Gout
-
గౌట్ సమస్యతో బాధపడుతున్నారా? ఇవిగో ఆహార నియమాలు!
కీళ్ల మధ్య యూరిక్ యాసిడ్ రాయిగా ఏర్పడి... అందులోనూ ముఖ్యంగా బొటనవేలి ఎముకల మధ్యగానీ, మోకాలి దగ్గర గానీ రాపిడి కలిగిస్తూ ఎంతో నొప్పిని, ఇబ్బందినీ కలిగించే వ్యాధి గౌట్. గౌట్‌ను నివారించేవి లేదా వచ్చాక అనుసరించాల్సిన ఆహార నియమాలివి... మాంసాహారం ముఖ్యంగా వేటమాంసం (రెడ్‌మీట్), పోర్క్, సీ ఫుడ్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారం (హై క్యాలరీ డైట్) బాగా తగ్గించాలి. మద్యం, మాంసాహారంలో ఉండే ప్యూరిన్స్ అనే వ్యర్థ పదార్థాల వల్ల గౌట్ వస్తుంది కాబట్టి మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. స్వీట్స్, సాఫ్ట్‌డ్రింక్స్, ఆలూ ( పొటాటోస్), ఐస్క్రీమ్స్లోని కొన్ని పదార్థాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. పాలు, మజ్జిగ వంటి డైరీ ఉత్పాదనలు రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గిస్తాయి. కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పండ్లు కూరగాయలు యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి. చెర్రీ పండ్లు కూడా యూరిక్ యాసిడ్ మోతాదులను నియంత్రించేందుకు బాగా ఉపయోగపడతాయి. పొట్టు తీయని బియ్యం (బ్రౌన్ రైస్), ఓట్స్ గౌట్ నివారణకు బాగా పనిచేస్తాయి. ఆకుపచ్చరంగులో ఉండి యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగి ఉండే వెజిటబుల్స్ (ముఖ్యంగా బ్రాకలీ వంటివి) తీసుకోవడం వల్ల అవి గౌట్‌ను సమర్థంగా నివారించగలవు. కొంతమంది పిల్లల్లో అరచేతులు, అరికాళ్లలో దురదలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వచ్చి తగ్గి΄ోవడం అన్నది చాలా మామూలు విషయమే. అయితే అలా కాకుండా మరికొంతమంది పిల్లల్లోనైతే అరచేతులు లేదా అరికాళ్లలో విపరీతంగా దురద రావడంతో పాటు అక్కడి చర్మం పొరలుగా ఊడి΄ోతుంటుంది. ఇది అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇలా జరగడానికి చాలా అంశాలు కారణమవుతుంటాయి. -
హోమియో కౌన్సెలింగ్స్
గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా? నా వయసు 37 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. మందులు వాడినా సమస్య తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – సైదులు, నల్లగొండ గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు : ∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు : ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స : హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నిద్రలేవగానే మడమల్లో నొప్పి! నా వయసు 40 ఏళ్లు. ఉదయం నిద్రలేచినవెంటనే నడవటం అంటే నరకం కనిపిస్తోంది. ఏదైనా సపోర్ట్ తీసుకొని నడవాల్సి వస్తోంది. మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. ఈ సమస్యకు హోమియో పరిష్కారం చెప్పండి. – సునీత, కొత్తగూడెం అరికాలులో ఉండే ప్లాంటార్ ఫేషియా అనే కణజాలం ఉంటుంది. అడుగులు వేసే సమయంలో ఇది కుషన్‌లా పనిచేసి, అరికాలిని షాక్ నుంచి రక్షిస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ దీనిలోని సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా మారుతుంది. ఇది పలచబారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తి కోల్పోతుంది. దాంతో ప్లాంటార్ ఫేషియా చిన్న చిన్న దెబ్బలకూ డ్యామేజ్ అవుతుంది. దాంతో మడమ నొప్పి, వాపు వస్తాయి. ఈ నొప్పి అరికాలు కింది భాగంలో ఉంటుంది. ఉదయం పూట మొట్టమొదటిసారి నిల్చున్నప్పుడు మడమలో ఇలా నొప్పి రావడాన్ని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఈ నొప్పి పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా వస్తుంది. కారణాలు : ∙డయాబెటిస్ ∙ఊబకాయం / బరువు ఎక్కువగా ఉండటం ∙ఎక్కువ సేపు నిలబడటం, పనిచేస్తూ ఉండటం ∙చాలా తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ చురుకుగా పనిచేయడం ∙ హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో వచ్చే నొప్పికి ఇది ముఖ్యమైన కారణం). లక్షణాలు : ∙రాత్రిళ్లు నొప్పి అధికంగా వస్తుంది ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ఉంటుంది ∙కండరాల నొప్పులు వ్యాధి నిర్ధారణ : అల్ట్రాసౌండ్ స్కానింగ్ చికిత్స : హోమియో విధానంలో మడమనొప్పికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి, తగిన మందులను వైద్యులు సూచిస్తారు. మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడోడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ మూర్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వైద్యనిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు వెంటనే అనుభవజ్ఞులైన హోమియో వైద్య నిపుణుడిని సంప్రదించండి. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు మంచి పరిష్కారం నా వయసు 58 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉంటున్నాయి. కీళ్లవద్ద ఎర్రగా మారుతోంది. హోమియోలో పరిష్కారం ఉందా? – యు. చంద్రశేఖరప్రసాద్, తాడేపల్లిగూడెం ఇటీవల ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యమైనది. సాధారణంగా స్త్రీ–పురుషులలో యాభైఏళ్ల తర్వాత కొన్ని నొప్పులు మొదలవుతాయి. వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతోంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే వారిలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. ఇది మహిళలు, పురుషులు, కొన్ని సందర్భాల్లో పిల్లల్లో్ల కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. లక్షణాలు : ఈ వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే ఉండకపోవచ్చు. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేవు. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా కూడా నివారించవచ్చు. - డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఆర్థరైటిస్కూ వ్యక్తిగత వైద్యం...
కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్)కు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు నార్త్ వెస్టర్న్ మెడిసిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జన్యుక్రమం ఆసరా తీసుకున్నారు. వ్యక్తి జన్యుక్రమానికి అనుగుణంగా వారికి కీళ్లవాతం మందులు తయారుచేసి ఇవ్వడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఇస్తున్న మందులు చాలామందిలో ఏ మాత్రం ప్రభావం చూపవన్న సంగతి తెలిసిందే. కీళ్ల వాతానికి ప్రస్తుతం చాలా మందులు అందుబాటులో ఉన్నాయనీ.. అయితే ఒక్కోదాన్నీ 12 వారాల పాటు వాడిన తరువాతే అది పనిచేస్తుందా? లేదా? అన్నది తెలుస్తుందనీ.. ఒకవేళ పనిచేయకపోతే డాక్టర్లు వెంటనే మరో మందు పేరు రాస్తారనీ.. ఇది కూడా పనిచేస్తుందన్న గ్యారెంటీ ఏమీ ఉండదనీ పెర్ల్‌మ్యాన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ఒక అధ్యయనం నిర్వహించామని, కొంతమంది బాధితుల జన్యుక్రమాలను విశ్లేషించామని చెప్పారు. సాధారణ మందులతో మంచి ఫలితాలు సాధించిన వారి జన్యువులతో పోల్చి అవే మందులు ఇచ్చినప్పుడు వీరిలోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించారు. ఈ అధ్యయనం ఆధారంగా జన్యుమార్పులకు అనుగుణంగా మెరుగైన ఫలితాలిచ్చే మందులను గుర్తించగలిగామని, త్వరలో కీళ్లవాతం ఉన్న వారందరికీ ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. -
ధనికుల జబ్బు... గౌట్!
మెడి క్షనరీ ఆ జబ్బుకు డిసీజ్ ఆఫ్ రిచ్ అని పేరు. రాజులకు వచ్చే జబ్బు అని మరో పేరు కూడా ఉంది. దాని పేరే ‘గౌట్’. ఈ జబ్బుకు ఇంగ్లిష్‌లో ‘పొడగ్రా’ అని మరో పేరు కూడా ఉంది. కీళ్లకు వచ్చే చాలా రకాల జబ్బుల్లో ఇదీ ఒకటి. రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లు ఎక్కువై, అది ఒక రాయిగా ఘనీభవించడం వల్ల ఇది బొటనవేలి దగ్గర వాపు, మంట వస్తుంది. ఇది ధనికులకూ, రాజులకు మాత్రమే వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. వేటమాంసాన్ని లేదా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం కారణంగా వచ్చే ఈ జబ్బు సాధారణ ప్రజల్లో కూడా కనిపిస్తుంటుంది. అయితే మన దేశంలో ఒకప్పుడు రాజులు, బాగా ధనికులు మాత్రమే మాంసాహారాన్ని ఎక్కువగా తినేవారు. అప్పట్లో అలాంటి ఆహారం తీసుకునే వారిలోనే ఇది ఎక్కువగా కనిపించేదీ కాబట్టి దీనికి ధనికులకు వచ్చే జబ్బు లేదా రాజులకు వచ్చే వ్యాధిగా పేరొచ్చింది. -
కీళ్లనొప్పులు - ఆయుర్వేద పరిష్కారాలు
ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు. ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, (స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించడం, రాత్రి ఎక్కువగా మేల్కొని ఉండటం వంటివి) కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు. ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేదశాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు. 1. సంధివాతం - Oesteo arthritis 2. ఆమవాతం - Rheumatoid arthritis 3. వాతరక్తం - Gout సంధి వాతం (Oesteo arthrities) సంధివాతాన్ని ఆస్టియో ఆర్ధరైటిస్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్లనుండి శబ్దాలు (Crepites) ఉంటాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియల్ ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50-60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తూంటుంది. ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆహారంలో పోషకవిలువల లోపం వలన కూడా (విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్) ఈ వ్యాధి వస్తుంది. జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన లేదా వీపుమీద మోయటం ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం... ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి. ఆమ వాతం (Rheumatoid arthritis) రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వల్న ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవటం వలన, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు (Swelling), తీవ్ర వేదన (Pain), కొద్దిపాటి జ్వరం (Mild Temp) కీళ్లు బిగుసుకుపోవటం (Stiffness), ఆకలి మందగించటం, మలబద్దకం (Constipation) లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది (Including small joints). వాత రక్తం (Gout) Goutను వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్యవయసు వారిలో ఎక్కువగా వస్తూంటుంది. కారణాలు: ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం (హై ప్రొటీనిక్ ఆహారం) ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహారపదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉండే ఆహారపదార్థాలు తినటం వలన అలాగే వీటితోపాటు శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వీటన్నిటివలన వాతం, రక్తం ఈ రెండు దుష్టి చెంది వాత రక్తంగా సమస్య ఏర్పడుతుంది. క్లినికల్‌గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి. లక్షణాలు: ఎరుపు, వాపు, నొప్పితో కూడిన కాలిబొటన వేలు నుండి ప్రారంభమై, తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది. డాక్టర్ డి.హనుమంతరావు ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 99599 114 66 / 99089 111 99 www.starayurveda.com ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ఆయుర్వేద శాస్త్రంలో... 1. నిదాన పరివర్జనం 2. ఔషధ సేవన 3. ఆహార విహార నియమాలు ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు. 1. నిదాన పరివర్జనం: వ్యాధి కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టటం. 2. ఆహార విహార నియమాలు: ఆహారం సరైన టైమ్‌కి తినటం, వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, తగు వ్యాయామం, సరైన టైమ్‌కి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం. 3. ఔషధ సేవన: ఔషధ సేవన విషయానికి వస్తే, ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఎ) శమనం బి) శోధన ం ఎ) శమనం: అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం. బి) శోధనం: అంటే పంచకర్మ. పంచకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు) తరువాత వమన, విరేచన, వస్తి (ప్రధాన కర్మలు) తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, బానువస్తి, పత్రపోటలీ, వాలుకాస్వేదం మొదలగు బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. -
కీళ్లనొప్పులు - ఆయుర్వేద పరిష్కారాలు
ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు. ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, (స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించుట, రాత్రి ఎక్కువగా మేల్కొనుట వంటివి) కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు. ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేదశాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు. 1. సంధివాతం - Oesteo arthrities 2. ఆమవాతం - Rheumatoid arthritis 3. వాతరక్తం - Gout సంధి వాతం (Oesteo arthrities) సంధివాతాన్ని ఆస్టియో ఆర్ధరైటిస్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్లనుండి శబ్దాలు (Crepites) ఉంటాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియర్ ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50-60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తూంటుంది. ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆహారంలో పోషకవిలువల లోపం వలన కూడా (విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్) ఈ వ్యాధి వస్తుంది. జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన లేదా వీపుమీద మోయటం ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం... ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి. ఆమ వాతం (Rheumatoid arthritis) రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వలన ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవటం వలన, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు (Swelling), తీవ్ర వేదన (Pain), మంద జ్వరం (Mild Temp) కీళ్లు బిగుసుకుపోవటం (Stiffness), ఆకలి మందగించటం, మలబద్దకం (Constipation) లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది (Including small joints) వాత రక్తం (Gout) Goutను వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్యవయసు వారిలో ఎక్కువగా వస్తూంటుంది. కారణాలు: ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం (హై ప్రొటీనిక్ ఆహారం) ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహారపదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉండే ఆహారపదార్థాలు తినటం వలన అలాగే వీటితోపాటు శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వీటన్నిటివలన వాతం, రక్తం ఈ రెండు దుష్టి చెంది వాత రక్తంగా సమస్య ఏర్పడుతుంది. క్లినికల్‌గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి. లక్షణాలు: ఎరుపు, వాపు, నొప్పితో కూడిన కాలిబొటన వేలు నుండి ప్రారంభమై, తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది. డాక్టర్ డి.హనుమంతరావు ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 99599 114 66 / 99089 111 99 www.starayurveda.com ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ఆయుర్వేద శాస్త్రంలో... 1. నిదాన పరివర్జనం 2. ఔషధ సేవన 3. ఆహార విహార నియమాలు ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు. 1.నిదాన పరివర్జనం: వ్యాధి కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టటం. 2. ఆహార విహార నియమాలు: ఆహారం సరైన టైమ్‌కి తినటం, వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, తగు వ్యాయామం, సరైన టైమ్‌కి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం. 3.ఔషధ సేవన: ఔషధ సేవన విషయానికి వస్తే, ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఎ) శమనం బి) శోధన ం ఎ) శమనం: అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం. బి) శోధనం: అంటే పంచకర్మ. పంచకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు) తరువాత వమన, విరేచన, వస్తి (ప్రధాన కర్మలు) తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, బానువస్తి, పత్రపోటలీ, వాలుకాస్వేదం మొదలగు బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.