Gout disease
-
గౌట్ సమస్యతో బాధపడుతున్నారా? ఇవిగో ఆహార నియమాలు!
కీళ్ల మధ్య యూరిక్ యాసిడ్ రాయిగా ఏర్పడి... అందులోనూ ముఖ్యంగా బొటనవేలి ఎముకల మధ్యగానీ, మోకాలి దగ్గర గానీ రాపిడి కలిగిస్తూ ఎంతో నొప్పిని, ఇబ్బందినీ కలిగించే వ్యాధి గౌట్. గౌట్‌ను నివారించేవి లేదా వచ్చాక అనుసరించాల్సిన ఆహార నియమాలివి... మాంసాహారం ముఖ్యంగా వేటమాంసం (రెడ్‌మీట్), పోర్క్, సీ ఫుడ్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారం (హై క్యాలరీ డైట్) బాగా తగ్గించాలి. మద్యం, మాంసాహారంలో ఉండే ప్యూరిన్స్ అనే వ్యర్థ పదార్థాల వల్ల గౌట్ వస్తుంది కాబట్టి మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. స్వీట్స్, సాఫ్ట్‌డ్రింక్స్, ఆలూ ( పొటాటోస్), ఐస్క్రీమ్స్లోని కొన్ని పదార్థాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. పాలు, మజ్జిగ వంటి డైరీ ఉత్పాదనలు రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గిస్తాయి. కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పండ్లు కూరగాయలు యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి. చెర్రీ పండ్లు కూడా యూరిక్ యాసిడ్ మోతాదులను నియంత్రించేందుకు బాగా ఉపయోగపడతాయి. పొట్టు తీయని బియ్యం (బ్రౌన్ రైస్), ఓట్స్ గౌట్ నివారణకు బాగా పనిచేస్తాయి. ఆకుపచ్చరంగులో ఉండి యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగి ఉండే వెజిటబుల్స్ (ముఖ్యంగా బ్రాకలీ వంటివి) తీసుకోవడం వల్ల అవి గౌట్‌ను సమర్థంగా నివారించగలవు. కొంతమంది పిల్లల్లో అరచేతులు, అరికాళ్లలో దురదలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వచ్చి తగ్గి΄ోవడం అన్నది చాలా మామూలు విషయమే. అయితే అలా కాకుండా మరికొంతమంది పిల్లల్లోనైతే అరచేతులు లేదా అరికాళ్లలో విపరీతంగా దురద రావడంతో పాటు అక్కడి చర్మం పొరలుగా ఊడి΄ోతుంటుంది. ఇది అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇలా జరగడానికి చాలా అంశాలు కారణమవుతుంటాయి. -
రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిందా? వీరిలో ముప్పెక్కువ
ఈరోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం ఎక్కువగా చూస్తున్నాం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్’ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అనేక ఆనోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. అవేంటో చూద్దాం. శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే... అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ... తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఇలా వచ్చే కీళ్లనొప్పుల్ని ‘గౌట్’ అని అంటారు. ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలామందిని వేధిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అయిన తర్వాత విడుదల చేసే పోషకాలలో ఇది కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా ఇది రక్తంలో ఉండిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ...? యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగే అవకాశాలు కొందరిలో మరీ ఎక్కువ. వారెవరంటే... మద్యం తీసుకునేవారు మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారు ∙అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ∙రక్తాన్ని పలుచబార్చే మందులు వాడేవారిలో... ముప్పు ఎక్కువ. శరీరంలో మోతాదుకు మించి యూరిక్ యాసిడ్ ఉంటే కడుపులో మంట,కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపులు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ ఇలా చేస్తే కంట్రోల్లో.. లేత సొరకాయ చెక్కు తీసి, చిన్న ముక్కలు చేసి, ఎటువంటి నీళ్లు పొయ్యకుండా మిక్సీలో వేసి, ఆ గుజ్జును (ఫిల్టర్ చెయ్యకుండా) పరగడుపున తినాలి. రోజూ ఒక చిన్న గ్లాసుడు(100ml) తిని చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపేయండి రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు తినొచ్చు రోజుకు కనీసం 4-5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్ మరియు పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించండి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
Health: యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే!
శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే... అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ... తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఇలా వచ్చే కీళ్లనొప్పుల్ని ‘గౌట్’ అని పేర్కొంటారు. ఈ గౌట్ మీద చాలామందికి అవగాహన ఉంటుంది. కానీ యూరిక్ యాసిడ్ పెరగడం మరికొన్ని అనర్థాలకు దారితీస్తుందనీ, ఆ సమస్యలు చాలామందికి పెద్దగా తెలియవని అంటున్నారు డాక్టర్లు. ఇలా యూరిక్ యాసిడ్ పెరగడం అన్నది గుండె, మూత్రపిండాలు, కాలేయం లాంటి కీలక అవయవాలపై దుష్ప్రభావం చూపుతుందనీ, కాబట్టి వాటి విషయంలోనూ అవగాహన అవసరమని చెబుతున్నారు. మనం అనేక రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. అందులో మాంసకృత్తులు (ప్రోటీన్లు) ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారాలు జీర్ణమయ్యే సమయంలో కొన్ని వ్యర్థాలూ విడుదలవుతాయి. వాటిని బయటకు పంపే బాధ్యత మూత్రపిండాలు నిర్వహిస్తాయి. ఒకవేళ ఆ బాధ్యతను అవి సరిగా నిర్వహించలేకపోతే రక్తంలో ‘యూరిక్ యాసిడ్’ మోతాదులు పెరుగుతాయి. ఇలా పెరిగాయంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో యూరిక్ యాసిడ్ ప్రమాణాలు 3.5 నుంచి 7.2 ఉండాలి. స్త్రీల విషయంలోనైతే గరిష్ట మోతాదు 6.2 వరకే ఉండాలి. ఈ మోతాదులు మించితే కిడ్నీలపై దుష్ప్రభావాలు, గాల్ బ్లాడర్‌లో రాళ్లు వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. ఇవి కొన్ని లక్షణాల రూపంలో వ్యక్తమవుతాయి. కారణాలు: రక్తంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరగడానికి అనేక అంశాలు దోహదపడతాయి. చాలా అరుదుగా కొందరిలో పుట్టుకతో వచ్చే ఎంజైమ్ లోపాల కారణంగా కూడా అవి పెరగవచ్చు. ఇది నివారించలేని సమస్య. ఇక నివారించగలిగే కొన్ని కారణాలూ ఉంటాయి. అవి... నీళ్లు : కొంతమంది చాలా తక్కువ నీళ్లు తాగుతుంటారు. రోజూ సరిపడా నీరు తాగనివారిలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయే అవకాశముంది. హై ప్రోటీన్ ఆహారం : మన దేహ నిర్వహణకు ప్రోటీన్లు చాలా అవసరం. కానీ కొంతమంది చాలా ఎక్కువగా ప్రోటీన్ డైట్... అందునా రోజూ వేటమాంసాల (రెడ్ మీట్) వంటివి తీసుకునేవారిలో ఈ ముప్పు మరింత ఎక్కువ. మూత్రపిండాల సమస్య : కిడ్నీలు తమ పూర్తి సామర్థ్యంతో పని చేయని సందర్భాల్లోనూ యూరిక్ యాసిడ్ మోతాదులు పెరగవచ్చు. గుండె జబ్బుకు మందులు వాడటం : ఈ సమస్య కోసం మందులు వాడే వారిలో... వాటి దుష్ప్రభావాల (సైడ్ ఎఫెక్ట్స్) కారణంగా ఈ సమస్య కనిపించే అవకాశముంది. క్యాన్సర్లు : కొన్ని రకాల క్యాన్సర్లు సోకినప్పుడు ఈ సమస్య కనిపించవచ్చు. తమకు తామే గ్రహించేందుకు అవకాశం... ఇక్కడ పేర్కొన్న కారణాలు గలవారు, ముప్పు ఉన్నవారిలో సమస్య పెరిగే అవకాశమున్నందున, వాళ్లలో ఒళ్లునొప్పులు, జ్వరం, కీళ్లనొప్పులు కనిపించనప్పుడు... దానికి యూరిక్ యాసిడ్ కారణం కావచ్చేమో అని అనుమానించి, జాగ్రత్తగా గమనించుకోవాలి. డయాబెటిస్‌ను, హైబీపీని అదుపు చేసే మందులు సక్రమంగా వాడుతున్నప్పటికీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, తగిన పరీక్షలు చేయించి, వాటి మోతాదు పెంచుకోవాల్సిన (డోస్ అడ్జెస్ట్ చేసుకోవాల్సిన) అవసరముందేమో చూడాలి. మద్యపానం తర్వాత కీళ్లనొప్పులు తరచూ కనిపిస్తుంటే... ఆ అలవాటుకు దూరంగా ఉండాలి. అలాగే రక్తాన్ని పలుచబార్చే ‘ఎకోస్ప్రిన్’ వంటి మందుల వాడకం తర్వాత ఈ సమస్య కనిపిస్తే, తమ డాక్టర్‌తో చర్చించి, ప్రత్యామ్నాయ మందులు వాడుకోవాలి. ఏ కారణమూ లేకుండా లక్షణాలు కనిపిస్తుంటే, రోజూ తాగే నీళ్ల మోతాదు పెంచి చూడాలి. మాంసకృత్తులు మరింత ఎక్కువగా తీసుకుంటున్నారేమో గమనించుకోవాలి. ఇలా ఎవరికి వారే కారణాలు గ్రహించి, కొంతమేరకు జాగ్రత్తపడేందుకు అవకాశం ఉంది. లక్షణాలు: ఒళ్లునొప్పులు తేలికపాటి జ్వరం పిక్కల్లో నొప్పులు పాదాలు, మోకాళ్లలో నొప్పులు చికిత్స: ఈ సమస్యకు అందించే చికిత్స కొంత తేలికైనదే. ఓ చిన్న రక్తపరీక్ష ద్వారా రక్తంలో పెరిగిన యూరిక్ యాసిడ్ మోతాదులను తేలిగ్గా గుర్తించవచ్చు. ఒకవేళ ఆ మోతాదు పెరిగితే, దాన్ని సరిచేసేందుకు డాక్టర్లు నోటి ద్వారా తీసుకునే మందులు సూచిస్తారు. వాటిని వాడుతూ, మరోసారి మోతాదులను పరీక్షించి, అవి అదుపులోకి వస్తే, మందుల్ని ఆపేయవచ్చు. అయితే పుట్టుకతో వచ్చే ఎంజైమ్ లోపం కారణంగా ఈ సమస్య వస్తే... ఇలాంటి వారు తమ జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ...? యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగే అవకాశాలు కొందరిలో మరీ ఎక్కువ. వారెవరంటే... మద్యం తీసుకునేవారు మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారు ∙అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ∙రక్తాన్ని పలుచబార్చే మందులు వాడేవారిలో... ముప్పు ఎక్కువ. మోతాదులు పెరిగితే కీలక అవయవాలపై దుష్ప్రభావం యూరిక్ యాసిడ్ మోతాదు పెరుగుదల దేహంలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్‌ను సృష్టించి, అన్ని అవయవాలనూ ప్రభావితం చేయగలదు. అలాంటప్పుడు చిన్న చిన్న సమస్యలే కాకుండా కొన్ని సందర్భాల్లో తీవ్ర రుగ్మతలూ తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా యూరిక్ యాసిడ్ పెరుగుదలకూ, మూత్రపిండాల సమస్యకూ సంబంధం ఉంటుంది. రక్తంలో ఉండే యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగితే, తొలుత స్ఫటికాల్లా మారి, తర్వాత రాళ్ల రూపం దాల్చేందుకు అవకాశం ఉంది. ఏ అవయవంలో ఈ యాసిడ్ ఎక్కువగా చేరుకుంటే, అది తీవ్రంగా ప్రభావితమవుతుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల ప్రభావం గుండె మీద కూడా పడే అవకాశం లేకపోలేదు. అలాగే మూత్రపిండాల పనితీరు, కాలేయం, గాల్ బ్లాడర్ పనితీరు కూడా దెబ్బతినవచ్చు. కీళ్లతోపాటు మన కండరాలు, ఎముకల (మస్క్యులో–స్కెలెటల్) వ్యవస్థ ప్రభావితం కావచ్చు. అలాగే కొంతమందిలో ఇలా పెరిగే యూరిక్ యాసిడ్ మోతాదు మధుమేహానికి కూడా దారితీయవచ్చు. ప్రత్యామ్నాయాలు ప్రయత్నించాలి యూరిక్ యాసిడ్ పెరుగుదల ఎకోస్ప్రిన్ మందులు వాడకం వల్ల జరుగుతుందని గ్రహిస్తే... అప్పుడా మందులకు ప్రత్యామ్నాయాలను; అలాగే తీసుకునే ఆహారంలో ప్రోటీన్ డైట్ ఎక్కువగా ఉండటం వల్ల అని తెలిస్తే... అప్పుడు మాంసకృత్తుల కోసం పాలు, గుడ్లు, అవకాడో వంటి తేలికపాటి ప్రత్యామ్నాయ ప్రోటీన్ వనరులను ప్రయత్నించవచ్చు. -డాక్టర్ రాజేశ్ ఉక్కాల, సీనియర్ కన్సల్టెంట్ , జనరల్ ఫిజీషియన్ -
గౌట్స్ వంశపారంపర్యమా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. మా నాన్న గౌట్ వ్యాధితో బాధపడుతుండేవారు. ఇటీవల నేను రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అప్పుడు నా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో నాకు కూడా గౌట్ వ్యాధి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. ఇది వంశపారంపర్యమా? హోమియోతో నయమవుతుందా?– బి. నర్సింహారెడ్డి, నల్లగొండ మన రక్తంలో ఉండే యూరిక్ యాసిడ్ అనే రసాయనం ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కీళ్లలోకి చేరి, అక్కడ స్ఫటికంగా రూపొందుతుంది. ఆ స్ఫటికాలు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు కీళ్లు వాచిపోయి కదలికలు కష్టంగా మారతాయి. దీన్నే గౌట్ లేదా గౌటీ ఆర్థరైటిస్ అంటారు. సాధారణంగా ఈ స్ఫటికాలు కాలి బొటన వేలి ప్రాంతంలో ఎక్కువగా ఏర్పడతాయి. దానివల్ల తీవ్రమైన నొప్పి, సలపరం, మంట, వాపు వస్తాయి. చిన్నపాటి కదలిక కూడా భరించలేనంత నొప్పిగా ఉంటుంది. ఇది పదే పదే వస్తుంటుంది. ఈ వ్యాధి కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కారణాలు: అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యం కూడా కొన్ని కారణాలు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కూడా ఈ వ్యాధి రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. లక్షణాలు: ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. సరైన చికిత్స తీసుకోకపోతే కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తలు: గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియోలోని అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్సీఎండ్డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్