శాస్త్రోక్తంగా పీఠాధిపతి పుట్టిన రోజు వేడుకలు
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాఽధిపతి సుబుధేంద్ర తీర్థుల పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎస్‌వీఎస్ విద్యాపీఠ విద్యార్థులు నిర్వహించిన పీఠాధిపతి పవిత్ర తైల అభ్యంగన స్నానాలతో ఉత్సవం ప్రారంభమైంది. తులసీవనాన్ని అలరించి పర్యావరణ సామరస్యం మొక్కలను పంపీణీ చేసి భక్తుల ఆశీర్వదవచనాలు చేశారు. స్వామీజీ పేరు మీదుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఊంజల మంఠపంలో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులకు తులాభారం సేవ చేపట్టారు. మఠం నిర్వాహకులు భారీ గజమాలతో పీఠాఽధిపతిని సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. భక్తులకు పీఠాఽధిపతి ఆశీర్వదవచనాలు చేశారు.


