కీళ్ల మధ్య యూరిక్ యాసిడ్ రాయిగా ఏర్పడి... అందులోనూ ముఖ్యంగా బొటనవేలి ఎముకల మధ్యగానీ, మోకాలి దగ్గర గానీ రాపిడి కలిగిస్తూ ఎంతో నొప్పిని, ఇబ్బందినీ కలిగించే వ్యాధి గౌట్. గౌట్‌ను నివారించేవి లేదా వచ్చాక అనుసరించాల్సిన ఆహార నియమాలివి...
మాంసాహారం ముఖ్యంగా వేటమాంసం (రెడ్‌మీట్), పోర్క్, సీ ఫుడ్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారం (హై క్యాలరీ డైట్) బాగా తగ్గించాలి.
మద్యం, మాంసాహారంలో ఉండే ప్యూరిన్స్ అనే వ్యర్థ పదార్థాల వల్ల గౌట్ వస్తుంది కాబట్టి మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి.
స్వీట్స్, సాఫ్ట్‌డ్రింక్స్, ఆలూ ( పొటాటోస్), ఐస్‌క్రీమ్స్‌లోని కొన్ని పదార్థాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
పాలు, మజ్జిగ వంటి డైరీ ఉత్పాదనలు రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గిస్తాయి. కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవాలి.
విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పండ్లు కూరగాయలు యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి.
చెర్రీ పండ్లు కూడా యూరిక్ యాసిడ్ మోతాదులను నియంత్రించేందుకు బాగా ఉపయోగపడతాయి. పొట్టు తీయని బియ్యం (బ్రౌన్ రైస్), ఓట్స్ గౌట్ నివారణకు బాగా పనిచేస్తాయి.
ఆకుపచ్చరంగులో ఉండి యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగి ఉండే వెజిటబుల్స్ (ముఖ్యంగా బ్రాకలీ వంటివి) తీసుకోవడం వల్ల అవి గౌట్‌ను సమర్థంగా నివారించగలవు.
కొంతమంది పిల్లల్లో అరచేతులు, అరికాళ్లలో దురదలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వచ్చి తగ్గి΄ోవడం అన్నది చాలా మామూలు విషయమే. అయితే అలా కాకుండా మరికొంతమంది పిల్లల్లోనైతే అరచేతులు లేదా అరికాళ్లలో విపరీతంగా దురద రావడంతో పాటు అక్కడి చర్మం పొరలుగా ఊడి΄ోతుంటుంది. ఇది అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇలా జరగడానికి చాలా అంశాలు కారణమవుతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment