అడవిలో ఏ జంతువైనా పులి, సింహాన్ని చూసి భయపడాల్సిందే. వీటి దాడి నుంచి తప్పించుకోవడం కష్టం. చిన్నా పెద్ద తేడా లేకుండా వేటినైనా క్రురంగా వెంటాడి, చంపేసి ఆహరం చేసుకుంటాయి. పొరపాటున పులి కంటపడితే.. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు పెట్టాల్సిందే. అయితే తాజాగా ఓ జంతువు పులిని భయపెట్టించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఖాళీగా ఉన్న రోడ్డు మీద ఓ ఎద్దు దాని మానాన అది పరుగెత్తుకెళుతుంది. ఇంతలో రోడ్డు పక్కన దాక్కున్న పులి ఎద్దుని చూసి దాని మీదకు దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. పులిని చూసిన ఎద్దు ఎంతమాత్రం బెదరలేదు. అంతేగాక ఎద్దు తన కొమ్ములతో పొడిచేందుకు పులిని భయపెట్టింది. దీంతో ఎద్దుని చూసి బెంబేలెత్తిన పులి తొకముడుచుకొని వెనక్కి పారిపోయింది. తర్వాత ఎద్దు వెళ్లిపోయాక పులి దాని దారిలో అది వెళ్లిపోయింది.
చదవండి: కొండచిలువతో పోట్లాడుతున్న కంగారు: వీడియో వైరల్
ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ భారత అటవీశాఖ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చి చేరుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘అన్నిరోజులు ఒకేలా ఉండవు.. పరిస్థితులు మారుతాయి. ఎవరైనా జాగ్రత్త పడాల్సిందే..’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Courage is found in unlikely places…
— Susanta Nanda IFS (@susantananda3) August 30, 2022
Bull scares away the tiger. This is not the behaviour apex predator that we know. Pressure of human presence is perhaps having a huge role.
WA fwd pic.twitter.com/6A4kx39yVc
Comments
Please login to add a commentAdd a comment