
బసవేశ్వర పురాణంలో ఆకట్టుకున్న సీమంతం
హొళగుంద: స్థానిక సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణంలో జరగుతున్న కల్బుర్గి శ్రీశరణ బసవేశ్వరస్వామి పురాణ ప్రవచనంలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన సీమంతం భక్తులను అమితంగా ఆకట్టుకున్నా యి. కార్యక్రమాన్ని తిలకించడానికి చుట్టు పక్కల గ్రా మాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రవచన కారుడు సిద్ధరామయ్యస్వామి హిరేమ ఠ్‌శాసీ్త్ర శరణ బసవేశ్వరస్వామి లీలలు గురించి వివరిస్తూ సీమంతం కార్యక్రమంపై భక్తులకు కథలు, గేయల రూపంలో చెప్పి ఆకట్టుకున్నారు. ఈనెల 30 వరకు జరిగే ఈ పురాణ ప్రవచన కార్యక్రమానికి వచ్చే చుట్టు పక్కల గ్రామాలు, దూర ప్రాంతాల భక్తులకు నిత్యం అన్నదానం చేపడుతున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు రాజ పంపన్న గౌడ్, శివశంకర్‌గౌడ్, సిద్ధార్థగౌడ్, ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

బసవేశ్వర పురాణంలో ఆకట్టుకున్న సీమంతం