ప్రేమంటే అందరికీ భయమే!
లాస్ ఏంజిల్స్: ప్రేమ ఎంతటి వారినైనా గాయపరిచే అవకాశం ఉంది కాబట్టి అదంటే అందరికీ భయమే అంటున్నాడు ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్ జాన్ లెజెండ్. మోడల్ క్రిస్సీ టీజెన్‌ను పెళ్లాడిన ఈ 'ఆల్ ఆఫ్ మి' హిట్మేకర్.. రిలేషన్‌లో తమ భావోద్వేగాలను వెల్లడించడం పురుషులకు కష్టంతో కూడుకున్నది అని కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే పురుషులు తమ ఎమోషన్‌ను బయటకు కనిపించకుండా ఎప్పుడూ ఓ కవచాన్ని పెట్టుకుంటారని.. దాని నుంచి బయటపడి మహిళల వలే వారు ఎమోషన్‌ను స్వేచ్ఛగా చూపించరని బీబీసీతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
ఇక తన కొత్త ఆల్బమ్‌లో మూడేళ్ల కూతురు లూనాకు సంబంధించిన ఓ పాట ఉందని.. అది తనను ఎంతగానో ఉద్వేగానికి గురిచేసిన పాట అని, అది విన్న ప్రతిసారీ తనకు మంచి అనుభూతి కలుగుతోందని జాన్ లెజెండ్ తెలిపాడు.