆర్ ట్యాంకు నేలమట్టమైన విషయం విధితమే. ఈ ఘటనపై శుక్రవారం ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరేరామ్ నాయక్, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు సత్యనారాయణ విచారణ చేపట్టారు. మంత్రాలయంలోని రాఘవేంద్రపురంలో కుప్పకూలిన ట్యాంకును పరిశీలించి నమూనా లు సేకరించారు. రూ.6 కోట్ల నిధులతో గురురాఘవేంద్రప్రాజెక్టు కాంట్రాక్టర్ యువరాజ్ పనులు చేపట్టారు. రూ.25 లక్షల వ్యయంతో ఓహెచ్‌ఆర్ ట్యాంకు నిర్మాణం గా వించారు. 2017లో ట్యాంకు నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు నీటి సరఫరా చేయలేదు. ఇటీవల తాగునీటిని ట్యాంకులో నింపగా బరువుకు కుప్పకూలింది. ట్యాంకు కూలడంతో సీఈ విచారణ చేపట్టారు. నాణ్యత లోపం అని తేలితే కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు తిరిగి వసూలు చేస్తామన్నారు. ఆయనతోపాటు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పద్మజ, డీ ఈఈ మొయినుద్దీన్, ఏఈ వెంకట్రాముడు, గ్రామ సర్పంచు తెల్లబండ్ల భీమయ్య ఉన్నారు. కోలుకోలేక వ్యక్తి మృతి మహానంది: మిద్దైపె నుంచి పడి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కోలేకోలేక గురువారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్న కంబలూరు గ్రామానికి చెందిన కొమ్ము సర్వయ్య(41) మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన ఎస్తేరాణిని వివాహం చేసుకున్నాడు. అత్తమామలను చూసేందుకు గోపవరానికి వచ్చిన అతడు.. గత నెల 29న ఈదురుగాలులతో కూడిన వర్షానికి మిద్దైపెన ఉన్న వరిగడ్డి కట్టలు తడిచిపోతాయేమోనని పట్టలు కప్పేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నంద్యాలకు, అక్కడి నుంచి కర్నూలుకు తరలించారు. కోలుకోలేక మృతిచెందినట్లు ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట
కర్నూలు: నేరగాళ్లు సాంకేతికతను ఉపయోగిస్తున్న నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్పై ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల అధికారులు, దర్యాప్తు అధికారులు, స్టేషన్ రైటర్లకు శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. హత్య, ఫోక్సో కేసులు, సైబర్ క్రైం వంటి నేరాలు జరిగినప్పుడు దర్యాప్తును పకడ్బందీగా చేపట్టాలన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సరళాదేవి, ఏపీపీ ఖాదర్ బాషా, డాక్టర్ రంగయ్య, డీఎస్పీలు, ఫోరెన్సిక్ నిపుణులకు పోలీసు అధికారులు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, ఉపేంద్ర బాబు, వెంకటరామయ్య, రామాంజి నాయక్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ డాక్టర్ ఎస్.అసీం బాషా, డాక్టర్ ఎం.కిషోర్ కుమార్‌రెడ్డి, జి.శ్యాం ప్రసాద్, కుమారస్వామి, జీజీహెచ్ డాక్టర్లు, పీపీలు, ఏపీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఫోరెన్సిక్ విభాగం, ఫింగర్ ప్రింట్స్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా -
ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ప్రారంభం
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు శుక్రవారం రాత్రి కౌతాళంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రత్యేక ఫాతేహాల అనంతరం స్వామి సమాధిని సుగంధ ద్రవ్యాలు, పానీయాలతో శుభ్రం చేశారు. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ, పీఠాధిపతి సయ్యద్ ఖాదర్‌బాష చిష్తీలు వారి శిష్య బృందంతో ప్రత్యేకంగా తెచ్చిన చద్దర్‌ను స్వామి సమాధిపై ఉంచి పూలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు, ఫాతేహాలు నిర్వహించి నగరా వాయించారు. దీంతో ఉరుసు ప్రారంభమైంది. ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయని ధర్మకర్త తెలిపారు. వర్షం వచ్చినా భక్తులు ఇబ్బందులు కలుగకుండా దర్గాలో ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశామన్నారు. గుల్షన్ కమిటీ అధ్యక్షుడు మున్నపాషా, కర్ణాటకలోని సర్మస్వలి దర్గా నిర్వాహకుడు దూద్‌బాషా పాల్గొన్నారు. విద్యుత్ అలంకరణలో దర్గా ఉరుసును పురస్కరించుకుని దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముఖ ద్వారంతో పాటు 60 అడుగుల మహా గోపురం మజీద్‌కు వెళ్లడానికి నూతనంగా నిర్మించిన ముఖద్వారం వరకు విద్యుత్ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. శనివారం గంధం, ఆదివారం ఉరుసు ఉంటుందని ధర్మకర్త తెలిపారు. -
గోదాముగా అంగన్వాడీ కేంద్రం
రుద్రవరం మండలం డి.కొట్టాల గ్రామంలోని ఈ భవనం.. గోదాము అనుకుంటే పొరపాటే. చిన్నారుల కోసం నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రం అది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద మొదటి విడతగా శ్రీరంగాపురం, డి.కొట్టాల, ముత్తలూరు, నర్సాపురం, పేరూరు, కొండమాయపల్లె గ్రామాలకు అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేసి, ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున విడుదల చేసింది. కాంట్రాక్టర్లు నిర్మాణాలు చేపట్టారు. భవనాలు వివిధ దశల్లో ఉండగా ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా పైసా నిధులు విదిల్చకపోవడంతో భవన నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. చిన్నారులకు ఉపయోగపడాల్సిన అంగన్వాడీ కేంద్రాలు ఇలా నిరుపయోగంగా మారడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – రుద్రవరం -
జల్సాల కోసం బైకుల చోరీ
కర్నూలు: మద్యం, గంజాయి, జల్సాలకు అలవాటు పడి వచ్చే ఆదాయం చాలక సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఆ యువకులు అన్వేషించారు. కర్నూలులోని ఠాగూర్‌నగర్‌కు చెందిన రమేష్ బాబు, టెలికాం నగర్‌కు చెందిన తెలుగు కళ్యాణ్, గణేష్ నగర్‌కు చెందిన పిక్కిలి పెద్దిరాజు, షేక్ ఖాజా మొహిద్దిన్, కర్నూలు మండలం నిడ్జూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ జట్టుగా ఏర్పడి ద్విచక్ర వాహనాల చోరీలను ఎంచుకున్నారు. కర్నూలు నగరంతో పాటు హైదరాబాదు, గద్వాల, జడ్చర్ల, కొత్తకోట, ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. దాదాపు ఐదు నెలలుగా సాగుతున్న వారి చోరీల పర్వానికి మూడో పట్టణ పోలీసులు చెక్ పెట్టారు. పక్కా ఆధారాలతో నిఘా పెట్టి వారి నుంచి రూ.5 లక్షల విలువైన ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, మూడో పట్టణ సీఐ శేషయ్యతో కలసి శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. కర్నూలుకు చెందిన ముగ్గురు, నిడ్జూరుకు చెందిన అనిల్ కుమార్ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చోరీ చేశారు. బాధితుడు కర్నూలు ఠాగూర్‌నగర్‌కు చెందిన రమేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పక్కా ఆధారాలతో ముందుగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. ముందు వాహనంపై కన్నేస్తారు, ఎంచక్కా పట్టేస్తారు, గుట్టుగా దాటిస్తారు, లోగుట్టుగా అమ్మేస్తారు. ఐదు నెలల వ్యవధిలో సుమారు 15 వాహనాలు చోరీ చేసి తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామంలో 11, గడివేముల మండలం గని గ్రామంలో నాలుగు వాహనాలను విక్రయించి వచ్చిన సొమ్ముతో దర్జాగా జల్సా చేశారు. వెలుగు చూసిందిలా... కర్నూలు ఠాగూర్‌నగర్‌కు చెందిన రమేష్ బాబు ప్రభుత్వాసుపత్రిలో పని మీద వచ్చి ద్విచక్ర వాహనం పార్క్ చేసి లోపలికి వెళ్లి వచ్చేసరికి మాయమయ్యింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఘా పెంచారు. తరచూ ద్విచక్ర వాహనాలు మారుస్తూ తిరిగేవారిపై కన్నేశారు. కర్నూలులోని మద్దూర్ నగర్లో కూడా ఓ వాహనం చోరీ అయినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ సీసీ ఫుటేజీని పరిశీలించి ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా వారి నేరాల చిట్టా మొత్తం బయటపడింది. వారి నుంచి 15 వాహనాలను రికవరీ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. మాయాబేరం... వాహనం కండిషన్లో ఉండి.. రూ.2 లక్షలు విలువ చేసే బుల్లెట్ వాహనం రూ.15 వేలకే ఇస్తాం. లక్షన్నర విలువ చేసే బజాజ్ పల్సన్ వాహనం రూ.10 వేలకే ఇస్తామంటూ గ్రామీణ ప్రాంతాల యువకులను మాటల్లోకి దింపి దొంగ వాహనాలను అమ్మి వచ్చిన కాసులతో జల్సా చేశారు. నలుగురు దొంగలను రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. చోరీ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్టు చేయడమే కాక భారీ ఎత్తున వాహనాలను రికవరీ చేసినందుకు క్రైం పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. నలుగురు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు 15 బైకుల రికవరీ వివరాలు వెల్లడించిన డీఎస్పీ రద్దీ ప్రాంతాలను ఎంచుకుని చోరీలు... ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలపై కన్నేసి వాహ నాలు ఆపే వ్యాపార సముదాయాల్లోకి ఎవరైనా వెళ్లగానే పని మొదలుపెడతారు. అప్పటికే సిద్ధంగా ఉన్న మారు తాళాలతో చోరీ చేస్తారు. అక్కడినుంచి గుట్టుగా గ్రామీణ ప్రాంతాలకు తరలించి రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచి సెల్‌తో ఫొటో తీసి కావలసిన వారికి వాట్సాప్‌లో పెట్టి కొనేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులకు విక్రయిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
రుద్రవరం: నర్సాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అహోబిలానికి చెందిన రంగ సుబ్బరాయుడు (70) గురువారం కారులో ఆళ్లగడ్డకు వెళ్లి అక్కడ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో రవి డిగ్రీ కళాశాల సమీపంలో ఎదురుగా వరిగడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన యువకుడు మృతి ఆదోని సెంట్రల్: ఆదోని రైల్వేస్టేషన్లో గత నెల 27వ తేదీన ప్రమాదవశాత్తూ రైలు దిగుతూ కింద పడి గాయపడిన యువకుడు రాజశేఖర్ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. నారాయణపురం గ్రామానికి చెందిన ఈ యువకుడిని మొదట ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సల నిమిత్తం కర్నూలుకు తరలించారు. పది రోజుల నుంచి కర్నూలులో చికిత్సలు పొందుతూ కోలుకోలేక గురువారం మృతిచెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాయి సర్వేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. రైలు ఢీకొని రైతు దుర్మరణం ఆదోని సెంట్రల్: రైలు ఢీకొనడంతో పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు.. ఇస్వీ–కుప్పగల్ రైల్వేస్టేషన్ల మధ్య కి.మీ. 523/23–24 వద్ద తన అన్న చేనులో వేసిన కనకాంబరాల పంటకు నీరు పెట్టడానికి బంగారయ్య(35) బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వెళ్లాడు. రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో తీవ్ర రక్తగాయాలపాలైన బంగారయ్య అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య తాయమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. -
అభివృద్ధి, సంక్షేమ సమ్మిళితంగా విజన్ ప్లాన్
కర్నూలు(అర్బన్): అభివృద్ధి, సంక్షేమ సమ్మిళితంగా విజన్ ప్లాన్‌ను రూపొందించాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ నవ్య ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల విజన్ కార్యాచరణ ప్రణాళిక, నియోజకవర్గాల వారీగా విజన్ ప్రణాళికలపై స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా స్టేక్ హోల్డర్లతో జిల్లా నుంచి మండల స్థాయి వరకు సమావేశాలు నిర్వహించాలన్నారు. విజన్ ఆంధ్రలో ఉంటే పది సూత్రాలు.. జీరో పావర్టీ, అగ్రికల్చర్ సెక్టార్, వాటర్ సెక్యూరిటీ, స్కిల్ డెవలప్మెంట్, సోషల్ సెక్యూరిటీ ఆధారంగా విజన్ ప్లాన్‌ను రూపొందించాలన్నారు. సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. ప్లానింగ్ డిపార్టుమెంట్ అడ్వైజర్ సీతాపతి మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో రూపొందించే ప్రణాళికకు చాలా ప్రాముఖ్యత ఉందని, ముఖ్యమంత్రి స్వయంగా చూస్తారన్నారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్, సీపీఓ హిమ ప్రభాకర్‌రాజు, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు సందీప్‌కుమార్, భరత్, నంద్యాల సీపీఓ వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ నవ్య -
అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి
డోన్ టౌన్: పట్టణంలో గురువారం ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన కురువ జయమ్మ, శ్రీనివాసుల దంపతుల మూడవ కుమార్తె చిన్నారి(18)కి కృష్ణగిరి మండలం ఎరుకలచెర్వు గ్రామానికి చెందిన దుబ్బ నరసింహులు, అనుమక్క దంపతుల కుమారుడు ఎల్లప్పతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఎల్లప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డోన్ పట్టణంలోని కోట్ల స్టేడియం సమీపంలో తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. అతని భార్య చిన్నారి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. గురువారం మధ్యాహ్నం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడిందని చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున డోన్‌కు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా తమ బిడ్డను అత్తింటి వాళ్లే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణ పోలీసులు డోన్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై పట్టణ సీఐ ఇంతియాజ్బాషాను వివరణ కోరగా.. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. నాలుగు నెలల క్రితం వివాహం అత్తింటి వారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ -
ప్రాణం తీసిన ఈత సరదా
నందవరం: సరదాగా తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి అనూక్(14) అనే బాలుడు మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. నందవరం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన శివ, రాణెమ్మ దంపతులు ఏకై క కుమారుడు అనూక్(14) నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసుకున్నాడు. గురువారం గ్రామంలోని కొందరు తోటి స్నేహితులతో కలిసి పెద్దకొత్తిలి గ్రామం ఒడ్డున తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లాడు. లోతైన మగుడులో ఈత కొడుతూ ప్రమాదానికి గురయ్యాడు. అనుకోకుండా మడుగు నీటిలోకి జారిపోయాడు. తోటి స్నేహితులు తేరుకునేలోపే అనూక్ తుదిశ్వాస విడిచాడు. స్నేహితులు పెద్దకొత్తిలి గ్రామంలోకి పరుగులు పెడుతూ పెద్దలకు విషయం చెప్పారు. పెద్దలు అక్కడికి చేరుకుని మడుగులో గాలించారు. నీటి అడుగున విగత జీవిగా పడి ఉన్న అనూక్‌ను మడుగు నుంచి బయటకు తెచ్చారు. అప్పటికే అనూక్ నీరు మింగి శ్వాస విడచడంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. అనంతరం సంజీవపురానికి అనూక్ మృతదేహాన్ని తీసుకెళ్లగా బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క బిడ్డ మృత్యువాత పడటంతో తల్లిదండ్రులకు దుఃఖమే మిగిలి. విషయం తెలుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
ఆశల దీపాలు ఆరిపోయాయి!
ఎమ్మిగనూరురూరల్: మనస్పర్థలతో భర్తకు దూరంగా ఉన్న ఆమె తన కుమారుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయితే పదేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందాడు. ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామ పరిధిలోని తుంగభద్ర దిగువ కాలువలో ఈ దుర్ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు ఎస్ఎంటీ కాలనీలో సిద్ధపోగు శిరోమణి నివాసముంటున్నారు. ఈమె కుమారుడు సిద్ధపోగు రోహణ్(10) వీవర్స్ కాలనీ ప్రభుత్వ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ శిరోమణి డీఎీస్సీకి సిద్ధం అవుతున్నారు. ఈమె భర్త చరితబాబు.. కామవరంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆదోనిలో నివాసముంటున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో కొన్ని సంవత్సరాలు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లవద్దు ఇంటి దగ్గరే ఉండు అని కుమారుడు రోహణ్కు చెప్పి తల్లి డీఎస్సీకి చదివేందుకు సమీపంలోని స్టడీ హాల్‌కు వెళ్లారు. తల్లి మాటలు వినకుండా బాలుడు గుడేకల్ గ్రామ పరిధిలోని తుంగభద్ర దిగువ కాలువకు వెళ్లి నీటిలో దిగి ఈతరాక మునిగిపోయాడు. కాలువ దగ్గర కాపలాగా ఉన్న మున్సిపల్ సిబ్బంది కొద్ది సేపు తర్వాత చూడటంతో బాలుడి మృతదేహం కనిపించింది. రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులను సంఘటన స్థలానికి పంపి బాలుడి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. వేర్వేరు చోట్ల ఈతకెళ్లి ముగ్గురు బాలురు మృత్యువాత -
షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్ధం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలవనరుల శాఖ అతిథిగృహం ఆవరణలో గురువారం ఓ కారు మంటల్లో దగ్ధమైంది. సున్నిపెంటలోని వైజాగ్ క్యాంప్‌కు చెందిన కె.నాగమల్లికార్జున కారును స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ఐ రాజేష్ కు అద్దెకు ఇచ్చాడు. సాయంత్రం ఆయన కారు ను స్టార్ట్ చేయగా అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. ఫైర్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ శ్రీశైలం నుంచి రావడానికి ఆలస్యం కావడంతో ఇక్కడున్న సిబ్బంది బకెట్లతో నీళ్లను చల్లి కొంత అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు(సెంట్రల్): పత్రికా స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. జిల్లావ్యాప్తంగా గురువారం జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అన్ని మండలాల్లో తహసీల్దార్ల, రెవెవన్యూ కేంద్రాల్లో ఆర్డీఓలకు వినతిపత్రాలు సమర్పించారు. కర్నూలులో ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా బుద్ధిని ప్రసాదించాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోరంట్లప్ప, జిల్లా కన్వీనర్ నాగేంద్ర, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు హుస్సేన్, సాక్షి బ్యూరో రవికుమార్. సాక్షి టీవీ కరస్పాండెంట్ లోకేష్ మాట్లాడుతూ.. సాక్షి ఎడిటర్ ఆర్. ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టటం అన్యాయమన్నారు. సాక్షి ఎడిటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగా అక్రమ కేసులు పెడుతోందన్నారు. గురువారం ఎడిటర్ నివాసానికి వెళ్లిన పోలీసులు సర్చ్ వారంట్ లేకుండా గంటకుపైగా విచారణ జరిపి నోటీసులు ఇవ్వడం, ఏ కేసులో విచారణ చేస్తున్నారో చెప్పకపోవడం అన్యాయమన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రభుత్వం గౌరవించాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 11 నెలల కాలంలో మీడియాపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని, ఎక్కడిక్కడే పోలీసులు కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైకి నీతులు చెబుతూ..లోలోపలా మాత్రంపై మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికై నా మీడియాకు రక్షణచట్టం తేవాలని కోరారు. జిల్లా అంతటా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు ‘పోలీసులది అనుచిత ధోరణి’ తమకు అనుకూలంగా లేని పత్రికలపై పోలీసులను అడ్డుపెట్టుకొని లొంగదీసుకోవాలను కోవడం అవివేకమైన చర్య అని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కె.నాగరాజు, ఎపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.వెంకటసుబ్బయ్య, జిల్లా గౌరవ సలహాదారుడు, రాష్ట్రసమితి సభ్యులు వైవీ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈఎన్‌రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసగౌడ్ గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు బలవంతంగా చొరబడి తనిఖీలు చేసిన అనుచితధోరణి దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. పాత్రికేయులను భయపెట్టడానికి మాత్రమే పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాని, ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుందని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. -
జంట హత్యల కేసులో తుది తీర్పు
● సంచలనం రేపిన చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్యోదంతాలు ● ఎనిమిదేళ్ల తర్వాత నిందితులకు యావజ్జీవ శిక్ష ● 11 మందికి శిక్ష ఖరారు, ఐదుగురు విడుదల ● కుటుంబ సభ్యుల్లో కట్టలు తెంచుకున్న కన్నీళ్లు అప్పుడు వాళ్లను ఏడ్పించి.. ఇప్పుడు వీళ్లు ఏడుస్తూ! (యావజ్జీవ శిక్ష పడటంతో రోదిస్తున్న ముద్దాయిలు) ఎవరికోసమైతే ఇద్దరిని చంపారో వాళ్లు కాపాడుతారనుకున్నారు. అడిగినంత డబ్బు ఇచ్చాం కాదా, ఎంచక్కా బయటకు రావచ్చునుకున్నారు. ఎనిమిదేళ్లు ఇలా గడిచిపోయింది.. ఇక కోర్టు మెట్లు ఎక్కే పని లేదనుకున్నారు.. గురువారం ఉదయం జిల్లా కోర్టు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. ఎలాంటి తీర్పు వస్తుందోనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కనిపించింది. 11 గంటల సమయంలో 11 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు వెలువరించింది. విషయం క్షణాల్లో బయటకు రావడంతో కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నెత్తీనోరు కొట్టుకుంటూ, ఇక మాకు దిక్కెవరంటూ రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. ఇదిలా ఉంటే కోర్టు నుంచి బయటకు వచ్చిన ముద్దాయిలు కూడా తమ వాళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. చంపినప్పుడు ఆ కుటుంబాల్లో ఎంతటి క్షోభకు గురై ఉంటాయో, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను చూసి వాళ్లు కూడా అంతకు రెట్టింపు వేదనను అనుభవించడం కనిపించింది. – కర్నూలు(సెంట్రల్)/వెల్దుర్తి -
ముగిసిన వజ్రోత్సవ వేడుకలు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో జరుగుతున్న వజ్రోత్సవ వేడుకలు గురువారం ముగిశాయి. చివరి రోజు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి తీర్థ మహాస్వామి ఆధ్వర్యంలో పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అంతక ముందు వేద పండితులు అమ్మవారికి ప్రాత:కాల పూజ, శ్రీచక్ర నవావరణార్చన, చతుషష్టికళార్చన, ప్రాణప్రతిష్ట, జపానుష్టానములు, దుర్గాసప్తశతీ పారాయణం, రుద్రపారాయణం, సుందరకాండ, భగవద్గీత, భారత సంపూర్ణ రామాయణం, రుద్రాభిషేకం, చండీ, రుద్ర, రాజశ్యామల హోమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరలో వాసవీమాత గ్రామోత్సవం కనులవిందుగా సాగింది. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామంలో బోయ శ్రీను(14) అనే బాలుడు ఈతకు బావికి వెళ్లి మూచ్ఛరావటంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ, అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు బోయ శ్రీను(14) ఐదో తరగతి వరకు చదువుకొని బడి మానేసి కూలీ పనులకు వెళ్తున్నాడు. స్నేహితులతో కలసి బావి దగ్గరకు ఈతకు వెళ్లారు. బావిలో ఈత కొడుతుండగా ఫిట్స్ రావటంతో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు కేకలు వేయటంతో అక్కడ ఉన్నవారు బావిలో దూకి గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడు మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
జిల్లా కలెక్టర్‌కు రెడ్‌క్రాస్ అవార్డు
కర్నూలు(సెంట్రల్): బాపట్ల, కర్నూలు జిల్లాల్లో రెడ్ క్రాస్ సొసైటీల ద్వారా 2023–24, 2024–25 సంవత్సరాల్లో అత్యుత్తమ సేవలందించిన అందించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా రెడ్ క్రాస్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో గురువారం విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి కలెక్టర్ అవార్డును అందుకున్నారు. అత్యుత్తమ సేవలకు లభించిన అవార్డును గౌరవంగా భావిస్తానని, మున్ముందు రెడ్‌క్రాస్ ద్వారా అందే సేవలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లాలో 8,500 ఫాంపాండ్స్ కర్నూలు(అగ్రికల్చర్): జూన్ నెల చివరిలోగా జిల్లాలో 8,500 ఫాంపాండ్స్ నిర్మించనున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలో 7,000 మంది రైతులను గుర్తించామని, వీరి పొలాల్లో 2,500 ఫాంపాండ్స్ పనులు మొదలయ్యాయన్నారు. వీటిలో 800 పూర్తి చేశామని, 1,600 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఫాంపాండ్స్‌తో ఉపాధి కూలీలకు 12 లక్షల పని దినాలు లభిస్తాయని, రూ.36.84 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. సిల్వర్ సెట్ గడువు పొడిగింపు కర్నూలు సిటీ: సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న సిల్వర్ సెట్ గడువు పెంచినట్లు క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్కట్టా వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెట్ దరఖాస్తుకు గత నెల 30 వరకు గడువు ఉండేదని, దానిని ఈ నెల 15వ తేదీ వరకు పెంచామని తెలిపారు. ఈ నెల 18న అర్హత పరీక్ష నిర్వహించాల్సి ఉండేదని, అయితే దానిని ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాలేజీలో మొత్తం 280 సీట్లు అందుబాటులో ఉన్నాయని, మరి కొంత మంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ కర్నూలు(సెంట్రల్): కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఎస్ఓ ఎం.రాజారఘువీర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే దరఖాస్తులను సమీపంలో ఉన్న వార్డు/గ్రామ సచివాలయాల్లో అందించాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులతోపాటు పాత కార్డుల్లో సభ్యులు చేర్పులు, మార్పులు, తొలగింపులు, చిరునామాలు, ఆధార్ సీడింగ్ తదితర మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. వైద్యులు, సిబ్బంది సెలవులు రద్దు కర్నూలు (హాస్పిటల్): భారత్ , పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అత్యవసర సమయంలో వైద్యసేవల పరంగా చికిత్స అందించేందుకు గాను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని వైద్యులు, సిబ్బంది సెలవులు రద్దు చేసినట్లు ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సమయంలో రోగులకు ఎలా వైద్యాన్ని అందించాలన్న విషయాన్ని గుర్తుంచుకుని ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచుకుని సేవలు అందించాలని సూచించారు. వెబ్సైట్లో ‘పది’ మార్కుల జాబితాలు కర్నూలు సిటీ: పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాలు www.bse.ap.gov.in అనే వెబ్సైట్లో ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ చంద్ర భూషణం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా స్కూళ్లకు చెందిన ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల లాగిన్ ఆధారాలను ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు సంతకాలు చేసి వాటిని విద్యార్థులకు అందజేయవచ్చు తెలిపారు. ఏవైనా తప్పులు ఉంటే సరి చేసేందుకు ఈ నెల25లోపు విజయవాడలోని పరీక్షల విభాగం డైరెక్టరేట్ దృష్టికి తీసుకపోవాలని పేర్కొన్నారు. -
చంపడాలు, చావడాలు ఎవరికీ మంచివి కావు
చెరుకులపాడు నారాయణరెడ్డిని హతమార్చే సమయంలో అడ్డుపడిన బోయ సాంబశివుడును సైతం దారుణంగా మట్టుబెట్టారు. ఇతనికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు పిల్లలు సంతానం. నారాయణరెడ్డి కుటుంబీకుల ఆశీస్సులతో సాంబశివుడి తల్లి బోయ రాములమ్మ ప్రస్తుతం చెరుకులపాడు గ్రామ సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. ఆయన తండ్రి జయరాముడు కాలం చేయడంతో.. తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు గంగాధర్, మురళీకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ‘సాక్షి’ వాళ్లను పలుకరించగా.. ‘సాంబశివుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు. మేము అష్టకష్టాలతో నారాయణరెడ్డి కుటుంబం చలువతో జీవనం నెట్టుకొస్తున్నాం. చంపడాలు, చావడాలు, జైలుకు పోవడాలు ఎవరికీ మంచివి కావు. మా కుటుంబం పడిన వేదన భవిష్యత్‌లో మరొకరికి రాకూడదు.’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. -
పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తులాభారం వేడుక కనుల పండువగా సాగింది. బుధవారం కర్ణాకటలోని మాండ్యకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ దంపతులు మొక్కుబడిలో భాగంగా బియ్యం, బేడలు, బాదంతో తులాభారం చేపట్టారు. శ్రీమఠం ప్రాంగణంలోని తులాభారం కౌంటర్లో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జెడ్పీలో అల్లూరికి ఘన నివాళికర్నూలు(అర్బన్): మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు నిబద్ధత, త్యాగం ఉంటే ఎలాంటి అణచివేతనైనా ఎదర్కోగలమని జిల్లా పరిషత్ సీఈఓ జి. నాసరరెడ్డి అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయస్సులోనే వీర మరణం పొందారన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి బ్రిటీష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారన్నారు. సమాజం కోసం ప్రాణాలను అర్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్డీఓ అనురాధ, జెడ్పీలోని వివిధ విభాగాలకు చెందిన పరిపాలనాధికారులు సి. మురళీమోహన్‌రెడ్డి, రాంగోపాల్, జితేంద్ర, సరస్వతమ్మ, పుల్లయ్య, బసవశేఖర్తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. బైక్ దొంగను పట్టుకుంటే.. బంగారు నగలు లభ్యంసి.బెళగల్: స్కూటర్ ఎత్తుకెళ్లిన దొంగను పట్టుకుంటే... బంగారు నగలు లభించిన ఘటన మండల కేంద్రం సి.బెళగల్లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. బుధవారం సి.బెళగల్ చెందిన కొందరు యువకులు గ్రామ శివారులోని కంబదహాల్ గ్రామ రోడ్డులో వ్యవసాయ పొలం దగ్గర తమ స్కూటర్లను నిలిపి పొలంలో ఉన్న ఉపరితల ట్యాంక్‌లో స్నానం చేస్తున్నారు. అయితే వారితో పాటు ఓ కొత్త యువకుడు సైతం ట్యాంక్‌లో స్నానం చేశాడు. కొద్ది సేపటికే ట్యాంక్ నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు సి.బెళగల్‌కు చెందిన శివ స్కూటర్‌ను ఎత్తుకెళ్లాడు. అనుమానంతో సదరు యువకుడి కోసం గాలిస్తుండగా కంబదహాల్ సమీపంలో స్కూటర్‌తో కనిపించాడు. వెంటనే ఆ యువకుడిని పట్టుకొని సి.బెళగల్లో పోలీసులకు అప్పగించేందుకు వెళ్తుండగా నిందితుడి దగ్గర బంగారు ఆభరణాలున్న ప్యాకెట్ గుర్తించారు. స్కూటర్‌తో పాటు బంగారు దొంగతనం బయటకు వస్తుందని భయపడి కొటారుమిట్ట దగ్గర ఉన్న వంకలోకి దూకాడు. నిందితుడిని వెంబడించిన స్థానికులు వంక నీటి నుంచి బయటకు లాగి పోలీసులకు అప్పగించారు. నిందితుడి దగ్గర దాదాపు ఏడు తులాల బంగారు, వెండి ఆభరణాలన్నాయి. అతడిని విచారిస్తున్నామని ఎస్ఐ పరమేష్‌నాయక్ తెలిపారు. -
డీఎస్సీ ప్రిపరేషన్ గడువు పెంచాలి
● సర్కారు తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన అభ్యర్థులు కర్నూలు సిటీ: డీఎస్సీకి ప్రిపరేషన్ గడువు పెంచాలని, లేకపోతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ సరిగా లేదని అందులోని పలు అంశాల్లో మార్పులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వారు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం బిర్లా కాంపౌండ్ దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్ మాట్లాడుతూ అనేక ఉద్యమాల ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకున్నామని, అయితే అందులో అనేక అంశాల్లో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. నెల రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు జరపరాదని, ఒక జిల్లా ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 90 రోజుల గడువు ఇవ్వడంతో పాటు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఇంటర్మీడియేట్, డిగ్రీ మార్కులు 40 శాతానికి తగ్గించాలన్నారు. ఈ న్యాయమైన డిమాండ్లపై సర్కారు స్పందించకపోతే డీఎస్సీ అభ్యర్థులతో కలిసి చలో విజయవాడ కార్యక్రమ చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి ఉదయ్, కర్నూలు మండల కార్యదర్శి ప్రకాష్, హరికిషన్ రెడ్డి, విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులైతేనేం.. మేము ట్యాక్స్‘బాబు’లం!
దేశమంతా యుద్ధ భయం.. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతోంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ, యుద్ధం వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియజేసేందుకు బుధవారం జిల్లా కేంద్రం కర్నూలులో మాక్ డ్రిల్ నిర్వహించారు. రోడ్డు పొడవునా పోలీసు వాహనాలు, ఖాకీ డ్రస్సు వేసుకున్న అధికారులు కలియతిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ మందు బాబు పోలీసులైతేనేమి, ఎవరేమైతే నాకేంటి అన్నట్లు నడి రోడ్డులో మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పక్క నుంచే పోలీసు వాహనాలు వెళ్తున్నా.. తాను ట్యాక్స్‘బాబు’ అనే ధీమాతో ఎంచక్కా మందు కలుపుకొని గుటకేసిన దృశ్యాలు కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దిన మద్యాంధ్రప్రదేశ్కు అద్దం పట్టాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ఇంగ్లిషులో మాట్లాడేలా తీర్చిదిద్దాలి
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ సులభంగా తెలుగు మాట్లాడినట్లు ఇంగ్లిషులో కూడా మాట్లాడగలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని విల్ టు కేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు సంస్థ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ఇంగ్లిషు ఉపాధ్యాయులకు 40 రోజుల ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ శామ్యూల్పాల్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణకు జిల్లాలో దాదాపు 450 మంది ఆంగ్ల ఉపాధ్యాయులు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. వారికి ఇంగ్లిషు బోధనలో పలు మెళకువలు, సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. వాటి ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులను ఇంగ్లిషులో పూర్తి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విల్ టు కేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు సంస్థ ప్రతినిధులు వేణుగోపాల్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ఒకే రోజు గుడి నిర్మాణం
బేతంచెర్ల: సాధారణంగా ఒకే రోజు ఆలయ నిర్మాణం పూర్తికాదు. అయితే, మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో ఓ భక్తుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు. బుధవారం స్వామి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి సాయంత్రం నాలుగు గంటల్లోగా పూర్తి చేశారు. సుమారు 30 మంది కూలీలతో ఈ పనులు చేపట్టారు. నెలరోజుల తర్వాత స్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవం ఉంటుందని ఆలయ నిర్మాణ దాత బ్రహ్మయ్య తెలిపారు. 13 ఏళ్ల క్రితం ఇదే మాదిరిగా బేతంచెర్ల పట్టణంలో స్వామి మందిరం నిర్మించినట్లు వెల్లడించారు. -
ఆదర్శనీయులు దామోదరం సంజీవయ్య
● సంజీవయ్య వర్ధంతి సభలో వక్తలుకర్నూలు(అర్బన్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య కుల, మతాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాలకు విశేషమైన సేవలు అందించి అందరికి ఆదర్శంగా నిలిచారని మాల గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు కొనియాడారు. సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విగ్రహం సమీపంలోనే సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు గోన నాగరాజు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభకు సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రామకృష్ణ, రత్నప్రసాద్, శరత్‌బాబు, చైర్మన్ సోమన్న, కన్వీనర్ చంద్రశేఖర్, కోశాధికారి రాజశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు హెచ్డీ ఈరన్న, ఎస్సీ, ఎస్టీ, లాయర్స్ ఫోరం అధ్యక్షుడు ఎగ్గోని జయరాజ్, దామోదరం రాధాక్రిష్ణ హాజరయ్యారు. ముందుగా సభకు అధ్యక్షతన వహించిన గోన నాగరాజు మాట్లాడుతూ రాయలసీమలోని బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చారని, కోస్తా ప్రాంత కాపు ( తెలగ ), రాయలసీమ బలిజలను బీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారని, ఎస్టీ, ఎస్టీలకు ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలయ్యేలా 1961లోనే ఉత్తర్వులు ఇచ్చారన్నారు. కోర్ కమిటీ సభ్యులు రామకృష్ణ, రత్నప్రసాద్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంజీవయ్య సేవలు అందించారన్నారు. భూమి లేని నిరుపేదల కోసం 6 లక్షల ఎకరాలను పంచారన్నారు. వ్యవసాయానికి కూడా పెద్ద పీట వేసి రాయలసీమలోని కర్నూలు జిల్లాలో హంద్రీ నదిపై గాజులదిన్నె ప్రాజెక్టు, ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వరదరాజ స్వామి ప్రాజెక్టు ప్రారంభించారన్నారు. మరో సభ్యులు శరత్‌బాబు మాట్లాడుతూ మాల గెజిటెడ్ ఆఫీసర్స్ గ్రూపుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాలను పొంది పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు బ్యాంకుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కోశాధికారి రాజశేఖర్, నాయకులు డా.వై ప్రవీణ్‌కుమార్, ఇరిగేషన్ డీఈఈ ఎన్ ప్రసాదరావు, రిటైర్డు అడిషనల్ ఎస్పీ వేల్పుల జయచంద్ర, మాధవస్వామి, డీఆర్ రాజు, సోగరాజు మునెయ్య, రాజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యాక్సిస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం
ఆలూరు: కూటమి ప్రభుత్వం అధిక ఽరేట్లకు విద్యుత్‌ను యాక్సిస్ సంస్థతో కమీషన్ల కోసం ఒప్పందం కుదుర్చుకుని అడ్డంగా దొరికిపోయిందని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబునాయుడుపై ఉందని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి డిమాండ్ చేశారు. స్థానిక ఆర్అండ్బీ అథితి గృహం ఆవరణలో బుధవారం ఆలూరు మండలం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కె.మల్లికార్జున ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో యూనిట్ విద్యుత్‌కు రూ.2.49 పైసలకే కేంద్ర ప్రభుత్వసంస్థ సెకీతో ఒప్పందం కుదర్చుకుంటే నాటి టీడీపీ నేతలు అడ్డగోలుగా విద్యుత్‌ను కొనుగోలు చేశారని ఆరోపిస్తూ..అమెరికా అధికారులు ఎప్పుడైనా జగన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పచ్చమీడియాతో పిచ్చిరాతలుగా రాయించారని మండిపడ్డారు. ప్రస్తుతం యాక్సిస్ సంస్థతో యూనిట్‌కు రూ.4.60 ప్రకారం కొనుగోలు చేయడంలో ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పి నేడు ఎడాపెడా పెంచేస్తున్నారని, ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్ర రాజధాని పేరుతో అక్రమాలకు పాల్పడటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందన్నారు. హొళగుంద నుంచి ఢనాపురం గ్రామ బీటీ రోడ్డు పనులను పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే.గిరి, మండల కో–కన్వీనర్ వీరేష్, మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు బోయ ఎల్లమ్మ, జీరా నాగమ్మ, మాజీ ఎంపీటీసీలు,భాస్కర్,నాగేంద్ర ఐటీ, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు వరుణ్, రాజ్, హనుమంతప్ప, యల్లప్ప, వీరేష్,రామన్న, మల్లయ్య, జీరాగౌడు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అవినీతికి పరాకాష్టి నాడు సెకీ ఒప్పందంపై కూటమి నేతల కారుకూతలు ఎమ్మెల్యే విరూపాక్షి -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది అన్నారు. బుధవారం జిల్లా న్యాయసదన్‌లో న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ సాంబశివరావు, ఐసీడీఎస్ పీడీ నిర్మల, కర్నూలు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డీసీబీ సెక్రటీ నాగరాజు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదాబేగం తదితరులు కర్నూలు నగరంలో బాల కార్మికులను గుర్తించేందుకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీని జిల్లా న్యాయ సేవాసదన్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.కబర్ది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాల కార్మికులను గుర్తించి బడికి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలలతో పనిచేయించడం నేరమని, ఇందుకు రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయన్నారు. అనంతరం రాజ్‌విహార్, పాతబస్టాండ్, పెద్ద మార్కెట్, ఆనంద్ థియేటర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి ఐదుగురు బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
రమణీయం రాయరు రథోత్సవం
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో ప్రహ్లాదరాయల రథోత్సవం రమణీయంగా సాగింది. బుధవారం రాత్రి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ప్రహ్లాదరాయల పంచ రథోత్సవాలు వైభవంగా జరిగాయి. ముందుగా వెండి అంబారి, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై ఉత్సవమూర్తిని కొలువుంచి శ్రీమఠం ప్రాంగణంలో ఊరేగించారు. రథోత్సవాలతో శ్రీమఠం శోభాయమానంగా మారింది. అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం కర్నూలు(సెంట్రల్): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా కొనియాడారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి పాత్ర ఎనలేనిదన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎస్డీసీ చిరంజీవి, టూరిజం అధికారి రామాంజనేయులు, సీపీఓ హిమప్రభాకరరాజు, కలెక్టరేట్ ఏఓ విజయశ్రీ పాల్గొన్నారు. సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటికి బెస్ట్ అవార్డు ● ఉత్తమ హెచ్‌డబ్ల్యూఓగా కె.ప్రమీలారాణి కర్నూలు(అర్బన్): జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని కర్నూలు సహాయ సంక్షేమాధికారిగా విధులు నిర్వహిస్తున్న బి.మద్దిలేటి స్టేట్ బెస్ట్ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేసిన ఐదుగురు సహాయ సంక్షేమాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవార్డులను అందించింది. ఇందులో కర్నూలు ఏఎస్డబ్ల్యూఓ మద్దిలేటికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అవార్డును అందించారు. అలాగే ఓర్వకల్ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం విద్యార్థినీలు ఉత్తీర్ణులయ్యేందుకు కృషి చేసిన వసతి గృహ సంక్షేమాధికారిణి కె.ప్రమీలారాణికి కూడా ఉత్తమ వసతి గృహ సంక్షేమాధికారిగా అవార్డును అందించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు కర్నూలు(సెంట్రల్): ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జేసీ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 15,501 మంది జనరల్ అభ్యర్థులు, 791 మంది ఒకేషనల్ విద్యార్థులు, మొత్తం 16,292 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. వీరి కోసం 52 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రెండో సంవత్సరం పరీక్షలకు సంబంధించి మొత్తం 5,032 మంది విద్యార్థులు ఉన్నారని, వీరి కోసం 24 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్ఐఓ గురువయ్యశెట్టి, డీవీఈఓ సురేష్‌బాబు పాల్గొన్నారు. -
విత్తనోత్పత్తికి మంగళం
● వ్యవసాయ శాఖ ఫామ్‌లు ఉన్నా లేనట్లే ● తంగడంచె ఫామ్‌లో బీళ్లుగా 350 ఎకరాలు ● పత్తి విత్తనాలకు దళారీలే ఆధారం ● ఖరీఫ్ సీజన్ వస్తుందంటే దళారీలు, అధికారులకు పండగే.. ● ముడుపులతో తనిఖీలు నామమాత్రంతంగడంచె ఫామ్‌లో బీడుగా మారిన భూములుకర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ వస్తుందంటే విత్తన సమస్య రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. విత్తనోత్పత్తికి పేరొందిన ఉమ్మడి కర్నూలు జిల్లా విత్తనాల కోసం దళారీలపై ఆధారపడాల్సి వస్తోంది. రెండు సీజన్లకు అవసరమైన విత్తనాలను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేస్తోంది. నిబంధనల ప్రకారం రైతులకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి విత్తనోత్పత్తి చేయించాలి. ఆ విత్తనాలను రైతుల నుంచి సేకరించి సర్టిఫైడ్ సీడ్‌గా సరఫరా చేయాలి. అలాంటిది విత్తనాల కోసం ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖ దళారీలపై ఆధారపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. విత్తనాలను సరఫరా చేసే దళారీలకు ఏపీసీడ్స్, వ్యవసాయ శాఖలు పెట్టుకున్న ముద్దుపేరు ‘ఆర్గనైజర్లు’. ఈ ఏడాది కూడా దళారీలు కాసుల పంట పండించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 10 లక్షల హెక్టార్లలో సాగు భూములు ఉండగా ఉమ్మడి జిల్లాకు పత్తి విత్తన ప్యాకెట్లు 25 లక్షల వరకు.. ఇతర విత్తనాలు 40వేల క్వింటాళ్లు అవసరం. దళారీలే దిక్కు విత్తనోత్పత్తికి దేశంలోనే కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేరుశనగ, పత్తి, జొన్న, శనగ, మొక్కజొన్న, కందులు, మినుములు, కొర్రలు తదితర విత్తనాలతో పాటు కూరగాయల విత్తనోత్పత్తి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేపట్టారు. నేడు కర్నూలు జిల్లాలోనే విత్తనాల కోసం దళారీలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖలు కనీసం తమ ఆధ్వర్యంలోని ఆర్గనైజర్ల(దళారీలు)తో విత్తనోత్పత్తి చేయించి సబ్సిడీపై పంపిణీకి సరఫరా చేయాలి. ఆ దిశగా కూడా చర్యలు శూన్యం. మామూళ్ల బంధం.. అంతా సవ్యం 2024–25లో సీడ్ విలేజ్ పోగ్రామ్ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం మార్కెట్లో వేరుశనగ క్వింటా ధర కేవలం రూ.6,500 నుంచి రూ.7వేలు పలుకుతోంది. రబీలో పండిన వేరుశనగను దళారీలు ఈ ధరతో కొనుగోలు చేసి తూతూ మంత్రంగా ప్రాసెసింగ్ చేసి ఏజెన్సీలకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారులు కూడా వీటినే నాణ్యమైన విత్తనమని ధ్రువీకరిస్తూ రైతులకు పంపిణీ చేయనున్నారు. అధికారులు, ఆర్గనైజర్లకు మామూళ్ల బంధం ఉండటంతో అంతా సవ్యమే అన్నట్లు వ్యవహారం సాగుతోంది. దీంతో ఖరీఫ్ రైతులకు నాణ్యమైన విత్తనం ప్రశ్నార్థకమవుతోంది. తనిఖీలు నామమాత్రమే.. ● దళారీలు సిద్ధం చేసిన వేరుశనగను వ్యవసాయ శాఖతో పాటు ఏపీ సీడ్స్ అధికారులు తనిఖీ చేయాలి. ● అయితే ఈ ప్రక్రియ కాగితాలపై కనిపిస్తుందే తప్ప క్షేత్ర స్థాయిలో జరగని పరిస్థితి. ● తనిఖీలకు వెళ్లిన వాళ్లు మామూళ్లు పుచ్చుకొని వస్తున్నట్లు తెలుస్తోంది. ● వ్యవసాయ అధికారులు కూడా తూతూ మంత్రంగానే తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ● ప్రస్తుతం విత్తనాల ప్రాసెసింగ్‌తో పాటు ప్యాకింగ్ జరుగుతోంది. ● ఈ నేపథ్యంలో విత్తనాల నాణ్యతను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. ● ఆ దిశగా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మందగించిన విత్తనోత్పత్తివ్యవసాయ శాఖకు కర్నూలు జిల్లాలో ఎదురూరు, ఎమ్మిగనూరు మండలం బనవాసి, నంద్యాల జిల్లా తంగడంచె ఫామ్‌లు ఉన్నాయి. ఎదురూరు ఫామ్‌లో 45 ఎకరాలు, బనవాసిలో 55 ఎకరాలు, తంగడంచెలో దాదాపు 600 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఎదురూరులో తూతూమంత్రంగా ఖరీఫ్‌లో కంది, రబీలో శనగ.. బనవాసి ఫామ్‌లో వరి, తంగడెంచెలో కంది విత్తనోత్పత్తి చేస్తున్నారు. తంగడంచె ఫామ్‌లో 600 ఎకరాల భూములు ఉన్నప్పటికీ 250 ఎకరాల్లోనే విత్తనోత్పత్తి జరుగుతోంది. మిగిలిన 350 ఎకరాల్లో కంపచెట్లు పేరిగి అడవిని తలపిస్తోంది. వందలాది ఎకరాల భూములు వృథాగా మిగిలిపోవడంతో కూటమి ప్రభుత్వం వీటిని ఇతర అవసరాలకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024–25 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన వేరుశనగ నాణ్యతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏపీసీడ్స్ సరఫరా చేసిన వేరుశనగలో రాళ్లు, మట్టిపెళ్లలు ఉండటం, విత్తనాలు నాసి రకం, పుచ్చులు ఉండటంతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఈసారైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటారనుకుంటే ఆ ఊసే కరువైంది. ఈ ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాల కోసం వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ దళారీలపైనే ఆధారపడటం గమనార్హం. వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ విత్తనోత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేస్తేనే రైతులకు నాణ్యమైన వేరుశనగ లభిస్తుంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అయితే దళారీలు ఇచ్చే కమీషన్లు పైనుంచి కింది స్థాయి వరకు ఉండటంతో విత్తనోత్పత్తి అటకెక్కినట్లు చర్చ జరుగుతోంది. -
కర్నూలులో మాక్ డ్రిల్
కర్నూలు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహణ కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద చేపట్టారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ రంజిత్ బాషా సూచనల మేరకు 4 గంటలకు కొండారెడ్డి బురుజు పరిసరాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ సివిల్, డిఫెన్స్ మాక్ డ్రిల్‌ను అధికారులు నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ద్వారా జారీ చేసిన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం మాక్ డ్రిల్ కొనసాగింది. మాక్ డ్రిల్‌కు ముందు ప్రజలు భయాందోళనకు గురికాకుండా సమాచారం అందించారు. సైరన్ మ్రోగిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రదేశంలోకి వెళ్లే విధంగా సూచనలు ఇచ్చి చైతన్యపరిచారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ పొరుగు దేశంలో ఉద్రిక్తత నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచించారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, డీఆర్డీఓ సంస్థ, ఇండస్ట్రియల్ ఏరియా, మంత్రాలయం, కర్నూలు నగరంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో డిజాస్టర్డ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు మేనేజర్ అనుపమ, అర్బన్ తహసీల్దార్ వెంకటలక్ష్మి, కర్నూలు–1, 2 సీఐలు రామయ్య నాయుడు, నాగరాజరావు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, డిస్ట్రిక్ట్ ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ బాలరాజు, ఏపీఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యుద్ధం వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన -
చేతకాకుంటే వెళ్లిపో!
