ఈరోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం ఎక్కువగా చూస్తున్నాం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్’ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అనేక ఆనోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. అవేంటో చూద్దాం.
శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే... అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ... తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఇలా వచ్చే కీళ్లనొప్పుల్ని ‘గౌట్’ అని అంటారు. ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలామందిని వేధిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అయిన తర్వాత విడుదల చేసే పోషకాలలో ఇది కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా ఇది రక్తంలో ఉండిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి.
ముప్పు ఎవరెవరిలో ఎక్కువ...?
యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగే అవకాశాలు కొందరిలో మరీ ఎక్కువ. వారెవరంటే...
మద్యం తీసుకునేవారు
మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారు ∙అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ∙రక్తాన్ని పలుచబార్చే మందులు వాడేవారిలో... ముప్పు ఎక్కువ.
శరీరంలో మోతాదుకు మించి యూరిక్ యాసిడ్ ఉంటే కడుపులో మంట,కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపులు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.
యూరిక్ యాసిడ్ ఇలా చేస్తే కంట్రోల్‌లో..
- లేత సొరకాయ చెక్కు తీసి, చిన్న ముక్కలు చేసి, ఎటువంటి నీళ్లు పొయ్యకుండా మిక్సీలో వేసి, ఆ గుజ్జును (ఫిల్టర్ చెయ్యకుండా) పరగడుపున తినాలి. రోజూ ఒక చిన్న గ్లాసుడు(100ml) తిని చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది.
- కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపేయండి
- రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు తినొచ్చు
- రోజుకు కనీసం 4-5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి.
- తరచుగా నిమ్మకాయలు తీసుకోండి.
- పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
- కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్ మరియు పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించండి.
-డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment