Gyan Dev Ahuja
-
బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
జైపూర్: రాజస్తాన్ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్ ఆహోజా చేసిన వ్యాఖ్యలు పెను వివాస్పదంగా మారడమే గాక మత విద్వేషాలకు తెరలేపింది. ఈ మేరకు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పోలీసులు ఆయన పై కేసు నమోదు చేశారు కూడా. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...ఇప్పటివరకు తాము ఐదుగురిని హత్య చేశామని, గోహత్య చేసే వారిని చంపండి అంటూ.. నినాదాలు చేశారు. ఆ హత్యలు లాలావాండి లేదా బెహ్రూర్‌లో కావచ్చు అంటూ రక్బర్ ఖాన్, పెహ్లూ ఖాన్ హత్యలు గురించి ప్రస్తవించారు. అంతేకాదు వాటిలో ఒక హత్యను 2017లో మరోకటి 2018లో చేశామని బహిరంగంగా చెప్పారు. అవన్నీ కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామ్‌గఢ్‌లో జరిగిందని చెప్పడం విశేషం. తమ కార్యకర్తలకు చంపడానికి స్వేచ్ఛ ఇచ్చానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారు హత్య చేసిన వెంటనే బెయిల్ పొందడమే గాక నిర్దోషులుగా విడుదలవుతారని చాలా ధీమాగా చెబుతున్నారు. కానీ రాజస్తాన్‌లోని అల్వార్ నియోజకవర్గం బీజేపీ చీఫ్ సంజయ్ సింగ్ మాత్రం అవన్నీ అతని వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొన్నారు. తమ పార్టీ ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేయదంటూ... మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలన్నింటిని తీవ్రంగా ఖండిచారు. వాస్తవానికి పెహ్లూ ఖాన్, రక్బర్ ఖాన్ ఇద్దరు హర్యానకు చెందిన పాల వ్యాపారులు. ఐతే పెహ్లు ఖాన్ బెహ్రూర్‌లో 2017 ఏప్రిల్‌లో హత్యకు గురవ్వగా రక్బర్ ఖాన్ జులై 2018లో లాలావండి గ్రామంలో హత్యకు గురయ్యారు. పోలీసులు కూడా ఈ రెండు మతపరంగా జరిగిన హత్యలుగానే గుర్తించారు. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా బీజేపీ మతపరమైన ఉగ్రవాదానికి, మతోన్మాదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.. బీజేపీ రంగు బట్టబయలైంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టారు. (చదవండి: లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధారి కేజ్రీవాల్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజం) -
రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్ : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీపై రాజస్తాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ఞాన్దేవ్ అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చడమే కాక.. కాంగ్రెస్ సామ్రాజ్యం అతి త్వరలో అంతం కానుందని జోస్యం చెప్పారు. ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తి.. అలానే రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు చివరి అధ్యక్షుడన్నారు. అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అభిప్రాయపడ్డారు. ‘రాహుల్ గాంధీ తనును తాను హిందువుగా చెప్పుకుంటూ.. జంధ్యం ధరిస్తానని అంటున్నారు. మరి ఆయన చేత జంధ్యం ధరింపజేసిన బ్రాహ్మణుడి పేరు చెప్పగలరా’ అంటూ అహుజా ప్రశ్నించారు. త్వరలో రాజస్తాన్‌లో జరగబోయే రామ్‌గఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే అహుజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆవులను దొంగతనం చేసే వారిని ఉగ్రవాదులంటూ గతంలో విమర్శించారు. -
బీజేపీ వివాదాస్పద ఎమ్మెల్యే రాజీనామా
జైపూర్ : ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి తలనొప్పులు తీసుకువచ్చే రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ ఆహూజా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న రామ్‌గఢ్ నియోజకవర్గంలో పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. అయినా వెనక్కి తగ్గేదిలేదని, రామ జన్మభూమి, గో రక్షణ, హిందూత్వ వంటి ప్రచార అస్త్రాలతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ఆయన సోమవారం ప్రకటించారు. గతంలో ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో అక్కడి విద్యార్థులు ప్రతి రోజూ మూడు వేలకు పైగా కండోమ్‌లు వాడుతారని, అమ్మాయిలు, అబ్బాయిలు విచ్చలవిడిగా తిరుగుతారంటూ వ్యాఖ్యలు చేసి వివాదంతో చిక్కుకున్నాడు. ఇతరులపైనే కాదు సొంత పార్టీ నేతలపై కూడా తలతిక్క మాటలతో విరుచుకుపడడం ఆయన నైజాం. ఇలా ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలో పెడతారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో దేవ్ తీరుతో విసిగిన పార్టీ నాయకత్వం ఆయనను పక్కన పెట్టాలని భావించింది. దీనిలో భాగంగానే ఈసారి ఎన్నికల్లో టికెట్ నిరాకరించి.. ఆ స్థానంలో బీజేపీ నేత సక్వుత్ సింగ్‌ను బరిలో నిలిపింది. -
నెహ్రూ బీఫ్ తినేవారు.. ఆయన పండిట్ కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బీఫ్ (పశుమాంసం), పందిమాంసం తినేవారని, ఆయన అసలు పండిటే కాదని రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్‌దేవ్ అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్వార్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్లను పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నెహ్రూ పండిట్ కాదు. ఆయన బీఫ్, పందిమాంసం తినేవారు. ఇవి తినేవారిని పండిట్ అని ఎలా అంటారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నెహ్రు పేరు ముందు పండిట్ అని చేర్చింది’ అని వ్యాఖ్యానించారు. అహూజా ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం ఇదే తొలిసారి కాదు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం కులం పేరును వాడుకొంటుందని గతంలో ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రాజస్తాన్ పీసీసీ ప్రెసిడెంట్ సచిన్ పైలెట్ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేవాలయాలను దర్శించుకోవడం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచే నేర్చుకున్నారని ఆయన తెలిపారు. అహుజా ఇదివరకు కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవును చంపుట ఉగ్రవాదం కన్న పెద్ద నేరమని, హిందు బాలికలను లవ్ జిహాద్ పేరుతో ముస్లింలు బలవంతంగా మతమార్పిడికి పాల్పడుతున్నారంటూ గతంలో పేర్కొన్నారు. దేశ రాజధానిలో జరిగే లైంగిక దాడులకు 50శాతం బాధ్యత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులదే అని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. -
‘అంబేద్కర్‌కి మొదటి ప్రాధాన్యం ఇవ్వొద్దు’
జైపూర్: బీజేపీ నేతల మాటలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ వైపు మతతత్వ పార్టీ అంటూ బీజేపీపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. నాయకుల అనుచిత వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. తాజాగా బీజేపీ రాజస్థాన్ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శుక్రవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘తమని ఆదివాసీలుగా చెప్పుకొనే ఎస్సీ, ఎస్టీలు అంబేద్కర్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఆయన కంటే ముందుగా హనుమాన్‌ని పూజించాలి. ఎందుకంటే, ఆదివాసీల మొదటి నాయకుడు హనామన్ జీ మాత్రమే.వారంతా ఆయనకు అగ్ర తాంబూలం ఇవ్వాలి. వారి మొదటి దేవుడు హనుమాన్. దళితులకు మార్గ నిర్దేశం చేసింది హనుమానే’ అని అహుజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యాలయంలో గల అంబేద్కర్ విగ్రహం కింద హనుమాన్ చిత్రపటం ఉండడం చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుణ్ని అవమానించారని మండిపడ్డారు. ‘మీరు సిగ్గు పడాలి. మీరంతా ఆదివాసీలమని చెప్పుకొంటూనే హనుమాన్‌ని అవమానిస్తారా..!’ అని స్థానిక ఎంపీ కిరోడి లాల్ మీనాపై అహుజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయస్వామికి ప్రపంచం మొత్తం మీద దాదాపు 40 లక్షల దేవాలయాలు ఉన్నాయని ఆయన అన్నారు. మరే దేవుడికి ఇన్ని ఆలయాలు లేవని తెలిపారు. అహుజా వ్యాఖ్యలపై ఎంపీ కిరోడిలాల్ స్పందించారు. ‘ హనుమాన్ కాలంలో ఇటువంటి రాజకీయాలు లేవు. అహుజా హనుమాన్ జీని ఆదివాసీ, దళిత నాయకుడు అని అనాల్సిన అవసరం ఏమొచ్చిందో అంతుచిక్కడం లేద’ని ఆయన అన్నారు. ‘హనుమాన్‌కి అవమానం జరిదిందని విన్నాను. ఇది చాలా విచారకరం. అలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను కించపరుస్తాయి. అయినా, ఈ ఘటనకు ఆదివాసీలను బాధ్యులను చేయాల్సిన అవసరం లేద’ని అన్నారు. -
‘ఆవును చంపితే.. మిమ్మల్ని హత్య చేస్తాం’
జైపూర్ : గోవులను అక్రమంగా రవాణా, గోవులను మాంసం కోసం చంపిన వారిని హత్య చేస్తామంటూ బీజేపీకి చెందిన రాజస్థాన్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆవులను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తి అరెస్టుపై మాట్లాడిన రామ్‌ఘర్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా గోవులను చంపిన వారి ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన జకీర్‌ను అరెస్టు చేయబోయే ముందు చితక్కొట్టారు. అయితే, జకీర్‌ను ఎవరూ కొట్టలేదని అహూజా పేర్కొన్నారు. ఆవులను తరలిస్తున్న ట్రక్కును ప్రజలు వెంబడించారని, ఆందోళనతో జకీర్ చేసిన పొరబాటు వల్ల ట్రక్కు తిరగబడిందని చెప్పారు. అందుకే జకీర్‌కు గాయాలయ్యాయని తెలిపారు. కానీ, జకీర్ మాత్రం గ్రామస్థులు కొట్టారని అబద్దం చెబుతున్నాడని అన్నారు.