Kidney problems
-
ఈ ఎండల్లో కిడ్నీ ఎమర్జెన్సీల నివారణ ఇలా..!
ఈ ఎండలతో దేహానికి వడదెబ్బ లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నట్టే మూత్రపిండాల (కిడ్నీల)కు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ‘అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ’ (ఏకేఐ), మూత్రవ్యవస్థలో రాళ్లు ఏర్పడే‘యూరో లిథియాసిస్’, కొన్నిరకాల మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, వడదెబ్బ కారణంగా ఏర్పడే కిడ్నీ సమస్యలు ఇందులో కొన్ని. ఈ మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి వంటి వాటి గురించి తెలిపే కథనమిది. ఏప్రిల్ నెల ఇంకా ముగియక ముందే... నమోదవుతున్న ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైమాటే. దాంతో డీహైడ్రేషన్ వల్ల సమస్యలకు గురయ్యే కీలక అవయవాల్లో కిడ్నీలు ముఖ్యమైనవి. కిడ్నీపై దుష్ప్రభావాలిలా... అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) : దేహంలో నీరు తగ్గినప్పుడు రక్తం చిక్కబడి, రక్తప్రవాహ వేగమూ మందగిస్తుంది. ఫలితంగా అన్ని అవయవాలకు లాగే కిడ్నీకి అందే రక్త పరిమాణం కూడా తగ్గుతుంది. దాంతో దేహంలో పేరుకు పోయే వ్యర్థాలను బయటకు పంపే వేగమూ తగ్గుతుంది. దాంతో కిడ్నీల పనితీరులో ఆకస్మికంగా మార్పులు వచ్చి, అస్తవ్యస్తంగా పని చేస్తాయి. ఈ కండిషన్ పేరే ‘అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ’. దీని దశలు:ఆలిగ్యూరిక్ ఫేజ్: ఈ దశలో యూరిన్ ఔట్పుట్ బాగా తగ్గి, కిడ్నీల్లోని రీనల్ ట్యూబ్యూల్స్ అనే సన్నటి నాళాలు దెబ్బతింటాయి. డైయూరెటిక్ ఫేజ్: ఈ దశలో కిడ్నీ తనను తాను రిపేర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. రికవరీ ఫేజ్: ఒకవేళ తగినన్ని నీళ్లు, ద్రవాహారం అంది రీ–హైడ్రేషన్ జరిగితే...కిడ్నీల పనితీరు మెరుగయ్యే అవకాశం ఉంది. ఏకేఐ లక్షణాలు...► మూత్రం తక్కువగా రావడం.► ఒంట్లో వాపు ► వికారం ∙తీవ్రమైన నిస్సత్తువ, అలసట► శ్వాస వేగంగా తీసుకుంటూ ఉండటం... సరిగా అందకపోవడం. చికిత్స... ఇది పరిస్థితి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సెలైన్ పెట్టి, దేహానికి తగినంత రీహైడ్రేషన్ జరిగేలా చూడటం. ∙అవసరాన్ని బట్టి యాంటిబయాటిక్స్ వాడటం. ∙కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయక దేహంలో బాగా వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి డయాలసిస్ చేయాల్సి రావడం. కిడ్నీలో రాళ్లు (యూరోలిథియాసిస్): మూత్ర వ్యవస్థలో లవణాల స్ఫటికాలతో రాళ్లు ఏర్పడటాన్ని ‘యూరోలిథియాసిస్’ అంటారు. దీన్నే వాడుక భాషలో మూత్రపిండాల్లో రాళ్లు రావడంగా చెబుతారు. తీవ్రమైన నడుము నొప్పి, మూత్రంలో రక్తం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే ఈ సమస్యలో రాళ్లు చిన్నగా ఉంటే మందులతో పాటు, తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోవడం, రాళ్లు ఏర్పడేందుకు అవకాశం ఉండే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలను సూచిస్తారు. రాయి పరిమాణాన్ని బట్టి కొన్ని ప్రక్రియలతో చూర్ణమయ్యేలా చేసి, మూత్రంతో పాటు పోయేలా చూస్తారు. కుదరనప్పుడు శస్త్రచికిత్స చేస్తారు.మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు : వ్యర్థాలు బయటకు పోని సందర్భాల్లో... అవి దేహంలో పేరుకు పోయి, బ్యాక్టీరియా పెరిగిపోయి, మూత్రవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బంది, నొప్పి, మూత్రం బొట్లు బొట్లుగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తారు. నివారణ కోసం... ►సాధ్యమైనంతవరకు నీడపట్టునే ఉండటం.►తేలికపాటి రంగులతో కూడిన, గాలి తగిలేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు, బ్రిమ్ హ్యాట్, స్కార్ఫ్ వంటివి వాడటం.► తగినన్ని నీళ్లు తాగుతూ, లవణాలు (ఎలక్ట్రోలైట్స్) అందేలా చూసుకోవడం.►డాక్టర్ సూచన లేకుండా డై–యూరెటిక్స్, నొప్పి నివారణ మందుల్ని వాడకపోవడం. ∙ -
ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వల్ల ఆ సమస్యలు ! పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఇటీవల కాలంలో ఎన్నో రకాల ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఉండే అడ్వర్టైస్మెంట్లు మహిళలను అట్రెక్ట్ చేసి మరీ కొనేలా చేస్తాయి ఈ ఫెయిర్‌నెస్ ప్రొడక్ట్‌లు. అయితే తాజా అధ్యయనంలో ఈ ఫెయిర్‌నెస్ వాడకం వల్ల ఆ సమస్యలు వస్తున్నాయంటూ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ప్రజల ఆరోగ్యానికి హానికరమైన వాటితో ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు తయారు చేస్తారా? అని తయారీదారులపై ఫైర్ అవుతున్నారు. చర్మ సంరక్షణ ఎలా ఉన్నా.. ఆరోగ్యమే చెడి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు ఆరోగ్యానికి నిజంగానే హానికరమా? ఎందుకని? సవివరంగా తెలుసుకుందామా..! ఫెయిర్‌నెస్ క్రీమ్‌లంటే మహిళలకు, ముఖ్యంగా యువతకు ఎంత మక్కువ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి ఉన్నంత డిమాండ్ మరే వ్యాపారానికి ఉండదంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి ఈ ఫెయిర్‌నెస్ క్రీముల్లో మెర్క్యురీ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల మూత్రపిండాలకు సంబంధించిన మెంబ్రానస్ నెఫ్రోపతీ (ఎంఎన్) కేసులు భారత్‌లో ఎక్కువగా పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అందుకు సంబంధించిన విషయం కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. ఈ పరిస్థితి కారణంగా మూత్రపిండాల్లో ఫిల్టరింగ్ వ్యవస్థ దెబ్బతిని ప్రోటీన్ లీకేజ్ కారణమవుతుందని చెబుతున్నారు. మూత్ర పిండాల వ్యాధి అనేది ముఖ్యంగా శరీరంలోని అంతర్గత రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడి మూత్రపిండాల రుగ్మతకు కారణమవుతుంది. దీని కారణంగా మూత్రంలో పోటీన్లు వెళ్లిపోవడం జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే.. మనం ముఖానికి రాసుకునే ఫెయిర్‌నెస్ క్రీమ్ మూత్ర పిండాలపై ఎలా ఎఫెక్ట్ చూపుతుందంటే..?. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లో వాడే పాదరసం చర్మం ద్వారా లోపలికి వెళ్తుంది. అది నేరుగా మూత్రపిండాల ఫిల్టర్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసులు పెరుగుదలకు దారితీస్తుందని పరిశోధకులు డాక్టర్ సజీష్ శివదాస్ అన్నారు. అందులోనూ మార్కెట్లో వచ్చే ప్రతి ఫెయిర్‌నెస్ క్రీమ్ తక్షణమై ముఖం ఫెయిర్‌గా ఉండేలా చేసే ఫలితాల కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యిందని అన్నారు. అంతేగాదు జులై 2021 నుంచి 2023 మధ్య కాలంలో ఇలాంటి మూత్ర పిండాల రుగ్మతకు సంబంధించిన 22 కేసులపై అధ్యయనం నిర్వహించారు. ఆయా వ్యక్తులు తేలికపాటి ఎడెమా(వాపు), నురుగతో కూడిన మూత్రం తదితర లక్షణాలు కనిపించాయని అన్నారు. అంతేగాదు వారిలో చాలామందికి మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు పెరిగాయన్నారు. అలాగే ఒక రోగి మాత్ర మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా వచ్చినట్లు తెలిపారు. అలాగే వైద్యపరీక్షల్లో 22 కేసుల్లో 68% మంది అంటే 15 మందికి న్యూరల్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ప్రోటీన్(NELL-1) పాజిటివ్‌గా తేలింది. అంటే వారంతా మాత్రపిండాలకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారని పరిశోధనలో తేలిందన్నారు. అంతేగాదు ఆ 15 మందిలో దాదాపు 13 మంది ఈ లక్షణాలు కనిపించక మునుపే తాము ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు వాడినట్లు అంగీకరించారు. మిగతా ఇద్దిరిలో ఒకరు సాంప్రదాయ స్వదేశీ క్రీములను వాడినట్లు తెలిపారు. మరోకరికి ఆ చరిత్ర కూడా లేదు. అయితే ఆయా రోగులు ఈ ఫెయిర్నస్ క్రీమ్‌లు వాడటం మానేసిన తర్వాత మూత్రిపిండాల వ్యాధి అదుపులో ఉన్నట్లు తేలింది. అంతేగాదు ఆయా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తున్నాయి అనేందుకు ఈ తాజా పరిశోధనే ఉదహరణ అని తెలిపారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ ఉత్పత్తులను సమర్థించడం, పైగా ఇది బహుళ బిలియన్ డాలర్ల పరిశ్రమ కావడం వల్ల అధికారులెవరూ ఈ ఉత్పత్తులకు అడ్డకట్టవేసే సాహసం చేయడం లేదని ఆరోపించారు. ఇక్కడ కేవలం చర్మ సంరక్షణ, మూత్ర పిండాల సమస్య కాదు. ఇందులో ఉపయోగించే పాదరసం ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమైనదనేది గుర్తించడం తోపాటు ఈ హానికరమైన ఉత్పత్తులకు అడ్డుకట్టవేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!) -
రోగాలకు ‘గూగుల్ చికిత్స’ వద్దు
మాదాపూర్: కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మాదాపూర్‌లోని యశోద హాస్పిటల్లో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై శనివారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రోజురోజుకీ జీవన విధానంలో మార్పులు రావడం వల్లనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. గ్రామాలలో చాలా మందికి కిడ్నీ సమస్యలపై అవగాహన లేకపోవడంతో, సంబంధంలేని డాక్టర్ల వద్దకు వెళ్లి మోతాదుకు మించిన మందులను వాడుతుండటంతో కిడ్నీ సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. చాలా మంది గూగుల్ సెర్చ్ చేసి స్వయంగా మందులు వాడటంతో అవి పెద్ద సమస్యలుగా మారుతున్నాయన్నారు. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మందులను వాడాలని, సంబంధించిన డాక్టర్ వద్ద మాత్రమే చికిత్స పొందాలని గవర్నర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందిస్తోందని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. కిడ్నీలను పరీక్షించేందుకు గతంలో సరైన పరికరాలు ఉండేవి కాదని, ప్రస్తుతం అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలాంటి సదస్సులను నిర్వహించడం వల్ల రోగులకు వ్యాధులపై అవగాహనతో పాటు మెరుగైన చికిత్సను అందించవచ్చని చెప్పారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ, ఏకేఐ నిర్ధారణ సీరం క్రియాటిన్ పెరుగుదలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచంలో దాదాపు 850 మిలియన్ ప్రజలు ఏదో ఒక మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారని తెలిపారు. కిడ్నీ వ్యాధులు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ వ్యాధులపై చర్చించడానికి సదస్సులో అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో వేయి మందికిపైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం
-
చేపలు తింటున్నారా? దానిలోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల..
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా వస్తుండటం విచారకరం. ‘అధిక రక్తపోటు’ శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యని నియంత్రించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు పదార్థాలను తినకూడదు. ఇలాంటివి తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ►గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ► ఆధునిక కాలంలో మారిన జీవన పరిస్థితుల వల్ల చాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి కారణాలు అనేకం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు ► తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ► కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టొమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితిలో రెండు టమోటాలు బాగా కడిగి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగాలి. కావాలంటే ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీలోని స్టోన్స్‌ను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. ► పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. -
రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిందా? వీరిలో ముప్పెక్కువ
ఈరోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం ఎక్కువగా చూస్తున్నాం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్’ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అనేక ఆనోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. అవేంటో చూద్దాం. శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే... అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ... తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఇలా వచ్చే కీళ్లనొప్పుల్ని ‘గౌట్’ అని అంటారు. ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలామందిని వేధిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అయిన తర్వాత విడుదల చేసే పోషకాలలో ఇది కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా ఇది రక్తంలో ఉండిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ...? యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగే అవకాశాలు కొందరిలో మరీ ఎక్కువ. వారెవరంటే... మద్యం తీసుకునేవారు మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారు ∙అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ∙రక్తాన్ని పలుచబార్చే మందులు వాడేవారిలో... ముప్పు ఎక్కువ. శరీరంలో మోతాదుకు మించి యూరిక్ యాసిడ్ ఉంటే కడుపులో మంట,కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపులు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ ఇలా చేస్తే కంట్రోల్లో.. లేత సొరకాయ చెక్కు తీసి, చిన్న ముక్కలు చేసి, ఎటువంటి నీళ్లు పొయ్యకుండా మిక్సీలో వేసి, ఆ గుజ్జును (ఫిల్టర్ చెయ్యకుండా) పరగడుపున తినాలి. రోజూ ఒక చిన్న గ్లాసుడు(100ml) తిని చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపేయండి రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు తినొచ్చు రోజుకు కనీసం 4-5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్ మరియు పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించండి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
పీరియడ్స్ టైంలో నొప్పిగా ఉందా? రక్తహీనతతో బాధపడుతున్నారా? ఈ ఆకు రసాన్ని..
ప్రకృతి ఓ ఔషదాల గని. అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని, ఔషధాలను ప్రకృతిలో లభించే మొక్కలతో తయారు చేసుకోవచ్చు. మర పెరట్లో లభించే అనేక మొక్కల్లో పునర్నవ ఒకటి.పునర్ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవింప చేయగలదు కాబట్టే ‘పునర్నవ’ అయ్యింది. పల్లెల్లో దానిని అటుక మామిడి అనీ, గలిజేరనీ, ఎర్రగలిజేరనీ అంటారు.పునర్నవ ఆకులవల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. ► కాలేయ వ్యాధుల చికిత్సకు సంబంధించిన చికిత్సల్లో పునర్నవ ఒక సంప్రదాయ చికిత్స. ఈ ఔషధ మొక్కను కాలేయ పనితీరు మెరుగుపర్చేందుకు ఉపయోగిస్తారు. ► పునర్నవ మూత్రపిండాల్లో రాళ్ళను నివారించేందుకు సహాయపడుతుంది. పునర్నవ ఆకు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుందని క్లినికల్ అధ్యయనాలు కనుగొన్నాయి. ► పునర్నవను మజ్జిగతో కలిపి తీసుకుంటే ఐరన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత లక్షణాల్ని 90 రోజుల్లోనే తగ్గిస్తుంది. ► పునర్నవ ఋతు సమయంలో వచ్చే తిమ్మిర్లు తగ్గడానికి సహాయం చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.గర్భాశయంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. వాపు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.ఇన్సులిన్ స్థాయిల్ని పెంచి బీటా-కణాల్ని పునరుద్దరించడం ద్వారా చక్కెర వ్యాధిని పునర్నవ తగ్గిస్తుంది. ► పునర్నవ బరువు తగ్గించేందుకు సహాయం చేస్తుంది. ► వృద్దాప్య లక్షణాలు తగ్గించడానికి, ముఖంపై ముడతలు, గీతలను నివారిస్తుంది. ► తెల్ల గలిజేరు కఫము, దగ్గు, శరీరంలో కలిగే వాపులు, వాత వ్యాధులు, పొట్టకు సంబంధించిన వ్యాధులు, లివర్ వాపుకి, గుండె బలహీనత వల్ల వచ్చిన వాపుని పోగొడుతుంది. కిడ్నీల పని తీరును మెరుగు పరుస్తుంది. ► పునర్నవ కంటిచూపును మెరుగుపరుస్తుంది.తెల్ల గలిజేరు ఆకుని రసం పది గ్రాముల మోతాదు తీసుకుని పెరుగులో కలిపి ఉదయం, సాయింత్రం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి. ఇలా మూడు రోజులు తీసుకోవాలి. ► ఈ ఆకు రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి సన్నని సెగ మీద కాచాలి. రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలేదాకా కాచాలి. ఈ నూనెను కీళ్ల నొప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి. నడక రాని పిల్లలకు ఈ తైలం మర్ధన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని ఆయుర్వేద వైద్యులు వివరిస్తారు. ► గలిజేరు ఆకురసాన్ని పటిక బెల్లంతో పాకంపట్టి.. రోజూ ఒక చెంచా చొప్పున నీళ్లలో కలిపి తీసుకుంటే గుండె దడ, బలహీనత తగ్గుతాయి. ఈ ఆకు రసం ఒక స్పూన్ తీసుకుని దానికి కొద్దిగా అల్లం రసం కలిపి నెల రోజులు తాగితే శరీరంలో ఉబ్బు తగ్గుతుంది. అయితే ఈ ఆకు కూరని అతిగా తినకూడదు. హుద్రోగ వ్యాధి గ్రస్తులు వైద్యుడి సలహా తీసుకుని తినాలి. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు చలువ చేసే పదార్థాలు అధికంగా తీసుకుంటూ ఈ ఆకు కూరని మితంగా తినాలి. పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు ఈ ఆకు కూర తినకూడదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారైనా వారానికి ఒకసారి మాత్రమే తినాలి. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది. చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. -
ఉద్దానం ఫేజ్–2కు రెడీ
సాక్షి, అమరావతి: దశాబ్దాల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా సురక్షిత తాగునీరు అందించనుంది. ఇందుకోసం రూ.265 కోట్లతో ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. తద్వారా పాతపట్నం, మెలియపుట్టి, హిరమండలం, కొత్తూరు, లక్ష్మీనరసపేట మండలాల పరిధిలోని 448 నివాసిత ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు మూడున్నర లక్షల మందికి తాగునీటి ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిపోతాయి. ఉద్దానం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో కొన్ని ప్రమాదకర లోహాలు కారణంగానే ఆ నీటిని తాగే అక్కడి ప్రజలు ఏళ్ల తరబడి కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ సమస్య పరిష్కారానికి గత చంద్రబాబు ప్రభుత్వం మాయమాటలు చెబుతూ కాలక్షేపం చేస్తే.. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడునెలలకే రూ.700 కోట్లతో పలాస, ఇచ్ఛాపురం రెండు మున్సిపాలిటీలతో పాటు ఆ ప్రాంతంలోని ఏడు మండలాల పరిధిలోని 807 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే ఉద్దానం ఫేజ్–1 రక్షిత మంచినీటి పథకానికి 2019 సెప్టెంబరు 6న ప్రభుత్వం మంజూరు చేసింది. 2020 ఆరంభంలోనే పనులను కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ పనులు 90 శాతానికి పైగా పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనికి అనుసంధానంగా ఇప్పుడు ఆ ప్రాంతంలోని మరో ఐదు మండలాల ప్రజలకు కూడా తాగునీరు అందించే పథకానికి ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) ఆ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. రూ.265 కోట్లతో చేపట్టే ఉద్దానం ఫేజ్–2 పనుల టెండరు డాక్యుమెంట్ ప్రస్తుతం జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలనలో ఉంది. మే 4 వరకు అభ్యంతరాల స్వీకరణ అనంతరం జ్యుడీషియల్ ప్రివ్యూ తుది ఆమోదం అనంతరమే టెండర్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆర్డబ్యూఎస్ అధికారులు ‘సాక్షి’కి వివరించారు. ‘హిరమండలం’ నుంచి నీటి తరలింపు.. ఉద్దానం మొదటి దశ, రెండో దశ మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఉద్దానానికి అతి సమీపంలో ఉండే బహుదా, మహేంద్రతనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతుండడంవల్ల అక్కడ ప్రజలు తిరిగి బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి ఉంటుందేమోనని ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో కొంత అదనపు ఖర్చయినా ఏడాది పొడవునా నీరు అందించే అంశంపై దృష్టిపెట్టింది. దీంతో ఉద్దానానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేసి, అక్కడి ప్రజలకు ఏడాది పొడువునా తాగునీరు అందించాలని సంకల్పించింది. ఇప్పుడు రెండో దశ ప్రాజెక్టులో కొన్ని ప్రాంతాలకు కూడా నేరుగా రిజర్వాయర్ నుంచే తాగునీటి సరఫరాకు ఏర్పాట్లుచేశారు. హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని, అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ఫేజ్–1 ద్వారా ఆ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కొత్తగా రూ.265 కోట్లతో చేపట్టే ఉద్దానం రెండో దశ ప్రాజెక్టుకు 0.291 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నారు. వచ్చే 30ఏళ్లలో పెరిగే జనాభాకు తగ్గట్లుగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. -
ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి / అరసవల్లి: రాష్ట్రంలో మూడేళ్ల క్రితం వరకు కిడ్నీ రోగుల పరిస్థితి ఏమిటని ఎవరైనా సరే స్వయంగా వెళ్లి బాధితులనే అడిగితే వాస్తవమేమిటో తెలుస్తుంది. కిడ్నీ బాధితుల కష్టాలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన, విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే విప్లవాత్మక చర్యలతో వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు వారికి అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకుంటూనే, మరో వైపు వారికి పింఛన్ పెంపు ద్వారా అర్థికంగా దన్నుగా నిలిచారు. ఇంకో వైపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మంచి నీటి సరఫరా జరిగేలా అడుగులు ముందుకు వేశారు. వాస్తవం ఇలా ఉంటే ఈనాడు పత్రిక అధినేత రామోజీరావుకు మాత్రం మరో కనిపిస్తోంది. మాటల్లో కాదు.. చేతల్లోనే ► 1980 దశకం నుంచి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంత వరకు స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ.. అక్కడి తాగునీరే కారణం కావొచ్చేమోనన్న నిపుణుల అనుమానాల మేరకు 2019 సెప్టెంబరు 6వ తేదీన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాంతానికి శాశ్వత రక్షిత మంచి నీటి పథకాన్ని మంజూరు చేసింది. ► పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రెండు మున్సిపాలిటీలతో పాటు 807 నివాసిత గ్రామాలకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని రూపొందించింది. ఏడాది పొడవునా సురక్షిత నదీ జలాలను పైపులైన్ ద్వారా అందించేలా డిజైన్ చేశారు. ► ఉద్దానానికి సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉన్నా, అవి వేసవిలో ఎండిపోతే ఇబ్బంది ఉంటుందని భావించి, దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హిరమండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా నీటిని తరలించి మెళియాపుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేస్తారు. ► హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ప్రాంత ప్రజల కోసం ప్రభుత్వం కేటాయించింది. శుద్ధి చేసిన నీటిని ఉద్దానం ప్రాంతంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేస్తోన్న రక్షిత మంచి నీటి ఓవర్‌హెడ్ ట్యాంకులకు తరలిస్తారు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు. ఇప్పటికే 80 శాతం పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. 2023 మార్చి నాటికి పనులు పూర్తవుతాయి. రోజుకు 84 మిలియన్ లీటర్ల తాగు నీటిని సరఫరా చేసేందుకు వీలుగా మెళియాపుట్టి ప్రాంతంలో నీటి ఫిల్టర్ బెడ్లు నిర్మిస్తున్నారు. కనీసం 30 ఏళ్ల పాటు సరఫరా చేసేలా వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ► 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత ఐదేళ్ల వరకు హడావుడి తప్ప చేసిందేమీ లేదు. పలాసలో 70శాతం పనులు పూర్తయిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైఎస్ జగన్ చర్యలు ఇలా.. ► ప్రతిపక్షనేత హోదాలో కవిటి మండలం జగతిలో కిడ్నీ బాధితుల భరోసా యాత్ర పేరిట వైఎస్ జగన్ పర్యటించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ సమస్యపై నిపుణులతో చర్చించారు. ► చంద్రబాబు ఇస్తున్న రూ.2,500 పింఛన్‌ను జగన్ అధికారంలోకి రాగానే వ్యాధి తీవ్రతను బట్టి రూ.10 వేలు, రూ.5 వేలు చేశారు. రూ.700 కోట్లతో భారీ రక్షిత మంచి నీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, 80 శాతానికి పైగా పూర్తి చేశారు. డయాలసిస్ కేంద్రాల్లో పడకల సంఖ్యను 62 నుంచి 90కి పెంచారు. ఇద్దరు నెఫ్రాలజిస్టులను నియమించారు. రూ.50 కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి నిర్మిస్తున్నారు. 70 శాతం పూర్తయింది. ► కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 37 రకాల మందులను నెఫ్రాలజిస్ట్‌లు సూచిస్తుంటారు. ఈ క్రమంలో ఉద్దానం ప్రాంతంలోని పీహెచ్సీ నుంచి ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తోంది. మరో 12 రకాల మందులను స్థానిక అవసరాలకు అనుగుణంగా అక్కడికక్కడే కొనుగోలు చేసుకోవడానికి వైద్య శాఖ అనుమతులు ఇచ్చింది. ► వ్యాధి లక్షణాలు కన్పిస్తే వెంటనే సామాజిక ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందే అవకాశం కల్పించారు. అక్కడ అవసరమైన మేరకు ఫిజీషియన్లను నియమించారు. డయాలసిస్ రోగులకు ఎత్రోపాయిటన్ ఇంజక్షన్ క్రమం తప్పకుండా ఉచితంగా ఇస్తున్నారు. పలాస సీహెచ్‌సీలో నెఫ్రాలజిస్టును నియమించారు. వారానికి ఒకసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బతుకుతాననుకోలేదు.. నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ లక్షల రూపాయలు ప్రైవేటు ఆస్పత్రికే ధారబోశాను. అప్పట్లో కనీసం ఒక్క డాక్టర్ గానీ, మందులు ఇచ్చేవారు గానీ మా గ్రామానికి వచ్చేవారు కాదు. రెండున్నరేళ్ల నుంచి రూ.10 వేలు పింఛన్ వస్తోంది. నన్ను డయాలసిస్ కేంద్రానికి తీసుకువెళ్లడానికి 108 బండి వస్తోంది. నేను ఇప్పటి వరకు బతుకుతానని అసలు అనుకోలేదు. అంతా జగనన్న దయే. – సుగ్గు లక్ష్మీ, సన్యాసిపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం, శ్రీకాకుళం జిల్లా రూ.10 వేలు పింఛన్ అందుకుంటున్నాం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.10 వేలు పింఛను ఇస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డయాలసిస్ చేసుకోవడానికి స్థానికంగా బెడ్స్ లేక ఇబ్బంది పడేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక సమస్యలు నుంచి గట్టెక్కాం. డయాలసిస్ కూడా సకాలంలో చేసుకుంటున్నాం. – మర్రిపాటి తులసీదాస్, పెద్దశ్రీరాంపురం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా ఈనాడు కథనం అవాస్తవం శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంత మండలాల్లో కిడ్నీ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అద్భుత సేవలందుతున్నాయి. ఈ విషయాన్ని విస్మరించి ‘ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు..?’ అంటూ ఈనాడు తప్పుడు కథనం ప్రచురించడం దారుణం. జిల్లాలో 35 వేల మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) తో బాధపడుతున్నారని, ఇందులో 4,500 మంది చనిపోయారని రాశారు. డయాలసిస్ సెంటర్లు సరిపడా లేవని, నెఫ్రాలజిస్టులే లేరన్నారు. వాస్తవంగా జిల్లాలో 2,27,099 మందికి స్క్రీనింగ్ చేస్తే 19,379 మంది కిడ్నీ రోగులుగా తేలింది. ఇందులో 1,118 మంది వివిధ కారణాలతో చనిపోయారు. ఉద్దాన మండలాల్లోనే 28 డయాలసిస్ యూనిట్లను కొత్తగా ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఒకటి, హరిపురం సీహెచ్‌సీలో 10, పలాస సీహెచ్‌సీలో 04, సోంపేటలో 08, కవిటిలో 05 చొప్పున యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు నెప్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. పీహెచ్‌సీల్లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10 ఎనలైజర్లను కొనుగోలు చేశారు. అన్ని రకాల మందులు అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ మీనాక్షి, డీఎంహెచ్‌వో -
Health: యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే!
శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే... అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ... తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఇలా వచ్చే కీళ్లనొప్పుల్ని ‘గౌట్’ అని పేర్కొంటారు. ఈ గౌట్ మీద చాలామందికి అవగాహన ఉంటుంది. కానీ యూరిక్ యాసిడ్ పెరగడం మరికొన్ని అనర్థాలకు దారితీస్తుందనీ, ఆ సమస్యలు చాలామందికి పెద్దగా తెలియవని అంటున్నారు డాక్టర్లు. ఇలా యూరిక్ యాసిడ్ పెరగడం అన్నది గుండె, మూత్రపిండాలు, కాలేయం లాంటి కీలక అవయవాలపై దుష్ప్రభావం చూపుతుందనీ, కాబట్టి వాటి విషయంలోనూ అవగాహన అవసరమని చెబుతున్నారు. మనం అనేక రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. అందులో మాంసకృత్తులు (ప్రోటీన్లు) ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారాలు జీర్ణమయ్యే సమయంలో కొన్ని వ్యర్థాలూ విడుదలవుతాయి. వాటిని బయటకు పంపే బాధ్యత మూత్రపిండాలు నిర్వహిస్తాయి. ఒకవేళ ఆ బాధ్యతను అవి సరిగా నిర్వహించలేకపోతే రక్తంలో ‘యూరిక్ యాసిడ్’ మోతాదులు పెరుగుతాయి. ఇలా పెరిగాయంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో యూరిక్ యాసిడ్ ప్రమాణాలు 3.5 నుంచి 7.2 ఉండాలి. స్త్రీల విషయంలోనైతే గరిష్ట మోతాదు 6.2 వరకే ఉండాలి. ఈ మోతాదులు మించితే కిడ్నీలపై దుష్ప్రభావాలు, గాల్ బ్లాడర్‌లో రాళ్లు వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. ఇవి కొన్ని లక్షణాల రూపంలో వ్యక్తమవుతాయి. కారణాలు: రక్తంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరగడానికి అనేక అంశాలు దోహదపడతాయి. చాలా అరుదుగా కొందరిలో పుట్టుకతో వచ్చే ఎంజైమ్ లోపాల కారణంగా కూడా అవి పెరగవచ్చు. ఇది నివారించలేని సమస్య. ఇక నివారించగలిగే కొన్ని కారణాలూ ఉంటాయి. అవి... నీళ్లు : కొంతమంది చాలా తక్కువ నీళ్లు తాగుతుంటారు. రోజూ సరిపడా నీరు తాగనివారిలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయే అవకాశముంది. హై ప్రోటీన్ ఆహారం : మన దేహ నిర్వహణకు ప్రోటీన్లు చాలా అవసరం. కానీ కొంతమంది చాలా ఎక్కువగా ప్రోటీన్ డైట్... అందునా రోజూ వేటమాంసాల (రెడ్ మీట్) వంటివి తీసుకునేవారిలో ఈ ముప్పు మరింత ఎక్కువ. మూత్రపిండాల సమస్య : కిడ్నీలు తమ పూర్తి సామర్థ్యంతో పని చేయని సందర్భాల్లోనూ యూరిక్ యాసిడ్ మోతాదులు పెరగవచ్చు. గుండె జబ్బుకు మందులు వాడటం : ఈ సమస్య కోసం మందులు వాడే వారిలో... వాటి దుష్ప్రభావాల (సైడ్ ఎఫెక్ట్స్) కారణంగా ఈ సమస్య కనిపించే అవకాశముంది. క్యాన్సర్లు : కొన్ని రకాల క్యాన్సర్లు సోకినప్పుడు ఈ సమస్య కనిపించవచ్చు. తమకు తామే గ్రహించేందుకు అవకాశం... ఇక్కడ పేర్కొన్న కారణాలు గలవారు, ముప్పు ఉన్నవారిలో సమస్య పెరిగే అవకాశమున్నందున, వాళ్లలో ఒళ్లునొప్పులు, జ్వరం, కీళ్లనొప్పులు కనిపించనప్పుడు... దానికి యూరిక్ యాసిడ్ కారణం కావచ్చేమో అని అనుమానించి, జాగ్రత్తగా గమనించుకోవాలి. డయాబెటిస్‌ను, హైబీపీని అదుపు చేసే మందులు సక్రమంగా వాడుతున్నప్పటికీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, తగిన పరీక్షలు చేయించి, వాటి మోతాదు పెంచుకోవాల్సిన (డోస్ అడ్జెస్ట్ చేసుకోవాల్సిన) అవసరముందేమో చూడాలి. మద్యపానం తర్వాత కీళ్లనొప్పులు తరచూ కనిపిస్తుంటే... ఆ అలవాటుకు దూరంగా ఉండాలి. అలాగే రక్తాన్ని పలుచబార్చే ‘ఎకోస్ప్రిన్’ వంటి మందుల వాడకం తర్వాత ఈ సమస్య కనిపిస్తే, తమ డాక్టర్‌తో చర్చించి, ప్రత్యామ్నాయ మందులు వాడుకోవాలి. ఏ కారణమూ లేకుండా లక్షణాలు కనిపిస్తుంటే, రోజూ తాగే నీళ్ల మోతాదు పెంచి చూడాలి. మాంసకృత్తులు మరింత ఎక్కువగా తీసుకుంటున్నారేమో గమనించుకోవాలి. ఇలా ఎవరికి వారే కారణాలు గ్రహించి, కొంతమేరకు జాగ్రత్తపడేందుకు అవకాశం ఉంది. లక్షణాలు: ఒళ్లునొప్పులు తేలికపాటి జ్వరం పిక్కల్లో నొప్పులు పాదాలు, మోకాళ్లలో నొప్పులు చికిత్స: ఈ సమస్యకు అందించే చికిత్స కొంత తేలికైనదే. ఓ చిన్న రక్తపరీక్ష ద్వారా రక్తంలో పెరిగిన యూరిక్ యాసిడ్ మోతాదులను తేలిగ్గా గుర్తించవచ్చు. ఒకవేళ ఆ మోతాదు పెరిగితే, దాన్ని సరిచేసేందుకు డాక్టర్లు నోటి ద్వారా తీసుకునే మందులు సూచిస్తారు. వాటిని వాడుతూ, మరోసారి మోతాదులను పరీక్షించి, అవి అదుపులోకి వస్తే, మందుల్ని ఆపేయవచ్చు. అయితే పుట్టుకతో వచ్చే ఎంజైమ్ లోపం కారణంగా ఈ సమస్య వస్తే... ఇలాంటి వారు తమ జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ...? యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగే అవకాశాలు కొందరిలో మరీ ఎక్కువ. వారెవరంటే... మద్యం తీసుకునేవారు మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారు ∙అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ∙రక్తాన్ని పలుచబార్చే మందులు వాడేవారిలో... ముప్పు ఎక్కువ. మోతాదులు పెరిగితే కీలక అవయవాలపై దుష్ప్రభావం యూరిక్ యాసిడ్ మోతాదు పెరుగుదల దేహంలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్‌ను సృష్టించి, అన్ని అవయవాలనూ ప్రభావితం చేయగలదు. అలాంటప్పుడు చిన్న చిన్న సమస్యలే కాకుండా కొన్ని సందర్భాల్లో తీవ్ర రుగ్మతలూ తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా యూరిక్ యాసిడ్ పెరుగుదలకూ, మూత్రపిండాల సమస్యకూ సంబంధం ఉంటుంది. రక్తంలో ఉండే యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగితే, తొలుత స్ఫటికాల్లా మారి, తర్వాత రాళ్ల రూపం దాల్చేందుకు అవకాశం ఉంది. ఏ అవయవంలో ఈ యాసిడ్ ఎక్కువగా చేరుకుంటే, అది తీవ్రంగా ప్రభావితమవుతుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల ప్రభావం గుండె మీద కూడా పడే అవకాశం లేకపోలేదు. అలాగే మూత్రపిండాల పనితీరు, కాలేయం, గాల్ బ్లాడర్ పనితీరు కూడా దెబ్బతినవచ్చు. కీళ్లతోపాటు మన కండరాలు, ఎముకల (మస్క్యులో–స్కెలెటల్) వ్యవస్థ ప్రభావితం కావచ్చు. అలాగే కొంతమందిలో ఇలా పెరిగే యూరిక్ యాసిడ్ మోతాదు మధుమేహానికి కూడా దారితీయవచ్చు. ప్రత్యామ్నాయాలు ప్రయత్నించాలి యూరిక్ యాసిడ్ పెరుగుదల ఎకోస్ప్రిన్ మందులు వాడకం వల్ల జరుగుతుందని గ్రహిస్తే... అప్పుడా మందులకు ప్రత్యామ్నాయాలను; అలాగే తీసుకునే ఆహారంలో ప్రోటీన్ డైట్ ఎక్కువగా ఉండటం వల్ల అని తెలిస్తే... అప్పుడు మాంసకృత్తుల కోసం పాలు, గుడ్లు, అవకాడో వంటి తేలికపాటి ప్రత్యామ్నాయ ప్రోటీన్ వనరులను ప్రయత్నించవచ్చు. -డాక్టర్ రాజేశ్ ఉక్కాల, సీనియర్ కన్సల్టెంట్ , జనరల్ ఫిజీషియన్ -
మూత్రంలో రక్తం.. తరచూ జ్వరం, కడుపునొప్పిగా అనిపిస్తుందా?
మన శరీరంలో మూత్రపిండాలను కీలకమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. శరీరంలోని విష పదార్థాలను వడపోసి, మూత్రం ద్వారా బయటకు పంపిచే ఇవి హార్మోన్లను, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. రక్తపోటును నియంత్రించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకే బీపీ ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలనూ చేయించుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారిలో కిడ్నీ వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. 1. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ 2. కిడ్నీ స్టోన్స్ 3. కిడ్నీ ఫెయిల్యూర్ 4. కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీల వరకు పాకి ఇన్ఫెక్షన్స్కు గురిచేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్య పురుషులలో ఎక్కువ. ఇవి ఇసుక రేణువు పరిమాణం నుంచి గోల్ఫ్‌బాల్ సైజు వరకు ఉంటాయి. అంత ప్రమాదకరం కాకపోయినా, తీవ్రమైన నొప్పి, బాధ కలిగించే ఈ స్టోన్స్‌కు సైజును బట్టి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అధిక బరువు, పొగతాగడం, మద్యం తీసుకోవడం, రక్తపోటు, షుగర్ లెవల్స్ అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం ఉంది. అయితే పూర్తిగా ఫెయిలైనప్పుడే లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక సైలెంట్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స పద్ధతులు తప్పనిసరి. పుట్టుకతో వచ్చే కిడ్నీలో కణుతుల సమస్య... పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ చెకప్‌కు వెళ్లినప్పుడు బయటపడుతుంది. కణితి పరిమాణం బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అజీర్ణం, హైబీపీ వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్‌గా చెప్పుకునే కిడ్నీృకణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతూ ఉంటాయి. ఈ కణుతులను పూర్తిగా నయం చేయడం సాధ్యమే. రీనల్ సెల్ కార్సినోమా (ఆర్సీసీ): ఈ రకం కణితి పెద్ద వయసులో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కోసారి ఇలా వ్యాప్తి అయిన భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తారు. ఒక్కొక్కసారి రెండు కిడ్నీల్లోనూ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్టైపుల్లో ఉండే ఈ క్యాన్సర్‌ను ఒక్కోసారి ఇతర కిడ్నీ పరీక్షలలో, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలో కనుగొంటుంటారు. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే స్మోకింగ్ చేసే చిన్నవయసు వారిలోనూ ఇది కనిపిస్తున్నట్టు సర్వేలు తెలియజేస్తున్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్, అధికబరువు వంటి వాటితో పాటు జీన్మ్యూటేషన్స్ ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. లక్షణాలు కనిపించనప్పుడు ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్‌లు, యూరిన్ టెస్ట్‌లు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవల్స్ తెలిపే పరీక్షలు చేయించాలి. ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడేసరికే ఊపిరితిత్తులకు, ఎముకలకు పాకి ఉండవచ్చు. కాబట్టి చెస్ట్ ఎక్స్‌రే, బోన్‌స్కాన్ కూడా చేయిస్తూ ఉంటారు. కిడ్నీ మొత్తంగా తీసివేసే సర్జరీతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియోథెరపీలను ఇవ్వాలి. ఈరోజుల్లో కిడ్నీలను లాపరోస్కోపిక్ పద్ధతుల్లో కూడా తొలగించడం సాధ్యమే. క్యాన్సర్ కాని కణుతులకు కూడా సైజుని బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా, లేదా చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లోనూ కిడ్నీలను తొలగించడం జరుగుతుంది. ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి, సర్జరీని మూడురకాలుగా చేస్తుంటారు. రాడికల్ నెఫ్రెక్టమీ : ఈ సర్జరీలో కిడ్నీతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలను, కణజాలాన్ని మొత్తంగా తీసివేస్తారు. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీ చేస్తారు. సింపుల్ నెఫ్రెక్టమీ: స్టేజ్1 కిడ్నీ క్యాన్సర్‌కు ఒక్క కిడ్నీని మాత్రమే తీసివేస్తారు. పార్షియల్ నెఫ్రెక్టమీ: పుట్టుకతో ఒకే ఒక్క కిడ్నీ ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంతవరకు మాత్రమే తీసివేస్తారు. ఒక్కొక్కసారి రెండు కిడ్నీల్లోనూ కణుతులు ఏర్పడినప్పుడు కణుతుల వరకు మాత్రమే తొలగిస్తారు. తొలిదశలోనే గుర్తించి, ఒక కిడ్నీని మాత్రమే తీసివేసినప్పుడు సర్జరీ అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. రెండింటినీ తీసివేసినా, లేదా ఒక్కటి తీసేశాక రెండోది పనిచేయకపోయినా డయాలసిస్ చేయించుకుంటూ వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం మంచిది. చికిత్స పూర్తయ్యాక కూడా ఫాలోఅప్ కేర్ తప్పనిసరి. సీటీ స్కాన్, చెస్ట్ ఎక్స్‌రే వంటి టెస్ట్‌లు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతోపాటు, స్మోకింగ్, ఆల్కహాల్ విషతుల్యమైన పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలిగిన వారమవుతాము. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421 -
Health Tips: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా..
Health Benefits Of Galijeru Aaku: పల్లెల్లో దానిని అటుక మామిడి అనీ, గలిజేరనీ, ఎర్రగలిజేరనీ అంటారు. ఆయుర్వేదంలో దీనిపేరు పునర్నవ. పునర్ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవింప చేయగలదు కాబట్టే ‘పునర్నవ’ అయ్యింది. ►తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరనీ, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరనీ పిలుస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్ధ రూపాయి పరిమాణంలో ఉంటాయి. ఔషధ గుణాలు ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు. వీటిలో ఏది దొరికితే దానిని కూరగా.. పచ్చడిగా, పులుసుకూరగా వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. గలిజేరు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ►పునర్నవలో ఆకు, కాండం, వేరు... ఇలా ప్రతీదీ పనికి వస్తుంది. ఈ ఆకులను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫ సమస్య, లివర్ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, యూరియా లెవల్స్ సరిచేయటానికి ఉపయోగపడుతుంది. ►వాతం, శ్వాస సంబంధ వ్యాధులు, రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు దరిచేరవు. జ్వరాలు రావు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యాధులకు ఇది మందుగా పనిచేస్తుంది. ►కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు దీనిని పప్పుతో వండుకుని తింటే చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►శరీరంలో అధికంగా నీరు పట్టినప్పుడు ఆ నీటిని తగ్గించే గుణం దీనికి ఉంటుంది. ►యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్ సి, డి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడతాయి. ►క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం ఇది. ►మనకి సామాన్యంగా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరే. ఈ ఆకులను పప్పులో కలిపి వండుకుంటారు, ఉప్పు మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండిలో గుమ్మడి బదులు సమూలంగా తరిగిన గలిజేరు మొక్కను కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. ►ఆకులతో కషాయం చేసి తాగుతారు. ఈ కషాయంలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది. ►ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది. ►గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానంగా నువ్వులనూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నటి సెగన కాచి, నొప్పులున్న చోట మర్దనా చేస్తే త్వరగా తగ్గుతాయి. ►నడకరాని పిల్లలకు ఇదే తైలంతో మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెబుతారు. ►గలిజేరు ఆకు రసం తీసి దానిలో సగం బరువు పటికబెల్లం పొడి కలిపి తీగ పాకం పట్టి చల్లార్చి నిల్వ చేసుకోవాలి. ►రోజు ఒక చెంచా పాకం గ్లాస్ నీళ్ళల్లో కలిపి తాగుతుంటే గుండె దడ, బలహీనత తగ్గుతాయి. అయితే పాలిచ్చే తల్లులు, గర్భిణులు ఈ ఆకును తినకపోవడమే మంచిది. చదవండి: Anjeer Health Benefits: అంజీర తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
Coronavirus: కిడ్నీ రోగులు జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్ మహమ్మారి దాదాపుగా అన్ని వర్గాలపై, నేపథ్యాలున్న వారిపై ఇంకా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తూనే ఉంది. దీని నియంత్రణకు వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నా.. ఇంకా సఫలం కాలేదు. మొదటి దశ కంటే రెండో దశలో ఉగ్రరూపంతో సామాన్య జనజీవనం అతలాకుతలమై పోయింది. ఇతరులతో పోల్చితే మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల వీరు కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కరోనా తర్వాత కూడా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది’.. అని నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ శ్రీభూషణ్‌రాజు తెలిపారు. కరోనా నేపథ్యంలో కిడ్నీ వ్యాదిగ్రస్తులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు? వారిపై కోవిడ్ ఏరకంగా ప్రభావం చూపిస్తుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటన్న అంశాలను శ్రీభూషణ్‌రాజు ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కొత్తగా కిడ్నీ సమస్యలు రెండు దశల్లోనూ ఇబ్బంది పడినా.. మొదటి దశతో పోల్చితే సెకండ్ వేవ్‌లో కరోనాతో కిడ్నీ రోగులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. గత లాక్డౌన్లో డయాలసిస్ రోగులు, కిడ్నీ మార్పిడి చేసుకున్న వారు రవాణా, మందుల విషయంలో కొంత ఇబ్బంది పడినా తర్వాత ఆ సమస్యలు పరిష్కారమయ్యాయి. చాలామందికి వైరస్ సోకినా, మరణాలు తక్కువగానే నమోదయ్యాయి. అవి కూడా జబ్బు తీవ్రత కంటే ఎక్కడ కిడ్నీ చికిత్స చేయించుకోవాలో తెలియక పోవడం వల్ల చోటు చేసుకున్నాయి. ఇక రెండోదశలో గతంలో కంటే ఎక్కువగా కిడ్నీ రోగులు కరోనా బారినపడ్డారు. కిడ్నీ రోగుల్ని.. మూత్రపిండాలు దెబ్బతిన్నవారు, డయాలసిస్ చేయించుకుంటున్నవారు, మూత్రపిండాల మార్పిడి చేయించుకున్నవారు ఇలా మూడురకాలుగా వర్గీకరించవచ్చు. అయితే ఈసారి కరోనా ఇన్ఫెక్షన్ల వల్లనో లేక వాడిన మందుల కారణంగానో కొత్తగా కిడ్నీ సమస్యలు తలెత్తిన వారి సంఖ్య కూడా పెరిగింది. కోవిడ్ వల్ల నార్మల్‌గా ఉన్నవారిలోనూ కిడ్నీ టిష్యూలలో, ఇతర అవయవాల్లోనూ వైరల్ పార్టికల్స్‌ను డాక్టర్లు గమనించారు. దీనిని బట్టి వైరస్‌కు అవయవాల్లోకి చొచ్చుకువెళ్లి పాడు చేసే గుణం ఉందని తేలింది. సెకండ్‌వేవ్‌లో మరణాలు కూడా పెరిగాయి. మిగతా వారితో పోల్చితే కిడ్నీ జబ్బు ఉన్న వారిలో మరణాల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంది. మొదటిదశలో కిడ్నీ పేషెంట్లు, ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నవారు జాగ్రత్తలు తీసుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండగలిగారు. సొంత వైద్యాలతో ఇబ్బందులు శరీరంలోని గుండె, కాలేయం, కిడ్నీ ఇలా.. ఏదైనా అవయవం బలహీనంగా ఉంటే వాళ్లపై కరోనా లేదా ఏ వైరస్ అయినా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల వీరంతా మిగతావారి కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. విచ్చలవిడిగా తీసుకుంటున్న మందులతో, సొంత వైద్యాలు, చిట్కాలతో చాలా మంది ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు రావడానికి ఇదే ప్రధాన కారణం. అందువల్ల తమకెదురయ్యే సమస్యల పట్ల పూర్తి అవగాహనతో వ్యవహరించాలి. ఇలా అవగాహనతో వ్యవహరించిన చాలామందిని బాగు చేయగలిగాం. ఈ జాగ్రత్తలు పాటించాలి మామూలు జలుబు, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటివి వచ్చినా డాక్టర్లను సంప్రదించాలి మరో 2 నెలలు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. కుటుంబసభ్యులకు దూరం ఉండాలి. కలిసి భోజనం, టీవీ చూడడం వంటివి కూడా చేయకూడదు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్లు 3,4 నెలలకు సరిపడా మందులు సిద్ధంగా ఉంచుకోవాలి మిగతావారి మాదిరిగానే థర్మామీటర్ లేదా పల్స్ ఆక్సిమీటర్‌తో తరచుగా టెస్ట్ చేసుకోవాలి ఇంటి వద్దే రక్తపరీక్ష చేయించుకుని క్రియాటిన్ చెక్ చేసుకుంటే కిడ్నీల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఎప్పుడూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం మంచిది. డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ రోగులు ఇన్ఫెక్షన్ రాకపోయినా హోం ఐసోలేషన్ పాటించాలి బయటికి వచ్చినప్పుడు డబుల్ మాస్క్, ఫేస్‌షీల్డ్ తప్పక ధరించాలి బీపీ, ఇతర మందులను ఆపకుండా వాడాలి చక్కటి ఆహారం, మంచినిద్ర ఉండాలి. మంచినీళ్లు తగినంతగా తాగాలి. ► కరోనా ఉగ్రరూపం నేపథ్యంలో దాని బారిన పడిన ఆరోగ్యవంతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధుల (కోమార్బిడీస్)తో బాధపడుతున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. ► ఇతర రోగులతో పోల్చితే అతి సున్నితమైన ఆరోగ్య పరిస్థితి కలిగి ఉండే కిడ్నీ (మూత్రపిండాలు) వ్యాధిగ్రస్తులు కరోనా రెండు దశల్లోనూ ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండోవేవ్‌లో మరణాలు పెరిగాయి. ► అందువల్ల కిడ్నీ రోగులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇంట్లోనూ భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ► అలాగే ప్రస్తుత గడ్డుకాలంలో వీరికి సకాలంలో వైద్యసేవలు అందించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తే మంచిదని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్‌రాజు సూచిస్తున్నారు. చదవండి: Coroanvirus: దొరకని మందులు రాయకండి -
ప్రోస్టేట్‌తో పాటు కిడ్నీ క్యాన్సర్ అంటున్నారు...
మా అన్నయ్య వయసు 48 ఏళ్లు. కొద్దికాలంగా ప్రోస్టేట్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈమధ్య తరచూ యూరిన్ సమస్యలు ఎక్కువకావడం, జ్వరం కూడా ఎక్కువగా రావడంతో పెద్దాసుపత్రిలో చూపించాం. అన్ని రకాల పరీక్షలు చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పారు. ఎడమ కిడ్నీలోని కొంతభాగానికి కూడా క్యాన్సర్ సోకిందరి పరీక్షల్లో తేలింది. రొబోటిక్ వైద్య విధానంలో ‘ప్రోస్టెక్టమీ’, ‘నెఫ్రెక్టమీ’ శస్త్రచికిత్స చేయించాలని ఇక్కడి డాక్టర్లు చెపా్పరు. దయచేసి మాకు ఈ వ్యాధి గురించి, దాంతో పాటు ఈ శస్త్రచికిత్సల గురించి వివరంగా తెలియజేయండి. మా అన్నయ్యకు ఇంకా చాలా జీవితం ఉంది. ఈ వయసులోనే ప్రోస్టేట్ గ్రంథిని తొలగిస్తే తర్వాత వచ్చే దుష్ఫలితాలు, వ్యంధ్వత్వం వంటివి ఏమైనా వస్తాయా? అలాగే ఇంత పెద్ద సర్జరీ చేయడం వల్ల ప్రాణహాని ఏదైనా ఉంటుందా అని మా కుటుంబం మొత్తం చాలా ఆందోళన పడుతున్నాం. దయచేసి అన్నీ వివరంగా తెలపగలరు. ముందుగా మీరు అడిగిన వివరాల ప్రకారం వరసగా మీకు సమాధానం ఇస్తాను. మీరు సర్జరీ విషయంలో ఎక్కువగా ఆందోళన చెందవద్దు. మీ కుటుంబసభ్యులకు కూడా భయపడొద్దని చెప్పండి. ప్రోస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్లకు ఇప్పుడు అత్యాధునికమైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రోస్టేట్ గ్రంథిలో సమస్యలున్నప్పుడు... మరీ ముఖ్యంగా క్యాన్సర్ ఉన్నప్పుడు దాన్ని తొలగించాల్సి వస్తుంది. ఈ శస్త్రచికిత్సను ‘రాడికల్ ప్రోస్టెక్టమీ’ అంటారు. లాపరోస్కోపీ ద్వారా ప్రోస్టేట్ను తొలగించేసమయంలో దాని చుట్టుపక్కల ఉన్న చిన్న నాడులు సరిగా కనిపించక పొరబాటున అవి తెగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యంధత్వం వచ్చే అవకాశాలుంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ తొలగిపోయి, ప్రాణాపాయం తప్పిపోయినప్పటికీ వాళ్లు ఇంపొటెంట్ కావడం చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటపుపడు ఈ సమస్య రాకుండా సర్జరీ చేయడం రొబోటిక్స్ ద్వారా సాధ్యమవుతుంది. లోపల ఉన్న శరీర భాగాలు పదివంతులు ఎక్కువ పెద్దగా కనిపించడం వల్ల చిన్న చిన్న నాడులు సైతం స్పష్టంగా కనిపిస్తుంటాయి. కాబట్టి అవి తెగిపోకుండా జాగ్రత్తగా సర్జరీ చేయడం సాధ్యమవుతుంది. ఇక కిడ్నీ ట్యూమర్లు / క్యాన్సర్లు / పెద్ద పెద్ద ట్యూమర్లు ఉంటే కొన్ని సందర్భాల్లో కిడ్నీ మొత్తాన్ని తీసేయాల్సి వస్తుంది. ఇలా తొలగించే ప్రక్రియను ‘రాడికల్ నెఫ్రెక్టమీ’ అంటారు. కానీ చిన్నసైజు ట్యూమర్లు ఉన్నప్పుడు కణితి వరకు మాత్రమే తీసేసి, మిగిలిన కిడ్నీని కాపాడవచ్చు. దీన్ని ‘పార్షియల్ నెఫ్రెక్టమీ’ అంటారు. ఓపెన్, లాపరోస్కోపీ, రొబోటిక్ సర్జరీ ఇలా అన్ని ప్రక్రియల ద్వారా కూడా పార్షియల్ నెఫ్రెక్టమీ చేయవచ్చు. కానీ రొబోటిక్స్ ద్వారా మరింత సమర్థంగా ఈ శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతుంది. ట్యూమర్‌ను తొలగించే సమయంలో కిడ్నీని కట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు రక్తం ఎక్కువగా పోతుంది. ఇది అరగంట కన్నా ఎక్కువ సేపు జరిగితే కిడ్నీ డ్యామేజీ అవుతుంది. కానీ రొబోటిక్స్ ద్వారా కిడ్నీ కట్ చేయడం, కుట్లు వేయడం చాలా తొందరగా అయిపోతాయి. కాబట్టి అధిక రక్తస్రావం ఉండదు. కిడ్నీ దెబ్బతినేందుకు ఆస్కారం ఉండదు. ఇప్పుడు రొబోటిక్స్ శస్త్రచికిత్సల గురించి సవివరంగా చెబుతాను. ఇప్పుడు ఎన్నో రకాల కిడ్నీ సమస్యలకు సురక్షితమైన పరిష్కారం చూపిస్తున్నది రొబోటిక్ సర్జరీ. వైద్యరంగంలో ఎన్ని మార్పులు వచ్చినా పేషెంట్ సేఫ్టీయే చివరి లక్ష్యంగా ఉంటుంది. మొదట్లో సర్జరీ అంటే పెద్ద కోత పెట్టి చేసే ఓపెన్ సర్జరీయే. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించివైతే ఛాతీ తెరచి సర్జరీ చేయాలి. పొట్టలోని అవయవాలకు సంబంధించినదైతే పొట్టపై గాటు పెట్టాలి. కానీ లాపరోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద కోత అవసరం లేకుండానే మూడు, నాలుగు రంధ్రాలు మాత్రమే పెట్టి చేసే కీహోల్ సర్జరీ రోగులకు వరప్రదాయని అయ్యింది. కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లకు కూడా లాపరోస్కోపీ చేసేవారు. ఇలా లాపరోస్కోపీ అందుబాటులోకి వచ్చిన తర్వాత శరీరాన్ని కోసే బాధ తప్పింది. కేవలం చిన్న చిన్న గాట్లతో రంధ్రాలు చేసి లోపలికి కెమెరా, లాపరోస్కోపిక్ పరికరాన్ని పంపి సర్జరీ చేయవచ్చు. లోపలి అవయవాలను స్క్రీన్ మీద స్పష్టంగా చూడవచ్చు. వాటిని తెర మీద చూస్తూ లోపల సర్జరీ చేయవచ్చు. లాపరోస్కోపిక్ పరికరం 2డి విజన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల లోపలి అవయవాలను 2 డైమన్షనల్గా చూపిస్తుంది. కోత ఉండదు కాబట్టి రక్తస్రావమై రక్తం నష్టపోయే అవకాశం ఉండదు. హాస్పిటల్ కూడా మూడు, నాలుగు రోజులుంటే చాలు. త్వరగా కోలుకుంటారు. అయితే కొన్ని ప్రొసిజర్లలో లాపరోస్కోపీ చేయడం కష్టం. కిడ్నీలో ట్యూమర్ ఉంటే కణితి వరకే తీసేసి మిగిలింది కుట్లు వేయాలి. ఇది లాపరోస్కోపీలో కష్టం. దీనికి చాలా నైపుణ్యం అవసరం. ఎంతో అనుభవం కావాలి. స్థూలకాయం ఉన్నవాళ్లలో కూడా లాపరోస్కోపీతో ఆపరేషన్ ఇంకా కష్టమవుతుంది. ఇక రోబోతో చేసే సర్జరీకి రోబో చేతుల సహాయంతోనే డాక్టర్లు సర్జరీ చేయిస్తారు. తెరమీద లోపలి అవయవాలను చూస్తూ రోబో పరికరాన్ని ఎటు ఎలా తిప్పాలనేది డాక్టర్ కంట్రోల్ చేస్తుంటారు. అందుకు అనుగుణంగా రోబో చేతులు చకచకా ఆపరేషన్ చేసేస్తుంటాయి. రొబోటిక్ సర్జరీకి కూడా పెద్ద కోత పెట్టాల్సిన అవసరం ఉండదు. దీనికి కూడా లాపరోస్కోపీ లాగానే కేవలం ఒక సెం.మీ. గాట్లు... మూడ్నాలుగు పెట్టాల్సి ఉంటుంది. లాపరోస్కోపీ ద్వారా చేయలేని సర్జరీలను రోబోతో చేయవచ్చు. పైగా రోబో యంత్రానికి 3డి విజన్ ఉంటుంది. అందుకే లోపలి అవయవాలను 3 డైమన్షనల్గా చూడవచ్చు. ఓపెన్ సర్జరీలో డాక్టర్ తన చేతులతో చేసినట్లు ఇక్కడ రోబో చేతులు ఆపరేషన్ చేస్తాయి. మన చేతులను ఎలా పడితే అలా తిప్పగలిగినట్లే, రోబో చేయి కూడా 360 డిగ్రీలలో తిప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే మానవ హస్తం కంటే మరింత మిన్నగా ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఉదాహరణకు ఒక్కోసారి మానవహస్తం కాస్తంతైనా వణికే అవకాశమైనా ఉందేమోగానీ రోబో చేయి అలా వణకదు. లాపరోస్కోపీ అయితే ఒకరు కెమరా పట్టుకొని ఉండాలి. కానీ ఇందులో రోబో యంత్రానికే కెమెరా ఉంటుంది. ఈ సర్జరీలు చాలా సురక్షితం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. లోతుగా ఉండే అవయవాలకు చేయాల్సిన సర్జరీలు కూడా చాలా సులువుగా జరిగిపోతాయి. స్థూలకాయులకు కూడా చాలా సులువుగా సర్జరీలు చేయవచ్చు. కాబట్టి మీరు ఏమాత్రం ఆందోళన పడకండి. డా. వి. సూర్యప్రకాశ్, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
నీళ్లు తాగకుండా మందులా..?
టొరంటో: తగినంత నీరు తాగకపోవటమూ కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది!! మరి అలాంటి వారు ఇతరత్రా మందులు తీసుకుంటే అది కిడ్నీని మరింత దెబ్బ తీస్తుందా? ఇదిగో... ఇలాంటి విషయాల్ని లోతుగా శోధించే కొత్త ‘కంప్యూటర్ కిడ్నీ’ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ‘అధిక రక్తపోటు ఉన్న వారికి నీటితో కూడిన మాత్రలిస్తారు. దాంతో వారు ఎక్కువగా మూత్రవి సర్జన చేస్తారు. అలా వారి రక్త పోటు అదుపులోకి వస్తుంది’ అని కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనితా లేటన్ చెప్పారు. ఈ పేషెంట్లకు హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపే మరో మందును కూడా తరచు ఇస్తారు. దాంతోపాటు ఆస్ప్రిన్ కూడా ఇస్తుంటారు. ఇవనీన కిడ్నీపై ప్రభావం చూపిస్తుంటాయి. ‘శరీరంల్లో నీరు తక్కువయినప్పుడు అతితక్కువ నీటితో మూత్ర విసర్జన జరిగేలా చేసేది కిడ్నీయే. కాకపోతే వృద్ధులు, కిడ్నీ సమస్యలతో మందులు తీసుకునేవారు ఇబ్బంది ఎదుర్కోవచ్చు. మూత్రాన్ని కిడ్నీ నుంచి బ్లాడర్‌కు తీసుకెళ్లే కండరాలు సరిగా సంకోచించకపోవటమే దీనికి కారణం’ అని చెప్పిన లేటన్... ఈ సంకోచాల స్టిమ్యులేషన్‌ను లెక్కించే తొలి మోడల్‌ను రూపొందించారు. కిడ్నీకి కాంబినేషన్ మందులు తీసుకునే వారు తగినంత నీటిని తప్పకుండా తీసుకోవాలని, లేనట్లయితే ఆస్ప్రిన్‌తో కిడ్నీ దెబ్బతింటుందని తమ కంప్యూటర్ మోడల్ గుర్తించిందన్నారు. -
ముందు చూపే మందు
సాక్షి,గుంటూరు : కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మికి మధుమేహం ఉంది. కొంతకాలంలో మందులు సరిగ్గా వాడటం లేదు. పది రోజుల కిందట అకస్మికంగా స్పృహ కోల్పోవడంతో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో శరీరంలో షుగర్ లెవల్స్ 800 ఉండటంతోపాటు, ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. వారం రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేయడంతో ప్రాణాపాయం నుంచి బయట పడింది. పటమటకు చెందిన వెంకటేశ్వర్లు రెండు రోజుల కిందట అకస్మాతుగా ఆయాసంతో పడిపోవడంతో నగరంలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతనికి ఇసీజీ తీయగా గుండెపోటుగా నిర్ధారణించారు. మధుమేహం కారణంగా ఛాతీ నొప్పి రాలేదని తేల్చారు. అసలు అతనికి అప్పటి వరకూ మధుమేహం ఉన్నట్లు కూడా తెలియకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలా వీరిద్దరే కాదు..ఇటీవల కాలంలో చాలా మంది మధుమేహం ఉన్నప్పటి తమకు తెలియక పోవడం, తెలిసినా మందులు వాడక పోవడంతో తీవ్రమైన దుష్సలితాలకు దారి తీస్తున్నట్లు చెపుతున్నారు, చిన్న వయస్సులోనే వ్యాధి బారిన ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా 20 ఏళ్లకు మధుమేహం భారిన పడుతున్నారు. జిల్లాలో 2.50 లక్షల మంది మధుమేహులు ఉండగా, మరో 4 లక్షల మంది ఫ్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు. మధుమేహుల్లో 10 శాతం మంది 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఉన్నారు. ఒకప్పుడు వంశపారంపర్యంగా 40 సంవత్సరాలు దాటిన వారిలో వచ్చేదని ఇప్పుడు 20 ఏళ్లకే వస్తుంది. దుష్ఫలితాలు ఇలా.. గుండె జబ్బులకు గురవుతున్న వారిలో 50 శాతం మంది మధుమేహమే కారణంగా నిర్ధారిస్తున్నారు. మధుమేహం ఉన్న వారిలో రక్తనాళాలు బిరుసుగా మారడం, స్పర్శ కోల్పోవడంతో గుండెపోటుకు గురైనప్పటికీ నొప్పి తెలియదని, నిద్రలోనే ప్రాణాలు వదిలే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మధుమేహం ఉన్న వారిలో మెదడుపోటుకు గురయ్యే వారు సైతం ఎక్కువగా ఉంటున్నారు. కిడ్నీలు పాడయ్యే ప్రమాదం మధుమేహం అదుపులోలేని వారిలో దాని ప్రభా వం కిడ్నీలపై చూపుతున్నారు. కిడ్నీల పనితీరు క్షీణిస్తున్న కొద్దీ క్రియాటిన్ పెరడగం, రక్తపోటు అదుపులో లేకపోవడం జరుగుతుంది. డయాలజిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొం టుంది. మధుమేహం కారణంగా ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే మరలా దానిని తిరిగి యథాస్థితికి రావడం జరగదు. దీంతో డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన దయనీయ స్థితి నెలకొంటుందని వైద్యులు చెపుతున్నారు. మధుమేహులు ప్రతి ఆరు నెలలకు కిడ్నీలు పరీక్షలు చేయించుకుంటే మేలు కంటిచూపు కోల్పోయే ప్రమాదం మధుమేహం ఉన్న వారిలో కంటిలోని రెటీనా(కంటినరం) మూసుకు పోవడం వలన చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. మధుమేహం ఎక్కువ కాలం అదుపులో లేని వారిలో కంటి రెటీనా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఉన్న చూపును కాపాడుకోవడం మినహా, పోయిన చూపును తిరిగి రావడం కుదరదని వైద్యులు చెపుతున్నారు. అవగాహన అవసరం మధుమేహంపై సరైన అవగాహనతో అదుపులో ఉంచుకో వడం మేలు. మధుమేహం ఉన్న వారిలో 50 శాతం మందికి తమకు వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు. ఉన్నట్లు తెలిసిన వారిలో కూడా 50 శాతం మంది మందులు వాడుతుండగా, వారిలో సగం మంది వ్యాధిని అదుపులో ఉంచుకోగలుగుతున్నారంటే..మొత్తంగా 12.5శాతం మందిలో మాత్రమే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. కొందరు మధుమేహ లెవల్స్ పెరిగిపోవడంతో కోమాకు చేరుకుని చికిత్సకోసం వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారికి ఇన్సులిన్ థెరఫీద్వారా చికిత్స అందిస్తున్నాం. ఆహార నియమాలు పాటిం చడం, శారీరక వ్యాయామం, ఒత్తిడి లేని జీవన విధానంలో అధిగమించవచ్చు. –డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు -
బసవ పీఠాధిపతి మాతా మహాదేవి కన్నుమూత
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో లింగాయత్ వర్గ మహిళా పీఠాధిపతిగా పేరుపొందిన మాతా మహాదేవి (70) బెంగళూరులో గురువారం కన్నుమూశారు. ఆమె కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు బీపీ, మూత్ర పిండ సమస్యలతో బాధపడుతున్నారు. అనేక మఠాలకు, పీఠాలకు నెలవైన కర్ణాటకలో ఏకైక మహిళా సాధ్విగా మహాదేవి చోటు సంపాదించారు. బాగల్కోటె జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కూడల సంగమ కేంద్రంగా ఆమె బసవధర్మ పీఠాన్ని నిర్మించిన బసవేశ్వరుని తత్వాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దసంఖ్యలో పీఠ శాఖలు, లక్షలాది మంది భక్తులు, అనుచరులకు ఆమె మాటే వేదవాక్కు. చిత్రదుర్గ జిల్లాలో జన్మించిన మహాదేవి కళాశాల విద్య తరువాత లింగాయత్ సన్యాస దీక్షను స్వీకరించారు. మంచి వాక్పటిమ, ధైర్యం ఆమె సొంతం. ఆమె అంత్యక్రియలను శనివారం కూడలసంగమలో లింగాయత్ సంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నారు. -
చిరునవ్వుతో...
కాలిఫోర్నియా. ఉదయం ఎనిమిది. హాలిడే కావడంతో తీరిగ్గా మ్యాగజైన్ తిరగేస్తున్నాను. ఫోన్ రింగైయింది. అన్నయ్య నుంచి కాల్. ‘‘హలో అన్నయ్యా.. ఎలా వున్నావ్? అమ్మా నాన్న..?’’ ‘‘బావున్నార్రా. అమ్మకే కొంచెం ఆరోగ్యం బాగుండటం లేదు. నువ్విక్కడికి వస్తే బావుంటుంది’’. ‘‘ఏమైందన్నయ్యా?’’‘‘ఏం కాలేదు. కంగారు పడకు. అమ్మ కండీషన్ స్టేబుల్. కానీ కొంచెం సీరియస్ అంటున్నారు డాక్టర్. వెంటనే వచ్చేయ్’’కాల్ కట్ చేసి ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయాను.నన్నలా చూసి కిచెన్ నుండి పరిగెత్తుకు వచ్చిన అంజలి ‘‘ఏమైందండి? ఏం జరిగింది?’’ అంది కంగారుగా. ‘‘అమ్మకు సీరియస్‌గా వుందట. వెళ్ళాలి..’’‘‘అవునా.. పిల్లలకు పరీక్షలు. ఎలా ఇప్పుడు?’’‘‘మీరంతా వద్దులే. నేనే వెళ్తా’’.అన్నీ సర్దుకొని ఎలాగోలా సాయంత్రానికి ఫ్లయిట్ ఎక్కాను. చాలా నెర్వస్‌గా వుంది. అమ్మ ఆరోగ్యం కొన్నాళ్లుగా బావుండటం లేదు. కిడ్నీ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు సీరియస్ అంటున్నారు.అమ్మకు ఏమైనా అవుతుందా? అనే బెంగ ఎక్కువైపోతోంది. ఎప్పుడు అమ్మను చూస్తానా? అనే ఆరాటం పెరిగిపోతోంది. కొంచెం ధైర్యం తెచ్చుకోవడం కోసం అమ్మ ఆల్బమ్ తీశా. నిండు జాబిల్లి లాంటి అమ్మను చూడగానే అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చేశాయి. ఎంత చేసిందమ్మ..! నా ప్రతి అడుగులోనూ నీడలా వుండి నన్ను ఒడ్డున చేర్చింది. నా బాధ నాకంటే ముందు అమ్మకే తెలిసిపోతుంది. కొండంత ధైర్యాన్ని ఇచ్చి నా కష్టాల్ని తన కనుచూపుతో మాయం చేసేయగల గొప్ప హీరో అమ్మ. నేనెప్పుడూ దేవుణ్ణి ఏమీ కోరుకోలేదు. ఎందుకంటే దేవతలా నా పక్కన నిలబడిపోయిందమ్మ. కొందరు దేవుడు లేడని ఎందుకు వాదిస్తారో అర్థం కాదు. బహుశా అమ్మ కంటికి కనిపించేస్తుందనేమో..?! ఆల్బమ్‌లోని ఒకొక్క ఫొటో చూస్తుంటే ఒకొక్క జ్ఞాపకం కళ్ళముందు కదిలింది.‘‘మన పెద్దోడు ఏదోలా బతికేస్తాడండీ.. చిన్నోడి మీదే నాకు బెంగ. వీడు మరీ సున్నితం. ఎలా బతుకుతాడో పిచ్చి తండ్రి!’’ అని నాన్నతో అమ్మ ప్రతిసారీ చెప్పే మాట గుర్తొచ్చింది.నిజమే. నేను ఓవర్ సెన్సిటివ్. అప్పుడు నేను ఎయిత్ క్లాస్. తాతయ్య కాలం చేస్తే ఇంట్లో అందరూ ఏడ్చారు. అది చూసి పది రోజులు ఏం తినలేకపోయాను. జ్వరం కూడా వచ్చేసింది. అమ్మ చాలా బెంగపెట్టుకుంది. ‘‘ఇకపై వీడిని ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంచుదాం’’ అని నాన్నతో చెప్పి ఆ రోజు నుండి అలాంటి కార్యాలకు నన్ను దూరం పెట్టేసింది. అమ్మమ్మ పోయినపుడు కూడా అంతా వెళ్లారు. కానీ నన్ను మాత్రం అమ్మ ఇంట్లోనే వుంచేసింది. నేను మళ్ళీ బెంగ పెట్టుకుంటాననే భయంతో. అమ్మ పెద్ద చదువులు చదవలేదు. కానీ మమ్మల్ని చదవగలదు. నిజంగా అమ్మ లేకపోతే నా జీవితం మరోలా వుండేది. లైఫ్‌లోని కీలక మలుపుల్లో అమ్మ నా వెనుక గోడలా నిలబడిపోయింది.నాన్నకు నేను మెడిసిన్ చేయాలని కోరిక. నాకు ఇంజినీరింగ్ ఇష్టం. కానీ నాన్న మాట కాదనలేక మెడిసిన్ సీట్ సంపాదించి జాయిన్ అయిపోయాను కూడా. కానీ ఆ చదువు ఎందుకో నచ్చడం లేదు.ఎవరికీ తెలియకుండా రోజూ ఏడ్చేవాడిని. కానీ అమ్మ నుండి తప్పించుకోలేక పోయాను.’’రేయ్.. ఆ చదువు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే మానెయ్. అలా బాధపడకు.’’ ‘‘... ఏవండీ... వాడికి అది ఇష్టం లేదు. పోతే ఓ ఏడాది పోయింది. వాడికి నచ్చిందే చదవనీయండి. డాక్టర్ ఉద్యోగమే కడుపు నింపుతుందా? మీకు అంత ఇష్టంగా వుంటే మీరే చదువుకోండి. వాడికి ఇష్టంలేని కోరికలు కోరకండి. అంతే. ఇంకేం మాట్లాడకండి’’అని అమ్మ ఆర్డర్ వేయడం నాకు ఇంకా గుర్తుంది. తర్వాత ఏడాదే నాకు ఇష్టమైన ఇంజినీరింగ్‌లో జాయినయ్యా. నిజంగా అమ్మ లేకపొతే నాకు ఇష్టం లేని ఆ చదువు చదవలేక, నాన్నకు భయపడి చెప్పలేక ఏమైపోయేవాడినో..! తలచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. అమ్మ నన్ను ఒడ్డుకు చేర్చిన మరో సుడిగుండం నా లవ్‌స్టోరీ. ఇంజినీరింగ్ మూడో ఏడాదిలో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాను. తనూ ప్రేమించింది. కానీ ఏమైందో తెలీదు. సడన్‌గా వేరేవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కుర్రాడికి ఆర్బీఐలో ఉద్యోగమట. మంచి సంబంధం అని వాళ్ళ నాన్న వెంటనే పెళ్లి చేయించేశాడు. తనూ మరో మాట లేకుండా వెళ్ళిపోయింది. నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. ఇంకచదువు లేదు. తిండి లేదు. పిచ్చోడిలా తిరిగాను. తాగాను కూడా. అమ్మకు తెలిసింది. వెంటనే హాస్టల్‌కి వచ్చి నన్ను వున్నఫళంగా ఇంటికి తీసుకువెళ్ళిపోయింది.నా పిచ్చి వేషాలు చూసి నాన్న బెల్ట్ తీశారు. కానీ కొట్టలేకపోయారు. ఎందుకంటే అక్కడ వున్నది అమ్మ. తను పక్కన వుండగా నాన్న కాదు కదా, ఆ దేవుడు కూడా మమ్మల్ని టచ్ చేయలేడు. ‘‘ఆ బెల్ట్ ఇటివ్వండి. పేద్ద హీరోలాబయలుదేరారు.. పిల్లాడ్ని కొట్టేయడానికి’’ అని గడుసుగా నాన్న ఆవేశంపై నీళ్ళు చల్లేసింది అమ్మ. అయితే నాపై కోప్పడుతుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ’’రేయ్ నాన్నా, నేనో టూర్ప్లాన్ చేశా. నువ్వూరా. ఇంకేం మాట్లాడకు’’ అని నన్ను తీసుకొని దేశమంతా తిప్పేసింది.నాకు తెలియకుండానే ఆ ప్రేమ జ్ఞాపకాలు నా నుండి వెళ్ళిపోయాయి. మళ్ళీ కొత్త జీవితం. అసలు నన్ను ఆ డిప్రెషన్ నుండి ఎలా బయటికి తీసుకువచ్చేసిందో అర్థం కాలేదు. ఇదే విషయం ఒకసారి అడిగాను. దానికి అమ్మ ఇచ్చిన సమాధానం –‘‘నేను అమ్మని. నా ముందు నువ్వు పడే బాధ ఎంతరా! నీ మనసును సరిచేయడం నాకో లెక్కా?! పిచ్చోడా’’. డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం.. ఇవేవీ కూడా అమ్మకు పట్టవు. నాకు బాగా గుర్తు. కాలిఫోర్నియాలో జాబ్ వచ్చిన రోజది. నేను కలలుగన్న సంస్థలో ఉద్యోగం. పెద్ద జీతం. ఎంతోసంబరపడిపోయాను. ఎగిరి గంతేశాను. అదే హుషారులో అమ్మకు చెప్పాను. అప్పుడు అమ్మ మొదటిమాట ఇంకా గుర్తుంది. ‘‘కాలిఫోర్నియా అంటున్నావు. అక్కడ భోజనం అదీ బావుంటుందా?! వుండేచోట అన్ని సౌకర్యాలూ వుంటాయా?’’ అని గాబరా పడిపోయింది.కాలంతో పాటు ఎన్నో మార్పులు. అంజలి, పిల్లలు.. వాళ్ళ చదువులు. ఇలా జీవితం ఎంత మారిపోయినా ఒకటి మాత్రం మారలేదు. అమ్మ. ఇప్పటికీ నేను అమ్మకి పిచ్చి తండ్రినే. ఇప్పటివరకూ ‘‘నువ్వు ఏం చేస్తున్నావ్ ? ఎంత సంపాదిస్తున్నావ్? అని ఏనాడూ అడిగింది లేదు. తనది ఒకటే మాట – ‘‘బావున్నార్రా? తిన్నావా?’’.ఇలా ఆల్బం చూస్తుండగా.. ఓ నాలుగు జ్ఞాపకాలతోనే నా ప్రయాణం పూర్తయింది. ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి క్యాబ్‌లో కూర్చున్నాను. గంటలో క్యాబ్ ఇంటిముందు ఆగింది. ఇంటి లోపల నలుగురు చుట్టాలు కనిపించారు. బహుశా అమ్మ హాస్పిటల్ నుండి వచ్చేసిందేమో, పరామర్శ కోసం వచ్చుంటారనుకొని ఎంతో ఆత్రుతగా లోపలకి వెళ్ళాను. నాన్న చైర్లో కూర్చుని వున్నారు. అన్నయ్య వదినను ఓదారుస్తున్నాడు. అమ్మ ఫొటో పక్కన దీపం వెలుగుతోంది. నా కళ్ళు తిరిగేశాయి. నన్ను చూసిన అన్నయ్య పరిగెత్తుకు వచ్చి పట్టుకున్నాడు. నాకు అర్థమైపోయింది. అమ్మ ఇక లేదని. కానీ ఎక్కడా కనిపించడం లేదు.‘‘ఎలా జరిగిందన్నయ్యా? అమ్మ ఎక్కడన్నయ్యా?’’ అని ఏడుస్తూ గట్టిగా అరిచాను. నా ఏడుపు విని నాన్న గబగబా వచ్చారు. నా భుజం మీద చేయి వేసుకొని నన్ను పెరట్లోకి తీసుకువెళ్లారు. వీపు తడుతూ..‘‘ఏరా ప్రయాణం ఎలా జరిగిందీ? కోడలు, హారిక, నిహాల్ ఎలా వున్నారు?’’ అని కుషలం అడిగారు.నాకు దుఃఖం, కోపం రెండూ ఒకేసారి వచ్చేశాయి.‘‘ఏంటి నాన్నా మీరు..? అమ్మ ఎక్కడో చెప్పండి...’’ అని గట్టిగా అరిచాను.నన్ను దగ్గరకి తీసుకున్న నాన్న ‘‘సారీ రా... అమ్మ వెళ్ళిపోయింది. మీ అమ్మ చాలా చిత్రమైన కోరిక కోరిందిరా.. ‘చిన్నోడు చాలా సున్నితమండి. వాడు నన్ను ప్రాణం లేకుండా చూడలేడు. చాలా డిస్టర్బ్ అయిపోతాడు. వాడిని ఓదార్చడం మీ వల్ల కాదు. ఇలాంటివి అంత సులువుగా జీర్ణం చేసుకోలేడు. నాకు ఏదైనా జరిగితే మీరు, పెద్దోడు చూసుకోండి. చివరిసారి వాడితో హాలీవుడ్ అంతా చక్కర్లు కొట్టాను. వాడి కొత్త కారులో నేను కూర్చుంటే ఎంత మురిసిపోయాడో. వాడికి నేను చివరిగా అలా చిరునవ్వుతోనే గుర్తుండిపోవాలి. నన్ను ప్రాణం లేకుండా చూస్తే మళ్ళీ మామూలు మనిషి కాలేడు. చివరి చూపు అని వాడు బాధపడితే.. నేను చెప్పానని చెప్పండి’ అని నా దగ్గర మాట తీసుకుందిరా. అందుకే నీకు ఫోన్ చేసి విషయం చెప్పకుండా సీరియస్ అని చెప్పాం. నీ మనసు నాకూ తెలుసు. అమ్మ వెళ్ళిపోయిందని తెలిస్తే నువ్వు ఇంత దూరం ప్రయాణం చేయలేవుకదరా!’’ అన్నారు నా భుజాన్ని తడుతూ సంజాయిషీ ఇస్తున్నట్టుగా.ఇంక నా మాట పడిపోయింది. వెల్లువలా పొంగుతున్న దుఃఖాన్ని అణుచుకుంటూ అమ్మ లేని ఇంట్లోకి వెళ్ళాను. అమ్మ గదిలో పెద్ద ఫొటో. ‘‘ఎంత స్వార్థమమ్మా నీది. నీ కొడుకు భయపడతాడని, బెంగ పెట్టుకుంటాడని చూసుకున్నావే కానీ, కొడుక్కి చివరిచూపు వద్దా? ఇంత స్వార్థం న్యాయమా?’’ అని నిలదీశాను. అమ్మ మాత్రం చిరునవ్వుతో నన్ను దీవిస్తోంది దేవతలా. -
స్మార్ట్ ఫోన్స్ వాడే మహిళలు బీ కేర్‌ఫుల్..
వాషింగ్టన్: ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ వాడే మహిళలు తమ ఆరోగ్య విషయంలో ఇక నుంచి జాగ్రత్త వహించాలి. స్మార్ట్ఫోన్లు, వైఫై రౌటర్లు, మైక్రోవేవ్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌తో మహిళలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆయా పరికరాల్లోని అయస్కాంత క్షేత్రాల నుంచి వెలువడే అయనీకరణం చెందని రేడియేషన్ వల్ల ఈ ప్రమాదం పొంచి ఉందని అమెరికాలోని కైజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తెలిపారు. సరికొత్త రక్త పరీక్ష కేన్సర్ వ్యాధులను నిర్థారించే సరికొత్త రక్త పరీక్ష ను జార్జియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లింపోమియా (తెల్లరక్త కణాల కేన్సర్), మెలనోమా (ఒక రకమైన చర్మ కేన్సర్)ను ఇన్ఫ్రారెడ్ స్పెకోŠట్రస్కోపితో రక్త పరీక్షలు చేసి నిర్ధారించవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన ఎలుకలు, కేన్సర్ వ్యాధి ఉన్న ఎలుకల నుంచి రక్త నమూనాలను సేకరించి ఇన్ఫ్రారెడ్ స్పెకోట్రస్కోపితో పరీక్షలు చేయగా.. లింపోమియా, మెలనోమా కేన్సర్లను గుర్తించగలిగినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మధుమేహం ముప్పు మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం, తదితర ఇబ్బందులుండే వారికి మధుమేహం వచ్చే ముప్పు ఉందని తాజా అధ్యయనంలో తేలింది. దీనికి కారణం యూరియాతో సంబంధమేనని వెల్లడైంది. ఇప్పటిదాకా మధుమేహం వల్ల కిడ్నీ పాడవుతుందని మాత్రమే తెలుసునని, కిడ్నీల వల్ల కూడా మధుమేహం వస్తుందని తమ తాజా పరిశోధనల్లో తేలిందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా మూత్రపిండాలు రక్తం నుంచి యూరియాను తొలగిస్తాయని, ఒకవేళ మూత్రపిండాలు పనిచేయడం తగ్గిపోతే రక్తంలో యూరియా శాతం పెరిగి మధుమేహానికి దారితీస్తాయని వివరించారు. -
బతుకు పోరాటం
రెండు కిడ్నీలూ పాడై.. ప్రాణాపాయంలో ఇంజనీరింగ్ విద్యార్థి దాతల సాయం కోసం ఎదురుచూపు ఇంజనీరై కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన యువకుడు. పేద కుటుంబమైనా.. కుమారుడిని ఉన్నత స్థితిలో చూడాలని అతడి తల్లిదండ్రులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి ఆశలపై క‘న్నీళ్లు’ చిమ్మినట్టుగా.. ఆ యువకుడి రెండు కిడ్నీలూ పాడయ్యాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ఆ కుటుంబం అతడికి వైద్యం చేయించే స్తోమత లేక తల్లడిల్లుతోంది. వివరాల్లోకి వెళితే.. – కంబాలచెరువు (రాజమహేంద్రవరం) సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన మహ్మద్ ఇబ్రహీం ఆటోడ్రైవర్. అతడి సంపాదనతోనే కుటుంబం గడుస్తోంది. తమ కుమారుడిని ఇంజనీర్‌గా చూడాలన్న తపనతో రేయింబవళ్లు శ్రమిస్తున్నాడు. అతడి కుమారుడు 20 ఏళ్ల మహ్మద్ జాఫర్ షాజిద్ దివా¯ŒSచెరువులోని బీవీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇలాఉండగా ఇటీవల జాఫర్షాజిద్కు తీవ్ర స్థాయిలో వాంతులయ్యాయి. దీందో అతడిని ఆస్పత్రిలో చూపించి, వైద్యుడి సలహా మేరకు వైద్య పరీక్షలు చేయించారు. రెండు కిడ్నీలు పాడైనట్టు నివేదిక వచ్చింది. కిడ్నీ మార్పిడి చేయాలని, ఇందుకు భారీ మొత్తంలో ఖర్చు కాగలదని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్నేహితుల సహకారంతో కొంతమేర వైద్యం చేయించారు. పూర్తి స్థాయిలో వైద్యం అందించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో అతడి కుటుంబం దిక్కు తోచని స్థితిలో మథనపడుతోంది. అతడికి క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించాలి. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ఉన్నప్పటికీ.. మందుల ఖర్చులు భరించలేని పరిస్థితి. దాతలు ముందుకువచ్చి తన కుమారుడిని కాపాడాలంటూ తండ్రి ఇబ్రహీం ప్రాథేయపడుతున్నాడు. దాతలు ఎస్బీఐ ఖాతా నం.34524807267(ఐఎఫ్ఎస్సీ : 15366)లో నగదు జమ చేయవచ్చని, 80960 04871 సెల్ నంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
దాతలే దిక్కు
► కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న యువకుడు ► చికిత్స కోసం పాట్లు పడుతున్న తల్లిదండ్రులు ► దాతలు ఆదుకుంటే బతుకుతాడని విన్నపం ఎదిగి వచ్చిన కొడుకు మంచం దిగడానికి అవస్థ పడుతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు అవిసిపోతున్నాయి. మలిసంధ్యలో దారి చూపిస్తాడనుకున్న వారసుడు రోజులు లెక్క పెట్టుకుంటూ బతుకుతుంటే ఆ దంపతుల కళ్లు జీవనదులే అవుతున్నాయి. కిడ్నీ వ్యాధి బారిన పడిన కొడుకుకు తన మూత్రపిండం దానం చేసి ఆ తల్లి కొంగుతో కన్నీరు తుడుచుకునేలోగానే మళ్లీ ఆ మహమ్మారి దాడి చేయడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. చికిత్స కోసం కరిగిపోయిన ఆస్తులు, వైద్యం కోసం పెరిగిపోతున్న అప్పుల కన్నా రోజురోజుకూ శుష్కించిపోతున్న కొడుకు శరీరం ఆ తల్లిదండ్రులను ఊపిరి సలపనివ్వడం లేదు. ఆ..వేదనకు అక్షర రూపమిది. – రాజాం జి.సిగడాం మండలం యందువ పంచాయతీ నరశింహాపురానికి చెందిన అల్లు రమణ, సింహాద్రమ్మ దంపతులకు లక్ష్మీనారాయణ, కవిలిలు ఇద్దరు కుమారులు. వీరికి ఆ గ్రామంలో ఇంటితో పాటు 30 సెంట్ల మెట్టు భూమి ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. లక్ష్మీనారాయణ 2009లో పొందూరులోని ఓ ప్రైవేటు ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చదువుతున్నప్పుడు పచ్చ కామెర్లు సోకిందని ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీ వ్యాధి అని తెలిసింది. విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చేరగా వెంటనే కిడ్నీ మార్చుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లి సింహాద్రమ్మ తన కిడ్నీని కుమారుడికి దానం చేసింది. ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేసుకుని మందులు వాడారు. కానీ మరోసారి కిడ్నీ మహమ్మారి లక్ష్మీనారాయణపై దాడి చేసింది. మొదట ఆపరేషన్ జరిగిన ఆరేళ్ల తర్వాత మరోమారు కిడ్నీ పాడైపోయింది. దీంతో లక్ష్మీనారాయణ మంచానికి పరిమితమైపోయాడు. మొదటి ఆపరేషన్ జరిగినప్పుడే ఈ కుటుంబం అప్పులపాలైపోయి విశాఖ వలస వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఏం చేయాలో వీరికి పాలుపోవడం లేదు. కిడ్నీ దాతను వెతుక్కుంటే ఆపరేషన్ చేస్తామని, సుమారు రూ. 12లక్షలు చెల్లిస్తే జీవన్‌ధాన్ సంస్థ ద్వారా తామే కిడ్నీ వెతికి అమరుస్తామని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఇటు కిడ్నీ దొరక్క, అటు ఆపరేషన్‌కు ఆర్థిక స్థోమత చాలక తల్లిదండ్రులు నరకం చూస్తున్నారు. మంచం పట్టిన లక్ష్మీనారాయణ రోజులు లెక్కపెడుతుండడంతో ఎవరైనా దాతలు సాయం చేస్తే తమ కొడుకు బతుకుతాడని కోరుతున్నారు. ఆస్పత్రి ఖర్చులతో సర్వం కోల్పోయి బంధువుల సాయంతో బతుకుతున్నామని, చికిత్స చేయించే స్థోమత లేని తమకు కాసింత చేయూత ఇవ్వాలని అర్థిస్తున్నారు. తమ వివరాలకు ‘సా„ì ’కి చెబుతూ తమకు జి.సిగడాం మండలం బాతువ ఎస్బీఐ బ్యాంక్‌లో అకౌంట్ ఉందని, వీలైతే ఆ నంబర్ 32900624554లో జమ చేయాలని, లేకుంటే నేరుగా కలవాలంటే ఫోన్ నంబర్లు 9000452749, 9502212362కు సంప్రదించాలని కోరారు. -
మరణమృదంగం
-
భార్యా భర్త మధ్యలో హై బీపీ
శంకర్‌దాదా ఎంబీబిఎస్ సినిమాలో చిరంజీవి పట్టించిన ఆటకి టెన్షన్ పెరిగిపోయి, కల్లు తాగిన కోతిలా ఎగురుతుంటాడు పరేశ్ రావల్ . ఆయనకి హై బీపీ. అందుకనే లాఫింగ్ క్లబ్బులో మెంబరైపోతాడు కూడా. సినిమాలో అయితే చెల్లింది గానీ, హై బీపీ లాఫింగ్ మ్యాటర్ కాదు. డాక్టర్లు, సైకియాట్రిస్టులు చెబుతున్న విషయం ఏంటంటే... కోపం పెరగడం వల్ల బీపీ పెరగడం తక్కువే. కానీ, బీపీ పెరగడం వల్ల చిరాకులు, కస్సుబుస్సులు, చిటపటలు, చిర్రుబుర్రులు పటపటలు... సర్వసాధారణం. ఈ మోడర్న్ టైమ్స్‌లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడానికి హై బీపీ కూడా ఒక కారణం అవొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హై బీపీ ప్రాణం తీయగలదన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రాణంలాంటి బంధాన్ని కూడా చంపుతుందని వైద్య పరిశోధనల్లో ఇప్పుడిప్పుడే తెలుస్తున్న విషయం. సో... భార్యాభర్తలు చిరాకు పడుతున్నారంటే ప్రేమ తగ్గి కాదు... బీపీ పెరిగి అయుండొచ్చు. దంపతులిద్దరూ ధుమధుమలాడుతూ కనిపిస్తున్నారా? చీటికీ మాటికీ చిటపటలాడుతూ టపాసుల్లా పేలుతున్నారా? ఇద్దరి మధ్య కీచులాటలు నిత్యకృత్యమయ్యాయా?... ఒకసారి బీపీ చెక్ చేయించుకోండి. బీపీ పెరిగితే ధుమధుమలు, చిటపటలు పెరగవచ్చు. కస్సుబుస్సుల మాట ఎలా ఉన్నా కంటినరాలు దెబ్బతినడం, కిడ్నీ సమస్యలు, గుండెజబ్బులు, పోటెత్తిన నెత్తురు మెదడులో ప్రవహించి పక్షవాతం సైతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాల్లో నెత్తురు పోటెత్తాల్సిందే! అయితే, అది నిలకడగా ఉంటేనే ఆరోగ్య లక్షణం. అలా కాకుండా, రక్తనాళాల్లో నెత్తుటి ఉధృతిని సామాన్య భాషలో బీపీ అంటారు. నిజానికది హై బీపీ. వైద్య పరిభాషలో హైపర్‌టెన్షన్... ఈ హైపర్‌టెన్షన్ వస్తే ఆరోగ్యానికి ఎంత చేటు తెచ్చిపెడుతుందోననే టెన్షన్ ఉండాల్సిందే! ఎందుకంటే ఒక్కోసారి అది ప్రాణాంతకం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో హై బీపీ ఒకటి. కేవలం ైెహ బీపీ వల్ల తలెత్తే సమస్యల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా 75 లక్షల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. బీపీ పెరిగే వారిలో దాదాపు 96 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. బీపీ అదుపు తప్పేంతగా పెరిగితే గుండె, కిడ్నీలు, మెదడు, కళ్లు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తరచుగా బీపీని తనిఖీ చేసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే, దీనివల్ల తలెత్తే గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలను నివారించుకోవచ్చు. ఏది సాధారణం..? ఏది అసాధారణం..? శరీరంలో రక్తప్రసరణ జరిగేటప్పుడు రక్తనాళాలపై కలిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు. విశ్రాంత స్థితిలో రక్తపోటు చూసేటప్పుడు సిస్టాలిక్ పీడనం 120, డయాస్టాలిక్ పీడనం 80 వరకు (120/80) ఉంటే రక్తపోటు సాధారణంగా ఉన్నట్లు లెక్క. అంతకు మించి పెరిగితే అధిక రక్తపోటుగా (హైబీపీ) పరిగణిస్తారు. సాధారణ స్థితి కంటే తక్కువగా ఉంటే, అల్ప రక్తపోటుగా (లో బీపీ) పరిగణిస్తారు. అయితే, శరీరంలో రక్తపోటు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇది నిమిష నిమిషానికీ మారుతూనే ఉంటుంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఈ హెచ్చుతగ్గులు ఒక క్రమ పద్ధతిలో నమోదవుతాయి. మధ్యాహ్నం వేళ రక్తపోటు సాధారణ స్థితి కంటే కాస్త ఎక్కువగా, రాత్రివేళ కాస్త తక్కువగా ఉంటుంది. రాత్రివేళ రక్తపోటు నెమ్మదించకుంటే, దానిని భవిష్యత్ అనారోగ్య సూచనగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది? చాలావరకు బీపీ ఎందుకు పెరుగుతుందనే దానికి కచ్చితమైన కారణాలు తెలియవు. శారీరక శ్రమకు ఆస్కారం లేని పనులు చేసేవారికి, నిరంతరం ఒత్తిడి ఎదుర్కొనే వారికి, స్థూలకాయులకు, పొగరాయుళ్లకు బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొందరు హై బీపీ బారిన పడవచ్చు. నిర్దిష్ట కారణాలు కనిపించకుండానే, రక్తపోటు పెరగడాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. నిర్దిష్టమైన కారణంతో వచ్చే రక్తపోటును సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. కారణం తెలియకుండా వచ్చే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ కంటే, నిర్దిష్టమైన కారణంతో కనిపించే సెకండరీ హైపర్ టెన్షన్‌తోనే ప్రమాదం ఎక్కువ. సెకండరీ హై బీపీకి కారణమైన జబ్బును నయం చేయడం ద్వారా హై బీపీని నయం చేయవచ్చు. ఉప్పుతో ముప్పు హై బీపీతో బాధపడేవారు ఉప్పు తగ్గించుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఉప్పులేని చప్పిడి తిండి తినడానికి చాలామంది ఇష్టపడరు గానీ, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, బీపీ పెరుగుతుంది. ఎందుకంటే, ఉప్పు ద్వారా రక్తంలోకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా చేరిన సోడియంను తొలగించడంలో కిడ్నీలు విఫలమవుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తంలోని సోడియం నరాల లోపల ఒత్తిడిని పెంచుతుంది. దీనిని తట్టుకునేందుకు నరాల లోపలి గోడల్లోని సన్నని కండరాలు మందంగా మారుతాయి. దీనివల్ల రక్తనాళాల్లో రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు కావలసిన చోటు కుంచించుకుపోతుంది. ఫలితంగా రక్తపోటు అదుపు తప్పి పెరుగుతుంది. అతిగా ఉప్పు తింటే మెదడుకు దారితీసే నరాలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా గుండెకు ఆక్సిజన్, ఇతర పోషకాలు సజావుగా చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి డెమెన్షియా వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు అదుపు తప్పితే, గుండెపోటు రావడం, మెదడు వద్ద రక్తనాళాలు చిట్లి పక్షవాతం, బ్రెయిన్ హెమరేజ్ వంటి ప్రమాదకర, ప్రాణాంతక పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అలాగే, శరీరంలో కొవ్వు పెరిగినా రక్తనాళాలపై వెలుపలి నుంచి ఒత్తిడి పడి ఇలాంటి పరిస్థితే తలెత్తుతుంది. చక్కెరతోనూ చిక్కులు ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీ పెరిగేలా చేస్తుంది. శరీరంలోకి చక్కెరలు ఎక్కువగా చేరితే, వాటికి ప్రతిస్పందనగా శరీరంలో ఇన్సులిన్, లెప్టిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి పెరిగితే, రక్తపోటు సహజంగానే పెరుగుతుంది. చక్కెరల్లో ముఖ్యంగా సుక్రోజ్ కంటే కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫ్రుక్టోజ్ ఎక్కువగా చేటు తెచ్చిపెడుతుందని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. రక్తనాళాలకు చేటు రక్తపోటు మితిమీరి పెరిగితే రక్తనాళాల్లో ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. హై బీపీ ఉన్నవారిలో రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదమూ లేకపోలేదు. బీపీ తీవ్రత పెరిగితే తలనొప్పి, తల దిమ్ముగా ఉండటం, కళ్లు తిరగడం, తల తిరగడం, కొందరిలో చూపులో తేడా రావడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తపోటు విపరీతంగా పెరిగితే అది పక్షవాతానికి దారితీసి మాట తడబడటం, ముఖంలో ఒకవైపు వంకరపోవడం, ఒకపక్క కాలు చేయి వంకరపోవడం, ఒక్కోసారి మాట సైతం పూర్తిగా పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హై బీపీ వల్ల కళ్లు, ఊపిరితిత్తులు, లివర్, స్ప్లీన్, జీర్ణాశయం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీనొప్పి, ఆయాసం, పాదాలకు నీరుచేరడం, మూత్రవిసర్జన తగ్గడం, జీర్ణశక్తి మందగించడం, ఫిట్స్, ముక్కు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బీపీ అకస్మాత్తుగా పెరగడం వల్ల మాత్రమే కాదు, దీర్ఘకాలంగా ఒక మోస్తరు హై బీపీ కొనసాగినా నరాలకు అదే స్థాయిలో చేటు తెచ్చిపెడుతుంది. పిల్లల్లోనూ హై బీపీ హై బీపీ... పెద్దల సమస్య మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో కొద్దిమంది పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తోంది. చిన్నారుల్లో సాధారణంగా పెద్దల కంటే రక్తపోటు తక్కువగానే ఉంటుంది. ఏడాది లోపు శిశువుల్లో రక్తపోటు 75/50 నుంచి 100/70 వరకు, ఐదేళ్ల లోపు చిన్నారులకు 80/50 నుంచి 110/80 వరకు, పన్నెండేళ్ల లోపు పిల్లలకు 85/50 నుంచి 120/80 వరకు, పద్దెనిమిదేళ్ల లోపు వారికి 95/60 నుంచి 140/90 వరకు ఉండటాన్ని సాధారణ రక్తపోటుగా పరిగణిస్తారు. అంతకు మించితే, హై బీపీగానే గుర్తించాల్సి ఉంటుంది. స్థూలకాయం, క్యాల్షియం జీవక్రియల్లో మార్పులు, రెనిన్ హార్మోన్లో మార్పులు వంటివి పిల్లల్లో హై బీపీకి కారణమవుతున్నాయి. ఇవి కాకుండా, కుటుంబంలో ఎవరికైనా హై బీపీ ఉన్నట్లయితే, పిల్లల్లోనూ ప్రైమరీ హైపర్ టెన్షన్‌కు కారణమవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మూత్రపిండాల సమస్యలు, మెదడుకు సంబంధించిన జబ్బులు, గుండె జబ్బులు, ఎండోక్రైన్ గ్రంథులకు సంబంధించిన జబ్బులు, రక్తనాళాలకు చెందిన సమస్యలు, కొన్నిరకాల మందుల వాడకం వల్ల పిల్లల్లో సెకండరీ హైపర్ టెన్షన్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. ప్రైమరీ హై బీపీ తొలిదశలో ఉన్నట్లయితే, ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఇతర కారణాల వల్ల రక్తపోటు పెరిగినట్లయితే మాత్రం తప్పక వైద్య సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సిందే. - ఇన్పుట్స్: డాక్టర్ గోవర్ధన్, డాక్టర్ పాపారావు సీనియర్ ఫిజీషియన్స్ -
ఎమ్మెల్యే వెంకటరమణకు తీవ్ర అస్వస్థత
గుండెపోటుతో స్విమ్స్‌లో చేరిక పరిస్థితి విషమం అంటున్న వైద్యులు తిరుపతి: గుండెజబ్బుతో బాధపడుతున్న తిరుపతి ఎమ్మెల్యే వెంక టరమణ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంట్లో కళ్లుతిరిగి పడిపోయిన ఆయన్ని కుటుంబసభ్యులు స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వెంటిలేటర్ అమర్చి చికిత్స చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ విలేకరులతో మాట్లాడుతూ బీపీ, సుగర్ లెవల్స్ తగ్గిపోయాయని, కిడ్నీ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. దీనికితోడు గుండెపోటు కూడా రావడంతో పరిస్థితి చాలా విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నామని తెలిపారు. బీపీ లెవల్ కూడా 80/80కి పడిపోయిందని తెలిపారు. డయాలసిస్‌కు ఎమ్మెల్యే శరీరం సహకరించే పరిస్థితి కనపడడం లేదన్నారు. డయాలసిస్ చేస్తేగానీ ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని ఎమ్మెల్యేకి వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ వెంగమ్మతో పాటు ముగ్గురు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్విమ్స్‌కు వచ్చి తిరుపతి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. టీడీపీ నాయకులంతా స్విమ్స్ వద్దకు చేరుకున్నారు. -
కదలండి... లేవండి...కాస్త నడవండి!
మెన్స్ హెల్త్ ‘‘ఆయనకేమండీ... కడుపులో చల్ల కదలకుండా ఫ్యాను కింద కూర్చొని చేసే ఉద్యోగం’’ అంటుంటారు. కూర్చోవడాన్ని అదృష్టంగా చెబుతుంటారు. అయితే అదే పనిగా కూర్చుంటే దెబ్బై పోతామంటున్నారు ఆరోగ్యనిపుణులు. మధుమేహంతో బాధపడే వారు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. సీట్లో ఎక్కువగా కూర్చోవడం అనేది... పొగతాగడం కంటే కూడా ప్రమాదమని, గుండెకు సంబంధించి రుగ్మతలు, కిడ్నీ సమస్యలు పెరగడానికి కారణమవుతుందని చెబుతున్నారు. ‘‘అధికంగా కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలను, రోజువారీ వ్యాయమాలు కూడా నివారించలేవు’’ అని బ్రిటన్‌కు చెందిన డా.ఎమ్మ విల్మట్ పరిశోధక బృందం హెచ్చరిస్తోంది. కొన్ని సూచనలు: సీట్లో నుంచి లేవలేనంత పని ఉండొచ్చు. అంతమాత్రాన సీటుకు అతుక్కుపోవాలని లేదు. ప్రతి అర్ధగంటకు ఒకసారి లేచి కనీసం అయిదు నిమిషాలైనా అటూ ఇటూ నడవడం మంచిది. కూర్చోవలసిన అవసరం లేకపోయినా...అదో తప్పనిసరి బాధ్యత అన్నట్లుగా కొందరు కుర్చీకి అతుక్కుపోతారు. నిలబడి కూడా మాట్లాడుకోవచ్చు కదా! రోజువారీ పనిగంటలలో ఎంత సేపు కూర్చున్నాము, ఎంత సేపు నిల్చున్నాము...అనేదాని గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. బాలెన్స్ తప్పితే లోటును సరిదిద్దుకోవాలి. -
పాదాల వాపు తగ్గేదెలా..?
నా వయసు 62. రెండు నెలలుగా తరచూ కాళ్లు, పాదాలలో కొద్దిపాటి వాపులు వస్తున్నాయి. నీరసంగా కూడా ఉంటోంది. పదేళ్లుగా మధుమేహానికి చికిత్స తీసుకుంటున్నాను. రక్తపోటు సక్రమంగానే ఉంది. డాక్టరుగారు పరీక్షలన్నీ చేసి, గాబరా పడాల్సిందేమీ లేదన్నారు. దయచేసి ఈ సమస్యకు ఆయుర్వేద మందులు తెలియజేయప్రార్థన. - సుగుణమ్మ, వరంగల్ గుండెజబ్బులు, కిడ్నీసమస్యలు, నెత్తురు తక్కువగా ఉండటం వంటి సందర్భాల్లో మీరు చెప్పిన వాపులు కనపడతాయి. చికరాల మధుమేహ వ్యాధిలో కూడా కొన్ని ఉప్రదవాలు ఉంటాయి. వాటిలో కాళ్లవాపులు కూడా ఒకటి. మీరు రాసినదాన్ని బట్టి ప్రత్యేకమైన వ్యాధులేమీ లేనట్లుగా కనబడుతోంది. ఈ కింది మందులు ఒక నెలపాటు వాడి ఫలితాన్ని పరిశీలించండి. గోక్షురాది గుగ్గులు (మాత్రలు) ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చంద్రప్రభావటి ( మాత్రలు ) ఉదయం ఒకటి, రాత్రి ఒకటి = శిలాజిత్వాటివటి (మాత్రలు )ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. వీలుంటే ‘తిప్పతీగె’ ఆకులు, కాండాన్ని దంచి, కషాయం కాచుకుని 30 మి.లీ. ఉదయం, రాత్రి ఖాళీ కడుపున తాగండి. తేలికపాటి వ్యాయామం చేయండి. కూర్చున్నప్పుడు కాళ్లను కాస్త ఎత్తుగా ఉంచాలి. ప్రాణాయామం రెండుపూటలా చేయండి. మా బాబు వయసు ఏడేళ్లు. గత నాలుగు నెలలుగా ముఖం మీద గోధుమరంగు మచ్చలు వస్తున్నాయి. చర్మంపై కీళ్ల దగ్గర చిన్నపొక్కుల్లాగ కనపడుతున్నాయి. ఆహారం తక్కువగా తింటాడు. సరియైన ఆయుర్వేద చికిత్స సూచింపగలరు. - లలిత, నిడదవోలు మీరు చెప్పినదాన్ని బట్టి బాబుకి విటమిన్ ‘ఎ’ అనే పోషకాహారం లోపించినట్లుంది. ఆహారంలో మునగకాడలు, మునగాకులు (లేతవి) వండి తినిపించండి. తాజాఫలాలలో దానిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయి వంటివి చాలా మంచిది. అన్నిరకాల ఆకుకూరలు, క్యారట్, బీట్రూట్ మొదలైనవి బాగా ఇవ్వండి. బయటి ఆహారం తినకుండా చూడండి. చాక్లెట్లు, ఐస్‌క్రీములు, శీతలపానీయాల జోలికి పోవద్దు. బరువు 15 కిలోలు ఉండేట్లు, నెత్తురు సక్రమ పరిధిలో ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోండి. ఈ కింది మందులు ఒక రెండు నెలల పాటు వాడండి. ఆరోగ్యవర్థని (మాత్రలు) రోజుకి ఒకటి విడంగారిష్ట, అవవిందాసవ ద్రావకాలను, ఒక్కొక్క చెంచా గ్లాసులో పోసుకుని, రెండు చెంచాల నీళ్లు కలిపి, రెండుపూటలా ఏదైనా తిన్న తర్వాత తాగించండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్