
మరో ఆశల సాగు..
రబీలో నష్టపోతే ఖరీఫ్.. ఖరీఫ్ ముంచితే రబీ.. ఏటా అన్నదాతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు. ఈ ఏడాది రబీ పంటలు అంతంత మాత్రంగానే చేతికందడంతో ఖరీఫ్‌పై కోటి ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు. కల్లూరు, కోడుమూరు మండలాల్లో పంటల వ్యర్థాలను, కంప చెట్లను తొలగించి పొలాలను రూపు చేసుకునే పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
స్థల వివాదంలో టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఆత్మకూరు: మండలంలోని క్రిష్ణాపురం గ్రామంలో సోమవారం ఓ స్థల వివాదంలో ఒకే వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ మాటలతో ప్రారంభమై చివరకు రాళ్లతో దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటాన గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. క్రిష్ణాపురం గ్రామంలో ఓ స్థల వివాదంలో కంప చెట్లు తొలగించే సమయంలో ఒకరినొకరు (రెండు వర్గాలూ టీడీపీకి చెందినవారే)దూషించుకుంటూ ఘర్షణకు పాల్పడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడులకు దిగారు. ఇరువర్గాలకు చెందిన పది మందికి రక్త గాయాలయ్యాయి. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ రాము తన సిబ్బందితో క్రిష్ణాపురం చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పది మందికి పైగా గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం

మరో ఆశల సాగు..