బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా
జైపూర్ : గోవులను అక్రమంగా రవాణా, గోవులను మాంసం కోసం చంపిన వారిని హత్య చేస్తామంటూ బీజేపీకి చెందిన రాజస్థాన్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆవులను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తి అరెస్టుపై మాట్లాడిన రామ్‌ఘర్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా గోవులను చంపిన వారి ప్రాణాలు పోతాయని హెచ్చరించారు.
గోవులను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన జకీర్‌ను అరెస్టు చేయబోయే ముందు చితక్కొట్టారు. అయితే, జకీర్‌ను ఎవరూ కొట్టలేదని అహూజా పేర్కొన్నారు. ఆవులను తరలిస్తున్న ట్రక్కును ప్రజలు వెంబడించారని, ఆందోళనతో జకీర్ చేసిన పొరబాటు వల్ల ట్రక్కు తిరగబడిందని చెప్పారు. అందుకే జకీర్‌కు గాయాలయ్యాయని తెలిపారు. కానీ, జకీర్ మాత్రం గ్రామస్థులు కొట్టారని అబద్దం చెబుతున్నాడని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment