
దురలవాట్లకు దూరంగా ఉండాలి
కర్నూలు: హోంగార్డులు దురలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని హోంగార్డు కార్యాలయంలో బుధవారం రాయలసీమ జిల్లాల (8 జిల్లాలు) హోంగార్డు ఇన్‌చార్జి పోలీసు అధికారులతో మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి వారు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందరికీ ఒకే విధమైన నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో మృతిచెందిన వారి ప్లిలలకు కారుణ్య నియామకాల ఉద్యోగాలు, ఎక్స్‌గ్రేషియా త్వరితగతిన పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హోంగార్డు ఇన్‌చార్జిలు, ఆర్‌ఐలు వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రాఘవేంద్ర, హోంగార్డ్స్ డీఎస్పీలు కేవీవీ ఎస్వీ ప్రసాద్, కేజేఎం చిరంజీవి, భాస్కర్ రావు, ఆర్‌ఐ జావెద్, హోంగార్డ్స్ ఆర్‌ఐలు సోమశేఖర్ నాయక్, పోతల రాజు తదితరులు పాల్గొన్నారు.
సదరన్ రీజియన్ హోంగార్డు
కమాండెంట్