ప్రకృతి ఓ ఔషదాల గని. అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని, ఔషధాలను ప్రకృతిలో లభించే మొక్కలతో తయారు చేసుకోవచ్చు. మర పెరట్లో లభించే అనేక మొక్కల్లో పునర్నవ ఒకటి.పునర్ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవింప చేయగలదు కాబట్టే ‘పునర్నవ’ అయ్యింది. పల్లెల్లో దానిని అటుక మామిడి అనీ, గలిజేరనీ, ఎర్రగలిజేరనీ అంటారు.పునర్నవ ఆకులవల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..
► కాలేయ వ్యాధుల చికిత్సకు సంబంధించిన చికిత్సల్లో పునర్నవ ఒక సంప్రదాయ చికిత్స. ఈ ఔషధ మొక్కను కాలేయ పనితీరు మెరుగుపర్చేందుకు ఉపయోగిస్తారు.
► పునర్నవ మూత్రపిండాల్లో రాళ్ళను నివారించేందుకు సహాయపడుతుంది. పునర్నవ ఆకు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుందని క్లినికల్ అధ్యయనాలు కనుగొన్నాయి.
► పునర్నవను మజ్జిగతో కలిపి తీసుకుంటే ఐరన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత లక్షణాల్ని 90 రోజుల్లోనే తగ్గిస్తుంది.
► పునర్నవ ఋతు సమయంలో వచ్చే తిమ్మిర్లు తగ్గడానికి సహాయం చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.గర్భాశయంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. వాపు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.ఇన్సులిన్ స్థాయిల్ని పెంచి బీటా-కణాల్ని పునరుద్దరించడం ద్వారా చక్కెర వ్యాధిని పునర్నవ తగ్గిస్తుంది.
► పునర్నవ బరువు తగ్గించేందుకు సహాయం చేస్తుంది.
► వృద్దాప్య లక్షణాలు తగ్గించడానికి, ముఖంపై ముడతలు, గీతలను నివారిస్తుంది.
► తెల్ల గలిజేరు కఫము, దగ్గు, శరీరంలో కలిగే వాపులు, వాత వ్యాధులు, పొట్టకు సంబంధించిన వ్యాధులు, లివర్ వాపుకి, గుండె బలహీనత వల్ల వచ్చిన వాపుని పోగొడుతుంది. కిడ్నీల పని తీరును మెరుగు పరుస్తుంది.
► పునర్నవ కంటిచూపును మెరుగుపరుస్తుంది.తెల్ల గలిజేరు ఆకుని రసం పది గ్రాముల మోతాదు తీసుకుని పెరుగులో కలిపి ఉదయం, సాయింత్రం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి. ఇలా మూడు రోజులు తీసుకోవాలి.
► ఈ ఆకు రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి సన్నని సెగ మీద కాచాలి. రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలేదాకా కాచాలి. ఈ నూనెను కీళ్ల నొప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి. నడక రాని పిల్లలకు ఈ తైలం మర్ధన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని ఆయుర్వేద వైద్యులు వివరిస్తారు.
► గలిజేరు ఆకురసాన్ని పటిక బెల్లంతో పాకంపట్టి.. రోజూ ఒక చెంచా చొప్పున నీళ్లలో కలిపి తీసుకుంటే గుండె దడ, బలహీనత తగ్గుతాయి. ఈ ఆకు రసం ఒక స్పూన్ తీసుకుని దానికి కొద్దిగా అల్లం రసం కలిపి నెల రోజులు తాగితే శరీరంలో ఉబ్బు తగ్గుతుంది.
అయితే ఈ ఆకు కూరని అతిగా తినకూడదు. హుద్రోగ వ్యాధి గ్రస్తులు వైద్యుడి సలహా తీసుకుని తినాలి. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు చలువ చేసే పదార్థాలు అధికంగా తీసుకుంటూ ఈ ఆకు కూరని మితంగా తినాలి. పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు ఈ ఆకు కూర తినకూడదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారైనా వారానికి ఒకసారి మాత్రమే తినాలి. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది. చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment