పత్తికొండ రూరల్: హోసూరు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ అడవి లక్ష్మన్న (58) సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. ఉదయం భార్య లక్ష్మీదేవితో కలిసి ఉపాధి పనులకు వెళ్లి కూలీలతో కలిసి కుంట తవ్వకం పనిచేసుకుంటూ ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఇంటికి తీసుకొచ్చేలోగానే మృతి చెందినట్లు ఉపాధి కూలీలు తెలిపారు. పనిప్రదేశంలో ఉపాధి కూలీలకు టెంట్లు, నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరఫరా లాంటి సౌకర్యాలు కల్పించకపోవడం కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ట్‌వేర్ ఉద్యోగి మృతి
శిరివెళ్ల: గుంప్రమాన్‌దిన్నె– యర్రగుంట్ల రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంప్రమాన్‌దిన్నెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వరకూటి రేణుకుశవరెడ్డి (32) మృతి చెందాడు. ఈ నెల 13న స్వగ్రామం నుంచి యర్రగుంట్లకు బైక్‌పై వస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలలో పడి మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున వాకింగ్‌కు వచ్చిన వ్యక్తులు చూసి తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి గోపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చిన్న పీరయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి గ్రామానికి చేరుకొని గోపాల్‌రెడ్డిని పరామర్శించరు.
రిమాండ్‌కు సెల్ దొంగలు
డోన్ టౌన్: చోరీచేసిన 52 సెల్‌ఫోన్‌లు, 40 లీటర్ల నాటాసారాను కారులో తరలిస్తుండగా ఈ నెల 11వ తేదీ డోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిందితులు నగనూరి వంశీ, హాజీవలి అలియాస్ అజ్జూ, నగనూరి వసంత అనే ముగ్గరిపై కేసు నమోదు చేశారు. సోమవారం జడ్జి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించినట్లు పట్టణ సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఐ నరేంద్రకుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
వడదెబ్బతో ఉపాధి కూలి మృతి
వడదెబ్బతో ఉపాధి కూలి మృతి