● ఎంపీడీఓపై ఓ వర్గం టీడీపీ నాయకుల ధ్వజం మద్దికెర: ‘అర్హులైన వారికి కాకుండా ఇష్టానుసారంగా బీసీ రుణాలు ఎలా మంజూరు చేస్తారని.. చేతకాకుంటే కార్యాలయం వదిలేసి వెళ్లిపో’ అంటూ మాజీ జెడ్పీటీసీ రాజన్నయాదవ్, టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌గౌడ్, రామాంజులు ఎంపీడీఓ కొండయ్యపై ధ్వజమెత్తారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓను కలిసి బీసీ రుణాలకు సంబంధించి టీడీపీకి చెందిన ఒకే వర్గం నాయకుడు చెబితే రుణాలు ఎలా మంజూరు చేశారని ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు కాకుండా పనికిరాని నాయకుడు చెప్పిన వారిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ‘ఎంపీడీఓగా నీవు పనికిరావు ఆఫీసు వదిలి వెళ్లిపో’ అంటూ తూలనాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ‘నా చేతుల్లో ఏమీ లేదు.. ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్ చెప్పిన వారికే మంజూరు చేయడం జరిగింది’ అంటూ చెప్పారు. ఈ సందర్భంగా విలేకరులు అందరికీ న్యాయం చేయాలని అడిగితే ఎవరైనా సరే ఎమ్మెల్యేని కలిసి రావాలని అప్పుడే రుణాలు మంజూరు చేస్తానని చెప్పడం గమనార్హం. -
ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం
డోన్ టౌన్: ప్రమాదవశాత్తూ ఓ ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.లక్ష్ముంపల్లె గ్రా మానికి చెందిన ట్రాక్టరు డ్రైవరు వెంకటేశ్ (20) మంగళవారం వెంకటాపురం చెరువు నుంచి ట్రాక్టరు మట్టిలోడుతో బయలుదేరాడు. మార్గమధ్యలో పెద్ద వంక వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడటంతో ట్రాక్టర్ ట్రాలీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 1 నుంచి నెల రోజులల పాటు సెలవులు ఇవ్వాలని అడిగాం. ఇంత వరకు అతీగతీ లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని ఇళ్లకు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. పని ఒత్తిడి తగ్గిస్తామని చెప్పారు కానీ ఇంకా పెంచుతున్నారు. జీతాల విషయంలోనూ ఆలోచించట్లేదు. ఎండలు ఎక్కువగా ఉన్నా చిన్నారుల విషయంలో శ్రద్ధ చూపకపోవడం దారుణం. – నిర్మల, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు (సీఐటీయూ) -
సారా జోలికి వెళ్లొద్దు
నందికొట్కూరు: నాటు సారా తయారు చేయడం, విక్రయించడం నేరమని, వాటి జోలికి వెళ్లి జైలుపాలు కావద్దని నంద్యాల అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వి. రాముడు హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని అల్వాల కళ్యాణ మండపంలో నవోదయం కార్యక్రమంలో భాగంగా కిరాణ వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని వ్యాపారులందరూ సారా తయారు చేసే వారికి బెల్లం విక్రయించొద్దంటూ సూచించారు. కోళ్లబావాపురం, పట్టణంలోని నీలిషికారిపేటకు చెందిన ప్రజలకు బెల్లం అమ్మకంలో నియంత్రణ పాటించాలన్నారు. నాటుసారా తయారీ చేయడానికి బెల్లం వనరుగా మారిందని గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో సారా తయారు చేసి విచ్ఛలవిడిగా ఇతర గ్రామాలకు సరఫరా చేస్తున్నారని, ఈ మేరకు కట్టడికి చర్యలు చేపట్టామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాటు సారా బెల్లం అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కిరాణం దుకాణాల అసోసియేషన్ అధ్యక్షుడు వజీర్‌బాషా, గౌరవ అధ్యక్షులు నగేష్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్, టౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎకై ్సజ్ శాఖ సీఐ రామాంజనేయులు నాయక్, ఎస్ఐలు జప్రూల్లా, శ్రీనివాసులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
‘మోహినీ’ అలంకరణలో సింహరూపుడు
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో సింహరూపుడైన లక్ష్మీనృసింహస్వామి జగన్మోహినీ అలంకరణతో భక్తులను కనువిందు చేశారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత జ్వాలా నరసింహ స్వామిని యాగశాలలో కొలువుంచి నవకలశ స్థాపన గావించారు. ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంభరాలతో మోహినీగా అలంకరించి పల్లకీలో కొలువుంచి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. -
జిల్లాలో జీఎస్టీ వసూళ్లలో మెరుగుదల
● వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్‌రావు కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే కర్నూలు జిల్లాలో జీఎస్టీ వసూళ్లలో మెరుగుదల సాధించినట్లు వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్‌లో రూ.89.404 కోట్లు జీఎస్టీ రాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 99.55కోట్లు జీఎస్టీ వసూళ్లు వచ్చాయని, ఈ మేరకు 12 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపారు. జిల్లాలో గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, మైనింగ్ తదితర కార్యకలాపాల వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. ఆన్లైన్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో అక్రమాలు జరుగుతున్నాయని గమనించి గత నాలుగు నెలల నుంచి నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ మేరకు ప్రతి నెలా 200లకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో లాగా ఇప్పుడు తనిఖీలు చేసే విధానం మారిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. రెగ్యులర్‌గా జీఎస్టీ అధికారులకు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేలా డ్యూటీలు వేస్తారని, ఈ మేరకు వారు వాహనాలను తనిఖీలు చేస్తారన్నారు. జీఎస్టీ చెల్లించని, అక్రమంగా వస్తువులను రవాణా చేసే వాహనాలను పట్టుకుని సీజ్ చేస్తామని తెలిపారు. ఫెనాల్టీ చెల్లించని పక్షంలో వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ఆ తర్వాత ఇలా స్వాధీనం చేసుకున్న వస్తువులను వేలం వేస్తామన్నారు. ఇటీవల ఆదోనిలో స్థానిక పోలీసులతో కలిసి ఓ బంగారు వ్యాపారి వద్ద అక్రమ బంగారా న్ని గుర్తించి రూ.9 లక్షలు జరిమానా విధించామని వివరించారు. -
పురుగు మందు తాగి చస్తాం
● పేదల కడుపు కొట్టేందుకు రాజకీయాలు చేస్తున్నారు ● కన్నీరు పెట్టిన దళిత పారిశుద్ధ్య మహిళా కార్మికులు ● వెల్దుర్తి సీహెచ్‌సీ ఎదుట నిరసన వెల్దుర్తి: ‘‘ ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా కుటుంబాలకు దూరంగా ఉండి కరోనా సమయంలో పారిశుద్ధ్య పనులు పనిచేశాం.. మా సేవలను మరచి మమ్మల్ని తొలగించాలని రాజకీయాలు చేస్తున్నారు.. మాకు న్యాయం జరగకపోతే మేమందరం కుటుంబ సమేతంగా పురుగు మందు తాగి చస్తాం.’ అంటూ దళిత పారిశుద్ధ్య మహిళా కార్మికులు ప్రశాంతి, రాధ, కృష్ణవేణి కన్నీరు పెట్టారు. పిల్లల్ని వెంట బెట్టుకుని వెల్దుర్తి సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్ – సామాజిక ఆరోగ్య కేంద్రం) వద్దకు వచ్చి మంగళవారం నిరసన తెలిపారు. ప్లాస్టిక్ కవర్లో తెచ్చిన పురుగు మందు డబ్బాను కూడా విలేకరులకు చూపారు.. బాధిత మహిళలు తెలిపిన వివరాలు వారి మాటల్లోనే.. ‘‘ మమ్మల్ని 2019లోనే శానిటేషన్ వర్కర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చిన్న సమస్య లేకుండా పనిచేసుకుంటూ వచ్చాం. ప్రాణాలు పోతాయని తెలిసినా కరోనా రోగులతో కలిసి ఆసుపత్రిలో విధులు నిర్వహించాం. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి. మా భర్తలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఒకే కారణంతో మాపై కక్ష కట్టారు. ఇది తెలిసి మేం టీడీపీ నాయకులకు మా కష్టాన్ని విన్నవించాం. ఎమ్మెల్యే శ్యాంబాబు కూడా ‘ పేదల కడుపు కొట్టమమ్మా, మీ పని మీరు ప్రశాంతంగా చేసుకోండి’ అంటూ హామీ ఇచ్చారు. చివరకు మా కాంట్రాక్టరు శివప్రసాద్ ‘పై నుంచి ఒత్తిడి పెరిగిందమ్మా, ఎమ్మెల్యే మనుషులంటూ, పీఏ అంటూ మిమ్మల్ని తీసేయమని బెదిరింపులు వస్తున్నాయి. నేను ఏమీ చేయలేను’ అంటూ సమాధానమిచ్చాడు. మాకు న్యాయం జరగకపోతే మేమందరం కుటుంబ సమేతంగా పురుగుల మందు తాగి చస్తాం.’’ అంటూ కన్నీరు పెట్టారు. -
‘పురాతన’ ఆనవాళ్లు ఛిద్రం చేయొద్దు
ఓర్వకల్లు: పురాతన రాతి చిత్రాల ఆనవాళ్లను ఛిద్రం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శివాలయ ప్రాంతంతో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను కేతవరం గ్రామస్తులు కోరారు. కేతవరం గ్రామ రెవెన్యూ పరిధిలో మైనింగ్ విస్తరణ పనులకు మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ విద్యాసాగర్ ఆద్వర్యంలో జరిగిన సమావేశానికి ఆర్డీఓ సందీప్‌కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ కిషోర్‌రెడ్డి, ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సందీప్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో 288 సర్వే నంబర్లో 20.24 హెక్టార్లలో సిలికా శాండ్, క్వార్ట్జ్ తవ్వకాల కోసం ప్రభుత్వ భూమిని లీజ్‌కు తీసుకుందన్నారు. ప్రస్తుతం అదే సర్వే నంబర్లో సిలికా శాండ్, క్వార్ట్జ్ మిశ్రమాన్ని తయారు చేయుట కోసం పనులను విస్తరించుటకు ప్రతిపాదనలు పంపామన్నారు. కేతవరం గ్రామాభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ గోవర్ధన్ కోరారు. పంటలకు ఎలాంటి నష్టం జరుగకుండా బ్లాస్టింగ్ పనులు చేయాలని ప్రజలు విన్నవించారు. కేతవరం నుంచి కన్నమడకలకు రాకపోకల నిమిత్తం రహదారిని నిర్మించాలని కోరారు. మైనింగ్ విస్తరణను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు చెప్పారు. ● అధికారులకు కేతవరం గ్రామస్తుల వినతి -
పక్క రాష్ట్రాలు సెలవులను
ప్రకటించాయి అంగన్వాడీ కేంద్రాలకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు సెలవులు ప్రక టి ంచాయి.మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వేసవిలో కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నా, ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఇ టీవలి కాలంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరా యం చోటు చేసుకుంటోంది. పలు కేంద్రాల్లో ఫ్యాన్లు ఉండవు,ఇరుకు గదుల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. – జె.లలితమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఏఐటీయుసీ) చిన్నారులకు ఇబ్బంది కలగనివ్వం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఫీడింగ్‌కు ఇబ్బంది తలెత్తకూడదని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఉంచుకొని ఇళ్లకు పంపమన్నాం. నెలలో మొదటి 15 రోజులు హెల్పర్, మిగిలిన 15 రోజులు వర్కర్ ఉండాలని ఉత్తర్వులు ఇచ్చాం. వేసవిలో చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆదేశాలు జారీ చేశాం. – నిర్మల, ఐసీడీఎస్ పీడీ● -
స్నేహితులను కాటేసిన కరెంట్
● పెళ్లి డెకరేషన్ పనులు చేస్తుండగా విద్యుదాఘాతం ● ఇద్దరు యువకుల మృత్యువాత ● తక్కువ ఎత్తులో విద్యుత్ లైన్ వెళ్లడంతో ప్రమాదం ● ఉరుకుందలో విషాదం కౌతాళం: రెక్కల కష్టంతో కుటుంబాలను పోషిస్తున్న ఇద్దరు స్నేహితులను మృత్యువు కబళించింది. అప్పటి వరకు కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు సహాయం అందించుకుంటూ పనులు చేస్తున్న వారిని కరెంట్ కాటేసింది. ఈ విషాద ఘటన ఉరుకుంద గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన కట్టవీధి సునీల్ అలియాస్ నాని (24), అదే కాలనీకి చెందిన మహేంద్ర (23) ఇద్దరు స్నేహితులు. ప్రతి రోజు ఇద్దరు టెంట్ హౌస్‌లో పని చేస్తూ శుభకార్యాలకు టెంట్లు ఏర్పాటు చేసేవారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం ఆర్యవైశ్య కల్యాణ మండపం వద్ద పెళ్లికి సంబంధించిన టెంటు వేసేందుకు వెళ్లారు. కాగా ప్రమాదవశాత్తూ ఇనుప కడ్డీకి పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో సునీల్, మహేంద్ర విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీటి పర్వంతమయ్యారు. మృతుల కుటంబీకుల ఫిర్యాదు మేరకు కౌతాళం సీఐ అశోక్‌కుమార్ కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు సునీల్‌కు భార్య వనిత, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వనిత రోదిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. మహేంద్రకు ఇంకా పెళ్లి కాలేదు. చేతికొచ్చిన కుమారుడి మృతితో తల్లిదండ్రులు తిక్కమ్మ, నాగన్న బోరున విలపిస్తున్నారు. ఇక తమకు దిక్కెవరూ అంటూ రోదించారు. -
ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు
● డ్వామా పీడీ వెంకట రమణయ్య ఆలూరు రూరల్: ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పని జిల్లా డ్వామా పీడీ వెంకట రమణయ్య ఉపాధి హామీ సిబ్బందిని హెచ్చరించారు. మండలంలోని పెద్దహోతూరు, ఆలూరు గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన ఉపాధి పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆన్లైన్ మస్టర్ తప్పుదారి పట్టించినా, ఒకే ఫొటోను ఇతర మస్టర్లలో అప్లోడ్ చేసినా.. పాత పనులనే కొత్త పనులుగా చూపుతూ మస్టర్లలో ఫొటోలు అప్లోడ్ చేస్తే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు, టీఏలపై చర్యలు తప్పని చెప్పారు. నిర్దేశించిన పనుల లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీఓ శ్రీనివాసులుకు సూచించారు. ఫాంపాండ్ పనులు వేగవంతం చేయాలన్నారు. జాబ్ కార్డు ఉన్న కూలీలకు వంద రోజుల పని కల్పించాలన్నారు. ప్రతి రోజు రూ.300 ఉపాధి కూలీ అందేలా పని చేయించాలని చెప్పారు. పని ప్రదేశంలో ఆన్లైన్ మస్టర్లు నమోదు చేయాలన్నారు. స్థానిక కసూర్బా గాంఽధీ పాఠశాలలో నిర్మించిన రూఫ్ వాటర్ గుంతను పరిశీలించారు. పని అంచనా, మెటీరియల్ కాంపోనెంట్ నిఽధులపై అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. -
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి కర్నూలు (అర్బన్): 70 ఏళ్ల వయస్సు పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధ పడేవారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, అలాగే బెయిల్ త్వరగా మంజూరయ్యేలా కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పురుషుల కేంద్ర కారాగారం, మహిళల కారాగారాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జైలు ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లినిక్‌లో ఒక న్యాయవాది, ఒక పారా లీగల్ వాలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయం అందిస్తారన్నారు. జైలులో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేసుకోవాలని కోరారు. ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. ఖైదీలకు అందించే ఆహారాన్ని, రేషన్‌తో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని, తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూలు వారిని సంప్రదించాలన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100పై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జైలు అధికారులు, న్యాయవాది శివరాం తదితరులు పాల్గొన్నారు. -
రాజ గోపురం నిర్మాణానికి రూ.13 లక్షలు విరాళం
నందవరం: పూలచింత గ్రామంలో వెలసిన శ్రీ బండేగురుడి మఠం రాజ గోపురం నిర్మాణానికి భక్తులు విరాళం అందించారు. మంగళవారం గ్రామంలో గ్రామ సర్పంచ్ అక్కమహాదేవి ఆధ్వర్యంలో మఠం ఉప పీఠాధిపతి బండేప్ప స్వామికి గ్రామ పెద్దలు, గ్రామస్తులు రూ.13 లక్షలు విరాళం అందజేశారు. గ్రామస్తులు మ ఠం అభివృద్ధికి, గోపురం నిర్మాణానికి తమ సహాయంగా విరాళం అందించారు. ఈ సందర్భంగా ఉప పీఠాధిపతి మాట్లాడుతూ.. పీఠాధి పతి జయ శంకర స్వామి ఆశీస్సులతో మఠాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామస్తు లు, భక్తులు ఇచ్చిన విరాళంతో రాజ గోపుర నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పురాతన బావుల సమాచారం ఇవ్వండి నంద్యాల(వ్యవసాయం): జిల్లాలోని పురాతన కాలంనాటి పాడుబడిన కోనేరులు, మెట్ల, దిగుడు బావుల సమాచారం ఇవ్వాలని ఇన్ టచ్ నంద్యాల చాప్టర్, మన ఊరు–మన గుడి, మన బాధ్యత గౌరవ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలోని పురాతన కాలం నాటి దిగుడు బావులు, కోనేరులు ఉంటే ఆ ఊరి ప్రజలతో తమ సంస్థ సభ్యులు కలసి వాటిని ఉపయోగంలోకి తెచ్చేలా కృషి చేస్తామన్నారు. కోనేరులు, బావుల్లో ఉన్నటువంటి వివరాలు తెలిపే శాసనాలు తదితర ఉంటే 8919547562కు ఫొటోలతో సహా పంపినట్లయితే వాటిని పునరుద్ధరించి సమష్టి కృషి చేస్తామని తెలిపారు. ఆవుల మందపై మళ్లీ పెద్ద పులి దాడి వెలుగోడు: తెలుగు గంగ ప్రాజెక్టులో భాగమైన మద్రాస్ కాల్వ వద్ద పంట పొలాల్లో ఆవుల మందపై పెద్దపులి మళ్లీ దాడి చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం దాడి చేసి పులి ఒక ఆవును చంపిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 20 రోజుల ఆవు దూడను చంపేసిందని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి వరుస దాడులతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పెద్ద పులి నుంచి ఆవులను కాపాడి నష్టపరిహారం చెల్లించాలని రైతు సేవా నాయక్ అటవీ అధికారులను కోరారు. -
స్వర్ణ పంచాయత్ పోర్టల్‌లోనే పన్నుల చెల్లింపు
కర్నూలు(అర్బన్): ఇక నుంచి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్వర్ణ పంచాయత్ పోర్టల్‌లోనే పన్నుల చెల్లింపు జరగాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు పన్నుల చెల్లింపులు ఆన్లైన్లోనే జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని అన్ని ఓహెచ్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్ ట్యాంకులను శుభ్రం చేయించాలన్నారు. చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఇళ్ల యజమానుల అసెస్మెంట్ నెంబర్‌కు వారి ఆధార్‌ను లింకు చేయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పశువుల తాగునీటికి సంబంధించి ఏర్పాటు చేసిన టబ్‌లను ఎప్పటికప్పుడు నీటితో నింపాలన్నారు. 12 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేది వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మద్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 21,342 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 15,292.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,032 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 52 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన విద్యార్థులకు, గైర్హాజరైన వారికి ఈ నెల 28వ తేది నుంచి జూన్ 1వ తేది వరకు కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే వీటిని నిర్వహించనున్నారు. కొత్తిమీర అ‘ధర’హోగోనెగండ్ల: ఒక్కసారిగా కొత్తిమీర ధర పెరిగిపోయింది. ఒక మడి ధర రూ. వెయ్యి నుంచి రూ. 1,200 వరకు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తిమీరకు డిమాండ్ పెరిగింది. గోనెగండ్ల మండలంలో బోర్లు,బావుల కింద 1,500 ఎకరాల్లో రైతులు కొత్తిమీర పంటను సాగుచేశారు. ఈ ఏడాది ఉల్లి, మిరప తదితర పంటలు సాగుచేసిన రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కొత్తిమీర పంటకు రెండు రోజుల నుంచి ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
జొన్న రైతుకు ‘వ్యయ’ప్రయాస
అర్థం కావటం లేదు నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ వద్ద ఉన్న మమ్మల్ని తిరిగి దీబగుంట్లకు తీసుకెళ్లాలని చెప్పడంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక తిరిగి గోపవరం వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు. మాకేం అర్థం కావటం లేదు. ఒకసారి కుదుర్చుకున్న బాడుగలకు తిరిగి క్వింటాకు రూ. 50 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. – వలి, పెసరవాయి, గడివేముల మండలం కష్టాలు అన్నీఇన్నీ కావు ఈ ఏడాది జొన్న సాగు చేసిన రైతులకు దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మార్కెట్లో సరైన ధర లేక రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో కొంత మేరకు ఉపశమనం వచ్చినా కష్టాలు అన్నీఇన్నీ కావు. బాడుగలు భారంగా మారుతున్నాయి. – ప్రతాపరెడ్డి, ఎం.చింతకుంట్ల, గోస్పాడు మండలం. గోస్పాడు: జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయడం లేదు. ఇందుకు కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రతి రోజూ తికమక పెడుతోంది. దీంతో రైతులకు ఖర్చులు తడిసి మోపెడుతున్నాయి. ముందుగా నంద్యాలలోని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ వద్దకు జొన్నలను తీసుకెళ్లేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుకు ట్రాక్టర్‌కు అయితే రూ. 1,300నుంచి రూ. 1,800 వరకు, లారీకి అయితే రూ. 2వేల నుంచి రూ. 2,500 వరకు ఖర్చు చేశారు. జొన్నలు అమ్ముకోవడానికి క్యూలో నిల్చొని నాలుగైదు రోజులు గడిచాక నంద్యాల సెంట్రల్ వేర్‌హౌస్ నుంచి దీబగుంట్ల లోని గోడౌన్‌కు పంపించారు. మంగళవారం దీబగుంట్లకు వచ్చిన తర్వాత గోపవరం సమీపంలోని గోడౌన్‌కు తరలించాలని అధికారులు చెప్పడంతో రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్ ఖాళీగా ఉన్నా ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించారు. రోజుల తరబడి క్యూలో నిలపాల్సి వస్తోందని, ఖర్చులు మరింత పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు ట్రాక్టర్ల వద్ద నిద్రిస్తూ కనిపించారు. మరికొందరు పొలాల్లో వేచి చూశారు. మద్దతు ధరతో కొనుగోలు చేయని ప్రభుత్వం రోజుకొక గోడౌన్‌కు తిరగాల్సిందే! -
ఉత్తీర్ణత శాతం మెరుగుపరచండి
● డీఈఓ శామ్యూల్‌పాల్ ఆదోని సెంట్రల్: పదో తరగతి పరీక్షల్లో తప్పిపోయిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌పాల్ అన్నారు. పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి సబ్జెక్టు టీచర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, గురుకులం, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు 31,185 మంది పదో తరగతి పరీక్షలు రాశారన్నారు. వారిలో 20,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. 10,600 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు పేర్కొన్నారు. ఉత్తీర్ణత శాతంలో మన జిల్లా 25వ స్థానానికి పడిపోయినట్లు వారి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 75 శాతం వృద్ధిని సాధిస్తే అది టీచర్స్ సక్సెస్‌గా, 50 శాతం ఉత్తీర్ణత సాధిస్తే అది విద్యార్థి సక్సెస్‌గా మన జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా పేర్కొన్నట్లు చెప్పారు. 50 శాతం తక్కువగా ఉత్తీర్ణత సాధించిన పాఠశాలకు నోటీసులు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. పెద్దకడబూరు, కౌతాళం, ఆలూరు మండలాల్లో కొన్ని పాఠశాలల్లో అత్యధికంగా ఫెయిల్యూర్ అయిన విద్యార్థులు ఉన్నారన్నారు. పత్తికొండ డివిజన్ ఉత్తీర్ణత శాతంలో వెనకబడినట్లు చెప్పారు. సమావేశంలో డిప్యూటీ ఈఓ వెంకటరమణారెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న డీఈఓ శామ్యూల్‌పాల్ -
ముత్తలూరులో ఉద్రిక్తత
వక్ఫ్ బోర్డు స్థలాలంటూ నోటీసులు ● ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలన్న రెవెన్యూ సిబ్బంది ● తిరగబడిన గ్రామస్తులు రుద్రవరం: మండల పరిధిలోని ముత్తలూరులో మంగళవారం రెవెన్యూ సిబ్బంది, కాలనీ వాసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మీరు నివసించే స్థలాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించినవని, వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని రెవెన్యూ సిబ్బంది కాలనీ వాసులను హెచ్చరించారు. అయితే 1967లో స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలాగని కాలనీవాసులు నిలదీయడం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలివీ.. ముత్తలూరు 146 సర్వే నంబరులో 3.36 ఎకరాల పొలం ఉంది. అయితే అక్కడ నివసించిన పూర్వీకులు ముళ్ల వంశీయులు కొంత మంది ఇవన్నీ తమ భూములేనని ఎవరికి వారు వివిధ సామాజిక వర్గాల వారికి విక్రయించి రిజిస్ట్రేన్ చేయించారు. దాదాపు 55 ఏళ్ల నుంచి కొనుగోలుదారులు ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, తాగు నీటి సౌకర్యం వంటి వసతులు కల్పించారు. అయితే కొద్ది కాలంగా ఆ స్థలాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించినవని, కొలతలు వేసి స్వాధీనం చేసుకుంటామని ఆ శాఖ ఇన్స్పెక్టర్ షేక్ ఇమ్రాన్ కాలనీ వాసులు 45 మందికి నోటీసులు పంపించారు. 6వ తేదీన కొలతలు వేస్తున్నామని, సహకరించాలని కాలనీవాసులకు రెండో నోటీసు పంపించారు. అలాగే 146 సర్వే నంబరుపై కొలతలు వేయించి తమ స్థలాలను అప్పగించాలని తహసీల్దారును కోరారు. దీంతో తహసీల్దారు మండల సర్వేయరు రమణ, ఓబులేసు, వీఆర్వో, వీఆర్ఏలు అందరూ కలిసి కాలనీలోకి వెళ్లారు. అక్కడ సర్వేయర్ కాలనీ వాసులను పిలిచి కొలతలు వేస్తున్నామని చెప్పడంతో ఎలా వేస్తావని, ఆ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించారు. ఎన్నో ఏళ్ల నుంచి నివాసాలు ఉంటున్న తమను ఖాళీ చేయమనడం సబబు కాదని వాపోయారు. తాము ముల్లా వారితో కొన్న స్థలాలని, క్రయ విక్రయాలు జరిగే సమయంలో వక్ఫ్ బోర్డు అధికారులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఇదిలాఉంటే ఇంత జరుగుతున్న సమస్యకు కారణమై వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మాత్రం అక్కడికి రాకపోవడం గమనార్హం. -
తుంగా తీరంలో మా‘రీచు’లు
మంత్రాలయం: రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ రవాణా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సాగుతోంది. ఇందుకు టీడీపీ నేతలు సహకరిస్తున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులకు పట్టుకున్నారు. ఈ టిప్పర్లకు నంబర్లు లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలంలో మూడు ఇసుక రీచ్‌లను ప్రారంభించారు. తుంగభద్ర నదిని ఆనుకుని ఉన్న మరళి, గుడికంబాళి, నదిచాగి గ్రామాలతో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడి రీచ్‌ల్లో నాణ్యమైన ఇసుక లభిస్తోంది. దీంతో బిల్డర్లు ఇక్కడి ఇసుకను ఎక్కువగా ఇష్టపడతారు. గోడల ప్లాస్టరింగ్ నేరుగా ఇసుకను వినియోగానికి వస్తుండటంతో మక్కువ చూపుతున్నారు. ఇక్కడి నుంచి కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు కూడా ఇసుకను తీసుకెళ్తున్నారు. నంబర్ల ప్లేట్లు లేకుండా.. సరిహద్దులు దాటిపోతున్న టిప్పర్లకు నంబర్లు ప్లేట్లు తీసేస్తున్నారు. మాధవరం చెక్‌పోస్టు దాటుకుని పోతున్న ఓ ఇసుక టిప్పర్‌కు నంబర్ ప్లేటు కనిపించలేదు. భారత్ బెంజ్ పేరుతో ఉన్న మూడు టిప్పర్లలో ఇలాగే ఇసుకను తీసుకెళ్తున్నట్లు సమాచారం. దర్జాగా చెక్‌పోస్టులను ఇసుక టిప్పర్లు దాటుకుని పోతున్నా ఎలాంటి అడ్డగింత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చర్యలేవీ? ‘ఏదో టెండర్లు వేశాం.. రీచ్‌లు ఏర్పాటు చేశాం.. ఎవ్వరు ఇసుక ఎటు తీసుకెళ్తే మాకేం’ అన్నట్లు మైనింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమణ రవాణాను పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కర్ణాటక మైనింగ్, పోలీస్ అధికారులు స్పందించారు. అక్రమ ఇసుక టిప్పర్లను పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంకెళ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు. టీడీపీ నేతల అండతోనే సాగుతున్న ఇసుక దందా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు తరలింపు పోలీసులకు పట్టుబడుతున్న టిప్పర్లు -
పీఎం కిసాన్తో కలిపే ‘అన్నదాత సుఖీభవ’
కర్నూలు(అగ్రికల్చర్): 2024–25 సంవత్సరంలో అన్నదాత సుఖీభవ కింద చెల్లించే పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం.. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ అమలుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో సూపర్–6 హామీల్లో భాగంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా రైతులకు రూ.20 వేలు చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. గత ఏడాది జూన్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా మొదటి ఏడాదే అన్నదాత సుఖీభవ కింద రూ.20వేల పెట్టుబడి సాయం అందిస్తారని ఆశించారు. కానీ ఆ దిశగా ఆలోచనే చేయలేదు. దీంతో చంద్రబాబు ఎన్నికల సమయంలో అధికారం కోసం ఒక విధంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తారనే చర్చ రైతుల్లో మొదలైంది. రైతుల్లో వ్యతిరేకత పెరుగకుండా ఉండేందుకు ఈ ఏడాది అమలుకు మార్గదర్శకాలు జారీ చేసింది. పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.6 వేలు, రాష్ట్రం రూ.14 వేలు వెరసి రూ.20 వేలు చెల్లిస్తుంది. ఇందుకు సంబందించి మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ జారీ చేసింది. అయితే కుటుంబం యూనిట్(కుటుంబంలో ఒక్కరికి మాత్రమే) లబ్ధి కల్పిస్తారు. హంద్రీనీవా ఎస్ఈగా పాండురంగయ్య ● కర్నూలు సర్కిల్ ఎస్ఈగా బాల చంద్రారెడ్డి కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్–1 పర్యవేక్షక ఇంజనీర్‌గా పాండురంగయ్యను నియమిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎల్ఎల్సీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్‌గా పాండురంగయ్య పని చేస్తున్నారు. హంద్రీనీవా సర్కిల్–1కి రెగ్యులర్ ఎస్ఈ లేరు. గత నెల 30న ఇన్చార్జిగా ఉన్న సురేష్ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హంద్రీనీవా విస్తరణ పనులు జరుగుతుండడంతో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు పాండురంగయ్యను నియమించారు. ● అదేవిధంగా కర్నూలు సర్కిల్ ఎస్ఈగా బాల చంద్రారెడ్డిని నియమించారు. ఈయన కర్నూలు సర్కిల్ ఎస్ఈగా గతేడాది నాలుగు నెలలకుపైగా పని చేశారు. ప్రస్తుతం అదే సర్కిల్లో డిప్యూటీ ఎస్ఈగా పని చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో రెగ్యులర్ ఎస్ఈలుగా పదోన్నతులు ఇవ్వడంతో ద్వారకనాథ్ రెడ్డి ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఖాళీగా ఉన్న ఈ స్థానంలో బాల చంద్రారెడ్డిని ఎస్ఈగా నియమితలయ్యారు. అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించండి కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్)లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఆయా అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ఆడిట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎస్డీసీ వెంకటేశ్వర్లు పాల్నొన్నారు. రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీ ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని రేషన్ దుకాణాల్లో సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని 7, 14, 15 నంబర్ గల రేషన్ దుకాణాల్లో డీసీటీవో వెంకటేష్, సీఎస్‌డీటీ మహేష్, సచివాయలం వీఆర్వో లింగేష్ల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. డీసీటీవో వెంకటేష్ మాట్లాడుతూ పై మూడు దుకాణాల్లో స్టాక్‌లో తేడాలున్నందున షాపులను సీజ్ చేసినట్లు తెలిపారు. -
అన్నదాతలకు తీవ్ర అన్యాయం
● రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశారు ● టీడీపీ నాయకుల ఇళ్లలోకి ఎరువుల బస్తాలు ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం: దేశానికి అన్నం పెట్టే రైతులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు. అన్నదాతలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు. పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో రైతులతో సోమవారం ముఖాముఖి నిర్వహించారు. పెట్టుబడి వ్యయం, గిట్టుబాటు ధర, సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో కాటసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులను టీడీపీ నాయకుల ఇళ్లలో ఉంచుతున్నారన్నారు. చేసేదేమి లేక రైతులు వేరే ప్రాంతానికి వెళ్లి యూరియా బస్తా రూ. 400 ప్రకారం కొనాల్సి వస్తోందన్నారు. కనీస మద్దతు ధర లేకపోవడంతో ధాన్యం కల్లాలు దాటడడం లేదన్నారు. సాగు నీరు అందలేదు ‘పది రోజులుగా కల్లాల్లో ధాన్యం ఉంచినా కొనుగోలు చేసేందుకు ఎవరూ రావడం లేదు’ అని కన్నీటితో తమ కష్టాలను కాటసానికి రైతులు వివరించారు. ‘సాగు నీరు సరిగ్గా రాలేదని, తెగుళ్లు ఎక్కువయ్యాయని, మందు బస్తాల రేటు చాలా పెరిగిందని.. ఇలా ఉంటే రైతులు ఏమి చేయాలి’ అని వాపోయారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల్లో బుకింగ్ చేస్తే ఊర్లోనే మందులు, విత్తనాలు, పనిముట్లు ఇచ్చేవారని, నాటి పరస్థితులు నేడు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు అన్నదాత సుఖీభవ కింద రూ. 20వేలు రైతులకు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని కాటసాని అన్నారు. అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతే ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. మోసం చేస్తే ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారన్నారు. జెట్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీలు వెంకటేశ్వర్లు, పార్వతమ్మ, మల్లు జయచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామలక్ష్మయ్య, గోపాల్‌రెడ్డి, ఉపేంద్రారెడ్డి, దేవేంద్రరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణాలతో లేని వ్యక్తులు పరిహారం కోసం కోర్టుకు వెళ్లినట్లు సృష్టించారు. ఈ విషయంలో ఓ టీడీపీ నేత చక్రం తప్పారు. ఇప్పటికే కొంతమందికి పరిహారం మంజూరు కాగా, మిగిలిన వారికీ పరిహారం మంజూరు చేయాలని సదరు నేత అధికారుల
2002లో చనిపోతే.. 2018లో కోర్టుకు ఎలా వెళ్లారు? పాలకొలనులోనే కలగొట్ల నాగమ్మ అనే మహిళకు 2 ఎకరాల పొలం ఉంది. ఎకరాకు రూ.4.30లక్షల చొప్పున ఈమెకు రూ.8.60లక్షలు పరిహారం రావాలి. అయితే నాగమ్మ 2002లో చనిపోయారు. భూమిని 2013లో సేకరించారు. కానీ పరిహారం కోసం నాగమ్మ పేరుతో ఓ టీడీపీ నేత 2018లో రిట్ (డబ్ల్యూపీ 42989/2018)దాఖలు చేశారు. అందులో నాగమ్మ వేలిముద్రలను ఫోర్జరీ చేశారు. అయ్యన్న సంతకాలు ఫోర్జరీ సర్వేనెంబర్ 232లో అయ్యన్న అనే వ్యక్తికి రెండు ఎకరాల పొలం ఉంది. ఇతనికి కూడా రూ.8.60లక్షలు పరిహారం రావాలి. ఇతను 2008 జూలై 8న చనిపోయారు. ప్రభుత్వం మరణధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసింది. అయితే ఇతని పొలాన్ని 2013లో సేకరించారు. పరిహారం కోసం చనిపోయిన అయ్యన్న 2018 నవంబర్ 5న కోర్టులో రిట్(40116/2018) దాఖలు చేశారు. 2002లో చనిపోయిన వ్యక్తి 2018లో కోర్టును ఎలా ఆశ్రయించారో అధికారులకే తెలియాలి. నాకు తెలీకుండానే నా పేరుతో కోర్టుకు.. నాకు అరెకరా ఉంది. నాకు రూ.2.15లక్షలు రావాలి. నేను బతికే ఉన్నా. నాకు తెలియకుండా నా పేరుతో టీడీపీ లీడర్ కోర్టుకు వెళ్లారు. నాకు సంతకం రాదు. నేనైతే ఎక్కడా వేలిముద్రలు వేయలేదు. కానీ నేను వేసినట్లు వేలిముద్రలు వేశారట. లేదంటే డ్వాక్రా గ్రూపులోని వేలిముద్రలను తీసుకున్నారేమో తెలీదు. ఇది చాలా అన్యాయం. నా పరిహారం నాకు ఇప్పించాలి. – శేషమ్మ నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు మా మానాన్న మద్దిలేటికి 4.38 ఎకరాల పొలం ఉంది. ఇప్పటికీ పాసుపుస్తకాలు మా నాన్న పేరుతో ఉన్నాయి. అయితే మా ఆడపిల్లలతో పాటు మా సోదరుడు వెంకటేశ్వర్లు భార్య భాగమ్మ, ఆమె పిల్లలు బతికే ఉన్నారు. వారికి తెలియకుండా భూమి భాగ పరిష్కారాలు కాకుండా మొత్తం భూమి రామాంజనేయులు తీసుకున్నట్లు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు. మా వద్ద మా నాన్న పాసుపుస్తకాలు ఉన్నాయి. దీనిపై అధికారులు విచారణ చేయాలి. అప్పటి వరకూ పరిహారం ఆపాలి. – మద్దిలేటి వారసులుఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ భూసేకరణ కుంభకోణం ● పరిహారం కోసం రైతులకు తెలియకుండా కోర్టుకు ● చనిపోయిన వారి పేరిట రిట్ పిటిషన్లు దాఖలు ● ఇప్పటికే 120 మందికి పరిహారం.. త్వరలో మరో 70 మందికి ● ఈ విషయంలో చక్రం తిప్పుతున్న ఓ టీడీపీ నేత ● మంజూరైన పరిహారంలో 50శాతం ఇచ్చేలా ఒప్పందం సాక్షి ప్రతినిధి కర్నూలు: ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) కోసం 3,250 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది. పట్టా భూము లకు, అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎకరాకు రూ.4.30లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. అయితే ఈ పరిహారం మంజూరులో కొందరు రైతుల పేర్లతో టీడీపీ నేతల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. 15–20 ఏళ్ల కిందట చనిపోయిన వారి పేర్లతో ఫోర్జరీ సంతకాలు చేసి పరిహారం పొందేందుకు సిద్ధమ య్యారు. ఇప్పటికే 120మందికి పరిహారం అందింది. మరో 70మందికి పరిహారం మంజూరు కాగా, ఖా తాల్లో జమ కావల్సి ఉంది. అయితే ఈ పరిహారం మంజూరులో అక్రమాలు జరిగాయని ఇటీవలే బాధిత రైతు కుటుంబాలతో పాటు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్‌రెడ్డి కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వేలిముద్రలు ఫోర్జరీ చేసి కోర్టులో రిట్ పాలకొలనులో మాదిగ శేషమ్మకు అరెకరా పొలం ఉంది. ఈమె భూమిని డీఆర్డీఓ కోసం సేకరించారు. అయితే పొలంలో శేషమ్మ సాగులో లేదని పరిహారం తిరస్కరించారు. దీనిపై శేషమ్మకు తెలియకుండానే ఆమె పేరుతో హైకోర్టులో 2022లో రిట్(పిటిషన్ నెం.25654) దాఖలు చేశారు. పిటిషన్లో శేషమ్మ పేరుతో వేలిముద్రలు వేసి ఆమె పేరు రాశారు. నిజానికి ఈ విషయం ఆమెకు ఏమాత్రం తెలీదు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తప్పుడు వేలిముద్రలతో శేషమ్మ పేరుతో రిట్ దాఖలు చేశారు. లేదంటే డ్వాక్రా సంఘంలో ఉన్న శేషమ్మ రుణాల లావాదేవీలలో గతంలో వేసిన వేలిముద్రలను ఫోర్జరీ చేసి ఉండొచ్చని శేషమ్మ అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈమె పేరుతో మంజూరైన పరిహారం శేషమ్మకు తెలియకుండానే టీడీపీ నేత ఖాతాలో జమ కానుంది. వచ్చిన పరిహారంలో ఫిఫ్టీ.. ఫిఫ్టీ పాలకొలనులో డీఆర్డీఓ కోసం వందల ఎకరాల భూమి సేకరించారు. ఇందులో కొందరు నిజమైన అర్హులు ఉంటే కొందరు భూమి లేకుండా కేవలం నకిలీ పట్టాలు సృష్టించి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వారున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే ప్రభుత్వం నుంచి అసైన్డ్భూములు పొంది, సాగులో లేకుండా ఉన్నారో వారికి పరిహారం నిరాకరించారు. ఇదే అదునుగా ఓ టీడీపీ నేత పరిహారం నిరాకరించిన కొందరి పేర్లతో వారికి తెలీకుండా వారి పేర్లతో కోర్టులో రిట్దాఖలు చేశారు. ఇది చూసి ఇంకొందరు రైతులు కూడా టీడీపీ నేతతో కలిసి వెళ్లి తమకూ పరిహారం ఇప్పించాలని కోరారు. దీంతో ఆ టీడీపీ నేత వచ్చే పరిహారంలో సగం తనకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. తనకు వచ్చే సగంలో అధికారులకు వాటా ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీకి తెలీకుండా దోపిడీ నక్కల మద్దిలేటికి సర్వేనెంబర్ 199లో 3.50 ఎకరాలు, సర్వేనెంబర్ 243/5లో 0.88 ఎకరాలు మొత్తంగా 4.38 ఎకరాలు ఉంది. మద్దిలేటి చనిపోయి 20 ఏళ్లు దాటింది. ఈయనకు ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వీరిలో మొదటి, రెండో కుమారులు మద్దిలేటి, వెంకటేశ్వర్లు చనిపోయారు. అలాగే ఓ ఆడపిల్ల కూడా చనిపోయింది. చిన్నోడు రామాంజనేయులుతో పాటు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మద్దిలేటి పేరుతో ఉన్న పొలాన్ని రెండో కుమారుడు వెంకటేశ్వర్లు భార్య భాగ్యమ్మకు మగపిల్లోడు ఉన్నారు. ఈమెతో పాటు తక్కిన నలుగురు ఆడపిల్లలకు సంబంధం లేకుండా మొత్తం పొలం దాన విక్రయం కింద తండ్రి తనకు రాసిచ్చినట్లు పాస్‌బుక్కులు సృష్టించారు. పరిహారం కోసం కోర్టులో 2018లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రామాంజనేయులు మినహా తక్కిన మద్దిలేటి వారసులు పాస్‌బుక్కులు తమ తండ్రి పేరుతోనే ఉన్నాయని, నకిలీ పాసుపుస్తకాలు సృష్టించుకుని రామాంజనేయులు తమకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీని వెనుక గ్రామానికి చెందిన టీడీపీ నేత ఉన్నారని చెబుతున్నారు. -
ఓర్వకల్లును పారిశ్రామికంగా తీర్చిదిద్దుతాం
ఓర్వకల్లు: ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం మండలంలోని గుట్టపాడు గ్రామం వద్ద రూ.38.50 కోట్లతో నిర్మించిన ఎంఎస్ఎంఈ పార్కును ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కలెక్టర్ రంజిత్ బాషా, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ సరైన శిక్షణ, చదువు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే ఓర్వకల్లులో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, దానికి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ త్వరగా మంచి సంపాదన ఉంటుందని, యువత పైలెట్ కోర్సుల వైపు ఆసక్తి చూపాలని సూచించారు. ఈ పార్కుకు అవసరమైన దూపాడు నుంచి ఓర్వకల్లు మీదుగా బేతంచెర్ల వరకు రైల్వే లైనింగ్ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయన్నారు. ఇండస్ట్రీయల్ హబ్ కోసం ఏర్పాటు చేస్తున్న నీటి సౌలభ్యం పనులు 90 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిన్న తరహా పరిశ్రమల పార్కులు, స్టార్టప్‌లు ఎవరైతే ఎంఎస్ఎంఈలుగా మారాలనుకున్నారో, వారందరికీ అవకాశం కల్పించేందుకు గాను 7 నియోజకవర్గాల్లో భూమిని గుర్తించామన్నారు. ప్రస్తుతం మొట్టమొదటి సారిగా జిల్లాలోని ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు వద్ద ప్రారంభించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, ఆర్డీఓ సందీప్‌కుమార్, మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారురాలు విజయభారతి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం అరుణకుమారి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఈ–శ్రమ్ కార్డులపై అవగాహన అవసరం
కర్నూలు (అర్బన్): ఈ–శ్రమ్ కార్డులపై కార్మికులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ శాఖల అధికారులపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి సూచించారు. సోమవారం న్యాయ సేవా సదన్‌లో ఆశా వర్కర్లకు ఈ–శ్రమ్ కార్డులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు వెంకటహరినాథ్, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి ఈ–శ్రమ్ కార్డు అందేలా కృషి చేయాలన్నారు. ఈ–శ్రమ్ కార్డుల వల్ల లభించే ఉపయోగాలను ప్రతి కార్మికుడికి తెలియజేయాలన్నారు. డీఎంహెచ్ఓ శాంతికళ మాట్లాడుతూ తమ డిపార్ట్మెంట్లో ఆశా వర్కర్లందరూ ఈ–శ్రమ్ కార్డులు పొందారని తెలిపారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆశా వర్కర్లకు ఈ–శ్రమ్ కార్డులు పోర్టల్‌లో ఎలా నమోదు చేయాలో వివరించారు. కార్డులు పొందిన వారికి ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ప్రతి కార్మికునికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాద బీమా ఉచితంగా కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ లీగల్ ఆఫీసర్ సుమలత పాల్గొన్నారు. -
రెట్టింపు లాభం అంటూ మోసం చేశారు
కర్నూలు: ఇన్‌స్ట్రాగామ్‌లో స్టాక్ మార్కెట్ గురించి ఒక ప్రకటన ఇచ్చి వాట్సాప్ గ్రూప్‌లో లింక్ పంపి ఇద్దరు వ్యక్తులు తనతో చాట్ చేసి ఒక యాప్ ఇచ్చి, అకౌంట్ నెంబర్ ఇచ్చి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు చూపిస్తూ ఆ డబ్బులు ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని రూ.5 లక్షలు తీసుకుని సైబర్ మోసానికి గురి చేశారని కర్నూలుకు చెందిన సునిత అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాకు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పక్కనున్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం అడిషనల్ ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 111 ఫిర్యాదులు రాగా వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస నాయక్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● చెత్త బండి ఇప్పిస్తామని చెప్పి రూ.3.30 లక్షలు తీసుకుని ధనుంజయ్, జానకిరామ్ అనే వ్యక్తులు మోసం చేశారని కృష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన బంగారి ఫిర్యాదు చేశారు. ● 10 ఎకరాల ఆస్తిని ఇద్దరు కొడుకులు సమానంగా పంచుకున్నారని, వచ్చిన పెన్షన్ డబ్బు కూడా వారే తీసుకుని తన బాగోగులు పట్టించుకోవడం లేదని, విచారణ జరిపి తనకు జీవనాధారం కల్పించాలని ఆస్పరి మండలం కై రుప్పల గ్రామానికి చెందిన అంగడి శివమ్మ ఫిర్యాదు చేశారు. ● కర్నూలు సంతోష్ నగర్ వద్ద ఉన్న విజయ నగర్ కాలనీలో మార్ట్గేజ్ చేసిన ఒక ప్రాపర్టీని అమ్ముతామని చెప్పి కొందరు బ్రోకర్లు అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకుని తనతో పాటు చాలా మందిని మోసం చేశారని కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన రెహమాన్ ఫిర్యాదు చేశారు. ● రూ.2 లక్షల విలువైన కంది పంటను నాశనం చేసి నా కుటుంబాన్ని మానసికంగా, ఆర్థికంగా కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామానికి చెందిన మాదమ్మ ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు -
పీజీఆర్ఎస్కు 93 వినతులు
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజల నుంచి 93 వినతులు అందాయి. జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చి అర్జీదారులు వినతులు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వినతుల్లో చట్టపరమైన సమస్యలను అక్కడికక్కడే ఆయా స్టేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, నగదు మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసం, అత్తింటి వేధింపులు తదితర ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ దృష్టికి వచ్చిన వినతులు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు మోహన్‌రెడ్డి, సూర్యమౌళి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు ● ముగ్గురి పరిస్థితి విషమం చాగలమర్రి: మండలంలోని నగళ్లపాడు గ్రామ సమీపంలోని 40వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు.. హైదరాబాద్ చందానగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కారులో తిరుపతికి బయలు దేరారు. మార్గమధ్యలోని నగళ్లపాడు వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. అంతటితో ఆగక ఎదురుగా వచ్చే హైదరాబాద్ బండ్లగూడ కాళికామందిర్కు చెందిన మందా అశోక్‌రెడ్డి కారును ఢీకొంది. ప్రమాదంలో అశోక్ రెడ్డి, అతని కుమారుడు నరేన్, మరో మహిళ సరితతో పాటు ప్రమాదానికి కారణమైన కారులోని శ్రీకాంత్, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను టోల్ ప్లాజా అంబులెన్సులో స్థానిక కేరళ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి తీవ్రంగా ఉన్న ముగ్గురిని నంద్యాల ఉదయానంద ఆసుపత్రికి తరలించారు. అశోక్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా అశోక్ రెడ్డి తన తల్లిదండ్రుల పెళ్లి రోజును పురస్కరించుకుని అరుణాచలం వెళ్లి తిరిగి హైదరాబాదుకు వెళ్తుండగా ప్రమాదం చేసుకున్నట్లు సమాచారం. -
ప్రమాదపుటంచున ప్రయాణం
రోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు మృత్యువాత పడుతుండగా ఇంకొందరు అవిటివాళ్లవుతున్నారు. అయినా అటు ప్రయాణికులు కానీ.. ఇటు వాహనదారులు కానీ మేల్కోవడం లేదు. రోడ్ల భద్రత వారోత్సవాల పేరుతో పోలీసు అధికారులు సైతం నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నా.. కాసులకు కక్కుర్తి పడి వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. ప్రమాదమని తెలిసినా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఐదారుగురు ప్రయాణించే ఆటోలో ఏకంగా 30 మందిని ఎక్కించుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. – ఆలూరు -
బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రారంభం
నంద్యాల(అర్బన్): స్థానిక కేసీ కెనాల్ కాంపౌండ్‌లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ భవనంలో సోమవారం సాయంత్రం అత్యాధునిక వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌ను మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ప్రారంభించారు. రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెండ్రీ డ్యూనంట్ చిత్రపటానికి మంత్రులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ రక్తం దొరక్క ఏ ఒక్కరూ మరణించకూడదనే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, గౌరవ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో రక్తం అవసరం ఉన్న వారికి సరైన సమయంలో అందించడానికి ఇతర జిల్లాలోని రక్తనిల్వ కేంద్రాల మీద ఆధార పడకుండా మన జిల్లాలోనే రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సంస్థ వారి సహకారంతో రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సబ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, డీఈఓ జనార్దన్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుళ్ల్ల, సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖలందర్, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పాల్గొన్నారు. -
పులి దాడిలో ఆవు మృతి
వెలుగోడు: పులి దాడిలో ఆవు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పట్టణ సమీపంలో ఉన్న గట్టు తండాకు చెందిన శివనాయక్ మద్రాస్ మెయిన్ కెనాల్ సమీపంలో ఉన్న పంట పొలంలో ఆవుల మందును నిల్వ ఉంచాడు. సోమవారం తెల్లవారుజామున మందపై పులి దాడి చేసి ఒక ఆవును చంపేసినట్లు బాధితుడు వాపోయాడు. ఆవు మృతితో రూ.50 వేల నష్టం వాటిల్లిందన్నాడు. పశు గ్రాసం దగ్ధం రుద్రవరం: మండల పరిధిలోని తువ్వపల్లె గ్రామ సమీపంలో సోమవారం విద్యుత్ ప్రమాదంలో ట్రాక్టర్‌పై తరలిస్తున్న పశుగ్రాసం దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రెడ్డిపల్లెకు చెందిన రైతు చిన్నక్రిష్ణయ్య తువ్వపల్లె సమీపంలోని రంగాపురం బావి వద్ద మరో రైతు నుంచి గ్రాసం కొనుగోలు చేసి ట్రాక్టర్లో లోడ్ చేసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకి నిప్పులు చెలరేగడంతో గ్రాసానికి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తమై లిఫ్ట్ ద్వారా గ్రాసాన్ని కిందకు తోసేయడంతో ట్రాక్టర్‌కు ఎలాంటి నష్టం కలగలేదు. కానీ గ్రాసం పూర్తిగా కాలిపోవడంతో రైతుకు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆస్తి కోసం మేనత్తపై కత్తితో దాడి బొమ్మలసత్రం: మేనత్తకు చెందిన ఆస్తిని రాసివ్వటం లేదని సొంత మేనల్లుడే కత్తితో దాడికి పాల్పడిన ఘటన నంద్యాలలో సోమవారం చోటుచేసుకుంది. అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు.. నూనెపల్లిలో నివాసముంటున్న షేక్రహమున్నిసాకు అక్కడే రెండు భవనాలున్నాయి. ఆమె అన్న కుమారుడు అబ్దుల్రహమాన్ పనిపాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. ఈక్రమంలో ఒక ఇంటిని తన పేరుమీద రాసివ్వాలని మేనత్తను ఒత్తిడికి గురిచేసేవాడు. ఈనేపథ్యంలో రైల్వేస్టేషన్ సమీపంలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న రహమున్నిసాపై మేనల్లుడు కత్తితో దాడి చేశాడు. బాధితురాలికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవటంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. త్రీటౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. -
నాటుసారా బట్టీలపై ఎకై ్సజ్ దాడులు
కర్నూలు: గుడుంబాయి తండా గ్రామ శివారులోని నాటుసారా బట్టీలపై ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్, కర్నూలు స్టేషన్ సీఐ చంద్రహాస్ తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి సోమవారం సారా స్థావరాలపై దాడులు నిర్వహించి బట్టీలను ధ్వంసం చేశారు. దాదాపు నాటుసారా తయారీకి ఉపయోగించే 1,600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 45 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీదారులు మాదావత్ దన్ను నాయక్, నానావత్ రాజు నాయక్, మాదావత్ మద్దిలేటి నాయక్, నానావత్ రమేష్ నాయక్ తదితరులపై కేసు నమోదు చేశారు. నవోదయం 2.0లో భాగంగా గ్రామ సభ నిర్వహించి నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు జరిపితే తీసుకునే చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. నలుగురిపై కేసు నమోదు -
స్కూల్ లేదని తాగునీరు బంద్!
మహానంది: వేసవి సెలవులని పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ పంపు కనెక్షన్ కట్ చేయడంతో బసవాపురం గ్రామస్తులకు తాగు నీటి సమస్య నెలకొంది. బసవాపురంలో రెండు చోట్ల నీటి ట్యాంకులున్నాయి. ఎంపీపీ పాఠశాల వద్ద ఉన్న మోటార్‌కు కనెక్షన్ తీసేయడంతో నీటి సమస్య తలెత్తింది. గ్రామంలో వాటర్ ఫిల్టర్ ట్యాంకులు సైతం లేకపోవడంతో ఇదే నీటిని ప్రజలు తాగుతుంటారు. ఉన్న రెండు మోటార్ల వద్ద సరఫరా అయ్యే నీళ్లలో పాఠశాల వద్ద ఉన్న నీళ్లే బాగుంటాయని, అధికారులు స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ఇర్ఫాన్‌ను ఆరా తీయగా.. ఇంత వరకు గ్రామస్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా మరమ్మతులు చేయించి పునరుద్ధరిస్తామని తెలిపారు. పది రోజులుగా బసవాపురం గ్రామస్తులకు నీటి సమస్య -
పోలీసులకు పట్టుబడి
మంత్రాలయం నియోజకవర్గం నుంచి టిప్పర్లతో కర్ణాటకలోని రాయచూరు, తెలంగాణలోని హైదరాబాద్, గద్వాల, జడ్చర్ల, పాలమూరు ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఇటీవల ఆంధ్ర టిప్పర్లను కర్ణాటక పోలీసుల చేతికి పట్టుబడ్డాయి. గత నెల 28న ఐదు టిప్పర్లను సీజ్ చేశారు. మంత్రాలయం సరిహద్దు గ్రామం మాధవరం చెక్‌పోస్టు నుంచి కర్ణాటక వైపుగా ఈ టిప్పర్లు తరలిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని ఎరిగేర సర్కిల్ ఠాణాలో టిప్పర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మాధవరం చెక్‌పోస్టు దాటుతుండగా ఇసుక ఎక్కడి నుంచి తెచ్చారని కొందరు అడుగగా మరళి రీచ్ నుంచి తెచ్చినట్లు చెప్పారు. టీడీపీ నేతల అండతోనే ఈ దందా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. -
శేష వాహనంపై అహోబిలేశుడు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూలమూర్తులను సోమవారం ఉదయం సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి, శ్రీ లక్ష్మీనరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులతో శేషవాహనంపై మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలువైన జ్వాలా నరసింహస్వామి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
ప్రశాంతంగా ‘నీట్’
కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్టీఏ ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఏ నిబంధనలను అనుసరిస్తూ విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,466 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు పేర్లు రిజిస్టర్ చేసుకోగా 4,381 మంది హాజరరుకాగా 85 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే విద్యార్థులు చేరుకున్నారు. ఎన్టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థినుల ముక్కు పుడకలు, చెవుల దిద్దులు, చేతుల గాజులు, ఆభరణాలను తీయించారు. పరీక్ష కేంద్రాల వెలుపల విద్యార్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన నీట్ యూజీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. డీఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ.. ప్రభుత్వ టౌన్ మోడల్ హైస్కూల్, టౌన్ మోడల్ జూనియర్ కాలేజీ, రాయలసీమ యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ బాలిక కాలేజీ(బి.తాండ్రపాడు)లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ 4,381 మంది హాజరు -
పెద్దహరివాణంలో సామూహిక వివాహాలు
ఆదోని రూరల్: పెద్దహరివాణం గ్రామంలో ఆదివారం 55 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామంలో వెలిసిన శ్రీగర్జిలింగేశ్వరస్వామికి బండార మహోత్సవం నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం సామూహిక వివాహాలు నిర్వహించారు. నూతన వధూవరులు స్వామి వారికి పూజలు నిర్వహించారు. 12 యేళ్లకు ఒకసారి బండార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. నూతన జంటలను ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆశీర్వదించారు. -
విద్యార్థుల చూపు.. ట్రిపుల్ ఐటీ వైపు!
కోవెలకుంట్ల: 2025–26 విద్యా సంవత్సరానికి రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)కళాశాలల్లో సీట్లు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. గత నెల 23వ తేదీన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కాగా ఇటీవలే ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 456 ప్రభుత్వ పాఠశాలలుండగా గత నెలలో విడుదలైన పది ఫలితాల్లో 54 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలోని ఆయా పాఠశాలల పరిధిలో 11,794 మంది బాలికలు పరీక్షలు రాయగా 9,954 మంది, 12,702 మంది బాలురకు గాను 10,097 మంది బాలురు వివిధ గ్రేడుల్లో ఉత్తీర్ణత పొందారు. ఆరేళ్ల ఇంటి గ్రేటెడ్ ఇంజినీరింగ్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో ట్రిపుల్ ఐటీకి వెయ్యి సీట్ల చొప్పున నాలుగు వేల సీట్లను కేటాయించారు. నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా మారిన ట్రీపుల్ ఐటీల్లో చేరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు గ్రామీణ, పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు గత నెల 24వ తేదీ నోటిఫికేషన్ విడుదల కాగా 27వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఎంపికై న అభ్యర్థుల జాబితా జూన్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. జూన్ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. స్పెషల్ కేటగిరి( పీహెచ్సీ/క్యాప్/ ఎన్సీసీ/స్పోర్ట్స్/భారత్స్కాట్స్) కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించనున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయిన అనంతరం జూలై మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించేందుకు 2008వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఇడుపులపాయ, నూజివీడు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఒక్కో కళాశాలకు 2 వేల సీట్లను కేటాయించగా తర్వాతి ప్రభుత్వాలు 2010 నుంచి ఒక్కో ట్రిపుల్ ఐటీలో వెయ్యి సీట్లు ఉండేలా కుదించాయి. 2014 రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల తెలంగాణాకు వెళ్లిపోవడంతో 2016వ సంవత్సరం నుంచి ఏపీలో ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల్లో ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు. వీటిలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు కేటాయించాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. 4 వేల సీట్లలో ఓపెన్ కేటగిరిలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ ఎన్ఆర్ఐలు, తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3,400 సీట్లను ఉమ్మడి జిల్లాల వారికి సమానంగా పంచనున్నారు. జిల్లాకు కేటాయించే సీట్ల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు అవకాశం లభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ అందుబాటులో ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తు రుసుం రూ. 200, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ విద్యార్థులు రూ. 300 చెల్లించాల్సి ఉంది. పేద విద్యార్థుల చదువుకు భరోసా గత ప్రభుత్వ చర్యలతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు జిల్లాలో 456 ప్రభుత్వ పాఠశాలలు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ పదవ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాలుగు శాతం డిప్రివేషన్ స్కోరు మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేది: మే 20 ఎంపికై న అభ్యర్థుల జాబితా విడుదల: జూన్ 6 సర్టిఫికెట్ల పరిశీలన: జూన్ 11 నుంచి 17 వరకు ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు: మే 28 నుంచి 31 వరకు ఏపీలో ట్రిపుల్ ఐటీ కాలేజీలు: ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం మొత్తం సీట్లు: 4వేలు -
పెరిగిన ఎండల తీవ్రత
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం పాణ్యంలో 42.7, బనగానపల్లిలో 42.1, నంద్యాలలో 42, దొర్నిపాడు, గడివేములలో 41.8, బండిఆత్మకూరు, రుద్రవరంలో 41.5, కర్నూలులో 41.4, ఆత్మకూరు, పాములపాడులో 41.3, నందికొట్కూరులో 41.1, డోన్‌లో 41 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఎండలు, వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ డీపీఎం అనుపమ తెలిపారు. ఇన్చార్జ్ ఎస్పీగా ఆదిరాజ్ రాణా ● జపాన్ పర్యటనకు వెళ్లిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్ విదేశీ పర్యటన నిమిత్తం సెలవుల్లో వెళ్లారు. ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు జపాన్‌లో పర్యటిస్తారు. పది రోజుల పాటు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ రాణా ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయమే ఎస్పీ విక్రాంత్ పాటిల్ జపాన్‌కు బయలుదేరి వెళ్లారు. భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకం కర్నూలు(సెంట్రల్): భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం భగరథ మహర్షి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కఠోర శ్రమతో దేనినైనా సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించడారన్నారు. మహర్షిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గతంలో తాత్కాలికంగా మూసివేసిన హాస్టళ్లను తిరిగి ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. బీసీ విద్యార్థుల కోసం డీఎస్సీ శిక్షణను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ వెల్ఫేర్ అధికారి కె.ప్రసూన, యాదవ కార్పొరేషన్ డైరక్టర్ వెంకటేశ్వరరావు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ, డైరక్టర్ సత్యన్న, నగర సంఘం అధ్యక్షుడు సత్యన్న తదితరులు పాల్గొన్నారు. మల్లన్న ఆలయంలోని హుండీకి కన్నం? ● కానుకలు చోరీచేసిన నలుగురు ● ఓ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని మల్లికార్జున స్వామి గర్భగుడిలో ఉన్న హుండీకి నలుగురు మైనర్లు కన్నం వేసినట్లు సమాచారం. ఈనెల 1న ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన మైనర్లు గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయం వద్ద ఉన్న (క్లాత్)హుండీని బ్లేడ్‌తో కోసి, అందులో కొంత డబ్బు తీస్తుండగా దేవస్థాన సూపరింటెండెంట్ పట్టుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి సుమారు రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది రోజుల నుంచి నలుగురు మైనర్లు దర్శనం పేరుతో ఉచిత క్యూలైన్ల ద్వారా ఆలయంలో తరచూ తిరిగినట్లు వెల్లడైంది. ఈఓ ఆదేశాలతో దేవస్థాన సీఎస్ఓ ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ స్టేషన్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. చోరీ విషయమై విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీనియర్ అసిస్టెంట్‌ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీశైలంలో సండే సందడి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
సమయం లేదు మిత్రమా!
● రిజిస్ట్రేషన్లలో టైమ్ స్లాట్ ● బుక్ చేసుకున్న స్లాట్ సమయానికి వెళ్లకపోతే అంతే సంగతులు ● అదనంగా రూ.200 చెల్లించి మరోస్లాట్ బుక్ చేసుకోవాలి ● ఇబ్బంది పడుతున్న క్రయ, విక్రయదారులుకర్నూలు(సెంట్రల్): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన టైమ్ స్లాట్ విధానంతో క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో రోజులో ఎన్ని డాక్యుమెంట్లు అయినా రిజిస్ట్రేషన్ చేసేవారు. ఒకనొక సమయంలో సిబ్బంది రాత్రిళ్లు ఉండి నూరు డాక్యుమెంట్లకుపైగా రిజిస్ట్రేషన్లను జరిపే వారు. నూతన విధానంతో ఎస్ఆర్ఓల్లో (సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో) రోజుకు కేవలం 39, ఆర్ఓ కార్యాలయంలో 78 స్లాట్లే బుకింగ్ అవుతున్నాయి. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి దూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ పని మీద వచ్చిన వారు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అన్లిమిటెడ్ నుంచి లిమిటెడ్‌కు... ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 22 ఎస్ఆర్ఓ, కర్నూలు, నంద్యాల ఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో కర్నూలు, నంద్యాల, ఆదోని, కల్లూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలాయల్లో రోజులో ఎన్ని డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లైనా జరిగేవి. ఒకనొక రోజులో 100కు పైగా డాక్యుమెంట్లు జరిగేవి. డాక్యుమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది అర్ధరాత్రి వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన టైం స్లాట్‌తో అనేక అవస్థలు ఉన్నాయి. వాటిని సరిచేయకపోతే క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడాల్సిందే. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ సంఖ్య టైమ్ స్లాట్‌తో బాగా తగ్గిపోతోంది. గతంలో అన్‌లిమిటెడ్‌గా జరిగే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నూతన విధానంలో లిమిటెడ్‌గా మారిపోయింది. ఇప్పుడు రోజులో సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయం(ఎస్ఆర్ఓ)లో అయితే కేవలం 39, ఆర్ఓ కార్యాలాయల్లో అయితే 78 డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి టైమ్ స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందిగా మారింది. వారు మరుసటి రోజు ఉండే టైం స్లాట్లను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఆ రోజు కూడా ఆన్లైన్ సైట్ పనిచేయకపోతే వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రెండో సారి స్లాట్‌బుక్ చేసుకుంటే రూ.200 వసూలు ఒకసారి రిజిస్ట్రేషన్ కోసం టైం స్లాట్‌ను బుక్ చేసుకుంటే కచ్చితంగా అదే సమయానికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి ఇచ్చిన 10 నిమిషాల సమయంలో వెళ్లకపోతే ఆ స్లాట్ ముగిసిపోతుంది. వారు మళ్లీ స్లాట్‌ను బుక్ చేసుకోవాలంటే అదనంగా రెండో సారి అయితే రూ.200, మూడోసారి అయితే రూ.500 చెల్లించాలనే నిబంధనలు ఉన్నాయి. ఫలితంగా విక్రయదారులపై మరింత ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికే పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంట్ రైటర్ల ఫీజు, చలానాల మొత్తాలతో వినియోగదారులపై తీవ్ర రుణ భారం పడుతోంది. గతంలో ఎప్పుడైనా అందుబాటులో టైం స్లాట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో టైం స్లాట్ విధానం 2020 నుంచే వినియోగదారులకు అందుబాటులో ఉంది. గత ప్రభుత్వ హయాంలో క్రయ, విక్రయదారులే తమ డాక్యుమెంట్‌ను తయారు చేసుకొని వారికి అనువైన సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లేలో పీడీఈ(పబ్లిక్ డేటా ఎంట్రీ) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతనంగా టైం స్లాట్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఎప్పుడైనా టైం స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా..ప్రస్తుతం వాటిని కుదించారు. దీంతో క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది టైమ్‌స్లాట్ విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేయడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గతంలోనూ స్లాట్లు అన్‌లిమిటెడ్‌గా బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం లిమిటెడ్ చేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి వారికి ఇబ్బంది మారింది. ప్రభుత్వం పునరాలోచనచేయాల్సిన అవసరం ఉంది. – చంద్రశేఖర్, డాక్యుమెంట్ రైటర్ -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
దేశానికే రోల్ మోడల్‌గా గుర్తింపు పొందిన రైతు భరోసా కేంద్రాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీటిని రైతుసేవా కేంద్రాలుగా మార్చడంతో నీలినీడలు అలుముకున్నాయి. ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో వందలాది రైతుసేవా కేంద్రాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లా యూనిట్‌గా రేషనలైజేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.ఇవీ కష్టాలు..● రైతు సేవా కేంద్రాలకు ఉరి వేసిన రాష్ట్ర ప్రభుత్వం ● రేషనలైజేషన్ పేరుతో కొన్ని కేంద్రాల తొలగింపు ● రెండు, మూడు రోజుల్లో రానున్న ఉత్తర్వులు ● వైఎస్సార్సీపీ హయాంలో 188 ఆర్బీకేల మనుగడ ● ఇక పోస్టుల భర్తీ, ఆర్బీకేల మనుగడ లేనట్లే ఆర్బీకేలో పనిచేయని డిజిటల్ కియోస్క్ కర్నూలు(అగ్రికల్చర్): రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే అన్నదాతలకు అన్ని రకాల సేవలు అందించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందించే రైతుభరోసా కేంద్రాలు నిర్వీర్యం అయ్యాయి. వీటిని రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేశారే తప్ప ఎలాంటి సేవలు అందించడం లేదు. వాటికి అన్నదాతలకు దూరం చేసేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. గతంలో విత్తనం వేసే సమయం నుంచి మద్దతు ధరతో పంటను అమ్ముకునే వరకు అనేక సేవలు పొందిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్షకుల కష్టం రెట్టింపు అయ్యింది. ఎక్కడి పనులు అక్కడే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు) ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 849, అర్బన్ ప్రాంతాల్లో 28 పనిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 466, నంద్యాల జిల్లాలో 411 ఆర్బీకేలు సేవలు అందిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఆర్బీకేలకు సొంత భవనాలు ఏర్పాటు చేసింది. కర్నూలు జిల్లాలో 328, నంద్యాల జిల్లాలో 156 ప్రకారం 484 ఆర్బీకేలకు అపురూపమైన సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 393 ఆర్బీకేలకు కూడా సొంత భవనాలు నిర్మితం అవుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పోస్టుల భర్తీ లేనట్టే ఆర్ఎస్కే పరిధిలో ఉద్యాన పంటలు ఉంటే గ్రామ ఉద్యాన సహాయకుడు(వీహెచ్ఏ) ఉండాలి. మల్బరీ సాగైతే గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుడు(వీఎస్ఏ) పనిచేయాల్సి ఉంది. వ్యవసాయ పంటలు ఎక్కువగా ఉంటే గ్రామ వ్యవసాయ సహాయుడు( వీఏఏ) విధులు నిర్వర్తించాలి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామ పట్టుపరిశ్రమ సహాయకులందరికీ పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీఏఏలు 474, వీహెచ్‌ఏలు 215 ప్రకారం మొత్తం 689 మంది పని చేస్తున్నారు. మిగిలిన 188 పోస్టులను భర్తీ చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం లేకుండా పోయింది. ఈ పోస్టులన్నీ రద్దయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మూతపడినట్లే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు)ఉండగా రేషనలైజేషన్‌తో వీటిలో 188 కేంద్రాలు మూతపడినట్లే అని వ్యవసాయశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేనందున ఆర్ఎస్కేలు కూడా లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏకంగా 188 ఆర్ఎస్కేలు మూత పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందంటే రైతులకు సేవలు ఏ స్థాయికి దిగజారి పోతాయో ఊహించుకోవచ్చు. 2,600 ఎకరాలకు ఒక వీఏఏ/వీహెచ్ఏ! ప్రతి 2,600 ఎకరాలకు ఒక వీఏఏ/వీహెచ్‌ఏలు ఉండే విధంగా రేషనలైజేషన్ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఈ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. మిగిలిన భూములకు వ్యవసాయ శాఖలో ఎంపీఈవోలుగా పనిచేస్తున్న వారిని నియమిస్తారు. వీఏఏ, వీహెచ్ఏ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఎంపీఇవోలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ● విత్తనం మొదలు పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకునే వరకు రైతుకు ఆర్బీకేలు అండగా నిలిచాయి. ● ఖరీఫ్, రబీ సీజన్లలో ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేసేవారు. ● వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఏపీఎంఐపీ, ఫిషరీష్, మార్కెటింగ్ తదితర శాఖలకు సంబంధించిన అన్ని రకాల కార్యాక్రమాలు ఆర్బీకేల ద్వారానే అమలయ్యాయి. ● ఆర్బీకేల్లో వ్యవసాయ విజ్ఞానానికి సంబంధించిన దాదాపు 50 పుస్తకాలతో మినీ లైబ్రరీ ఉండేది. ● ఆర్బీకేల్లోనే రైతుల సందేహాలను నివృత్తి చేసేవారు. ఏ ఎరువు ఎందుకు ఉపయోగపడుతుందనే దానిపై అవగాహన కల్పించేవారు. ● డిజిటల్ కియోస్క్‌ల ద్వారా తమకు అవసరమైన రైతులు ఆర్డర్ చేస్తే 48 గంటల్లోనే సరఫరా అయ్యేవి. ● ఆడియో, వీడియోలతో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. రేషనలైజేషన్ జరుగుతోంది ఉమ్మడి జిల్లా యూనిట్‌గా రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయితే రైతులకు ఎలాంటి నష్టం ఉండదు. ఉమ్మడి జిల్లాలో 877 ఆర్బీకేలు ఉన్నాయి. ప్రస్తుతం వీఏఏలు, వీహెచ్‌ఏలు కలిపి 689 మంది పనిచేస్తున్నారు. ఇందువల్ల ఆర్బీకేలు తగ్గే అవకాశం లేదు. వీఏఏలు, వీహెచ్‌ఏలు స్థానంలో ఎంపీఇవోలను వినియోగించుకుంటాం. రైతులకు సేవలు యథావిధిగా అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు 2014నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అవే కష్టాలు ఎదురవుతున్నాయి. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందడం లేదు. కల్తీ విత్తనాలు విజృంభిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలో నకిలీ కంది విత్తనాలతో నష్టపోయిన రైతులు పత్తికొండలో ఆందోళన చేపట్టారు. అలాగే గతేడాది ఖరీఫ్ సీజన్లో జూపాడుబంగ్లా, గడివేముల, మిడుతూరు మండలాల్లోని రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారు. పురుగుమందులు, ఇతరత్రా సేవలు పొందడానికి పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబందించిన సేవలను పొందడానికి కియోస్క్‌లను వినియోగిస్తారు. అయితే ఇవి నిరుపయోగంగా మారాయి. రైతుల నుంచి పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసే ఆర్బీకేలు అసలు లేవు. పంటలు పండకపోయినా రైతులను పలకరించే వారు కరువయ్యారు. -
సీహెచ్‌ఓల నిరవధిక సమ్మె
కర్నూలు(హాస్పిటల్): తమ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నట్లు సీహెచ్‌ఓలు తెలిపారు. గత వారం రోజులుగా వీరు కర్నూలు నగరంలోని మ్యూజియం (ధర్నా చౌక్) వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరేళ్లు దాటిన సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు తీర్చే విధంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు చందన, ఉపాధ్యక్షుడు నాగరాజు, నాగేంద్ర, ట్రెజరర్ కార్తీక్, కాంగ్రెస్ నాయకుడు షేక్ జిలానీ బాషా పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– లింగాల ఆర్అండ్బీ రహదారిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. మండలంలోని బిజనవేములకు చెందిన ప్రసాదు సొంత పనుల నిమిత్తం కోవెలకుంట్లకు వెళ్లాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వెళుతుండగా గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రసాదుకు స్థానికులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు రెఫర్ చేశారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. న్యాయం చేయండి సారూ.. డోన్ రూరల్: టీడీపీ నాయకుల నుంచ తమ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడి న్యాయం చేయాలని ఎద్దుపెంట గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ అధికారులను వేడుకుంటున్నాడు. తన తండ్రి డి.ప్రసాద్ పేరుతో ఇంటి ముందు 1సెంట్ ఖాళీ స్థలం ఉందని విజయ్‌కుమార్ తెలిపారు. ఆ స్థలాన్ని పక్కనే ఉన్న టీడీపీ నాయకులు కేబీసీ డీలర్ పెద్దన్న, మాజీ సర్పంచ్ బి.ఈశ్వరయ్య, కేబీసీ మల్లేశ్వరయ్య ఆ ఆక్రమించడానికి యత్నిస్తున్నారన్నారు. పోలీసులకు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లానన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్చు ఇచ్చినా టీడీపీ నాయకులు దౌర్జన్యంగా రచ్చకట్టపేరుతో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. -
ఆర్బీకేలు ఉన్నా లేనట్టే!
మాకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఇందులో కంది, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నాం. ఆర్బీకే మాకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీకేలు లేనట్లుగా ఉన్నాయి. ఎలాంటి సేవలు అందడం లేదు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కోడుమూరుకు, వెల్దుర్తికి వెళ్లాల్సి వస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఆర్బీకేలను నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. – ఎం.మాదన్న, ఎస్‌హెచ్ ఎర్రగుడి, కృష్ణగిరి మండలం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి గత ఏడాది మే నెల వరకు రైతుభరోసా కేంద్రాలతో అన్ని రకాల సేవలు పొందాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆర్బీకేలు పనిచేయడం లేదు. గత ఏడాది వరకు ఎరువులు/ పురుగు మందులు ఏదీ అవసరమైనా నిమిషాల వ్యవధిలోఆర్బీకే ద్వారా పొందువారం. నేడు బస్తా ఎరువు కావాలన్నా... నీళ్ల మందులు కావాలన్నా డోన్‌కు, పత్తికొండకు పోవాల్సి వస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – నౌనేపాటి, ముక్కెళ్ల, తుగ్గలి మండలం -
ట్రిపుల్‌ఐటీలో సీటు వస్తుందని భావిస్తున్నా
నేను పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాను. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాలన్న తపనతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి 589 మార్కులు తెచ్చుకున్నాను. మా అన్న ఉసేన్‌వలి సైతం ట్రిపుల్ ఐటీలోనే బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. – ఉసేన్బాష, పదవ తరగతి మండల టాపర్, కోవెలకుంట్ల పది ఫలితాల్లో 578 మార్కులు వచ్చాయి మాది మధ్యతరగతి కుటుంబం. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాను. గత నెలలో విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 578 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచాను. ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లను నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. – కరిష్మ, కోవెలకుంట్ల విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి 2024–25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లను దరఖాస్తులు చేసుకోవాలి. డోన్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది 119 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 6,280 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,813 మంది విద్యార్థులు వివిధ గ్రేడుల్లో ఉత్తీర్ణత సాధించారు. పాసైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. – వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డీఈఓ, డోన్ -
శ్వేత వర్ణంతో ఆనందిం‘చేను’
భానుడు భగభగ మంటున్నాడు.. ఎండలు మండుతున్నాయి.. నెత్తిమీద టవాల్ వేసుకుని రైతులు బయటకు వెళ్లాల్సి వస్తోంది. అయితే పొలంలో ఉండే పంట పరిస్థితి ఏమిటని రైతు మద్దిలేటి రెడ్డి ఆలోచించాడు. ఎండలకు పంట దెబ్బతినకుండా, తెగుళ్లబారిన పడకుండా వినూత్న ప్రయోగం చేశారు. కాయల నాణ్యత తగ్గకుండా తోటలో దానిమ్మ చెట్లకు గ్రో కవర్ తొడిగారు. దీనిని గుజరాత్ నుంచి తెప్పించారు. ఎకరాకు 10 టన్నులు దిగుబడి వస్తుందని, పెట్టుబడికి రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని రైతు చెప్పారు. తుగ్గలి మండలం తువ్వదొడ్డి గ్రామ సమీపంలో మొత్తం 10 ఎకరాల్లో దానిమ్మ తోట శ్వేత వర్ణంతో అందరినీ ఆకర్షిస్తోంది. – తుగ్గలి -
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి
కర్నూలు(హాస్పిటల్): శ్రీశైలం దర్శనానంతరం తిరిగి వస్తూ నంద్యాల జిల్లా బైర్లూటి సమీపంలో ప్రమాదానికి గురై గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పురుషులు, సీ్త్రల విభాగాల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివారం జిల్లా కలెక్టర్ పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. వారి ఆరోగ్య విషయాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయకుమార్, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి రంగస్వామి, జిల్లా అధ్యక్షులు వీరన్న ఉన్నారు. -
‘పది’ సంతోషం.. దారిలోనే మాయం!
బొలెరో బోల్తా ఘటనలో ఐదుకు చేరిన మృతులు ● ఎర్రబాడు గ్రామంలో అలుముకున్న విషాదం గోనెగండ్ల: పదో తరగతి పాసైన సంతోషంలో శ్రీశైలానికి వెళ్లొస్తుండగా జరిగిన ప్రమాదంలో విద్యార్థి మృత్యువాతపడ్డాడు. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, విద్యార్థి కురువ కుమార్ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. వివరాలివీ.. ఎర్రబాడు గ్రామానికి చెందిన సునిల్‌కు భార్య సునిత, ఇద్దరు కుమారులు సంతానం. సునిల్‌కు బొలెరో వాహనం ఉంది. భార్య గ్రామంలో కూలీ పనులు చేస్తోంది. పెద్ద కుమారుడు కుమార్ సున్నిపెంటలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. చిన్న కుమారుడు గ్రామంలోనే ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కుమార్ 514 మార్కులు సాధించాడు. ఎర్రబాడు గ్రామానికి చెందిన చంద్రమ్మకు ఆదోనికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈ నేపథ్యంలో సునీల్ బొలెరో వాహనాన్ని ఆదోని చెందిన వారు శ్రీశైలానికి వెళ్లేందుకు బడుగకు మాట్లాడుకున్నారు. తన కుమారుడు కూడా పదిలో మంచి మార్కులు సాధించడంతో కుమార్‌ను కూడా తండ్రి సునీల్ తన వెంట తీసుకెళ్లాడు. శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని శుక్రవారం తిరిగి ఆదోనికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోగా బొలెరో టైరు జారింది. వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీకొట్టింది. ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన కుమార్ కోలుకోలేక శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. శనివారం ఉదయం ఎర్రబాడు గ్రామంలో కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు.