
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా వస్తుండటం విచారకరం. ‘అధిక రక్తపోటు’ శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యని నియంత్రించవచ్చు.
అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు పదార్థాలను తినకూడదు. ఇలాంటివి తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
►గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
► ఆధునిక కాలంలో మారిన జీవన పరిస్థితుల వల్ల చాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి కారణాలు అనేకం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు
► తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
► కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టొమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితిలో రెండు టమోటాలు బాగా కడిగి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగాలి. కావాలంటే ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీలోని స్టోన్స్‌ను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది.
► పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment